Wednesday, 1 August 2012

సల్‌ఫోన్‌తో ఎముక క్యాన్సర్‌..!


చెెవిదగ్గర పెట్టుకుని ఎడతెరిపి లేకుండా మాట్లాడే సెల్‌ఫోన్లు ఎముక క్యాన్సర్‌ని కలిగించే ప్రమాదం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. యూరప్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. సెల్‌ఫోన్ల వల్ల అనేక దుష్ప్రభావాలు పొంచి ఉన్నాయని ఆ ఫోన్లు పుట్టిన నాటి నుండి వార్తలు వస్తున్నాయి. కానీ, వాటిలో చాలా వరకూ కేవలం అపోహలు మాత్రమే అని కొంతమంది కొట్టి పడేశారు. కానీ, రేడియేషన్‌ వల్ల ఏనాటికైనా హాని తప్పదని మరికొంతమంది అంటున్నారు. తాజా అధ్యయనంలో చెవి ఎముకల వద్ద, దవడ ఎముక వద్ద క్యాన్సర్‌ రావడానికి కారణం సెల్‌ఫోన్లే అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయంలో వెంటనే అంతిమ నిర్ణయానికి రాకూడదనీ, మరికొంత విస్తృత అధ్యయనం అవసరమనీ కూడా అంటున్నారు. చూద్దామ్‌.. ఏమవుతుందో..!
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

No comments:

Post a Comment