ఇపుడు మనం తింటున్న టమాటాలు బహుశ మన ముత్తాతల ముత్తాతలు
తిన్న టమాటాలకంటే ఎంతో భిన్నంగా, రుచిగా ఉన్నాయేమో? నిజానికి అసలు టమాటాలు
మరింత రుచికరంగా, నేరుగా కోసుకుని ఆపిల్‌లా తినేవిధంగా ఉండి ఉంటాయని
పరిశోధకులు భావిస్తున్నారు. టమాటాలు పచ్చిగా ఉన్నపుడు వాటి తొడిమి దగ్గర
మరింత ఆకుపచ్చ రంగు ఉంటుంది. రైతులకి అది నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పటి
రైతులు టామాటాలు మొత్తం ఒకే విధమైన పచ్చని రంగుతో ఉంటేనే సరిగ్గా
మగ్గుతాయని భావిస్తున్నారు. ఆ ఆకుపచ్చ రంగు లేకపోవడం వల్ల టమాటాల రుచిలో
తేడా వస్తుందట! టమాటాలు పండుతున్న కొద్దీ చక్కెర పదార్థాల తక్కువ అవుతాయి.
ఆకుపచ్చ రంగు (తొడిమి దగ్గర) లేని టమాటాలు తక్కువ చక్కెర ఉత్పత్తికి
దోహదపడే జన్యువు కలిగి ఉంటాయి. అందువల్ల, అవి మంచి ఎరుపు రంగు పొందినా
రుచిలో మాత్రం అంత బాగా ఉండవు. అలాగే, తక్కువ క్లోరోప్లాస్టు ఉన్న టమాటాలు
తమ రుచిని ఎక్కువ చేసే వాయువులను విడుదల చేయవు. అందువల్ల, మనం వీటి రుచిని
ఆస్వాదించలేము. మరో మాట.. ఆధునిక టమాటాలు ఫ్రిజ్‌లో నిలువ ఉంచితే మరింత
చప్పగా ఉంటాయి! నిల్వ సమయంలో చక్కెరలో జరిగే రసాయనిక మార్పులే దీనికి
కారణం.
No comments:
Post a Comment