- డాక్టర్ కాకర్లమూడి విజయ్
త్వరలో
మనకు నచ్చిన స్వీట్‌ని తినేసి బరువు గురించి దిగులుపడకుండా నిశ్చింతగా
ఉండవచ్చట! దీనికోసం ఆకలిని తగ్గించే పౌడర్‌ని రూపొందించారు పరిశోధకులు. ఈ
పదార్థాన్ని మనం తినే ఆహారంలో కలిపితే, కొద్దిగానే తిన్నా కడుపు నిండినట్టు
అనిపిస్తుందట. మామూలుగా మిథైల్ సెల్యులోజ్ పదార్థం జీర్ణవ్యవస్థలో
వేగంగా ప్రయాణించి ఆకలిపై ఎటువంటి ప్రభావాన్నీ చూపించదు. కానీ, ఇప్పుడు
కొత్తగా రూపొందిన పదార్థం జెల్ రూపంలోకి మారి శరీరంలో ఎక్కువకాలం ఉంటుందట!
అందువల్ల, ఆకలి మందగిస్తుందట.
No comments:
Post a Comment