* పత్తిని ఏక పైరుగా కాక మిశ్రమ / అంతర పైరుతో సాగు చేయాలి.
* భూసారాభివృద్ధికి ప్రయోజనకర జీవుల్ని పెంచగల 'అలసంద' (లేక ఇతర లెగ్యూమ్ జాతి పైరు) వంటి పైరును పత్తిలో అంతర పంటగా వేయాలి.
* రసాయన ఎరువులకు తక్కువ ప్రాముఖ్యతనిచ్చి, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలి.
* బాక్టీరియా బూజులవంటి జీవుల ద్వారా పైరుకు అందించే నత్రజని, భాస్వరాల్ని కూడా పొదుపు చేసుకోవాలి. వాటి కల్చర్లను విత్తనాలకు కలపాలి.
* ఆముదం, బంతి వంటి ఎర పంటల ద్వారా పొలాల్లో వైవిధ్యతను పెంచాలి.
* పురుగుల వలసల్ని ఆపగలిగే జొన్న వంటి పైరును పత్తి చేను సరిహద్దుల్లో వేయాలి.
* పంచగావ్య (ఆవు మూత్రం), జీవామృతం, వేప కషాయం వంటి సహజ రసాయ నాల్ని పురుగు, తెగుళ్ల అదుపుకు వాడాలి.
* ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే కృత్రిమ రసాయనాల జోలికి వెళ్లాలి.
* పురుగులపై నిఘా ఉంచుతూ లింగాకర్షణ ఎరల్ని వాడాలి.
* పురుగుల్ని తినే పక్షుల్ని ప్రోత్సహించగల పక్షి స్థావరాల్ని ఏర్పరచాలి.
* పత్తి మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత (65-70 రోజులు) తలల్ని, (పై రెమ్మల్ని) తుంచితే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి వీటిని తెంచాలి.
* అనుభవజ్ఞులతో, తోటి రైతులతో నిత్యం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
* పత్తి పొలం నుండి వచ్చిన ఆకు, కట్టెలను పొలంలోనే దున్నేయాలి.
* మరుసటి సంవత్సరం, వీలైన చోటల్లా పంట మార్పిడి చేయాలి.
మీకు తెలుసా..?
శ్రీ విత్తనం : క్రోడీకరించిన సంక్షిప్త సాంకేతిక విజ్ఞానం.
సవరణ: 'గతవారం'జీవనధార మందులు.. అవరోధాలు..అవకాశాలు..' లో 'నాణ్యత పోలిక' బాక్స్‌ఐటమ్‌లో 270 ప్రయోగాలు అని వచ్చింది. దీనిని 2,070 ప్రయోగాలుగా సవరించి చదువుకోవలసిందిగా మనవి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. - విజ్ఞానవీచిక డెెస్క్
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment