ఎల్ నినో ప్రభావం వలన ఈ సంవత్సరం భారతదేశంలో.....ఫోటోలు
గత శంవత్సరం దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ లో కనీ వినీ ఎరుగని
బీభత్సాన్ని సృష్టించాయి. రాష్ట్రం రూపురేఖలనే మార్చేశాయి. రాష్ట్రంలో
వచ్చిన వరుస తఫాన్ లు కోస్తాంధ్రలో పంటలను తుడిచిపెట్టాయి. ఇప్పుడు మరో
ఉపద్రవం రాబోతోంది.ఈ సంవత్సరం కూడా భారతదేశ వాతావరణం మీద ఎల్ నినో ప్రభావం
పడ్నుందని అది భారత్ ను కరువు కోరల్లోకి నెట్టనుందని వాతావరణ శాఖ నిరాశ
కలిగించే సమాచారం అందించింది.
మధ్య ఫసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం లేదా చల్లబడడం వల్ల ప్రతీ
ఐదేళ్లకోసారి 'ఎల్ నినో', 'లా నినో' మేఘాల్లో కదలికలు వస్తాయి. ఒకసారి ఎల్
నినో మేఘాలు ఎక్కువగా ఏర్పడితే ఇంకోసారి లా నినో మేఘాలు ఎక్కువగా
ఏర్పడుతాయి. దీని కారణంగా వాతావరణంలో వేడి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. 'లా
నినో' మేఘాలు ఎక్కువగా ఏర్పడితే వరదలు వస్తాయి. ఫలితంగా 'ఎల్ నినో' మేఘాలు
ఎక్కువగా ఏర్పడితే కరువు వస్తుంది. ఇది లాటిన్ అమెరికా నుంచి ఆగ్నేయ
దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని
తగ్గిస్తుంది. ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు. అందువల్ల ఆ ఏడాది వ్యవసాయం
దెబ్బతింటుంది. తిండి గింజల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా ప్రజలు ఆకలితో
అల్లాడుతారు.
2004 సంవత్సరంలో భారత దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో
ఏర్పడిన ఈ 'ఎల్ నినో' ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది దేశంలో సాధారణం
కంటే 10 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు
సంవత్సరంగా ప్రకటించారు.
అలాగే 2009లో కూడా 'ఎల్ నినో' ప్రభావం కారణంగా వర్షాలు రాక దేశంలో
వ్యవసాయం బాగా దెబ్బతింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కరువు ఈ
సంవత్సరంలో ఏర్పడింది.
2014లోనూ 'ఎల్ నినో' తన ప్రభావాన్ని మరోసారి దేశ వ్యవసాయం, ఆర్థిక
పరిస్థితిపై చూపనుంది. ఇప్పటికే బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన
వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ 'ఎల్ నినో'
ప్రభావం వస్తే వీటి ధరలు చుక్కల దగ్గరికి చేరుతాయేమోనని ప్రజలు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. దేశంలో గత 130 ఏళ్లలో వచ్చిన కరువుల్లో 60 శాతం
'ఎల్ నినో' సమయంలోనే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1997 లో ఎల్ నినో ప్రభావం మనదేశ వాతావరణంలో మార్పు తీసుకు వచ్చినా, మన
దేశానికి పెద్ద నష్టం జరగలేదని....కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ
వ్యయాలు,ధరల కమీషన్ మాజీ అధిపతి అశోక్ గులాటి చెప్పేరు.
No comments:
Post a Comment