Posted On Tue 14 Jul 2105
సౌరమండలం మధ్యలో ఉన్న సూర్యుడి బరువెక్కువా? లేక సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల బరువెక్కువా? సూర్యుడికి తన చుట్టూ గ్రహాల్ని తిప్పుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గ్రహాల గతుల్ని నిర్దేశించే శక్తి ఏదో తెలుసుకోలేకే ఆ శక్తినే 'దేవుడు' అన్నారని విన్నాను. అది నిజమేనా? అబద్ధమా?
- విద్యార్థి బృందం, మహబూబ్‌నగర్
ఒకే పెద్ద ప్రశ్నలో ఓవైపు విజ్ఞానశాస్త్రానికి, మరోవైపు తాత్వికతకు, ఇంకోవైపు నమ్మకాలకు సంబంధించిన అంశాల్ని సంధించారు. ముందు విజ్ఞానపరమైన అంశాల్ని ప్రస్తావిస్తాను.
గతంలో పలుమార్లు ప్రస్తావించినట్లుగానే మన సౌరమండలం (రశీశ్రీaతీ రyర్‌వఎ) సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందింది. 'రూపొందింది' అనడానికి 'ఉద్భవించింది' లేదా 'పుట్టింది' అనడానికి చాలా తేడా ఉంది. శూన్యం నుంచి ఏర్పడితే 'ఉద్భవించిందనో' 'పుట్టిందనో' అనేవాణ్ని. కానీ ఈ విశ్వంలో ఎప్పుడూ ఏదీ శూన్యం నుంచి పుట్టదు, పదార్థంలో జరిగే మార్పుల ప్రస్థానంలో ఒక రూపం నుంచి మరో రూపం ఏర్పడుతుంది. శక్తి కూడా పదార్థ రూపమేనని ఆధునిక భౌతికశాస్త్రం ఋజువు చేసింది. నెబ్యులా అనే పాదార్థిక మేఘం నుంచే సౌరమండలం రూపొందింది. మొదట్లో ఉబ్బిన పూరీలాగా ధృతి (శ్రీబఎఱఅశీబర) తో ఉన్న ఈ సౌరఫలకం (రశీశ్రీaతీ సఱరష) దీపావళిలో మీరు నేల మీద మండించే భూచక్రంలాగా తిరిగేది. క్రమేపీ అపకేంద్రబలాల (షవఅ్‌తీఱటబస్త్రaశ్రీ టశీతీషవర) ప్రభావం వల్ల అంచుల్లో ఉన్న పదార్థభాగం గ్రహాలు తదితర ఖగోళ వస్తువులు (షశీరఎఱష bశీసఱవర) గా మారగా మధ్యలో ఉన్న పదార్థం సూర్యుడిగా నిలిచింది. మొదట్లో సౌరఫలకం అంతా కేంద్రక సంలీనచర్యలు (అబషశ్రీవaతీ టబరఱశీఅ) ద్వారా వెలుగును, వేడిని చిమ్ముతూ ఉండేవి. కానీ సుమారు 550 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహాలలో పెద్ద పెద్ద పరమాణువులు ఏర్పడిన క్రమంలో అవి స్వయం ప్రకాశకత్వాన్ని కోల్పోయాయి. కానీ సూర్యుడిలో ఇంకా చిన్న పరమాణువులైన హైడ్రోజన్ బాగా ఉండడం వల్ల అది వెలుగులు చిమ్ముతూనే ఉంది.
సౌరమండలంలో సూర్యుడు మధ్యలో ఉన్న నక్షత్రం. దాని బరువు (నిజానికి ద్రవ్యరాశి లేదా ఎaరర) విలువ సుమారు 2×1030 కిలోగ్రాము అంటే 2 పక్కన 30 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని కిలోగ్రాముల ద్రవ్యరాశి సూర్యుడిది. భూమి ద్రవ్యరాశి సుమారు 6 × 1024 కి.గ్రా అంటే 6 పక్కన 24 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య ఎంతో అన్ని కిలోగ్రాముల ద్రవ్యరాశి భూమిది. ఈ లెక్కన సూర్యుని ద్రవ్యరాశి సుమారు మూడు లక్షల భూముల ద్రవ్యరాశికి సమానం. సూర్యుని వెలుగును చిమ్మేందుకు కేంద్రక సంలీన చర్యలో ప్రతి సెకనుకు సుమారు 50 కోట్ల టన్నుల (లేదా 50 వేల కోట్ల కి.గ్రా) హైడ్రోజన్ పాల్గొంటుంది. ఈ లెక్కన సూర్యుడు మరో 10వేల కోట్ల సంవత్సరాల పాటు వెలుగును ఇవ్వగలడు. ఆ క్రమంలో అది విస్తరించి గ్రహలను మింగేస్తూ చివరకు ఓ శ్వేతకుబ్జగా (ఔష్ట్రఱ్‌వ ణషaతీట) గా మారుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధాంతరీకరించారు. అది వేరే విషయం.
సూర్యుడి ద్రవ్యరాశి తెలుసుకున్నాం. ఇక సూర్యుడి చుట్టూ బుధుడు (వీవతీషబతీy), శుక్రుడు (Vవఅబర), భూమి (జుaత్‌ీష్ట్ర), అంగారకుడు (వీaతీర), బృహస్పతి (ఖజూఱ్‌శీతీ), శని (ూa్‌బతీఅ) యురెనస్ (ఖతీaఅబర), నెప్ట్యూన్ (అవb్‌బఅవ) అనే గ్రహాలు తిరుగుతున్నాయి. ఇందులో కొన్ని గ్రహాలకు, భూమికి చంద్రుడిలానే ఉపగ్రహలు (ఝ్‌వశ్రీశ్రీఱ్‌వర) ఉన్నాయి. అంగారకుడికి, బృహస్పతికి మధ్య లక్షకు పైగా చిన్నా చితక రాళ్లూరప్పలూ ఉన్నాయి. వీటినే ఆస్టరాయిడ్లు అంటారు.
ఇందులో సుమారు 950 కి.మీ వ్యాసమున్న సెరెస్ అనే పెద్ద ఆస్టరాయిడ్ నుంచి ఊరూ పేరూ లేని అవగింజంత సైజున్న ఆస్టరాయిడ్లు ఉన్నాయి. నెప్ట్యూన్ తర్వాత మొన్న మొన్నటివరకు గ్రహహోదా (ర్a్‌బర శీట a జూశ్రీaఅవ్) ను అనుభవించిన ప్లూటో కూడా ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సుమారు తొమ్మిదేళ్ళ క్రితం ప్రయోగించిన న్యూహోరైజాన్స్ (చీవష నశీతీఱఓశీఅర) వ్యోమనౌక సుమారు 500 కోట్ల కి.మీ. గంటకు సుమారు 50వేల కి.మీ దూరాన్ని వేగంతో ప్రయాణించి, నిన్నటికి నిన్న (14.7.15 నాడు) ప్లూటోకు అతి దగ్గరగా వెళ్లి చాయఛిత్రాలను సేకరించింది. ప్లూటో సంగతులు మరికొన్ని తెలిపే అవకాశం ఉందన్న మాట.
ప్లూటో తర్వాత మరికొన్ని ఖగోళ వస్తువులు ఉన్నాయి. 'ఉర్ట్ ్జ మేఘం (ఔబత్‌ీఓ జశ్రీశీబస) లో ఉన్న పదార్థాలు కూపర్ బెట్టీ (ఖబజూవతీ దీవ్‌్) అనే స్థానంలో ఉన్న పదార్థాలు అడపా దడపా వచ్చే తోక చుక్కలు (షశీఎవ్‌ర) ఇలా ఎన్నో గ్రహాలు, గ్రహేతర ఖగోళ వస్తువులు సౌర మండలంలో తమ తమ స్థావరాల్లో, తమ తమ పద్ధతుల్లో, తమ తమ గతుల్లో చరిస్తున్నాయి.
పరిణతి చెందుతున్నాయి. ఇంతటి పెద్ద సంక్లిష్ట సౌరమండలపు ద్రవ్యరాశి 10,014 సూర్యుల ద్రవ్యరాశికి సమానం. అంటే మొత్తం సౌరమండలపు ద్రవ్యరాశి 10,014 ప్రమాణాలనుకొంటే ఒక సూర్యుడి ద్రవ్యరాశే 10,000 ప్రమాణాలుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే సౌరమండలం అనే కుటుంబంలో సూర్యుడు అష్టగ్రహాలు, లక్షలాది ఆస్టరాయిళ్లు, డజన్ల కొద్దీ ఉపగ్రహాలు, ఇంకా ఎన్నో ఖగోళ వస్తువులుండగా ఆ కుటుంబంలోని అందరి దగ్గర సుమారు 10,014 రూపాయలుంటే కేవలం సూర్యుడి జేబులోనే 10,000 రూపాయలున్నట్లు అర్థం. లేదా సౌరమండలపు ద్రవ్యరాశిలో సూర్యునిది 99.86 శాతం ద్రవ్యరాశి కాగా, భూమి, బృహస్పతి, శని వంటి ఎందరో ఉన్న మిగిలిన సౌరమండలపు ద్రవ్యరాశి శాతం కేవలం 0.14 శాతం మాత్రమే!
ఇక రెండో ప్రశ్న తాత్వికతకు సంబంధించింది. సూర్యుడు తన చుట్టూ గ్రహాల్ని తిప్పుకోవడం లేదు. గ్రహాలే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయనడం మరింత నిజం. మన సమాజంలో యజమాని పనిమనిషిని తనచుట్టూ తిప్పుకుంటున్నట్టు గ్రహాలు సూర్యుడికి బానిసలు కావు. అలాగే సూర్యుడు గ్రహాలకు యజమాని కూడా కాదు. సౌర మండలంలో సూర్యుడికెంత హక్కు ఉందో గ్రహాలకు, గ్రహేతర తదితర ఖగోళ వస్తువులకూ అంతే పరపతి ఉంది. సూర్యుడి వెలుగు వల్లనే భూమ్మీద జీవం ఏర్పడిందన్నదెంత నిజమో, సూర్యుడి వెలుగు వల్లనే బుధుడి మీద జీవం లేదనాలి. కాబట్టి జీవం ఆవిర్భవించడానికి భూమి మీదున్న పరిస్థితులు ప్రధానం. ఆ హోదా, హంగు భూమికి ఉన్నాయి. అది భూమికున్న గొప్పగుణం. ఆ గుణాన్ని సూర్యుడు భూమికి బహుమతిగా ఇవ్వలేదు. ఈ విశాల విశ్వంలో భూమికున్న స్థావర ప్రభావం వల్ల, కాల, మాన ప్రభావం వల్ల సిద్ధించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సౌకర్యం పోతుంది. భూమి మాత్రమే కాదు సూర్యుడికీ గతి ఉంది. మునుపు చెప్పినట్లు ఆ సూర్యుడు శ్వేతకుబ్జగా మారతాడు. అపుడక్కడ వెలుగు ఉండదు. ఇంకా అక్కడెక్కడో ఉన్న నక్షత్రాల కాంతిని పరావర్తనం చేసే మామూలు వస్తువుగా మిగిలిపోతాడు. గ్రహాలను నిర్దేశించే శక్తి ఏదో తేలీకే, దాన్ని 'దేవుడు' అన్నారని విన్నట్లు చెప్పారు. నిజమే. ఆ రోజుల్లో గ్రహణాలు ఎందుకొస్తాయో, తోకచుక్కలు ఎందుకొస్తాయో, ఎపుడొస్తాయో తేలీదు. భూమి గుండ్రంగా ఉన్నట్లు తెలీదు. పగలు రాత్రి ఎందుకొస్తాయో, పగలు సూర్యుడుండగా రాత్రి ఎక్కడికెళ్తాడో తెలీదు. ఆ రోజుల్లో ఇలాంటి ఎన్నో విషయాలకు సమాధానం తెలీదు కాబట్టి వీటికి కారణాన్ని 'దేవుడ'ను కొన్నారనే అనుకొందాం. అందులో కొంచెం నిజం కూడా ఉంది.
మరి నేడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సవివరంగా, సమగ్రంగా తెలుసు కాబట్టి ఇంకా ఆ శక్తికీ, ఆ గతులకూ కారణం 'దేవుడు' అనుకోకూడదు కదా! అందరూ శాస్త్రాన్నే గౌరవించాలి కదా! కానీ 14వ తేదీ నాడు అద్భుతంగా న్యూ హోరయిజాన్స్ ప్లూటోగ్రహానికి అతి దగ్గరగా వెళ్లి ఫొటోలు తీయడం గురించిన ప్రచారం కన్నా అర్థంపర్థం లేకుండా నదీజలాల్ని కలుషితం చేసే గోదావరి పుష్కరాలకు వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు, రాజకీయ ప్రముఖులూ, పాలకులూ, సేవకులూ, ప్రజలూ బ్రహ్మరథం పట్టారు, పడుతున్నారు. ఎవరి విశ్వాసాలు వారివి అనుకున్నా భక్తులకు బస్సు నిచ్చిన డీజిల్ శాస్త్రవేత్తను, వారికి రైళ్లనిచ్చిన స్టీఫెన్‌సన్ శాస్త్రవేత్తను, కుళాయిలకు, పైపులకు రూపాన్నిచ్చిన లోహ సంగ్రహణ శాస్త్రవేత్తలను, ప్రకృతి గురించి ఎంతో నేర్పిన, నేర్పుతున్న విజ్ఞానశాస్త్రాన్ని విశ్వసించాలి కదా!
ఆఖరికి నిన్నటికి నిన్న రాజమండ్రి పుష్కరాల్లో దేవుడిని నమ్మి వెళ్లిన కొందరు భక్తుల్ని తొక్కిసలాటలో చనిపోకుండా ఏ దేవుడూ కాపాడలేకపోయాడు. వారెందుకు తొక్కిసలాటలో చనిపోయారో విజ్ఞానశాస్త్రం తెలుపుతోంది. తొక్కిసలాటలో తృటిలో ప్రాణాలు నిలబెట్టుకొని, గాయాలు పాలయినవారు గోదాట్లో మునిగితే గాయాల నుంచి బయటపడలేదు. చివరికి వారు విజ్ఞానశాలలైన వైద్యశాలల్లోనే చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడేది వైద్యమే!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు చెకుముకి,
జనవిజ్ఞాన వేదిక.

Courtesy with: PRAJA SEKTHI DAILY
No comments:
Post a Comment