బరువు తగ్గడానికి కొత్త మందుని శాస్త్రవేత్తలు
కనిపెట్టారు. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా అలా తగ్గిన బరువుతో చాలాకాలం
ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో పరిశోధన జరుపుతున్న శాస్త్రవేత్తలు. ఈ
మందు వల్ల లేప్టిన్ అనే హార్మోన్‌ను ఉత్తేజితం చేస్తుందని వారు
చెబుతున్నారు. లెప్టిన్ మన శరీరంలో ఉండే సహజ ఆకలి నిరోధక పదార్థం. అయితే,
కేవలం లేప్టిన్‌ని బయటి నుండి తీసుకోవడం వల్ల అనుకున్న లబ్ధి చేకూరడం లేదు.
ఇందుకు కారణం మన శరీరం లేప్టిన్‌కి స్పందించకపోవడం. ఇప్పుడు తాజాగా
రూపొందించిన మందు మనలను లేప్టిన్‌కి స్పందించేలా చేస్తుంది. బరువు సమస్యకు
ఎన్నోరకాల పరిష్కారాలు కనిపిస్తున్నాయిగానీ ఏదీ ఇంతవరకూ సమర్థవంతంగా
పనిచేయలేదు. మరి ఈ కొత్త మందు ఎలా పనిచేస్తుందో వేచి చూడాల్సిందే!
No comments:
Post a Comment