Wednesday, 1 August 2012

'ఫేజ్‌'లతో చికిత్స..



          ఫేజ్‌లనేవి ఒక రకమైన వైరస్‌లు. ఇవి బ్యాక్టీరియా కణాలపై దాడి చేసి, వాటి జీవప్రక్రియ కొనసాగకుండా నిరోధిస్తాయి. బ్యాక్టీరియా ద్వారా కలిగే రోగ చికిత్సకు ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది. అప్పటి సోవియట్‌ యూనియన్‌లో 60 ఏళ్ల క్రితమే ఈ విధానాన్ని సమర్థవంతంగా వాడారు. యాంటిబయాటిక్‌ మందులను కనుగొనక ముందు అమెరికాలో కూడా దీన్ని వాడారు. నిరోధకశక్తి గల సూక్ష్మజీవుల రోగాలకు చికిత్స చేయడానికి ఇది ముఖ్యమైన ప్రత్యామ్నాయ పద్ధతిగా ఇప్పుడు భావిస్తున్నారు.
నిరోధకశక్తి పెరగకుండా ఉండాలంటే..
* వైద్యుల సలహా లేకుండా యాంటిబయాటిక్‌ మందుల్ని సొంత నిర్ణయంతో తీసుకోకూడదు.
* జబ్బు త్వరగా తగ్గాలనే కాంక్షతో యాంటిబయాటిక్‌ మందును ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తీసుకురాకూడదు.
* వైద్యుల్ని సంప్రదించకుండా యాంటిబయాటిక్‌ మందు వాడకాన్ని ఆపకూడదు.
* పర్యావరణంలో కాలుష్య కారకాలు, భారీ లోహాలు యాంటిబయాటిక్‌ మందుల నిరోధకశక్తిని పెంచుతాయి. అందువల్ల పర్యావరణం పరిశుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment