స్మృతి చిహ్నాలు: |
చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు.
2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు.
జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న
తపాలా బిళ్ల విడుదలజేసింది.
______________________________________________________
గెలీలియో
గెలీలియో 1564 ఫిబ్రవరి 15న
ఇటలీలోని పీసా నగరంలో విన్సెంజో గెలీలియో,
గైలియా దంపతులకు జన్మించారు. ఆయన
విద్యాభ్యాసం వల్లెంబ్రోసాలోని ఓ మఠంలో
సాగింది. అనంతరం గణితశాస్త్ర అధ్యయనం
కోసం పీసా విశ్వవిద్యాలయంలో చేరారు.
| |
1589లో పీసాలో గణిత శాస్త్ర అధిపతిగా
నియమితుడయ్యాడు. 1592లో రేఖాగణితం,
యాంత్రిక శాస్త్రం,
ఖగోళశాస్త్రాలను బోధించడానికి పాడువా విశ్వవిద్యాలయంలో
చేరారు.
1593లో వ్యాకోచం చెందే గాలి వలన పనిచేసే ఉష్ణమాపకం
కనుక్కున్నారు.
1595 - 98 మధ్యకాలంలో సైనికులకు పనికివచ్చే
రేఖాగణిత కంపాస్‌ని కనుక్కుని,
అభివృద్ధిపరిచారు. 1609లో ఓ టెలిస్కోప్ కనుక్కున్నారు. అది పనిచేసే విధానం
పెద్దలకు వివరించారు. 1610
జనవరిలో ఆయన గురుగ్రహం ఉపగ్రహాలను గుర్తించారు.
అదే ఏడాది శుక్రగ్రహం కళలు (Phases) పరిశీలించారు. ఈ పరిశోధనలు
సూర్యకేంద్ర
సిద్ధాంతాన్ని బలపరిచాయి. పై నుంచి కిందికి పడే వస్తువులు వాటి
ద్రవ్యరాశి లేదా పరిమాణంతో
నిమిత్తం లేకుండా శూన్యంలో ఒకే సమ త్వరణంతో
ప్రయాణిస్తాయని
తెలిపారు. లఘు లోలకాల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల ఆధారంగానే క్రిస్టియన్ హైగేన్స్ లోలక గడియారాలను తయారుచేయగలిగారు. |
భూకేంద్రక, సూర్యకేంద్రక సిద్ధాంతాలకు సంబంధించి గెలీలియో రాసిన
'డైలాగ్' అనే పుస్తకం క్రైస్తవ చర్చి ఆగ్రహానికి కారణమైంది. ఆయన్ని ఫ్లోరెన్స్
నగరంలో గృహనిర్బంధంలో ఉంచింది. అక్కడే 1642 జనవరి 8న తన
77వ ఏట గెలీలియో చనిపోయారు. |
గెలీలియోని ఆధునిక ఖగోళ శాస్త్ర పరిశోధనల పితామహుడిగా
పిలుస్తారు . 2009లో గెలీలియో టెలిస్కోప్ ఆవిష్కరించి 400 ఏళ్లు
పూర్తయిన సందర్భంగా ఓ అంతర్జాతీయ స్మారక నాణెం విడుదల చేశారు .
_________________________________________
హెర్జ్
హెర్జ్ 1857 ఫిబ్రవరి 22న
జర్మనీ హేంబర్గ్‌లో పుట్టారు.
అన్నా ఎలిజబెత్, గుస్టవ్ ఫెర్డినాండ్
హెర్జ్, ఆయన తల్లిదండ్రులు. ఆయన
జర్మనీలోని వివిధ నగరాల్లో
విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్
అభ్యసించారు. 1880లో బెర్లిన్
విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా
పొందారు.
| |
1883లో
కేల్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరారు.
1885లో కార్ల్‌స్రూహే విశ్వవిద్యాలయంలో
భౌతికశాస్త్ర ఆచార్యుడిగా
నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తూనే విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి
చేయడం, శోధించే ప్రక్రియలను కనుక్కున్నారు. హెర్జ్ చేసిన ప్రయోగాలు
వైర్‌లెస్ టెలిగ్రాఫ్, రేడియో,
రాడార్, టెలివిజన్ ఆవిష్కరణలకు దోహద
పడింది. కాంతి తరంగాలు
కూడా ఒకరకం విద్యుదయస్కాంత తరంగాలని ఆయన
కనుక్కున్నారు. 1887లో కాంతి విద్యుత్తు ఫలితం లెక్కగట్టగలిగారు. 1892లో
కాథోడ్ కిరణాలు అతిపల్చటి లోహపు రేకుల ద్వారా చొచ్చుకు పోగలవని
తెలుసుకున్నారు. |
విద్యుదయస్కాంత వికిరణాల పౌనఃపున్యం S.I ప్రమాణంగా ఆయన
గౌరవార్థం హెర్ట్జ్ పేరే పెట్టారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈయన చిత్రంతో
తపాలా బిళ్లలను విడుదల చేసాయి. ఆయన 1894 జనవరి 1న తన
36వ ఏట జర్మనీలోని బాన్ నగరంలో కన్నుమూశారు.
______________________________________________________
|
|
|
చార్లెస్ బాబేజ్
కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు
చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26
న
బెంజిమన్, బెట్సీ దంపతులకు
లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,
ఉన్నత
విద్యాభ్యాసాలు ఇంటివద్ద,
ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి.
పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని
రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో
పూర్తిచేసి కేంబ్రిడ్జ్
యూనివర్సిటీ
నుంచి గౌరవపట్టా పొందారు.
కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా
కొంతకాలం పనిచేసి మంచి గణిత
శాస్త్రజ్ఞుడిగా పేరు పొందారు. సొంతంగా గణనలు చేసే యంత్రానికి
బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు.
| |
వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్
కృషిని
ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను
మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను
కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు
అని పిలిచారు.
రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి
పరీక్షల కోసం
'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్
బాబేజ్ తయారు చేశారు. గణిత,
ఖగోళ సంబంధ పట్టికలను గణన
చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో
రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్
జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు
పెట్టడమే
కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్
అనే సంస్థను కూడా
స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.
_______________________________________
జాకబ్స్
హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్
జాకబ్స్
హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్‌లోని
రోటర్‌డామ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్‌హాఫ్ సీనియర్,
కాఫ్ వాంట్‌హాఫ్. చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల
ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. రసాయన
సాంకేతిక నిపుణుడిగా పట్టా పొందాడు. 1874లో యుట్రెక్ విశ్వవిద్యాలయం నుంచి
డాక్టరేట్ పట్టా పొందాడు. 1874లో వాంట్‌హాఫ్ స్టియిరో
కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలను ప్రచురించాడు. 1884లో రసాయన గతిశాస్త్రంపై
చేసిన పరిశోధనా వివరాలను ప్రచురించాడు. | |
వీటిలో
రసాయన చర్యల క్రమాంకాన్ని (Order) నిర్ణయించడానికి కొత్త పద్ధతి
కనిపెట్టాడు. ఈ పద్ధతిలో గ్రాఫిక్స్, ఉష్ణగతి శాస్త్ర నియమాలను రసాయన చర్యల
సమతాస్థితికి ఉపయోగించాడు. 1889లో అర్హీనియస్ సమీకరణానికి భౌతిక
న్యాయాన్ని సమకూర్చాడు. 1896లో వాంట్‌హాఫ్‌ను బెర్లిన్‌లోని ప్రష్యన్
అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో రసాయన శాస్త్ర ఆచార్యుడిగా నియమించారు. వాంట్‌హాఫ్
1893లో రాయల్ సొసైటీ నుంచి డేవి పతకాన్ని స్వీకరించాడు. ద్రావణాల మీద
చేసిన ప్రయోగాలు, పరిశోధనలకు 1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి
పొందాడు. జర్మనీలోని బెర్లిన్‌లో 58వ ఏట 1911 మార్చి 1న మరణించారు. |
_________________________________________
మెండలీవ్
మెండలీవ్ 1834 ఫిబ్రవరి 8న సైబీరియాలోని టోబోల్‌స్క్(రష్యా)లో ఇవాన్
మెండలీవ్, మారియా కోర్నిలెవా దంపతులకు జన్మించాడు. స్థానిక పాఠశాల్లో
ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. 1850లో పెడగాగిక్ ఇన్‌స్టిట్యూట్‌లో
చేరి, 1855లో ఉపాధ్యాయుడిగా అర్హత పొందాడు.
మెండలీవ్ 1857లో మొదటి నియామకం పొందాడు. 1861లో ''ఆర్గానిక్ కెమిస్ట్రీ''
అనే పుస్తకాన్ని ప్రచురించాడు. 1864లో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో రసాయన
శాస్త్రాచార్యుడిగా నియమితులయ్యారు. 1869లో ''ప్రిన్సిపుల్స్ ఆఫ్
కెమిస్ట్రీ'' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో మూలకాల ఆవర్తన పట్టికకు
సంబంధించిన విషయాలను తెలియజేశాడు.
| |
మెండలీవ్ అంతవరకూ తెలిసిన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో
అమర్చాడు. ఒకే ధర్మం గల మూలకాలను ఒకే నిలువు వరుసలో ఉంచాడు. ఈ పట్టికను
పరిశీలించి మూలకాల ధర్మాలకు, వాటి పరమాణు భారాలకు సంబంధం ఉందని తెలుపుతూ
ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. తాను తయారు చేసిన పట్టికకు ఆవర్తన పట్టిక
అని పేరు పెట్టాడు.
ఈ పట్టికలో కొన్ని చోట్ల ఖాళీలను ఉంచాడు. ఈ ఖాళీల ఆధారంగా ప్రకృతిలో ఇంకా
కనుక్కోవాల్సిన మూలకాలు ఉన్నాయని తెలియజేశాడు.వీటిలో మూడు మూలకాల లక్షణాలను
1870లో తెలియజేశాడు. తర్వాత శాస్త్రవేత్తలు ఈ మూడు మూలకాలను కనుగొన్నారు.
వీటి లక్షణాలు మెండలీవ్ తెలియజేసిన మూలకాల లక్షణాలతో దాదాపుగా సరిపోయాయి.
మెండలీవ్ 1893లో తూనికలు, కొలతల విభాగానికి అధిపతి అయ్యాడు. 1905లో
స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైస్సెస్‌కి సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1907 ఫిబ్రవరి 2న
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 72వ ఏట మరణించాడు.
___________________________________________
సర్ హంఫ్రీడేవి
సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్)లో
రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్
పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది.
ప్రాథమిక విద్యను పూర్తి
చేయడానికి
1793లో ట్రూరో వెళ్లాడు.
1798లో బ్రిష్టల్‌లోని
న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో
చేరాడు. అక్కడ
వాయువులపై
ప్రయోగాలు చేశాడు. 1801లో
రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్
ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
| |
1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి
పొటాషియం తయారుచేశాడు.
సోడియం హైడ్రాక్సైడ్ నుంచి
సొడియంను వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని
కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను
కూడా గుర్తించాడు.
బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్
వాయువుకి ఆ పేరును
ప్రతిపాదించాడు. చంద్రునిపై ఒక బిలానికి
డేవీ పేరు పెట్టారు. నెపోలియన్
బోనా పార్టీ నుంచి ఒక పతకాన్ని పొందాడు.
1819లో హంఫ్రీ డేవీకి
''సర్'' బిరుదు ఇచ్చి గౌరవించారు. 1829 మే 29న 50వ ఏట
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.
|
________________________________________
లైనస్ కార్ల్ పౌలింగ్
లైనస్ కార్ల్ పౌలింగ్ 1901 ఫిబ్రవరి 28న అమెరికాలోని ఓరిగాన్‌లోని 'లేక్
ఓస్వెగొ'లో
హెర్మన్ పౌలింగ్, లూసీ ఇసబెల్లా దంపతులకు జన్మించాడు. 1917లో
పాఠశాల విద్య
పూర్తయ్యాక కెమికల్ ఇంజినీరింగ్
చదవడానికి కార్వల్లీస్‌లోని
ఓరిగాన్
స్టేట్ అగ్రికల్చరల్ కాలేజీలో చేరాడు.
1925లో పట్టభద్రుడయ్యాడు.
తర్వాత పేసాడేనాలోని కాలిఫోర్నియా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నుంచి
Ph.D.పొందాడు. తన రెండు సంవత్సరాల
యూరప్ పర్యటనలో ప్రముఖ శాస్త్రవేత్తలైన
నీల్స్ బోర్, స్క్రోడింగర్, బ్రేగ్‌లతో కలిసి పనిచేశాడు. పౌలింగ్ అణు
నిర్మాణాన్ని క్వాంటం యాంత్రిక శాస్త్రంతో వివరించాడు.
| |
పౌలింగ్ 1939లో రసాయన బంధాలపై ఒక
పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో
క్వాంటం యాంత్రిక శాస్త్రం
ఆధారంగా రసాయన బంధాలు ఏర్పడటాన్ని వివరించాడు.
ఆర్బిటాళ్లు సంకరీకరణ చెందుతాయని వివరించాడు. రుణ విద్యుదాత్మకత అనే భావనను
ప్రవేశపెట్టి, మూలకాల రుణ విద్యుదాత్మకతల పట్టికను తయారు చేశాడు.
మొట్టమొదటి
సారిగా యాంటీబాడీస్, ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వివరించాడు.
1951లో పౌలింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడు పీచు
ప్రొటీన్‌ల
నిర్మాణాలను వివరించింది. 1954లో రసాయన శాస్త్రంలో
నోబెల్ బహుమతి పొందాడు.
అణుపరీక్షలను నిషేధించాలని, అణ్వాయుధాల మీద
నియంత్రణ ఉండాలని ప్రపంచమంతా
తిరిగి ప్రచారం చేశాడు.
అణ్వాయుధ పరీక్షలు జరపకుండా చూడాలని
ఐక్యరాజ్యసమితికి
11వేల మంది శాస్త్రవేత్తల సంతకాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని
అందజేశాడు. 1962లో పౌలింగ్‌కు నోబెల్ శాంతి బహుమతి
వచ్చింది. 1994 ఆగస్టు
19న కాలిఫోర్నియాలో మరణించాడు. |
|
_____________________________________
హోమీబాబా...
Share
విజ్ఞానవీచిక డెస్క్
Wed, 4 Nov 2009, IST
ఆధునిక భారతదేశం ఇప్పటిస్థాయికి ఎదగడానికి కొంతమంది మూలపురుషులు
కారణం. అణు విజ్ఞానంలో ఇప్పటిస్థాయికి వచ్చేటట్లు కార్యక్రమాన్ని
రూపొందించింది హోమీ జహంగీర్ బాబా (హోమీబాబా). అప్పట ప్రధాని జవహర్‌లాల్
నెహ్రూ ప్రోద్బలంతో అణు విజ్ఞానంలో మన దేశం స్వయం పోషకత్వం సాధింపజేసే
లక్ష్యంతో హోమీబాబా మన దేశ అణు కార్యక్రమాన్ని రూపొందించాడు. ఇటువంటి బాబా
1909 అక్టోబర్ 30న జన్మించాడు. అంటే ఈ సంవత్సరం ఆయన శత జయంతి. ఈయనను భారత
అణు ఇంధన పితామహుడిగా పరిగణిస్తున్నాం. ఈయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్
ఫండమెంటల్ సైన్స్ సంస్థను, భారత అణు ఇంధన కమిషన్‌ను ప్రారంభించాడు.
1948లో భారత అణు ఇంధన కమిషన్ ఏర్పాటైంది. ఈ రెండూ మన విజ్ఞానశాస్త్ర
పరిశోధనలకు, దేశాభివృద్ధికి ఎంతో కీలకమైనవి. ఉన్నత విద్యా సంస్కరణల్లోనూ
హోమీబాబా ప్రముఖపాత్ర వహించాడు. ఇవన్నీ ఈ రంగాల్లో మనదేశం స్వయంపోషకత్వం
సాధించాలనే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పటి ప్రపంచీకరణలో భాగంగా చేపట్టే
సంస్కరణలు ఈ లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయి. అయితే ఈయన 1966లో ఫ్రాన్స్‌లో
మౌన్ట్‌బ్లాంక్ అనే చోట జరిగిన భారత విమాన ప్రమాదంలో మరణించాడు. ఈయన మరణం
వెనుక సిఐఎ హస్తం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈయన గౌరవార్థం
ముంబయిలో పనిచేస్తున్న అణుశక్తి వ్యవస్థ సముదాయాన్ని బాబా అటమిక్ పరిశోధనా
సంస్థగా నామకరణం చేశారు. అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు వాడటంలో ఈ సంస్థ
ఎంతో కృషి చేస్తోంది.
మూడు స్థాయిల్లో పనిచేసే అణు విద్యుత్
కార్యక్రమాన్ని ఈయన రూపొందించాడు. మొదటి దశలో సహజంగా దొరికే యురేనియాన్ని
భారజలంతో నియంత్రిస్తూ, చల్లబరిచే రియాక్టర్స్ (ప్రెషర్డ్ హెవీవాటర్
రెగ్యులేటర్) ద్వారా తయారుచేయాలని ప్రతిపాదించాడు. వాడిన ఇంధనం నుండి
ఫ్లుటోనియంను తయారుచేయాలని ప్రతిపాదించాడు. రెండోదశలో ఫాస్ట్ బ్రీడర్
రియాక్టర్స్ ద్వారా ఈ ఫ్లుటోనియం నుండి విద్యుదుత్పత్తి అయ్యేలా ఈ దశను
రూపొందించాడు. ఇదే రియాక్టర్ ద్వారా మనకు సమృద్ధిగా గల థోరియం అణు ఇంధనం
నుండి యు233 తయారుచేయాలని ప్రతిపాదించాడు. ఇక మూడోదశలో యు233 లేదా థోరియం
నుండి నేరుగా విద్యుదుత్పత్తి కొనసాగాలని ప్రతిపాదించాడు. అయితే రెండోరోజుల
క్రితం 2009, అక్టోబర్ 29న ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ప్రధాని
మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ అణు విద్యుత్ కార్యక్రమాల్లో మనం మొదటిదశను
పూర్తిచేశామని, రెండో దశలోకి వచ్చామని ప్రకటించారు. అంటే ఇది అణువిద్యుత్
కార్యక్రమాల్లో బాబా ముందుచూపుకు నిదర్శనం.
______________________________________
ఖగోళశాస్త్ర పితామహుడు..!
Share
చిన్నారి డెస్క్ : శాంతిశ్రీ
Sat, 18 Feb 2012, IST
-
నేడు నికోలస్ కోపర్నికస్ జయంతి
-
- Nikolaus Kopernikus
చిన్నారులూ..! 'విశ్వంలో ఏం
జరుగుతుందో..? ఈ భూమి మీద ఇంతమందిమి ఉన్నాం మరి ఇది కుంగిపోదా..?' అని
ఇలాంటివే చాలా సందేహాలు మీ బుజ్జి బుర్రల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి
జిజ్ఞాసతోనే ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న 'నికోలస్ కోపర్నికస్' గొప్ప
నిజాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీలో ఎవర్ని అడిగినా 'సూర్యుని చుట్టూ భూమి
తిరుగుతుంద'ని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీన్ని నిరూపించడానికి ఎన్నో
ఆటంకాలను ఎదుర్కొన్నాడు కోపర్నికస్. ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందుకు గణిత,
ఖగోళశాస్త్రాల్ని మదించాడు. చివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే
కన్నా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని అను కుంటేనే రాత్రీ పగలుకూ,
మారుతున్న ఋతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయ న్నాడు. అంతేకాదు ఆ
వాస్తవాన్ని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనాసారం ప్రపంచానికి ఎలా
ఉపయోగపడిందో ఆయనైతే చూడలేకపోయాడు. కానీ మనం మాత్రం ఆ వాస్తవాన్ని గ్రహించి,
మరింత ముందుకుపోతున్నాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి నాటి మత వాదులు
ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ నేడు అదే వాస్తవమైంది. సైన్స్ ఏదైనా
ప్రయోగాత్మకంగా రుజువైనవే వాస్తవమని నమ్ముతుంది. ప్రయోగాత్మకంగా ఋజువు
చేయడం అంత ఆషామాషీ కాదు. అందుకెంతో కృషి చేయాలి. అంత మేధోమథనం చేశాడు గనుకే
'నికోలస్ కోపర్నికస్' ఖగోళ పితామహుడయ్యాడు. మరి ఆయన గురించి
తెలుసుకుందామే..!
'నికోలస్ కోపర్నికస్' 1473, ఫిబ్రవరి
19న జన్మించాడు. తండ్రి రాగి వ్యాపారం చేసేవాడు. నలుగురి పిల్లల్లో
'కోపర్నికస్' ఆఖరివాడు. 'కోపర్నికస్'కు పదేళ్లప్పుడే తల్లీతండ్రీ ఇద్దరూ
మరణించారు. మేనమామ 'లుకాస్ వాజెన్‌రోడ్' పెంచి పెద్దచేశాడు. ఆయన గొప్ప
విద్యావేత్త. న్యాయశాస్త్రంలో 'బోలాగ్నా' యూనివర్శిటీ నుండి డాక్టరేట్
పొందాడు. 'పర్మియా'లో బిషప్ కూడా. సామాజిక హోదా, డబ్బుకు లోటు లేకపోవడంతో
తెలివైన 'కోపర్నికస్'ను బాగా చది వేందుకు ప్రోత్సహించాడు. 'కోపర్నికస్'
'క్రాకౌ' యూని వర్శిటీలో రెండేళ్లు చదువుకున్నాడు. ఆ తర్వాత 'ఫ్రంబర్క్'
చర్చిలో మతాధికారిగా ఉద్యోగం వచ్చింది. చర్చిలో ఎక్కువ సమయం ఉండాల్సిన
అవసరం లేకపోవడంతో మరో 12 సంవత్సరాలు చదువు కొనసాగించాడు.
యూరప్‌లో
15వ శతాబ్ది ఆరంభం నాటికి కొత్త మార్గాలు, ప్రాంతాల అన్వేషణ ముమ్మరంగా
మొదలైంది. కొందరు అప్పటికే కొత్త ప్రాంతాలను అన్వేషించారు. రాజులు,
ప్రభువుల పాలన పోయే దిశగా సమాజంలో మార్పు జరుగుతోంది. మేధోమథనం ఆరంభమైంది.
ఇది 'కోపర్నికస్'లోనూ ప్రారంభమైంది. ముద్రణ పద్ధతి అమల్లోకి రావడంతో
పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. కనపడిన ప్రతి పుస్తకాన్నీ 'కోపర్నికస్'
చదివేవాడు. గణిత, ఖగోళశాస్త్రాలపై ఎక్కడ ఉపన్యాసాలున్నా హాజరయ్యేవాడు.
ఈ
కొత్త భావాలకు అప్పట్లో ఇటలీ కేంద్రంగా ఉండేది. క్రమంగా ఆ భావాలు ఇతర
దేశాలకూ వ్యాపించాయి. 1496లో 'బోలోగ్నా' యూనివర్శిటీలో 'కోపర్నికస్'
చేరాడు. ఆ తర్వాత 'పడువా', 'ఫెరార' యూనివర్శిటీల్లో చదివాడు. 'జీవితం, కళ,
తత్వ శాస్త్రాల'పై తమ తమ అభిప్రాయాలను లేఖల రూపంలో రాసి, వాటినే పంచేవారు.
వాటిని 'కోపర్నికస్' ఆసాంతం చదివేవాడు. న్యాయశాస్త్రాన్ని చదువుతున్నా ఆయన
ధ్యాసంతా 'ఖగోళ, గణితశాస్త్రాల'పైనే ఉండేది. ఆయన 'గ్రీకు భాషను, వైద్యం,
తత్వశాస్త్రం, రోమన్ చట్టాన్ని' కూడా అధ్యయనం చేశాడు. 'బోలోగ్నా'
యూనివర్శిటీ లోనే ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలు 'డోవినికో', 'డానొవోరా'
పరిచయమయ్యారు. 'డానొవోరా' సహకారంతో ఖగోళ పరిశోధనల్లో కిటుకులు
తెలుసుకున్నాడు. 'కోపర్నికస్' అన్వేషణకు ఇక్కడే పునాది పడింది.
విమర్శనాత్మకంగా విషయాల్ని పరిశీలించే అలవాటు 'కోపర్నికస్'కు చిన్న ప్పటి
నుండీ ఉంది. 'టాలెమీ' సిద్ధాంతాల్లో వాస్తవాన్ని అనుమానించటమే కాక,
ప్రత్యామ్నాయం కోసమూ అన్వేషించాడు.
న్యాయశాస్త్రంలో 1503లో
డాక్టరేట్ పొంది, 'ఫ్రంబర్గ్' వెళ్లాడు. ఈలోపు మేనమామ అస్వస్థతకు గురైతే
1506-12 వరకూ అక్కడే ఉన్నాడు. ఈ ఆరేళ్లల్లో ఎన్నో ఆలోచనలు చేశాడు. 'టాలెమి'
ప్రతిపాదనల్ని వందలసార్లు పరిశీలించాడు. చివరికి 'సూర్యకేంద్ర
సిద్ధాంతాన్ని' చిత్తుగా తయారుచేశాడు. 1514లో ఈ విషయాన్ని మిత్రులు
కొందరికి అందజేశాడు. అదే తర్వాత 'ఆన్ ద రివెల్యూషన్ ఆఫ్ ద
సెలెస్ట్రియల్ స్పియర్స్' గ్రంథంలో వివరించాడు.
'ఫ్రంబర్గ్'
నుంచి తిరిగొచ్చాక ఇంటి పైకప్పు మీద ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, ఖగోళ
పరిశోధన లు జరిపాడు. తన ప్రతిపాదనల్నే పదేపదే తార్కికంగా పరిశీలించాడు.
చివరికి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందనే నిర్ణయానికి
వచ్చాడు. సూర్యుడితో పాటు ఇతరగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు
అరిస్టాటిల్, టాలెమి ఎందుకు భావించారో 'కోపర్నికస్' కు అర్థమైంది. భూమి
నిర్దిష్ట కక్ష్యలో 24 గంటలకోసారి తనచుట్టూ తాను తిరగటంతో సూర్యుడూ, ఇతర
గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు వారు భ్రమించారని నిర్ణయానికొచ్చాడు.
ఒక్క చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ప్రతిపా దించాడు.
అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే దూరంగా సూర్యుడి చుట్టూ
తిరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ఆకర్షితుడైన జర్మనీ గణితశాస్త్రవేత్త
'రెటికస్' 1539లో 'కోపర్నికస్'ని చూడటానికి 'ప్రంబర్గ్'కి వెళ్లాడు.
'రెంటికన్' ఎంత బతిమాలినా వాటిని ప్రచురించటానికి 'కోపర్నికస్'
అంగీకరించలేదు. చివరికి 1540లో 'కోపర్నికస్' సిద్ధాంతాన్ని 'రెటికస్'
స్వయంగా ప్రచురించాడు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చినరోజే 1543, మే 24న
'కోపర్నికస్' మరణించాడు. మిత్రులు ఆ పుస్తక ప్రతిని ఒకదాన్ని ఆయన చితిపై
పెట్టారంట! ఏమైనా 'విజ్ఞానశాస్త్రం'లో ఇదే అంతిమం అనేదేమీ ఉండదు. నిరంతర
ప్రయోగాత్మక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే విజ్ఞానశాస్త్ర పురోగమనం
తీరు..!
మరి ఇంత గొప్ప విషయాన్ని కనిపెట్టిన
'నికోలస్ కోపర్నికస్'కు జేజేలు చెప్పేద్దామే..!
_______________________________________________
CLICK ON NAME OF SCIENTIST
|
|
|
|
|
|
|
|
No comments:
Post a Comment