SCIENCE AWARENESS
'ఫొటోగ్రఫీ' అనే గ్రీకు మాటకి 'కాంతి రాత' అని అర్థం. ఈ మాటకు తొలిసారిగా 1837లో సర్ జాన్ హెర్షల్ వాడుకలోకి తీసుకొచ్చారు. ఇక ఈ విజ్ఞానానికి సంబంధించిన చరిత్రలోకి తొంగిచూస్తే... క్రీ.పూ. 5వ శతాబ్ధంలో ఒక చైనా తాత్వికుడు కాగితంలాంటి ఓ తలపై తొలిసారిగా ఒక చిత్రాన్ని నమోదు చేయగలిగాడు. గుండుసూది మొనంత సన్నని రంధ్రం గుండా ఓ చీకటి గదిలోకి కాంతిని పంపించడం ద్వారా, ఒక బొమ్మ తాలూకూ తల కిందులుగా ఉండే చిత్రాన్ని అతను పొంద గలిగాడు. ఒక విధంగా ప్రపంచంలో దీనినే మొట్టమొదటి ఫోటో అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తరువాత 21 వందల సంవత్సరాలకు, 17వ శతాబ్ధంలో నిప్సీ అనే ఒక వ్యక్తి ఎండలో పెట్టినప్పుడు గట్టిగా మారే ఒక పదార్థం మీద బొమ్మల తాలూకూ 'చిత్రం' పడేలా చేయగలిగాడు. తరువాత కొంత కాలానికి డాగరి అనే వ్యక్తి లోహంతో చేసిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను కనిపెట్టాడు. అంతేకాదు, ఏదైనా ఒక ఫోటోలోని చిత్రాన్ని ఉప్పునీటిలో ముంచి ఉంచడం వల్ల ఆ చిత్రం శాశ్వతంగా (సుదీర్ఘకాలం) ఉంటుంది అన్న నిజాన్ని కూడా అతను కనుగొన్నాడు. ఇక దానితో వాడవాడలా ఫోటో స్టూడియోలు వెలియడం మొదలయ్యింది. అయితే...
అనేక నూతన ఆవిష్కరణలలాగే 'ఫోటోగ్రఫీ' కూడా మొదట్లో చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. లోహపు పలకల మీద మనుషుల ముఖాలను ముద్రించడం అనేది దెయ్యాలు చేసే పని అంటూ చర్చి అధికారులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ఉపాధి అవకాశాలు పోతాయంటూ చిత్రకారులు కూడా దీనిని గట్టిగా అడ్డుకున్నారు. ఏమైతేనేం ఇలాంటి అడ్డంకు లన్నింటినీ అధిగమించి ఫోటోగ్రఫీ పరిశ్రమ మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడం మొదలుపెట్టింది. 1850 నుంచి నేటి దాకా ఫోటోగ్రఫీ విజ్ఞానం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు దాని రూపురేఖలు సమూలంగా మారిపోయాయని చెప్పవచ్చు.

________________________________________________________________________
జలుబు చేసినప్పుడు పిల్లలు రాత్రిపూట ఒకటే దగ్గుతుంటారు. పిల్లలేంటి మనం కూడా దగ్గుతుంటాం. అయితే పిల్లలు దగ్గుతో నిద్రలేమి కలిగి చాలా చిరాకు చేస్తారు. దీంతో పెద్దవాళ్లు వెంటనే ఏదో ఒక దగ్గు మందు పోసేస్తారు. దగ్గు మందులు అలా ఇష్టానుసారం వాడటం మంచిది కాదు. కానీ ఇలాంటి సమయంలో పిల్లలకు దగ్గు మందుకన్నా తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు సహజంగా కొన్నిరోజులకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ తల్లితండ్రులు దగ్గు మొదలవడం ఆలస్యం ఏదో ఒక దగ్గు మందో లేదా అంతకుముందు డాక్టర్ రాసిచ్చిన దగ్గు మందునే మళ్లీ కొని తెచ్చి, వేసేస్తారు. ఈ మందులు ఎక్కువ మోతాదులో వాడితే ప్రమాదకరం కూడా! అయితే ఇక ఈ దగ్గు మందుల్ని మానుకుని తేనె ఉపయోగించడం సురక్షితం, శ్రేయస్కరం. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే నోటిలో లాలాజలం ఊరటానికి దోహదం చేయడంతో పాటు తేనెలోని చిక్కదనం కూడా ఇందుకు దోహదం చేస్తోందని వారు వివరించారు.
________________________________________________________________________
స్టెతస్కోపుని ఎప్పుడు కనుగొన్నారు?
Posted on: Wed 13 Nov 23:53:20.731511 2013
మనిషి శరీరంలోని వివిధ అవయవాలు చేసే ధ్వనులను స్పష్టంగా వినేందుకు తద్వారా రోగ నిర్ధారణ చేసేందుకు నేడు స్టెతస్కోపు అనే సాధనం డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చిత్రంగా, వైద్యరంగంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ సాధనం పిల్లలు ఆడుకునే ఓ ఆట నుంచి ఆవిష్కరింపబడింది! థియోఫిల్ హÄయాసింథ్ అనే 19వ శతాబ్దంలో జీవించిన ఒక ఫ్రెంచి వైద్యుడు... ఒకనాడు కొందరు పిల్లలు ఆడుకుంటున్న ఓ ఆటను చాలా ఆసక్తిగా గమనించాడు. ఆ సమయంలో పిల్లలు ... ఒక వెదురు బొంగు తాలూకూ ఓ కొసని పిన్నుతో గీరుతూ, ఆ బొంగు రెండవ కొసన విన్పించే ధ్వనులను (తమ చెవులను దానికి ఆనించి వింటూ) ఆలకిస్తూ ఆనందిస్తున్నారు. దీని నుంచి ప్రేరణ పొందిన ఆ ఫ్రెంచి వైద్యుడు క్రీ.శ. 1816లో అడుగు పొడవుండే ఒక వెదురు బొంగును తీసుకుని, దానిని స్టెతస్కోపులా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆ వెదురు బొంగు ఒక కొసని రోగుల ఛాతీ మీద ఆనించి, వారి ఛాతీ నుంచి, గుండె నుంచి విన్పించే శబ్ధాలను అతను జాగ్రత్తగా ఆలకించేవాడు. ఇలా వివిధ సందర్భాలలో వారి నుంచి విన్పించే ధ్వనులను విశ్లేషించి, ఆÄయా వ్యక్తుల ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోగలిగేవాడు. తను కనుగొన్న విషÄయాల గురించి 1819లో ఆయనొక మంచి పుస్తకం కూడా రాశారు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే వైద్యరంగంలో స్టెతస్కోపు వాడకం బాగా పెరిగింది. దాని నిర్మాణం కూడా ఎంతో అభివృద్ధిచెంది, అత్యంత సునిశితమైన సాధనంగా అది అవతరించింది.
________________________________________________________________________
పర్యావరణ క్షీణత .. అభివృద్ధి సమస్యలు ..
'ఒకే ఒకవ్యక్తి (అప్పటి పర్యావరణ అటవీశాఖా మంత్రి జయరాం
రమేష్ బిటి వంగ సేద్యానికి విడుదల నిలిపి వేసిన నేపథ్యం) ఎంతో ఖర్చుతో,
ఎంతోమంది శాస్త్రజ్ఞులు, ఎన్నో ఏళ్లుగా చేసిన కృషిని ఒక్క కలం పోటుతో
నిలువరించగలిగాడు.' అని బాసిల్లస్ తురింజినిసిస్ (బిటి) సాంకేతికాన్ని
వాణిజ్య వినియోగంలోకి తెచ్చి, వేల కోట్ల లాభాల్ని పొందుతున్న కంపెనీ
సమర్థకులు కొంతమంది తీవ్ర విమర్శను చేశారు. తద్వార రైతులకు న్యాయంగా
రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి అడ్డు నిలుస్తున్నారనే ఆరోపణలూ చేశారు. ఈ
బహిరంగ విమర్శలకు ముందే జయరాం రమేష్ శాఖ మారిపోయింది. ఇదేవిధంగా,
చట్టవ్యతిరేకంగా, అన్నిరకాల పర్యా వరణ సమస్యలను సృష్టిస్తూ అడ్డగోలుగా
కొల్లగొడుతున్న వివిధ రకాల మైనింగ్, ఇసుక తరలింపు గ్యాంగు (మాఫియా) లపై,
వారికి మద్దతిస్తున్న పాలకులపై, ఉన్నతాధికారులపై ఆర్థిక ఆరోపణ లనే
చేస్తున్నారు తప్ప, పర్యావరణానికి కలిగిస్తున్న నష్టాన్ని ప్రశ్నిం చడం
లేదు. ఈ ధోరణి పర్యావరణ క్షీణతకు, ఆర్థికాభివృద్ధికి, రాజ కీయ ప్రమేయానికి
ఉన్న సమీప సంబంధాల్ని చెప్పకనే చెప్తుంది. ఈ నేపథ్యంలో 'పర్యావరణ క్షీణత..
అభివృద్ధి సమస్యలను..' ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు సహకారంతో
సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
సుస్థిరాభివృద్ధి క్రమంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతకు గుర్తింపుగా 2004లో 'జాతీయ పర్యావరణ విధానం' రూపొందింది. జనాభా పెరుగుదల, సాంకేతిక, వినిమయ ఎంపికలు పర్యావరణ క్షీణతకు సమీప కారణాలుగా జాతీయ విధానం గుర్తిస్తుంది. ఇవన్నీ పేదరికానికి దారితీస్తున్నాయి. సాంద్ర వ్యవసాయం, కాలుష్య పరిశ్రమలు, అడ్డగోలు పట్టణీకరణ పేదరికాన్ని పెంచుతున్నాయి. పర్యావరణాన్ని పట్టించుకోలేని విధిలేని పరిస్థితులు సృష్టించబడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటికి తోడుగా పెరుగుతున్న విదేశీ వాణిజ్యలోటు, రుణభారం ద్రవ్యపెట్టుబడి అవసరాల్ని తీర్చడం కోసం పర్యావరణ నాణ్యతా ప్రమాణాల అమలు విషయంలో రాజీ ధోరణితో పర్యావరణ క్షీణత వేగవంతమవు తుంది. పెరుగుతున్న అవినీతి, రాజకీయ బలహీనతలు వీటికి తోడవుతున్నాయి. అందువల్ల 'జాతీయ పర్యావరణ విధాన' లక్ష్యాలు, సూత్రాలు ఎంతో ఆకర్షణీ యంగా, అభిలషించేవిగా పైకి కనపడుతున్నప్పటికీ, ఆచరణలో ఇవి ఉన్నత ఆకాంక్షలుగానే మిగిలిపోతున్నాయని ఇప్పటి అనుభవాలు తెలియజేస్తున్నాయి.
ఆర్థికాభివృద్ధిలో..
జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదలపై పెడుతున్న ప్రాధాన్యత పర్యావరణాన్ని క్షీణింపజేస్తుంది. ప్రకృతి వనరుల వినియోగ నియంత్రణ, కాలుష్య నివారణకు సంబంధించిన సంస్థల వైఫల్యాలు కూడా క్షీణింపజేస్తున్నాయి. అందువల్ల, జాతీయ స్థూల ఉత్పత్తి ద్వారా లభిస్తున్న సంకేతాలు ముందుకొస్తున్న క్షీణతను మరుగునపరుస్తున్నాయి.
దుష్ప్రభావాలు..
క్షీణిస్తున్న పర్యావరణంతో ఎన్నో సమస్యలు ముందుకొస్తున్నాయి. దీంతో పేదలు ఎక్కువ కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. భూగోళ వాతావరణం వేడెక్కడం వల్ల పేదలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇపుడు మన దేశంలో దాదాపు 20 శాతం రోగాలు పర్యావరణ క్షీణించడం వల్ల వస్తున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. పోషకలోపాలు, నాణ్యమైన నీరు, ఇంధన అందుబాటు పేదరికంతో సంబంధం కలిగి ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం, విజ్ఞానస్థాయిని పెంచకుండా వీటిని అందరికీ అందించలేం. గతంలో గ్రామీణ సమిష్టి వనరులైన నీరు, పచ్చికబయిళ్లు, స్థానిక అడవులు, చేపలు అతిగా వాడకుండా స్థానికులు జాగ్రత్తలు తీసుకునేవారు. జరిమానాలు విధించి మరీ ఈ వనరుల్ని కాపాడేవారు. కానీ, పట్టణీకరణ ద్వారా జరుగుతున్న అభివృద్ధి జనాభా పెరుగుదల, వ్యక్తుల హక్కుల పుష్టీకరణ, గ్రామ సమిష్టి వనరుల నాణ్యతను కొల్లగొడుతుంది. మార్కెట్‌శక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా పర్యావరణ క్షీణతను పెంచుతుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రకృతి వనరుల క్షీణత వేగవంతమవుతుంది. స్థానికుల జీవనం విచ్ఛిన్నమవుతుంది. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు, కార్యక్రమాల వల్ల పర్యావరణ నియంత్రణ వైఫల్యం చెందుతుంది. సేద్య విధానం, దానికోసం అనుసరించే ఉత్పత్తి పద్ధతి పర్యావరణంపై దుష్ప్రభావం కలిగి ఉంది.
భూగోళ మార్పులు..
భూగోళ వాతావరణంలో కలుగుతున్న మార్పులు, ఓజోన్ పొర, జీవవైవిధ్య క్షీణత ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతున్నాయి. వీటి గురించి ఈ శీర్షికలోనే గతంలో చర్చించుకున్నాం. ఈ సమస్యల పరిష్కారానికి ప్రపంచ వనరుల వినియోగంలో (ఉదా: ముడిచమురు) సమిష్టి ప్రయోజనాల్ని గుర్తింప జేయడం కీలకం. ఇది అంత తేలికకాదని ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి. భూగోళ వాతావరణ పరిరక్షణలో అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్తవ్యాల్ని నిర్వర్తించకుండా, 'కార్బన్ ట్రేడింగ్' పేరుతో అసలు బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపై నెడుతున్నాయి. పేదలు, పేద దేశాలు ఈ దుష్ప్రభావాల భారాల్ని మోయాల్సి వస్తుంది.
విధాన లక్ష్యాలు..
సూత్రాలు..
ప్రకృతి వనరుల పరిరక్షణ..
పర్యావరణ క్షీణతకు అశాస్త్రీయ ఉత్పత్తి, వినిమయ పద్ధతులే సమీప కారణాలు. కానీ, వీటిమీదే కేంద్రీకరిస్తూ పర్యావరణ క్షీణతను నిలువరించలేం. అంతిమంగా, పర్యావరణ క్షీణతకు సంబంధిత విధానాలు, సంస్థల వైఫల్యాలు కారణాలుగా భావించాలి. దీనికితోడు పర్యావరణ క్షీణత కారణాలు, ప్రభావాలపై సరైన విజ్ఞానం లేకపోవడమూ మరో కారణంగా భావించాలి. అందువల్ల పాలకుల్ని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. పర్యావరణ పరిరక్షణకు ఇది కీలకం.
భూసార క్షీణత..
కోత, చౌడు తేలడం వల్ల, నీటి ముంపు, కాలుష్యం, సేంద్రీయ పదార్థ స్థాయి తగ్గడం భూసార క్షీణతకు అంతర్లీన సమీప కారణా లుగా చెప్పవచ్చు. అడవులు, చెట్ల నరికివేత, అవసరానికి మించిన నీటి వినియోగం, వ్యవసాయ రసాయనాల దుర్వినియోగం, పశువుల వ్యర్థాలను ఎరువులుగా కాక, ఇంటి అవసరాలకు (ఉదా: పేడ, చెత్తా చెదారం) వాడుకోవడం. మంచి ఉత్పత్తినిచ్చే భూముల్ని పారిశ్రామిక, గృహ సంబంధాల వ్యర్థాలతో నింపడం, తదితరాలు భూసార ఉత్పా దకతను తగ్గిస్తున్నాయి. ఇవన్నీ అంతిమంగా నీరు, విద్యుత్, ఎరువులు, సస్యరక్షణ మందులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. వినియోగఛార్జీలు, పన్నుల విధానాలు భూ ఉత్పాదకతపై ప్రభావం కలిగిస్తున్నాయని కొంతమంది భావిస్తున్నారు. సుస్థిర భూ వినియోగ పరిశోధనా ఫలితాలను పెద్దఎత్తున ప్రచారం చేయాలి. క్షీణిస్తున్న భూముల్ని స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిపరచాలి.

'జాతీయ పర్యావరణ విధానం-2004' లో ఈ కింది ప్రధాన లక్ష్యాలతో
రూపొందించబడింది. కీలక వనరుల పరిరక్షణ.
పేదలు సహా అందరికీ జీవనభద్రత. భవిష్యత్తరాల అవసరాలను
కూడా సమదృష్టితో చూస్తూ ఇప్పటి అవసరాలను తీర్చుకోవాలి.
పర్యావరణ పరిరక్షణను ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో
విధానపరంగా ఇమడ్చాలి.పారదర్శక బాధ్యతతో పర్యావరణ
భాగస్వామ్య యాజమాన్యం. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన
నిధుల కేటాయింపు పెంపకం.

పర్యావరణ
క్షీణతను నిలువరించి, పునరుద్ధరించడంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు సమన్వయంతో కింది సూత్రాల
ఆధారంగా పనిచేయాలని విధానపత్రం అభిలషిస్తుంది.సుస్థిరాభివృద్ధిలో
మానవులే ప్రధాన పాత్రధారులు.అభివృద్ధిలో ఇప్పటి, భవిష్యత్తరాలకు
సమానహక్కులు కలిగి ఉండాలి.అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ
అంతర్భాగం.పర్యావరణ వనరులకు నష్టం జరిగే ప్రమాదం
తీవ్రంగా ఉన్నప్పుడు (లేదా) పునరుద్ధరించలేమని
భావించినప్పుడు సరైన ఆధారం అందుబాటులో
లేదనో (లేదా) ఖర్చును తగ్గించాలనే మిషతో నియంత్రణ
చర్యలను వాయిదా వేయకూడదు. ముందు జాగ్రత్తలూ
(ప్రికాషనరీ ప్రిన్సిపుల్) తీసుకోవాలి.
ఆర్థిక సామర్థ్యం ఉండేలా పర్యావరణ వనరుల వినియోగాన్ని
రూపొందించాలి. కాలుష్యానికి కారణమైన వారే ఖర్చులు
భరించాలి. ముఖ్యంగా ఇతరులు ప్రభావితమవుతున్నప్పుడు
ఆర్థిక సామర్థ్యాన్ని పట్టించుకోవాలి. కాలుష్య కారకుల ఖర్చు
భరించేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఉత్పత్తి వినియోగంలో కాలుష్య నివారణ ఖర్చు అంతర్భాగం
కావాలి. దీనికోసం తగిన ప్రోత్సాహాన్నివ్వాలి.
కాలుష్య అవకాశాలున్నప్పుడు ఖర్చు, ఆదాయంతో నిమిత్తం
లేకుండా పర్యావరణ పరిరక్షణకు నిధులు కేటాయించాలి.
కాలుష్య కారకులపై చట్టపర చర్యలు తీసుకోవాలి.
అన్ని ప్రకృతి వనరులకూ ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమే.
సొంతదారు కాదు.అన్నిస్థాయిల్లో వికేంద్రీకరణ, జవాబుదారీతనం
ఉండాలి.పర్యావరణ సంబంధిత విధాన పరిశోధనల్లో సామాజిక,
ప్రకృతిశాస్త్రాల విజ్ఞానాన్ని సమన్వయంతో జోడించాలి.
పర్యావరణ ప్రమాణాలను ఆర్థిక, సామాజిక అభివృద్ధి స్థితగతుల్ని
దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి.మానవారోగ్యానికి, పర్యావరణానికి
ఎదురవుతున్న ఇబ్బందులను, సాంకేతిక సాధ్యాసాధ్యాల్ని,
ఇమిడి వున్న ఖర్చులను, వ్యూహాత్మక అంశాలను గమనంలో
ఉంచుకొని పర్యావరణ నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించాలి.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రధానం.ప్రమాద అంచున
ఉన్న వ్యవస్థ (ఉదా: మడ అడవులు), అంతరించిపోగల
జీవ రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.పై సూత్రాల ఆధారంగా
పర్యావరణ, అటవీశాఖల అనుమతులు, సముద్ర తీరప్రాంతాల
అనుమతి నియంత్రణ,మార్పు చేసిన జీవుల (జీవ సాంకేతిక విజ్ఞానం)
అనుమతి, ప్రకృతి సున్నిత ప్రాంతాల పరిరక్షణ తదితరాలన్నీ అమలు
జరుగుతున్న తీరును పర్యవేక్షించాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు సమన్వయంతో కింది సూత్రాల
ఆధారంగా పనిచేయాలని విధానపత్రం అభిలషిస్తుంది.సుస్థిరాభివృద్ధిలో
మానవులే ప్రధాన పాత్రధారులు.అభివృద్ధిలో ఇప్పటి, భవిష్యత్తరాలకు
సమానహక్కులు కలిగి ఉండాలి.అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ
అంతర్భాగం.పర్యావరణ వనరులకు నష్టం జరిగే ప్రమాదం
తీవ్రంగా ఉన్నప్పుడు (లేదా) పునరుద్ధరించలేమని
భావించినప్పుడు సరైన ఆధారం అందుబాటులో
లేదనో (లేదా) ఖర్చును తగ్గించాలనే మిషతో నియంత్రణ
చర్యలను వాయిదా వేయకూడదు. ముందు జాగ్రత్తలూ
(ప్రికాషనరీ ప్రిన్సిపుల్) తీసుకోవాలి.
ఆర్థిక సామర్థ్యం ఉండేలా పర్యావరణ వనరుల వినియోగాన్ని
రూపొందించాలి. కాలుష్యానికి కారణమైన వారే ఖర్చులు
భరించాలి. ముఖ్యంగా ఇతరులు ప్రభావితమవుతున్నప్పుడు
ఆర్థిక సామర్థ్యాన్ని పట్టించుకోవాలి. కాలుష్య కారకుల ఖర్చు
భరించేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఉత్పత్తి వినియోగంలో కాలుష్య నివారణ ఖర్చు అంతర్భాగం
కావాలి. దీనికోసం తగిన ప్రోత్సాహాన్నివ్వాలి.
కాలుష్య అవకాశాలున్నప్పుడు ఖర్చు, ఆదాయంతో నిమిత్తం
లేకుండా పర్యావరణ పరిరక్షణకు నిధులు కేటాయించాలి.
కాలుష్య కారకులపై చట్టపర చర్యలు తీసుకోవాలి.
అన్ని ప్రకృతి వనరులకూ ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమే.
సొంతదారు కాదు.అన్నిస్థాయిల్లో వికేంద్రీకరణ, జవాబుదారీతనం
ఉండాలి.పర్యావరణ సంబంధిత విధాన పరిశోధనల్లో సామాజిక,
ప్రకృతిశాస్త్రాల విజ్ఞానాన్ని సమన్వయంతో జోడించాలి.
పర్యావరణ ప్రమాణాలను ఆర్థిక, సామాజిక అభివృద్ధి స్థితగతుల్ని
దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి.మానవారోగ్యానికి, పర్యావరణానికి
ఎదురవుతున్న ఇబ్బందులను, సాంకేతిక సాధ్యాసాధ్యాల్ని,
ఇమిడి వున్న ఖర్చులను, వ్యూహాత్మక అంశాలను గమనంలో
ఉంచుకొని పర్యావరణ నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించాలి.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రధానం.ప్రమాద అంచున
ఉన్న వ్యవస్థ (ఉదా: మడ అడవులు), అంతరించిపోగల
జీవ రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.పై సూత్రాల ఆధారంగా
పర్యావరణ, అటవీశాఖల అనుమతులు, సముద్ర తీరప్రాంతాల
అనుమతి నియంత్రణ,మార్పు చేసిన జీవుల (జీవ సాంకేతిక విజ్ఞానం)
అనుమతి, ప్రకృతి సున్నిత ప్రాంతాల పరిరక్షణ తదితరాలన్నీ అమలు
జరుగుతున్న తీరును పర్యవేక్షించాలి.
ప్రకృతి వనరుల పరిరక్షణ..
పర్యావరణ క్షీణతకు అశాస్త్రీయ ఉత్పత్తి, వినిమయ పద్ధతులే సమీప కారణాలు. కానీ, వీటిమీదే కేంద్రీకరిస్తూ పర్యావరణ క్షీణతను నిలువరించలేం. అంతిమంగా, పర్యావరణ క్షీణతకు సంబంధిత విధానాలు, సంస్థల వైఫల్యాలు కారణాలుగా భావించాలి. దీనికితోడు పర్యావరణ క్షీణత కారణాలు, ప్రభావాలపై సరైన విజ్ఞానం లేకపోవడమూ మరో కారణంగా భావించాలి. అందువల్ల పాలకుల్ని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. పర్యావరణ పరిరక్షణకు ఇది కీలకం.
భూసార క్షీణత..
కోత, చౌడు తేలడం వల్ల, నీటి ముంపు, కాలుష్యం, సేంద్రీయ పదార్థ స్థాయి తగ్గడం భూసార క్షీణతకు అంతర్లీన సమీప కారణా లుగా చెప్పవచ్చు. అడవులు, చెట్ల నరికివేత, అవసరానికి మించిన నీటి వినియోగం, వ్యవసాయ రసాయనాల దుర్వినియోగం, పశువుల వ్యర్థాలను ఎరువులుగా కాక, ఇంటి అవసరాలకు (ఉదా: పేడ, చెత్తా చెదారం) వాడుకోవడం. మంచి ఉత్పత్తినిచ్చే భూముల్ని పారిశ్రామిక, గృహ సంబంధాల వ్యర్థాలతో నింపడం, తదితరాలు భూసార ఉత్పా దకతను తగ్గిస్తున్నాయి. ఇవన్నీ అంతిమంగా నీరు, విద్యుత్, ఎరువులు, సస్యరక్షణ మందులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. వినియోగఛార్జీలు, పన్నుల విధానాలు భూ ఉత్పాదకతపై ప్రభావం కలిగిస్తున్నాయని కొంతమంది భావిస్తున్నారు. సుస్థిర భూ వినియోగ పరిశోధనా ఫలితాలను పెద్దఎత్తున ప్రచారం చేయాలి. క్షీణిస్తున్న భూముల్ని స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిపరచాలి.
జీవవైవిధ్యం.. సాంప్రదాయ విజ్ఞానం.. ప్రకృతి వారసత్వం..
భూసార క్షీణత, అడవుల నరికివేత, మాగాణి మార్పు, అతి నీటి వినియోగంతో కలిగే కాలుష్యం, తీరప్రాంత వ్యవస్థ క్షీణతల వల్ల జీవవైవిధ్యం, సాంప్రదాయ విజ్ఞానం, ప్రకృతి వారసత్వాన్ని కోల్పోతున్నాం. జన్యు వైవిధ్య పరిరక్షణ పంటలాభివృద్ధికి కీలకం. బెట్టను తట్టుకునే రకాల్ని, కొత్త ఔషధ రకాల్ని తయారుచేయడానికి ఇవి అవసరం. వీటిలో సాంప్రదాయ, సానుకూలాంశాలను పరిరక్షించుకోవాలి. జీవవైవిధ్య ప్రాంతాలను గుర్తించి, ప్రకృతి వారసత్వ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. నదీ నీటివ్యవస్థను, తాజా నీటి వనరులను పరిరక్షించాలి. భూగర్భ జల సంపదను అతిగా వాడకుండా, సుస్థిర స్థాయిలోనే వాడుకోవాలి. నిరంతరం తేమగల భూములను, పర్వత పర్యావరణ వ్యవస్థలను, సముద్రతీర వనరులను పరిరక్షించాలి. వాయు, నీటి, భూమి, ధ్వని కాలుష్యాలను నివారించే చర్యలు తీసుకోవాలి. భూమి కాలుష్యం ఒకసారి వచ్చాక, తొలగించడం చాలా కష్టం. ముందు జాగ్రత్తలే ముఖ్యం.
వాతావరణ మార్పులు..
భూగర్భ ఇంధన వినియోగం, కొన్ని సేద్య, పారిశ్రామిక కార్యక్రమాలు, అడవుల నరికివేత వంటి చర్యలు గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను పెంచుతూ వాతావరణాన్ని వేడిక్కిస్తూ, మార్పుల్ని తెస్తున్నాయి. దీనివల్ల ఎన్నో జీవుల ఆర్థిక, ఆరోగ్య స్థితులు విచ్ఛిన్నమవుతున్నాయి. 2004లో 122.8 కోట్ల టన్నుల (కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో) కు సమానమైన గ్రీన్‌హౌస్ వాయువులు భారతదేశం నుండి విడుదలయ్యాయని అంచన. ఇది ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయువుల్లో మూడు శాతం కన్నా తక్కువ. ప్రపంచ సగటు విడుదలలో ఇది 23 శాతమే. అమెరికా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల్లో మనది నాలుగు శాతం మాత్రమే. అయితే, పునరుద్ధరించగల ఇంధన వినియోగంలో భారత భాగం 36 శాతం. అంటే అభివృద్ధి చెందిన దేశాలకన్నా భూగోళ వాతావరణ కాలుష్యానికి మన భాగస్వామ్యం చాలా తక్కువని చెప్పవచ్చు. అయినా, సుస్థిరాభివృద్ధికి అన్నిచర్యలూ తీసుకోవాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి
_________________________________________________________
మలేరియాపై మరో విజయం
సుమారు వందేళ్లుగా మానవులకు, అదీ భూమధ్యరేఖ ప్రాంతం లోని ప్రజలకు, ప్రాణాంతక వ్యాధిగా మలేరియా సుపరిచితమే. ఇంత అభివృద్ధి సాధించినా మలేరియా కారకమైన ప్లాస్మోడియం సూక్ష్మజీవినీ, దాన్ని మనకు అంటించే అతి చిన్న అనాఫిలేస్ దోమనూ ఏమీ చేయలేకపోయాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాది క్రితం సుమారు ఏడు లక్షల మంది మలేరియాతో చనిపోయారు. తాజాగా దాన్ని ఎదుర్కొనే మందు ఒకటి తయారైంది. కానీ అధికధర వల్ల అది అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అది చౌకగా, సులభంగా తయారు కావచ్చని అంటున్నారు పరిశోధకులు. 'ఆర్తిమిసినిన్' అనే మలేరియా మందుని తయారుచేసేందుకు కొత్త ప్రక్రియ కనుగొన్నారు. ఆ మందు సహజంగా పెరిగే ఒక మొక్క నుండి తయారవుతుంది. దాన్ని కొన్ని దశాబ్దాల నుండి చైనీస్ వైద్యంలో వాడుతున్నారు. 70వ దశక ప్రారంభంలో 'టు యు యు' అనే శాస్త్రవేత్త ఆ మందులో క్రియాత్మక పదార్థాన్ని గుర్తించింది. అందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు 'లాస్కర్ డి బెకీ క్లినికల్ మెడికల్ రీసెర్చ్' అవార్డ్‌ను ఇచ్చింది. అంతవరకూ ఉన్న అనేక మలేరియా మందులకన్నా 'ఆర్తిమిసినిన్' మెరుగ్గా పనిచేస్తుందని తేలింది. దాంతో, డబ్ల్యుహెచ్‌ఓ దానినే ప్రోత్సహిస్తుంది. అయితే, ఆ మొక్కలో కేవలం 0.001% నుండి 0.8% మందు తీయవచ్చట. కొత్త ప్రక్రియతో మొక్క నుండి వెలికి వచ్చే మరో ఆమ్లాన్ని ఉప యోగించి ప్రస్తుతం రోజుకు 800 గ్రాముల మందును తయారు చేస్తున్నారు. మరో మూడునెలల్లో రోజుకు రెండు, మూడు కిలోల మందు తయారుచేయవచ్చని సీబర్గర్, లేవిస్క్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఏదేమైనా, ఈ దశాబ్దంలోనైనా మలేరియాని రూపు మాపగలమేమో చూడాలి.
_____________________________________________________
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
భూమి సూర్యుని చుట్టూ ఎందుకు తిరగాలి? ఒకవేళ తిరగాల్సి వస్తే తన చుట్టూ తాను తిరుగుతూ ఎందుకు తిరగాలి? సూర్యుడిలాగే భూమి కూడా నిశ్చలముగా ఉండవచ్చును కదా?!
- ఓ పాఠకుడు
ఈ విశాల విశ్వంలో ఏదీ నిశ్చలము (stationary) గా లేదు. కాబట్టి సూర్యుడు నిశ్చలముగా ఉంటున్నట్టు అనుకోవద్దు. పాలపుంత గెలాక్సీలో ఓ మారుమూల కీల (radial wing of Milky Way galaxy) లో సూర్యుడు గమనంలో ఉన్నాడు. పైగా సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూనే గెలాక్సీలో పరిభ్రమి స్తున్నాడు. పాదార్థిక ప్రపంచంలో ప్రతిస్థాయిలోనూ విరుద్ధభావాలున్నాయి. ద్రవ్యరాశి (mass) ఉన్న ఏవేని రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ (gravitational attraction)ఉంటుంది. అదే సమయంలో ఆ గురుత్వాకర్షణను తప్పించుకొని తన ఉనికిని కాపాడుకోవాలనే జడ (inertial) స్వభావం కూడా ఉంటుంది. ఈ రెండు విరుద్ధ భావాలు పరస్పరం ఘర్షించుకుంటూ ఉంటాయి. అయినా కలిసే ఉంటాయి. గతితార్కిక భౌతికవాదం (dialectical materialism) అనే సంపూర్ణ విశ్వతాత్వికత (universal philosophy) కి ఇది ప్రథమసూత్రం. భూమి, సూర్యుడు పదార్థ స్వరూపాలు. వాటి మధ్య అత్యంత గురుత్వాకర్షణ బలం ఉంది. దీన్ని అధిగమించి తన స్థానాన్ని నిలుపుకోవాలంటే భూమి మీద సూర్యుడికి వ్యతిరేకదిశలో అంతే బలంతో పనిచేసే మరో బలం సమకూరాలి. దానిపేరే అపలంబ బలం(centrifugal force). కానీ ఇది గురుత్వాకర్షకబలంలాగా నిలకడబలం (static force) కాదు. కేవలం చక్రీయ గమనం (circular motion) ద్వారా మాత్రమే సంభవిస్తుంది. కాబట్టి ఇది గమనబలం (dynamic force). అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగాలి. సుమారు 365 రోజులకో చుట్టు చుట్టేలా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. తద్వారా తనకూ, సూర్యుడికీ మధ్య ఉన్న గురుత్వా కర్షణ బలాన్ని తటస్ఠం చేస్తుంది. కాబట్టి సూర్యుడి చుట్టూ భూ పరిభ్రమణం (revolution) అవసరం.
చక్రీయ మార్గంలో తిరిగే ప్రతి వస్తువుకు మరో నూతన భౌతికరాశి సంక్రమిస్తుంది. దానిపేరు కోణీయ ద్రవ్యవేగం(angular momentum). బాహ్య పరిస్థితులకు సంబంధంలేని వ్యవస్థ (system) ను ఐసోలేటెడ్ వ్యవస్థ (isolated system) అంటారు. ఇలాంటి ఐసోలేటెడ్ వ్యవస్థలో కోణీయ ద్రవ్యవేగం నికరంగా(resultant) శూన్యం(zero) కావాలి. మరి తిరిగే వ్యవస్థకు కోణీయ ద్రవ్యవేగం ఉండాల్సిందేననడం ఓ వాస్తవమే. దానికి విరుద్ధ వాస్తవం ఐసోలేటెడ్ వ్యవస్థలో నికర కోణీయ ద్రవ్యవేగం (resultant angular momentum) శూన్యం కావాలనడం. అందువల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కొత్త కోణీయ ద్రవ్యవేగాన్ని సంతరించు కొంటుంది. దీన్ని భ్రమణ కోణీయ ద్రవ్యవేగం (spin angular momentum) అంటారు. ఇది భూమికి పరిభ్రమణం వల్ల ఏర్పడిన కక్ష్యా కోణీయ ద్రవ్యవేగాని (orbital angular momentum) కి వ్యతిరేకదిశలో పనిచేయడం వల్ల, విలువలో సమానం కావడం వల్ల భూ గమనంలో నికర కోణీయ ద్రవ్యవేగం శూన్యం కాగలిగింది. అందువల్లే భూమి తన చుట్టూ తాను (భ్రూభ్రమణం) తిరగాలి.
______________________________________________________
మూఢనమ్మకం అంటే ఏమిటి?
- టి.చెన్నకేశ్వరి, రామచంద్రాపురం
వాస్తవాలకు విరుద్ధంగా ఏర్పర్చుకొనే నమ్మకా లనే మూఢనమ్మకాలు అంటాము. మొరటుగా ఓ ఉదాహరణను ఇవ్వాలనుకొంటే.. 'స్త్రీల గర్భంలో పిండోత్పత్తి(embryological development)ద్వారా శిశువు జన్మిస్తుంది. ఇది వాస్తవం. కానీ అలా కాకుండా 'పురుషుడి పొట్టలో (stomach) శిశువు ఎదిగి నోట్లోంచి బిడ్డ బయటి కొస్తుంది'. ఓ వ్యక్తి ఇలా అనుకుంటున్నాడను కుందాం. ఇది మూడింతల అబద్ధం. శిశువు జన్మించేది స్త్రీకి, పురుషుడికి కాదు. శిశువు పెరిగేది గర్భంలో; పొట్టలో కాదు. శిశువు బయటపడేది యోని (vagina)మార్గం ద్వారా, నోటి నుంచి కాదు. ఇలా వాస్తవాలకు విరుద్ధంగా మనిషి ఏర్పర్చుకొనే ఏ నమ్మకమైనా మూఢనమ్మకమే. మరో ఉదాహరణ. యజ్ఞం చేస్తే వర్షం వస్తుందనీ, దేవాలయంలో పూజలు చేస్తే రాకెట్టుకు అంతరాయం ఉండదనీ, దేవుడికి మొక్కుకొంటే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారనీ, ఫలాని దేవాలయంలోనే పూజలు చేస్తే అమెరికా వీసా లభిస్తుందనీ, చనిపోయిన దేహాన్ని పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజులకు తిరిగి సజీవంగా బయటికొస్తాడనీ, పురుషుడితో సాంగత్యం లేకుండానే ఓ స్త్రీ బిడ్డకు జన్మనిస్తుందనీ, ఇద్దరు పురుషులు సంగమిస్తే మరో పురుషుడు పుడతాడనీ, మనిషి భవిష్యత్తును తారల సముదాయాలు (constellations)నిర్ణయిస్తాయనీ - ఇలా చాలా మూఢనమ్మకాలు సాధారణ ప్రజల్లోనే కాదు, పెద్దపెద్ద మేధావులనబడే వారిలోనూ, శాస్త్రీయ అవగాహనకు పెద్దపీట వేయాల్సిన విద్యాసంస్థల అధిపతుల్లో కూడా ఉన్నాయి.
_____________________________________________________
ఇంటివైద్యం -- జీలకర్ర
- 29/01/2012 |
- - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
నల్లజీలకర్రను నీళ్లకు వేసి మరిగించి కషాయం సిద్ధం చేసుకోండి. ఈ నీళ్లలో ఒక
కాటన్ గుడ్డను ముంచి మలద్వారం నుంచి వెలుపలకు వచ్చి దురదను, నొప్పినీ
కలిగించే అర్శమొలల మీద కాపడం పెట్టుకోండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే మూల
వ్యాధి సమూలంగా తగ్గుతుంది.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాసు నీళ్లకు వేసి పావు గ్లాసు కషాయం మిగిలేంత వరకూ మరిగించండి. దీనికి ఒక టీస్పూన్ పటికబెల్లం పొడిని కలిపి తాగండి. ఇలా రెండు పూటలా చేస్తుంటే అర్శమొలల తాలూకు వాపు, నొప్పి తగ్గుతాయి. అలాగే జీలకర్ర పొడిని నీళ్లతో కలిపి లేపనంలాగా పైల్స్ మీద పూసుకోండి.
ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను రెండు కప్పుల నీళ్లకు వేసి మరిగించండి. అరకప్పు కషాయం మిగిలిన తరువాత దించి తాగండి. ఇలా రెండు పూటలా కొన్ని రోజులపాటు తాగితే పేగుల్లోని ఆంత్రక్రిములు నశిస్తాయి.
జీలకర్రను ఒక గుడ్డలో చుట్టి, మంట మీద మండించి, దాని నుంచి వచ్చే పొగను వాసన పీల్చండి. దీంతో వాంతులు తగ్గుతాయి.
అర టీ స్పూన్ నిమ్మరసాన్ని, అర టీ స్పూన్ ఉప్పునూ కలిపి ఆరబెట్టండి. భావన జీలకర్ర తయారవుతుంది. దీనిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడల్లా నోటిలో వేసుకొని చప్పరిస్తూ ఉంటే వికారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది గర్భధారణలో జరిగే వాంతులను తగ్గిస్తుంది.
జీలకర్ర చూర్ణం, ధనియాల చూర్ణం, నెయ్యి వీటిని సమంగా కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా తింటే మందాగ్ని సమస్య దూరమవుతుంది.
రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను ఒక కప్పు నీళ్లలో వేసి పావు కప్పు కషాయం మిగిలేంత వరకూ మరిగించండి. తరువాత దించి, వడ పోసుకోండి. దీనికి అర టీ స్పూన్ మిరియాల చూర్ణం, అర టీ స్పూన్ ఉప్పును కలిపి తీసుకుంటే పుల్లని త్రేన్పులు ఆగిపోతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మలంలో దుర్గంధం దూరమవుతుంది.
నల్లజీలకర్రను గాని లేదా తెల్లజీలకర్రను గాని నీళ్లకు వేసి కషాయం తయారుచేయాలి. దీనిని ఒక బాత్‌టబ్ నీళ్లకు కలిపి దానిలో బొడ్డు మునిగే వరకూ కూర్చోవాలి. దీంతో గర్భాశయ శోథ తగ్గుతుంది.
నల్ల జీలకర్రను నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసుకోండి. దీనికి తగినంత పంచదారను కలిపి తీసుకుంటే మూత్రం కష్టంగా రావటం, మూత్రంలో మంట ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ జీలకర్ర చూర్ణం, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడిని అర కప్పు బియ్యం కడగు నీళ్లకి కలిపి తాగితే మహిళల్లో తెల్లబట్ట, ఎర్రబట్ట సమస్యలు తగ్గుతాయి. దీనిని రెండు పూటలా 40 రోజులు వాడితే మంచిది.
శొంఠి పొడి, జీలకర్ర పొడి వీటిని నీళ్లతో కలిపి పేస్టులాగా తయారుచేసి పూస్తే సాలెపురుగు విషం దిగుతుంది.
ఒక టీ స్పూన్ జీలకర్రను, ఒక టీస్పూన్ మిరియాల పొడినీ నీళ్లకు కలిపి మరిగించి వడపోసి, రెండు పూటలా తాగితే పిచ్చికుక్క కరిచినప్పుడు ప్రథమ చికిత్సగా పని చేస్తుంది.
జీలకర్ర, ఉప్పులను కలిపి నూరండి. దీనికి తేనె, నెయ్యిలను కలపండి. పేస్టులాగా చేసి కొద్దిగా వేడి చేయండి. దీనిని తేలు కాటు మీద పూయండి. దీంతో విషం దిగుతుంది.
40 గ్రాముల జీలకర్రను, 20 గ్రాముల సిందూరాన్ని 320 మి.లీ. ఆవనూనెను కలిపి మరిగించి నిల్వ చేసుకోండి. దీనిని దురదలు, కురుపుల మీద పూస్తే ఉపశమనం లభిస్తుంది.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని 20 మి.లీ. దేవకాంచనం చెట్టు పట్ట రసానికి కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఇలా రోజుకి 3సార్లు వారం పాటు తీసుకోవాలి.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఆవు పాలలో తడిపి ఎండబెట్టండి. తరువాత దీనిని పొడిచేసి, తగినంత పటికబెల్లం పొడిని కలిపి రోజుకు 3సార్లు, అర టీ స్పూన్ చొప్పున తింటే దుర్భలత వల్ల వచ్చే జ్వరం తగ్గుతుంది.
ఒక టీ స్పూన్ జీలకర్ర చూర్ణాన్ని రెండు టీ స్పూన్ల కాకరకాయ రసంలో కలిపి తాగితే మలేరియా జ్వరంలో హితకరంగా ఉంటుంది. ఇలా రోజుకు మూడుసార్లు, మూడు నాలుగు రోజులు తీసుకోవాలి.
ఒక టీ స్పూన్ జీలకర్ర చూర్ణాన్ని తగినంత పాత బెల్లంతో కలిపి ఆహారానికి ఒక గంట ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. వాతపు నొప్పులు తగ్గుతాయి. మలేరియా జ్వరంలో హితకరంగా ఉంటుంది.
*

పాత్రుడు, అమలాపురం
ప్రశ్న: తులసిని తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసాన్ని తగ్గించుకోవచ్చని నా స్నేహితుడి తండ్రిగారు చెప్పారు. ఇది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే, ఆస్త్మాని తగ్గించుకోవడానికి రోజుకి ఎన్ని గ్రాముల తులసిని తీసుకోవాలి? ఇదే ఔషధాన్ని మూడేళ్లుండే మా అబ్బాయికి కూడా ఇవ్వవచ్చా?
జ: తులసి శ్వాసకోశ వ్యాధులన్నిటిలోనూ అద్భుతంగా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులను వేడి నీళ్లకు కలిపి పది నిమిషాలు మూత పెట్టి, హాట్ ఇన్‌ఫ్యూజన్ తయారుచేసి, తేనె కలిపి రెండు పూటలా తీసుకుంటే ఉబ్బసం వ్యాధిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఊపిరి తిత్తుల్లో పేరుకుపోయి గట్టిపడి పోయిన కఫాన్ని కరిగించి వెలుపలకు తీసుకురావడానికి తులసి చూర్ణాన్ని వాడుకోవచ్చు. తాజా తులసి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిల్వ చేసుకోండి. ఇలా నిల్వ చేసుకున్న తులసి చూర్ణాన్ని మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా టీ స్పూన్ తేనె కలిపి కడుపు లోపలకు తీసుకుంటే కఫం పల్చబడి వెలుపలకు వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు వాడే డోస్‌లో సగం వాడితే సరిపోతుంది. మరీ చిన్నపిల్లలైతే పెద్ద వాళ్ల డోస్‌లో పావువంతు మాత్రమే వాడాల్సి ఉంటుంది.
పి.సునీత, గుడివాడ
ప్రశ్న: ప్రతిరోజూ తేనెను రెండు పూటలా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందా? నాకు నెలకు ఒకసారి జ్వరం వస్తోంది. దీంతో సాధారణ ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటోంది. నాకు చాలాకాలం నుంచి సైనసైటిస్ సమస్య కూడా ఉంది. దీంతో ఎప్పుడూ నిస్సత్తువగా, బలహీనంగా, శక్తిలేనట్లు అనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం?
జ: వ్యాధి నిరోధక శక్తి పెంచే వాటిల్లో తిప్ప తీగ చాలా ముఖ్యమైనది. తిప్ప తీగ చెట్ల మీద అల్లుకొని కనిపిస్తుంది. మీరు ఇంట్లో కూడా పాదు పెట్టి పెంచుకోవచ్చు. 20 గ్రా. తాజా తిప్పతీగ కాండాన్ని తెచ్చి పైనుండే గోధుమ రంగు పట్టను తొలగించేయండి. లోపలి తెల్లని కాండాన్ని మాత్రమే గ్రహించి చిన్నచిన్న ముక్కలుగా తరగండి. వీటిని ఒక కప్పు వేడి నీళ్లకు కలిపి రాత్రంతా వదిలేయండి. ఉదయం నానిన కొమ్మను అదే నీళ్లలో పిండండి. శుభ్రమైన నూలు గుడ్డతో ఆ నీళ్లను వడపోయండి. ఈ జ్యూస్‌ని సగం ఉదయం, మిగతా సగం సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకోండి. ఇలా క్రమం తప్పకుండా కనీసం మూడు నెలలు చేయండి. దీంతో తప్పకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇంటివైద్యం
- 22/01/2012
జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో
లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర
అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి.
గృహ చికిత్సలు
జీరకర్ర చూర్ణాన్ని పాత బెల్లంతోనూ, తిప్పతీగ రసంతోనూ కలిపి తీసుకుంటే చలితో కూడిన మలేరియా జ్వరం తగ్గుతుంది. (అష్టాంగ సంగ్రహం, వృందమాధవ)
జీలకర్ర చూర్ణాన్ని బెల్లంతో కలిపి తిని ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. చెమట పుట్టేవరకూ ఆగాలి. దీంతో కఫం వల్ల వచ్చిన జ్వరం తగ్గుతుంది. (గదనిగ్రహం)
సౌవర్చల లవణం, జీలకర్ర చూర్ణం, పంచదార, మిరియాల చూర్ణం, తేనె వీటిని కలిపి లేహ్యం మాదిరిగా తయారుచేసుకొని చప్పరించి మింగితే వాంతులు తగ్గుతాయి. (వృందమాధవ)
4 భాగాల నెయ్యికి అర భాగం జీలకర్ర చూర్ణాన్ని, అర భాగం ధనియాల చూర్ణాన్ని, 16 భాగాలు నీళ్లనూ కలిపి నీరంతా ఆవిరయ్యే వరకూ మరిగించి నిల్వ చేసుకోండి. దీనిని పూటకు 10 మి.లీ. చొప్పున రెండు పూటలా వేడి పాలకు లేదా వేడి నీళ్లకు కలిపి తాగుతుంటే పుల్లని త్రేన్పులు, యాడిడ్ పొంగటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. (చక్రదత్త)
జీలకర్ర పొడిని నెయ్యి, సైంధవ లవణంతో కలిపి పేస్టులాగా చేసి పైకి పూస్తే తేలు కాటులో విషం దిగుతుంది. (చక్రదత్త)
నల్లజీలకర్ర, మిరియాలు, తెల్లజీలకర్ర, ఎండు ద్రాక్షపండ్లు, వృక్షామ్లం, దానిమ్మ గింజలు, సౌవర్చల లవణం వీటిని కలిపి బెల్లంతోను, తేనెతోనూ కలిపి నూరి పూటకు టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అన్ని రకాల జీర్ణక్రియా సమస్యలూ తగ్గుతాయి. (చరక సంహిత)
నల్లజీలకర్రతో కషాయం తయారుచేసుకొని పుక్కిట పడితే దంతాల నొప్పి, పళ్లు జివ్వుమనటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
జీలకర్ర, పాతబెల్లం, చింతపండు వీటిని సమంగా కలిపి ముద్దగా నూరండి. చిన్నచిన్న ఉండలు చేయండి. బుగ్గనుంచుకొని చప్పరించి రసం మింగండి. దీంతో వికారం, అరుచి, కడుపులో తిప్పటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
నల్లజీలకర్రను నిప్పుల మీద వేసి మండించి, దాని నుంచి వచ్చే పొగను పీల్చితే జలుబు, ముక్కు కారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
అర టీస్పూన్ జీలకర్ర పొడినీ, ఒక టీ స్పూన్ చింతపండు రసాన్నీ, ఒక టీ స్పూన్ తేనెనూ కలపండి. చిక్కని ద్రవం తయారవుతుంది. దీనిని చప్పరించి మింగండి. దీంతో కాలేయం శక్తివంతమవుతుంది. ఆకలి పుడుతుంది. కామెర్లలో ఇది హితకరంగా ఉంటుంది.
ఏడు గ్రాములు నల్లజీలకర్రను లేదా తెల్ల జీలకర్రను అర లీటరు మరిగించిన నీళ్లకు కలిపి రెండు గంటలు మూతపెట్టి ఉంచండి. ఈ నీళ్లతో కళ్లను కడుక్కుంటే కంటి దురదలు, కళ్ల కలక, కంటి నుంచి నీరు కారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
జీలకర్ర, ఉసిరి, పత్తి చెట్టు ఆకులు వీటిని చన్నీళ్లు చిలకరించి మెత్తగా రుబ్బండి. దీనిని తల మీద కట్టుకోండి. ఇలా మూడు వారాలు చేస్తే రేచీకటికి మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక కప్పు నీళ్లకు కలిపి మరిగించండి. దీనికి ఒక టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలపండి. దీనిని ఆహారం తరువాత రెండు పూటలా తీసుకోండి. దీంతో తలతిరగటం, వికారం, అరుచి సమస్యలు తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని, అర టీ స్పూన్ చందనం పొడిని, అర టీ స్పూన్ యాలకుల గింజల పొడిని, అర టీ స్పూన్ పటిక పొడిని (ఆలం లేదా ఫిట్‌కరి) కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీళ్లకు కలపండి. ఈ నీళ్లతో పుక్కిట పట్టండి. దీంతో నోటి పూత, నోటి మంట, నోటి దుర్వాసన ఇలాంటి నోటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ జీలకర్రను నెయ్యిలో వేయించి హుక్కా పైప్‌లో పెట్టి పొగ పీల్చితే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
గర్భధారణ సమయంలో జీలకర్రలో నెయ్యిలో వేయించి పొడి చేసి పంచదార పాకం పట్టి లడ్డూలాగా చేసి తింటే ప్రసవం తరువాత తల్లిపాలు పడతాయి.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ తాజా కొబ్బరి పాలకు కలపండి. పేస్టులాగా తయారవుతుంది. దీనిని చెమటకాయల మీద మలాము పూసినట్లుగా పూయండి. ఆరిన తరువాత సున్నిపిండితో స్నానం చేయండి. దీంతో చెమటకాయలు, వాటివల్ల వచ్చే దురద ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
ఒక టీ స్పూన్ జీలకర్రను పెనం మీద వేయించి, మెత్తగా పొడిచేసి పెరుగుతో కలిపి తినండి. దీంతో నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
ఒక టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన నీళ్లకు పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి తాగిస్తే చిన్న పిల్లల విరేచనాలు ఆగిపోతాయి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు వాడండి.
గసగసాలు చూర్ణం 100 గ్రా. శొంఠి చూర్ణం 20 గ్రా. జీలకర్ర చూర్ణం 400 గ్రా. వీటిని కలిపి నిల్వ చేసుకోండి. దీనిని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు టీ స్పూన్ల పెరుగుతో కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా 40 రోజులపాటు తీసుకుంటే చాలాకాలం నుంచి బాధించే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఆహారంలో పెరుగు, వరిఅన్నం, పెసరపప్పుతో చేసిన కిచిడీ, మజ్జిగ, తేలికగా జీర్ణమయ్యే కూరలు వీటిని తినాలి.
వేయించిన జీలకర్రను తాజా సోంపు గింజలను చూర్ణించి, సమాన భాగాలు కలిపి నిల్వ చేసుకోండి. దీనిని పూటకో టీ స్పూన్ చొప్పున రెండు పూటలా నీళ్లకు కలిపి తీసుకుంటే కడుపునొప్పితో కూడిన పల్చని విరేచనాలు ఆగుతాయి.

మదన్ టోంగే, సికిందరాబాద్
ప్రశ్న: నా వయసు 30 ఏళ్లు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాను. రోజుకు కనీసం 8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. గత ఆరు నెలల నుంచి నాకు విపరీతమైన నడుము నొప్పి వస్తోంది. ఈ మధ్యకాలంలో నొప్పి ఎడమ కాలిలోకి కూడా వ్యాపిస్తోంది. నొప్పి సలుపుతున్నట్లు, మెలి పెడుతున్నట్లు, నములుతున్నట్లు ఉంటోంది. ఇంటర్‌నెట్‌లో సయాటికా నొప్పికి సంబంధించి అనేక రకాల వ్యాయామాల చిత్రాలను చూశాను. అయితే వీటిని వైద్య సలహా లేకుండా చేస్తే సమస్య మరీ ఎక్కువ అవుతుందేమోనని భయంగా ఉంది. ఒక స్నేహితుడు సూచిస్తే బలారిష్ట అనే ఆయుర్వేద మందును వాడుతున్నాను. ఇది సరైన ఔషధమేనా? దీంతో పాటు ఇంకా వేరే ఔషధాలను వాడాల్సి ఉంటుందా?
జ: బలారిష్ట ఔషధం మంచిదే. ఇది నరాలను శక్తివంతం చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. వాతహరంగా పని చేస్తుంది. దీంతోపాటు రోజు మార్చి రోజు ‘సింధువార తైలం’ అనే ఔషధాన్ని 20 మి.లీ. మోతాదుగా పంచదార కలిపిన వేడి పాలకు కలిపి తాగండి. అలాగే ప్రభంజన తైలం అనే ఔషధాన్ని వెన్ను మీద, నొప్పి మీద పరోక్షంగా వేడి చేసి రాసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోండి. తరువాత వేడి నీళ్లతో స్నానం చేయండి. దీంతో మీ సైయాటికా నొప్పి తగ్గుతుంది.

భూమిపై నుంచి ఆకాశానికి వెళుతూ ఉంటే ఉష్ణోగ్రత
తగ్గుతుంది. ప్రతి 100 మీటర్లకూ సుమారుగా ఒక డిగ్రీ సెంటీగ్రేడ్
తగ్గుతుంది. భూమిపై గాలిలో ఎప్పుడూ నీటిఆవిరి ఉంటుంది. ఈ గాలి-ఆవిరి పైకి
వెళ్ళి మేఘంగా మారతాయి. వేడిగా ఉన్న గాలిలో తేమ అధికంగా నిలవగలదు. ఇదే గాలి
పైకి పోయినప్పుడు చల్లబడుతుంది. గాలి చల్లబడ్డప్పుడు తక్కువ తేమను
ఇముడ్చుకో గలుగుతుంది. ఇలా ఉన్న తేమ సూక్ష్మ బిందువుల రూపంలో గాలి నుండి
ఏదో రూపంలో బయటపడుతుంది. ఇలా వచ్చిన బిందువులే మేఘాల్లో ఉంటాయి. పర్వతాలు
అడ్డుగా రావడం వల్లగానీ లేక ఏ ఇతరకారణాల వల్లనైనా మేఘాలు పైకి పోవాల్సి
వస్తుంది. ఈ మేఘాలు పైకి పోతున్న కొద్దీ చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటాయి.
ఈ సమయంలో అధికంగా ఉన్న సూక్ష్మ నీటి బిందువులు వేర్వేరుగా ఉండక,
ఒకదానికొకటి కలిసి పెద్ద నీటి బిందువులుగా మారిపోతాయి. ఈ నీటి బిందువులు
భూమ్యాకర్షణకు లోనై వర్షంగా కురుస్తాయి. ఒకోసారి ఇలా పడేటప్పుడు వాతావరణ
గాలి వేడిగా ఉన్నప్పుడు పెద్ద నీటి బిందువులు తిరిగి సూక్ష్మ నీటి
బిందువులుగా మారిపోతాయి. ఇలా మారని నీరు పెద్ద బిందువుల రూపంలో వర్షంగా
భూమ్మీద పడతాయి.
యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా?
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికై హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తదని యజ్ఞం చేసేవారు నమ్ముతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లోనూ యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి మేఘమధనాన్ని చూపెడుతున్నారు. మేఘమధనం ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెపుతున్నారు. ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అని ఆలోచించాలి.
అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్యం సమస్యగా ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం పెరుగుతున్న ఈ నేపథ్యంలో గతంలోలాగా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు ఈ హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.
ఎలా వర్షిస్తాయి...?

__________________________________________________________
భూగోళంపై వాతవరణంలో నీటి ఆవిరి ఎప్పుడూ ఉంటుంది. ఒకోసారి ఈ
నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారుతుంది. ఇలా గాలిలో ఘనీభవించిన నీటి ఆవిరి
చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతాయి. ఈ నీటి బిందువులు ఎంతో చిన్న,
చిన్నవిగా ఉండటంతో భూమి మీదికి వర్ష రూపంలో పడలేవు. ఈ నీటి బిందువులే
గాలితో కలిసి మబ్బులుగా మారుతాయి. ఈ నీటి బిందువులు ఘనీభవించి సూక్ష్మ
మంచుకణాలుగా కూడా మారుతాయి. అందువల్ల మేఘాలలో ఈ సూక్ష్మ మంచుకణాలతో పాటు
ఘనీభవించిన నీటిఆవిరి (నీరు), గాలి కలిసి ఉంటాయి. అందువల్ల భూమిమీద వర్షం
పడటానికి మేఘాలు తప్పనిసరిగా ఉండాలి. మేఘాలులేని వర్షం సామాన్యంగా ఉండదు.
మేఘాల ఎత్తును భూమి ఉపరితలం నుండి వాటి కిందిభాగం గల మధ్యదూరంగా కొలుస్తారు. మేఘంపై పొర ఎత్తును పరిగణలోనికి తీసుకోరు. భూమిపై 5-7 కిలో మీటర్ల ఎత్తున గల 'క్యుమ్యులోనింబస్' అనే మబ్బులు మనకు భూమిమీద కనిపించే ఉరుములు, మెరుపులకు ముఖ్యకారణాలు. ఈ మబ్బులు భారీ వర్షంతో ముడిపడి ఉంటాయి. భూమిపై నుండి బలమైన వాయువులు (నీటిఆవిరితో సహా) లేచినప్పుడు ఈ రకం మబ్బులు ఏర్పడుతాయి.
భూమికి అతి దగ్గరగా ఉండే 'నింబోస్ట్రేటస్' అనే మబ్బులు భారీ వర్షాన్ని కలుగజేస్తాయి. 'సిర్రస్' రకం మబ్బులు భూమికి దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. తక్కువ ఎత్తులో వచ్చే ఈ మబ్బులు ఆకస్మాత్తుగా ఎత్తు ప్రదేశంలో కనిపించవచ్చు.
'ఆల్టోక్యుమ్యులస్' రకం మబ్బులు వేసవి కాలంలో సాయంత్రం లేదా ఉదయం పూట కనిపించవచ్చు. ఇవి భూమిపై సుమారు 4-5 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. భూమిపై రెండు కిలోమీటర్ల లోపు ఎత్తులో 'స్ట్రాటస'్ రకం మబ్బులు ఉంటాయి. ఎత్తు ప్రదేశాల్లో భూమిని నేరుగా తాకుతూ ఇవి కనిపిస్తాయి. ఈ మబ్బులు మందమై మంచు, చిరుజల్లు లేదా వర్షాన్ని కలుగజేస్తాయి. 'క్యుమ్యులెస'్ రకం మబ్బులు రెండు కిలో మీటర ్లఎత్తువరకు 'కాలిఫ్లవర్'ల్లాగా తెప్పలుగా తెప్పలుగా చిన్న చిన్న మబ్బులుగా, ఒక్కోసారి పలుచగా కనిపిస్తాయి. వేడిగాలి పైకి వెళుతున్నప్పుడు ఈ మబ్బులు కనిపిస్తాయి.
మబ్బులు

_______________________________________________________________
ఉరుములు, మెరువులు, పిడుగులు
ఇటీవల మన రాష్ట్రంలో శ్రీకాకుళం, నిజామాబాద్ జిల్లాల్లో పిడుగుపడి కొందరు మరణించారు. అలాగే బ్రెజిల్‌లోని రియోనగరం నుండి ఫ్రాన్స్‌కు బయలుదేరిన విమానం అట్లాంటిక మహాసముద్రంలో కుప్పకూలి పోయింది. దీనికి కారణం మెరుపులే అన్న అనుమానా లున్నాయి. ఈ ప్రమాదంలో 228 మంది గల్లంతయ్యారు. అసలు ఈ పిడుగులు, మెరుపులు, ఉరుములు ఎలా సంభవిస్తాయో ఈ వారం తెలుసుకుందాం...
పిడుగులు వల్ల ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఆస్థినష్టం కలుగుతుంది. ఎంతోమంది చనిపోతున్నారు కూడా. చిన్నప్పుడు వీటికి భయపడి బామ్మను కౌగలించు కున్నప్పుడల్లా, బామ్మ వీపుతడుతూ భయాన్ని పోగొట్టా నికి ఓ కథ చెప్పేది. 'అర్జునుడు వేగంగా రథంమీద వెళుతున్నప్పుడు రథచక్రాలు రాళ్ళకు తాకిన ప్పుడల్లా కళ్ళు మిరమిట్లు కొలుపుతూ వచ్చే వెలుతురే (కాంతి) ఈ 'మెరుపు'లని, ఇలా వెళుతున్నప్పుడు వచ్చే ధ్వనే 'ఉరుము'లని' చెప్పేది. అందువల్ల ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు 'అర్జునా అర్జునా' అని తలుచుకుంటే ఉరుములు, మెరుపులవల్ల మనకేమీ కాదని, భయపడాల్సిన అవసరంలేదని చెప్పేవారు. విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో భయాల్ని పోగొట్టడానికి ఇలాంటి కథలు ఉపయోగపడేవి. కాని, విజ్ఞానశాస్త్రం ఎంతో అభివృద్ధిచెందిన ఈ కాలంలో ఎన్నో ప్రకృతి రహస్యాలను శాస్త్రీయంగా తెలుసుకోగలుగు తున్నాం. అర్థం చేసుకోగలుతున్నాం. ప్రమాదాలను నుండి రక్షించుకోగలుగుతున్నాం. ఇలా అర్థం చేసుకో గలిన ప్రకృతి రహస్యాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులు ముఖ్యమైనవి. అందువల్ల ఇంకా ఉరుములు, మెరుపులు అర్జనుడి రథంవల్ల వస్తున్నాయని నమ్మడం అశాస్త్రీయం. మూఢవిశ్వాసం.
మెరుపులు
వాతవరణంలో విద్యుత్ విడుదలవల్ల మెరుపులు కనిపిస్తాయి. మాములుగా ఇవి ఉరుములతో కలిసి వస్తాయి. మబ్బులలో జరిగే విద్యుత్‌చ్ఛక్తి మార్పులు వీనికి మూలకారణాలు.
మెరుపులు కలిగేతీరు
వాతవరణంలో కలిగే మార్పులు మెరుపులకు కారణమని కొంతమంది శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. వేగంగా వీచే గాలులు, నీటి ఆవిరి, వీటి మధ్య రాపిడి మరియు వాయుపీడనం మేఘాలలో విద్యుత్ మార్పు లను తెచ్చి మెరుపులను కలగజేస్తాయి.
మబ్బులలో ఉన్న చిన్న చిన్న మంచుకణాలు మెరుపుల్ని కలగజేయటంలో కీలకపాత్ర వహిస్తాయని శాస్త్రజ్ఞునులు భావిస్తున్నారు. వీని వత్తిడి వలన మబ్బులలో అంతర్గతంగా పాజిటీవ్, నెగిటీవ్ ఛార్జీలు వేరుపడతాయని, పాజిటివ్ ఛార్జీలు మబ్బుపైకి, నెగిటీవ్ ఛార్జీలు మబ్బు కింది భాగానికి చేరుతాయని వీరు సూచిస్తున్నారు. ఇలా విద్యుత్ ఛార్జీలు వేరుపడటం వల్ల మబ్బుల్లో 'విద్యుత్ పీడనం' (ఎలక్ట్రిక పొటేన్షియల్ ) ఏర్పడుతుంది. ఈ విద్యుత్ పీడనం ఒక స్థాయికి మించి నప్పుడు, మబ్బుల్లో అదనంగా ఉన్న విద్యుత్‌చ్ఛక్తి మెరుపు రూపంలో విడుదలవుతుందని వీరు తెలుపుతున్నారు.
భూగోళంలో కాంగో దేశంలో మెరుపులు అత్య ధికంగా వస్తున్నాయని గమనించారు. మాములుగా మనం చూసే మెరుపులు మబ్బుల కింది భాగం నుండి వచ్చే నెగిటివ్ విద్యుత్ ప్రసారంవల్ల వస్తున్నాయి. ఈ విద్యుత్‌చ్ఛక్తి సుమారుగా ముప్పైవేల ఆంపియర్‌లకు సమానమని అంచనా వేస్తున్నారు. ఈ విద్యుత్‌చ్ఛక్తి 1,20,000 ఆంపియర్‌ల వరకూ పోవచ్చునట.
విద్యుత్ పీడనం మీటర్‌కు మూడు మిలియన్ ఓల్ట్‌లకు మించినప్పుడు మెరుపు వస్తుంది. కేవలం ఒకే ఒక మెరుపు వచ్చినప్పుడు వచ్చే విద్యుత్ పీడనం శక్తి వెయ్యి బిలియన్ వాట్ల వరకూ ఉంటుందట. ఇది చాలా శక్తివంతమైనది కాని, సెకండ్‌లో దాదాపు 33 వేల వంతు (30 మైక్రో సెకండ్లు) వరకు మాత్రమే ఉంటుం దట. అయితే 'మెరుపు' ఒకేసారి కాక కనీసం నాలుగైదు సార్లు వస్తుందట. ఇలా ఎన్నో మెరుపులు రావచ్చు.
మెరుపు వచ్చినప్పుడు చుట్టుపట్ల ఉన్నగాలి ఒకేసారి 20వేల డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు వేడి విడుదలవుతుంది. ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా దాదాపు మూడు రెట్లు అధికం. ఇంతవేడి ఒకేసారి రావటంతో, చుట్టుపట్ల గాలి ఒకేసారి అత్యంత వేగంతో (సూపర్ సానిక అంటే శబ్దానికి మించిన వేగంతో) వ్యాకోచిస్తుంది. ఈ సమ యంలో వచ్చే శబ్దాన్నే 'ఉరుము' రూపంలో వింటున్నాం. అంటే, మొదట మెరుపు వచ్చి, ఆ తరువాతే శబ్దం భూమి మీద వినపడుతుంది. తెలుగులో ఉరుము, మెరుపలని పిలుస్తున్నార. ఉరుమే ఎక్కువగా భయం కలిగిస్తుంది కాబట్టి జంటగా వచ్చే మెరుపు, ఉరుములను 'ఉరుము, మెరుపు'లుగా తెలుగులో పిలుస్తున్నాం.
'ఉరుములు' ఆలస్యంగా ఎందుకు వినిపిస్తున్నాయి?
'మెరుపు' కాంతిలాగా చాలా వేగంగా ప్రసారమ వుతుంది. సుమారు సెకండుకు 60వేల మీటర్ల వేగంతో (గంటకు రెండు లక్షల 20 వేల కిలోమీటర్ల వేగంతో ) ప్రసారమవుతుంది. అందువల్ల భూమిమీద మెరుపును వెంటనే చూడగలుతున్నాం. కాని, ధ్వని కేవలం సెకండుకు 330 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే కాంతికన్నా ఒక మిలియన్ రెట్లు తక్కువ వేగంగా ధ్వని భూమిపైకి ప్రసారమవుతుంది. అందువల,్ల మెరుపు కనిపించిన తరువాత కొంత సమయానికి మెరుపు వల్ల వచ్చిన 'ఉరుము'ను వినగలుగుతున్నాం.

___________________________________________________________
బాటిల్ నీటి తయారీలో రివర్స్ ఆస్మాసిస్
రివర్స్ ఆస్మాసిస్ ద్వారా అధిక లవణాలు గల ద్రవాన్నుండి ఒక ప్రత్యేక పొర ద్వారా (పాక్షిక అభిసరణ పొర లేదా సెమి పర్మియబుల్ మెంబ్రేన్) ద్రావకాన్ని (సాల్వెంట్) తక్కువ ద్రావణం కలిగిన ద్రవంలోకి వచ్చేలా చేస్తారు. అయితే అధిక ద్రావణం కలిగిన ద్రవం పీడన 'ద్రవాధిసరణ పీడన' (ఆస్మిటిక్ ప్రెషర్) ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, దీన్నుంచి ద్రావకాన్ని తక్కువ ద్రావణం కలిగిన ద్రవంలోకి పోవాలంటే ఆస్మటిక్ ప్రెషర్ (ఒత్తిడి) కన్నా ఎక్కువ వత్తిడిని కృత్రిమంగా ఉపయోగించాల్సి ఉంటుంది. మామూలు బోరు నీళ్ళ నుండి బాటిల్ నీళ్ళను తయారుచేయడానికి రివర్స్ ఆస్మాసిస్ కోసం 8 నుంచి 14 వాతావరణాలకు సమానమైన పీడనాన్ని వినియోగించాల్సి వుంటుంది. ఇదే సముద్రపు నీటి నుండి మంచినీటిని తయారుచేయడానికి 40 నుంచి 70 వాతావరణ పీడనాలకు సమానమైన వత్తిడిని ఉపయోగించాల్సి వస్తుంది. ఇదంత తేలికకాదు. ఈ సందర్భంలో ప్రత్యేక నిర్మాణం కలిగిన 'పాక్షిక పొరల'ను వాడాల్సి ఉంటుంది.
బహిర్గతంగా ఉపయోగించిన వత్తిడివల్ల 'మంచినీరు' ఉప్పు అధికంగా కలిగిన ద్రవం నుండి వస్తుంది. అయితే వాడిన నీటిలో కొంత భాగం యంత్రాలలోని లవణాలను తీసివేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. అందువల్ల, ఈ ప్రక్రియ ద్వారా మంచినీటిని తయారుచేసేటప్పుడు కొంతనీటిని వృధాగా కోల్పోవాల్సి వస్తుంది. ఇలా వృధా పోయే నీటి పరిమాణం, ఉష్ణోగ్రత, వినియోగించిన వత్తిడి, వాడిన పొర ధర్మాల మీద, యంత్రాల మీద ఆధారపడి ఉంటుంది.
బోరు నీటిని నేరుగా రివర్స్ ఆస్మాసిస్ యంత్రాల ద్వారా పంపరు. మొదట నీటిని శుద్ధి చేస్తారు. దీనికై ఇసుక పొర కలిగిన బెడ్స్ ద్వారా వడపోస్తారు. ఇది నీటిలోని కరగని మాలిన్యాలను తొలగిస్తుంది. తరువాత, ఆక్టివేటెడ్ కార్బన్ (బొగ్గుపొడి) ద్వారా వడపోస్తారు. ఇది చెడు వాసనలను, రంగులను తొలగిస్తుంది. ఆ తర్వాత ఈ నీటిని క్లోరినేషన్ చేస్తారు. దీనికై క్లోరిన్ కావాలి. ఆ తర్వాత నీటిలో సోడియం లవణాలు కలిపి, అధికంగా గల కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్‌లు, బైకార్పొనేట్‌లను ఎక్కువశాతం తగ్గిస్తారు. ఆ తర్వాత, నీటిలో అధికంగా ఉన్న క్లోరిన్‌ను ప్రత్యేక రసాయనాలను వాడి తొలగిస్తారు. ఆ తర్వాత వడపోస్తారు. అంతిమంగా కంటికి మసక మసకగా కనిపించే ఇతర పదార్థాలను కూడా తొలగిస్తారు. ఇలా వచ్చిన నీటిని ఓజోన్ వాయువుతో ఆక్సీకరణ చేస్తారు. సూక్ష్మక్రిములను నిర్మూలించడానికి ఆల్ట్రా వయిలెట్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల నీటిలోని వైరస్‌లు, బ్యాక్టీరియా, జబ్బులు కలిగించే ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. మొత్తం మీద చూస్తే రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మంచినీటిని తయారుచేసే ప్రక్రియ మామూలు బోరు నీళ్లను వడపోసి, క్లోరినేషన్ చేసే దానికన్నా చాలా క్లిష్టమైనది.
ఈ యంత్రాల ద్వారా తయారుచేసే బాటిల్ నీటి నాణ్యత యంత్రాల యాజమాన్య నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా ఇసుక పొరల బెడ్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, ప్రత్యేక పాక్షిక పొర మీద, ఇతర అంతర్గత భాగాల మీద చేరిన లవణాలను (ఇవి పొరల రూపంలో) తీసివేయాల్సి ఉంటుంది. నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవుల నిర్మూలన, ఆల్ట్రా వయిలెట్ కాంతి ప్రసరించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ నియంత్రణ ప్రమాణాలను సరిగా పాటించడంలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆచరించే ప్రమాణాలను ఊహించడం అంత కష్టమేమీ కాదు. అంతిమంగా, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కొనుక్కునేది బాటిల్స్ ద్వారా అమ్మే బోరుబావి నీళ్లే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. కాచి, చల్లార్చి వడపోసిన నీరు నమ్మకంగా సురక్షిత మంచినీరని గుర్తు తెచ్చుకుంటే, సమర్థవంతంగా మన ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడవచ్చో తెలిసిపోతోంది.
నీరు ఒక్క మానవుడికే కాదు. అన్ని జీవరాశులకూ కావాలి. ఇది అన్ని జీవరాశులయొక్క జన్మహక్కు. కొత్త జలవిధానం ద్వారా ప్రభుత్వం అన్ని జీవరాశుల హక్కులను, పర్యావరణ అవసరా లను, సురక్షిత నీటి సరఫరా విషయాలలో తన రాజ్యాంగ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తుంది? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు కనీసం వడపోసి, క్లోరినేషన్ చేసి సురక్షిత నీటిని సరఫరా చేయలేని ప్రభుత్వం నాణ్యమైన మినరల్ వాటర్‌ను ఎంతో పెట్టుబడి, మౌలిక సౌకర్యాలు అవసరమైన 'రివర్స్ ఆస్మాసిస్' ద్వారా తయారుచేయించి, సరఫరా చేయగలదా? అందరూ అవసరమైన మేర కొనుక్కోగలరా?
ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో సరఫరా అవుతున్న మినరల్ వాటర్ లేదా బాటిల్ నీళ్ల నాణ్యత అంతంతమాత్రమే. వీటి నాణ్యతపై పర్యవేక్షణ నామమాత్రం. గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న క్లోరినేషన్‌ను పర్యవేక్షణ చేయలేని వ్యవస్థ బాటిల్ నీళ్ల నాణ్యతను సరిగ్గా పర్యవేక్షించగలదా? వీటన్నింటికీ సమాధానం 'లేదనే' చెప్పాలి. అటువంటప్పుడు ప్రభుత్వం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మినరల్ వాటర్ సరఫరా చేయాలని ఎంతో సాహసమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం అంత కష్టమేమీ కాదు. మార్కెట్‌లో నీటిని వ్యాపార వస్తువుగా మార్చే లక్ష్యమే దీనికి కారణం తప్ప మరొకటి కాదు. దీన్ని అందరికీ అలవాటు చేయడానికే ఇప్పటి బాటిల్ నీటి సరఫరా. అందరికీ చెందిన సహజ నీటివనరును మార్కెట్ సరుకుగా మార్చేందుకు ప్రభుత్వం అనుసరించే మభ్యపెట్టే విధానమే తప్ప మరొకటి కాదు.
___________________________________________________________
సాధారణంగా పండ్లు పండిన తరువాత
కొన్నిరోజులకు బూజుపట్టటం, కుళ్ళిపోవటం జరుగుతుంది. కానీ ఖర్జూరపండ్లు
మాత్రం ఎన్నిరోజులయినా కుళ్ళవు. బూజు పట్టవు. ఎందుకని? తుమ్మల మోహనరావు,
జి.2, రజిత ఎన్‌క్లేవ్, సంగీత్‌నగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్ 500072.
జవాబు: అవసరం, ఆవశ్యకత లేనిదే ఎవరూ ఎవరినీ ఏదీ ఆశించరు. ఏదైనా వస్తువు కుళ్లిపోవడమన్నా, బూజుపట్టడమన్నా కుళ్లబెట్టే పరాన్నజీవులకూ, బూజుపట్టించే శిలీంధ్రాలకూ (fungi) ఇష్టమైనవి ఆ పదార్థాల్లో ఉన్నాయన్నమాట. సూక్ష్మజీవులకూ, శిలీంధ్రాలకూ మనకులాగే ఆహారపదార్థాలు, ఇతర జీవరసాయనాలు అవసరం. అవి వాటిని ఆయా పండ్లలోంచీ, ఆహార పదార్థాల్లోంచి దొరకబుచ్చుకుంటాయి. ఆ క్రమంలో అవి తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ గొప్ప గొప్ప సమూహాలను ఏర్పరుస్తాయి. అవి విడుదల చేసే విషపదార్థాలు, దుర్గంధపూరితమైన వాయువుల వల్ల ఆ పదార్థాలు చెడిపోయాయి అంటాం. బూజుపట్టడం వెనక శిలీంధ్రాలకు అవసరమైన స్థావరం, ఆహారం రెండూ ఒనగూరుతాయి. బూజులో ఉన్నదల్లా మొక్కల జాతికి చెందిన శిలీంధ్రాలు. వీటిలో పచ్చని చెట్ల ఆకుల్లోలాగా పత్రహరితం (chlorophyll) ఉండదు. అందువల్ల అవి కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా తమ ఆహారాన్ని తాము తయారుచేసుకోలేవు. కాబట్టి జంతువుల్లాగా ఇవి కూడా తమ ఆహారపదార్థాల నిమిత్తం ఇతరజీవుల మీద లేదా ఆహారపదార్థాల మీద ఆధారపడతాయి. తమ సంతానాన్ని వృద్ధి చేసుకునేందుకు తమ విత్తన ప్రతినిధులైన స్పోరులను గాలిలోకి వదులుతాయి. అవి గాలిలో దుమ్మూ, ధూళిలాగా పయనిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్థావరం ఏర్పర్చుకుని సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇవి చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల కంటికి కనిపించవు. వీటితో ఏర్పడిన సమూహాలను మనం బూజు అంటాము. ఆహారపదార్థాలు, కళేబరాలు, మురికి తదితర వాటిమీద సూక్ష్మక్రిముల దాడి కూడా ఇలాంటిదే. గాలిలో ఎన్నో కంటికి కనిపించని సూక్ష్మజీవులు (Micro organisms) తమ జీవనం కోసం వీటిమీద దాడి చేస్తాయి. ఇందులో బ్యాక్టీరియాలు, చిన్న చిన్న కీటకాల గుడ్లు, ఈగల కాళ్ల మీద ఉండే వేలాది పరాన్నజీవులు (parasites) ఆహారపదార్థాలను, తదితర ప్రోటీను సమృద్ధ పదార్థాలను ఆశిస్తాయి.
తాజాగా ఉన్న పదార్థాల మీదా, చెట్లకు వేలాడుతున్న పండ్లు, కాయల మీదా, జీవంతో ఉన్న జీవకణాల మీదా ఈ పరాన్నజీవులు దాడి చేస్తున్నా వాటిని అధిగమించేలా ఆయా పదార్థాల్లో రక్షణ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల ఈ సూక్ష్మక్రిముల పాచిక పారదు. కాబట్టి అవి కుళ్లిపోవు. అయితే తాజాదనం కోల్పోయిన కూరగాయల్లోనూ, చాలారోజులు అట్టేపెట్టిన పండ్లలోనూ, నిల్వ ఉన్న ఆహారపదార్థాల్లోనూ, మృతకణాల్లోనూ రక్షణవ్యవస్థ మందగిస్తుంది. అందువల్ల వాటిమీద బ్యాక్టీరియా, శిలీంధ్రాల దాడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి కుళ్లిపోతాయి, కంపుకొడతాయి. ఇంతకుముందే చెప్పినట్లు ఈ కంపు వాసనకు కారణం ఆయా పరాన్నజీవులు విడుదల చేసే విషవాయువులే. ఇప్పుడిక మీరడిగిన అసలు ప్రశ్నకు వద్దాము. 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అని తెలుగులో సామెత ఉంది. శనీ గినీ అల్లుడూ నోరూ ఇవన్నీ పక్కనబెడదాం. సామెతలోని అర్థం ప్రకారం పరిస్థితులన్నీ అనుకూలించినా ఏదో ఒకటి లోపించడం వల్ల అనుకున్నది జరగకపోయినప్పుడు ఈ సామెత వాడతాం కదా! అలాగే ఖర్జూర పండ్లలో కూడా అన్నీ అనుకూలంగానే ఉన్నా సూక్ష్మక్రిములకు నష్టం కలిగించే అంశాలు ఒకటి, రెండు ఉన్నాయి.
పరాన్నజీవులైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మక్రిములు ఆహారపదార్థాల మీద దాడి చేసినప్పుడు కేవలం అందులోని విలువైన ఆహారపదార్థాలేకాక ఆయా పదార్థాలలో ఆ ఆహార పదార్థాలను సులభంగా కరిగించుకునేలా నీటి శాతం ఉండాలి. అంటే తగినంత తేమ లేకుండా ఉంటే ఆ ఆహారపదార్థాలు ఈ బ్యాక్టీరియాలకు అందవు. బత్తాయి, ఆపిల్, ద్రాక్ష, అరటి తదితర తొందరగా కుళ్లిపోయే పండ్లలో సూక్ష్మక్రిములకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు, తేమ శాతం ఎక్కువ. ఆ పండ్లలోని ఆహారపదార్థాలు (ముఖ్యంగా లవణాలు, గ్లూకోజు, ఫ్రక్టోజు ఇతర పోషకపదార్థాలు) ఈ తేమలో కరిగి ఉంటాయి. అందువల్ల సులభంగా సూక్ష్మక్రిములకు అందుతాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఆయా సూక్ష్మక్రిములు సంతానాభివృద్ధి చేసుకుని సమూహాలుగా ఏర్పడి తమ పబ్బం గడుపుకుంటాయి. కర్జూరపు పళ్లలో తేమ శాతం చాలా తక్కువ. అతి తక్కువ కాలం మాత్రమే సూక్ష్మక్రిములు బతుకుతాయి. ఎప్పటికప్పుడు తమ సంతానాన్ని అధికమోతాదులో ఉంచుకునేలా ఆహారపదార్థాలు అందుబాటులోకి రావు. ఎందుకంటే ఆహారపదార్థాలను కరిగించుకుని, రవాణా చేసే నీటి శాతం ఇందులో తక్కువ ఉండటమే. కాబట్టి ఇతర పండ్లలాగా, ఆహారపదార్థాల్లాగా ఖర్జూరపండ్లు తొందరగా కుళ్లిపోవు. బూజు పట్టవు. అలాగని సంవత్సరాల తరబడి శుచిగా ఉంటాయని కూడా అనుకోవద్దు. కుళ్లిపోయే వేగం, బూజు పట్టే వేగం తగ్గాయిగానీ, అసలు కుళ్లిపోవనీ, అసలు బూజుపట్టవనీ అర్థం కాదు.
ఇలా తక్కువ నీటిశాతం ఉండటం వలన ఎక్కువకాలం మనగలిగే లక్షణం తేనెకు కూడా ఉంది. తేనె, ఖర్జూరపు పళ్లు బూజు పట్టకపోవడానికి, తొందరగా కుళ్లిపోకుండా ఉండడానికి తక్కువ నీటి శాతంతో పాటు మరో కారణం కూడా ఉంది. ఈ పదార్థాల్లో గ్లూకోజు శాతం కన్నా ఫ్రక్టోజు శాతం ఎక్కువ. రెండూ చక్కెరలే అయినా, రెండూ సూక్ష్మక్రిములకూ, మనకూ తీయగానే ఉంటాయి. ఫ్రక్టోజుకు రసాయనికంగా చురుకైన లక్షణం ఉంది. ఇది సూక్ష్మక్రిముల శరీరాలకు ఎంతో కొంత అపకారం కలిగిస్తుంది. అందువల్ల కూడా సూక్ష్మక్రిములు ఫ్రక్టోజు శాతం అధికంగా ఉండే తేనె, ఖర్జూరపు పండ్ల వంటివాటిని ఆశించవు. ఇలాగే ఊరగాయ పచ్చళ్ల చెడిపోకుండా ఉండడానికి కారణం నీటి శాతం తక్కువగా ఉండడమూ, సూక్ష్మక్రిములకు హానికలిగించే లవణ శాతం ఎక్కువగా ఉండడమూనూ. అలాగే ఎండు పండ్లలు నిల్వ ఉండడానికి కూడా వాటిలో నీటిశాతం లేకపోవడమే. అలాగే ఇడ్లీ, దోశ కన్నా నూనెలో డీప్ ఫ్రై చేసిన పిండివంటలూ, బిస్కెట్లు ఎక్కువరోజులు నిల్వ ఉండడానికి కూడా వాటిలో తేమ శాతం తక్కువగా ఉండడమే. వైద్య కళాశాలల్లో వైద్య విద్యార్థులు శస్త్ర చికిత్స నేర్చుకోవడం కోసం వాడే శవాలు ఎంతకాలమైనా చెడిపోకుండా ఉండడానికి కారణం వాటిని ఫార్మలిన్ తొట్లలో ఉంచి నీటిశాతాన్ని పూర్తిగా తీసివేస్తారు. తేమ లేకపోవడం సూక్ష్మక్రిములు ఆ శవాలను ఆశించలేవు. తేమలేని శవాలను మమ్మీలు అంటారని మీరు వినే ఉంటారు కదా!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
శాస్త్ర ప్రచార విభాగం
జన విజ్ఞాన వేదిక
గమనిక
ఈ శీర్షికకు సైన్స్‌కు సంబంధించిన మీ సందేహాలను ప్రశ్నల రూపంలో పంపండి.
అడ్రస్: ఎందుకని? ఇందుకని?
ప్రజాశక్తి, కేరాఫ్ ఎం.హెచ్.భవన్, ప్లాట్ నెం. 21/1, అజామాబాద్ ఇండిస్టియల్ ఎస్టేట్,ఆర్టీసీ కల్యాణ మండపం దగ్గర, హైదరాబాద్ -500020.
ఖర్జూరపండ్లు ఎందుకు కుళ్ళవు?

ఇప్పటి వర్షాభావ పరిస్థితులకు కారణంగా తరచుగా
వినిపిస్తున్నది ''ఎల్‌నీనో''. ఇంతకీ ఇదేమిటి? ఫసిఫిక్ మహాసముద్ర
ప్రాంతంలో వాతావరణం, సముద్రంలో అప్పుడప్పుడు వచ్చిన ఉష్ణోగ్రత, పీడనాల్లో
వస్తున్న 'దక్షిణ మార్పులనే' (సదర్న్ ఆసిల్లేషన్స్) 'ఎల్‌నీనో' అంటారు.
తాహతి, ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రదేశాల మధ్య వాతావరణ పీడన మార్పుల
రూపంలో ఇది బహిర్గతమవుతుంది. తూర్పు ఫసిఫిక్ మహా సముద్రంలో ఉపరితలం,
అంతరభాగంగా వేడెక్కడం లేదా చల్లబడే రూపంలో ఇది బహిర్గతమవుతుంది. ఎల్‌నీనో
సమయంలో ఉపరితల సముద్రం (కొన్ని సెంటీమీటర్ల మందంగల పొర, వేడిగా, అంటే 0.5
డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉంటుంది). కొన్ని వందల కిలోమీటర్ల
విస్తీర్ణంలో దీని ప్రభావం కలిగి ఉంటుంది.
ఎల్‌నీనో ప్రారంభాన్ని ఈ కింది మార్పుల వల్ల గుర్తించవచ్చు:
1. హిందూ మహాసముద్రం, ఇండోనేషియాలో, ఆస్ట్రేలియాలో ఉపరితల పీడనం పెరుగుతుంది.
2. తాహతి, మిగతా మధ్యతూర్పు ప్రాంత ఫసిఫిక్ మహాసముద్ర గాలిలో పీడనం పడిపోతుంది (డిప్రెషన్ ఏర్పడుతుంది).
3. దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంపై వచ్చే ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి లేదా తూర్పువైపు మళ్ళుతాయి.
4. పెరూ (దేశం) దగ్గర వేడిగాలి పైకి వెళుతుంది. దీనివల్ల ఉత్తర పెరూ ఎడారి ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి.
5. పశ్చిమ ఫసిఫిక్ మహాసముద్రం నుండి హిందూ మహాసముద్రం - తూర్పు ఫసిఫిక్ మహాసముద్రం మధ్య వేడినీరు విస్తరిస్తుంది. ట్రేడ్ విండ్స్ దిశ ఎన్నో నెలలు మారినప్పుడు ఎల్‌నీనో ప్రారంభమవుతుంది.
ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో వచ్చే వరదలకు, వర్షాభావ పరిస్థితులకు ఎల్‌నీనో కారణంగా చెపుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయోత్పత్తి, చేపల వేటలపై ఎల్‌నీనో దుష్ప్రభావం చూపుతుంది. మామూలుగా భూమధ్యరేఖ దాపుల్లో వీచే వాణిజ్య పవనాల వల్ల (ట్రేడ్ విండ్స్) నైరుతీ ఋతుపవనాలు వస్తాయి. కానీ ఒకోసారి ఈ పవనాల దిశ మారి ఎల్‌నీనో రూపంలో బయటపడుతుంది. (చిత్రంలో గమనించండి). వాణిజ్య పవనాల దిశ మారడం వల్ల భారతదేశంలో రావాల్సిన నైరుతీ ఋతుపవనాల వర్షం దక్షిణ అమెరికాలోని పెరూ, చిలీ దేశాలలో కురుస్తుంది. ఫలితంగా నైరుతీ ఋతుపవన ప్రభావ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2-7 సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నీనో వస్తుంది. ఒకసారి ప్రారంభమైన తర్వాత దీని ప్రభావం 9 మాసాల నుండి 2 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. భూగోళం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ఎల్‌నీనో ప్రభావం తరచుగా, బలంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ఇప్పుడు మనం తరచుగా ఎదుర్కొంటున్న తీవ్ర వడగాలులు దీనిని సూచిస్తున్నాయి. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, అన్ని ఎల్‌నీనో ప్రభావాలు అన్నిచోట్లా వర్షాభావాన్ని, కరువును కలిగించాల్సిన అవసరం లేదని గత అనుభవాలు చెపుతున్నాయి. మన దేశంలో మాత్రం ఇంతవరకూ వచ్చిన ఎల్‌నీనోలు కరువులనే కలిగించాయి.
ఎల్‌నీనో అంటే....

పరిసరాలు శుభ్రంగా లేని ప్రాంతాల్లో మురికినీరు
చేరుతుంది. లేదా కొన్ని కారణాల వల్ల నీరు నిల్వ ఉంటుంది. ఇటువంటి
ప్రదేశాల్లోనే దోమలు గుడ్లు పెట్టి తన సంతానోత్పత్తిని కొనసాగిస్తాయి. మొదట
లార్వాలు వస్తాయి. ఆ తర్వాత ఇవే పెరిగి పెద్దవుతాయి. ఇటువంటి సమయాల్లో
గప్పి లేక గంబోషియా చేపలు (క్యాట్‌ఫిష్), బాసిల్లస్ బ్యాక్టీరియాలను
ఉపయోగించి నియంత్రించవచ్చు. దోమల లార్వాలను ఈ పద్ధతిలో నియంత్రించవచ్చు.
పర్యావరణ పరిశుభ్రంగా ఉంచుతూ, మురుగు, నిల్వనీరు ఎప్పటికప్పుడు పోయేందుకు
ఏర్పాటు చేసి దోమల పెరుగుదలను అరికట్టవచ్చు. అయితే, పెద్దఎత్తున ప్రజల
సహకారంతో ఉద్యమరూపంలో దోమల నియంత్రణ కార్యక్రమాలను చేబట్టాలి. దోమ తెరలను
వినియోగించి దోమకాటు నుంచి తప్పించుకొని తద్వారా మలేరియా వ్యాప్తిని
నియంత్రించవచ్చు. అందువల్ల, రసాయన కీటక సంహారాలు తప్ప దోమల నివారణకు మరో
ప్రత్యామ్నాయం లేదనటం సరైంది కాదు.
నివారణకు ప్రత్యామ్నాయాలు
దోమల మందులు.. ఒక ప్రహాసనం..
సైన్స్ వారసత్వం నిలుపుకుందాం..
విజృంభిస్తున్న మలేరియా...
తలనొప్పి, జ్వరం, చలి వస్తూ పోతున్న చిహ్నాలు రాగానే మలేరియా జ్వరం వచ్చిందని అనుమానిస్తారు. దీనినే చలిజ్వరంగా పిలుస్తున్నాం. ఇది వచ్చిన వెంటనే రక్తం నమూనాని పరీక్ష చేసి నిర్ధారించాలి. కొన్ని జిల్లాల్లో మలేరియా జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి. సరైన సమయంలో వైద్యం అందక మారుమూల ప్రాంతాల్లో, పేదలు చనిపోతున్నారు. అందువల్ల, ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే చికిత్స, నివారణ చర్యలు తీసుకోవాలి. దీని వ్యాప్తికి కారణమైన దోమలను నియంత్రించాలి. మలేరియా జ్వరం ఎర్రరక్తకణాల్లో ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా సూక్ష్మజీవి వల్ల వస్తుందని 1880 ప్రాంతంలో చార్లిస్ లూయీ ఆల్‌ఫోన్స్ లావెరన్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. దీన్ని కనుగొనకముందు సంవత్సరానికి లక్షలాది మంది మలేరియాతో మరణించేవారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు (1947లో) మనదేశంలో 75 మిలియన్ల మంది మలేరియాకు గురయ్యారు. ఎనిమిది లక్షల మంది చనిపోయారు. జాతీయ మలేరియా నిర్మూలనా కార్యక్రమం చేపట్టిన తర్వాత మలేరియా కనీసస్థాయికి తగ్గింది. కానీ, 1980 దశకం రెండవ భాగంలో మలేరియా జ్వరం మళ్లీ విజృంభించడం ప్రారంభించింది. 2008లో దేశం మొత్తంమీద 1.52 మిలియన్ల మంది మలేరియా బారిన పడ్డారు. దక్షిణ భారతదేశంలో ఈ జ్వరాలు కొద్దిగా తక్కువ. తూర్పు, ఉత్తర భారత దేశంలో మలేరియా జ్వరాలు ఎక్కువ. 2008లో మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమందికి 0.02 మంది మలేరియా బారిన పడ్డారు. మరణాలు కూడా తగ్గాయి. కానీ మలేరియా ద్వారా కాలేయం, మెదడుకు సంబంధించిన సంక్లిష్ట వ్యాధులకు గురవుతున్నారు. వెంటనే మలేరియాను గుర్తించి, వైద్యం అందించకపోతే వీరు మరణిస్తున్నారు. మంచి వైద్యం అందించడం ద్వారా మలేరియా బాధితులను రక్షించాలి.
మనదేశంలో ఈ జ్వరం ప్రధానంగా మూడురకాలైన సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. అవి ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఓవేల్. ప్లాస్మోడియం వివాక్స్ ద్వారా జ్వరం తీవ్రస్థాయిలో వస్తుంది. కానీ, మలేరియా వల్ల చనిపోయే 90 శాతం రోగుల్లో ప్లాస్మోడియా ఫాల్సిపారం జ్వరం కారణమవుతుంది. మలేరియా జ్వరాలు ఆడ అనాఫలిస్ దోమ కాటు ద్వారా మనుషుల్లో వ్యాప్తి చెందుతుంది. మగదోమలు ఇలా కుట్టలేవు. కుట్టి, రక్తం పీల్చే విధంగా వీటి నోటిభాగాలు ఉండవు. ఆడ దోమలు అంతకుముందే మలేరియా జ్వరం కలిగిన వారిని కుట్టి, మలేరియా కారక సూక్ష్మజీవులను నెత్తుటితో సహా తీసుకుంటాయి. ఈ సూక్ష్మజీవులు దోమల కడుపులో వృద్ధి చెందుతాయి. కాటు వేయడం ద్వారా దోమ తన సెలైవా గ్రంథి (ఉమ్మిలాంటిది) నుండి జబ్బులేని మనిషిలోకి మలేరియా కారక సూక్ష్మజీవుల్ని పంపుతాయి. ఈ విధంగా మలేరియా జ్వరం వ్యాపిస్తుంది. దోమ కుట్టిన అర్ధగంటలోనే మలేరియా కారక సూక్ష్మజీవులు రక్తంద్వారా మనిషి కాలేయంలోకి ప్రవేశిస్తాయి. కాలేయంలో ఇవి పెరిగి, వృద్ధి చెందుతాయి. తర్వాత కాలేయం నుంచి ఇవి శరీరం మొత్తం వ్యాపించి ఎర్రరక్త కణాల్ని నశింపజేస్తాయి. ఇది రక్తహీనతకు, బలహీనతకు దారితీస్తుంది. ఇవి స్పోర్స్ విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. దోమ కుట్టిన 6-14 రోజుల తర్వాత జ్వరం బయటపడుతుంది.
చిహ్నాలు..నిర్ధారణ
జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు స్పృహ కోల్పోతారు.
స్ల్పీన్, కాలేయం పెద్దవుతాయి. రక్తంలో చక్కెరస్థాయి తగ్గిపోతుంది. రక్తహీనత కలుగుతుంది.
మూత్రపిండాలు పనిచేయవు. ఫలితంగా మూత్రం ద్వారా ఎర్రరక్తకణాలు బయటకు వస్తాయి.
మంచి వైద్యం అందినా 20 శాతం వరకూ మరణాలు ఉండవచ్చు.
మలేరియా వ్యాధి కారక జీవులు ఎర్రరక్తకణాల్లో అభివృద్ధి చెందుతాయి. తద్వారా రక్తకణాల్ని చంపివేస్తా యి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. తేలికగా తల తిప్పడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, చలి 12 లేదా 24 గంటల వ్యవధిలో తిరిగి తిరిగి రావడం ఈ రోగ చిహ్నాలు.
ఒకోసారి రోగచిహ్నాలు పూర్తిగా కనిపించకపోవచ్చు. మైక్రోస్కోపును ఉపయోగించి రక్తపరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవాలి.
చికిత్స..
మామూలుగా క్లోరోక్విన్ మందు సమర్థవంతంగా నయం చేస్తుంది. కానీ ఇటీవల మలేరియా కారక సూక్ష్మజీవిపై ఈ మందు ప్రభావం చూపడంలేదు. ఈ సూక్ష్మజీవులు నిరోధకశక్తిని పెంచుకున్నాయి. వైద్యులు సూచించిన విధంగా పూర్తికాలం, పూర్తి మోతాదు వాడకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అలాగే మలేరియా తరచుగా వచ్చినప్పుడు కూడా ఈ మందుకు నిరోధకశక్తి ఏర్పడుతోంది. ఇటువంటి సందర్భంలో క్వినైన్, ఎమో డయాక్విన్‌లు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఇట్టి సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు ప్రత్యామ్నా యంగా కింది మందులను తీసుకోవచ్చు. ఫాల్సిపేరమ్ మలేరియాకు 'ఎమో డయాక్విన్' మందును తీసుకోవచ్చు. లేదా 'ఆర్టిసినేట్, సల్ఫో డయాక్సిన్'ను కలిపి లేదా 'ఆర్టిసినేట్, 'డయాక్సల్' కలిపి తీసుకోవచ్చు. ఓవేల్, వైవాక్స్ మలేరియాలకు 'ప్రైమాక్విన్' తీసుకోవచ్చు. పలు మందులకు నిరోధకశక్తి ఉన్నప్పుడు 'ఆర్టిసినేట్'తో పాటు 'మెఫలోక్విన్' తీసుకోవాలి.
నియంత్రణ వ్యూహం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం...
1. మలేరియా జ్వరాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలి. దీనికై మలేరియా అధికంగా ఉన్న ప్రాంతాల్లో జ్వరపీడితుల రక్త నమూనాలను పరీక్షించాలి. జ్వరపీడితులకు వెంటనే చికిత్సను ప్రారంభించాలి. ఇది రోగ వ్యాప్తి నిరోధకంలో తోడ్పడుతుంది.
2. రోగ వ్యాప్తికి కారణమైన దోమల నియంత్రణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, మురుగునీరు, నిల్వనీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
3. నిల్వనీరు, మురుగునీటి ప్రాంతాల్లో జీవ నియంత్రణ పద్ధతులను (ఉదా:గంబోషియా చేపలు) అనుసరిస్తూ దోమలను నియంత్రించాలి.
4. దోమల బెడద తీవ్రంగా ఉన్నప్పుడు మందుల్ని చల్లి నియంత్రించాలి. డిడిటి, మలాథియాన్, అల్లెత్రిన్ లాంటి మందులను వాడవచ్చు.
5. వ్యక్తిగతంగా, ముందుజాగ్రత్త చర్యగా దోమతెరల్ని వాడాలి. దోమ నియంత్రణ మందులతో పటిష్టపరిచిన దోమ తెరలను కూడా వాడవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో....
ఆంధ్రప్రదేశ్‌లో దోమల ద్వారా వ్యాప్తిచెందే వ్యాధుల్లో మలేరియా ప్రథమస్థానంలో ఉంది. ప్రతి వెయ్యిమందిలో 1977లో ఐదుగురు మలేరియాతో బాధపడేవారు. 1987లో ఇలా బాధపడేవారు 1.25కు తగ్గిపోయారు. కానీ, గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాల్లో, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 1996-2000 మధ్య ప్రతి సంవత్సరం వెయ్యిమందికి రాష్ట్రంలో సగటున 1.75 మంది మలేరియాతో బాధపడ్డారు.కొన్ని జిల్లాలో మలేరియా చాలా అధికంగా ఉంది. విశాఖ జిల్లాలో 8.35, కృష్ణాలో 5.18, తూర్పుగోదావరిలో 3.67, ఆదిలాబాద్‌లో 3.01, ఖమ్మంలో 2.86, కర్నూలులో 2.70, శ్రీకాకుళంలో 2.46, కడపలో 2.02, విజయనగరంలో 1.96 మంది మలేరియా బాధితులు. మిగతా జిల్లాల్లో తక్కువగా ఉంది
ప్రపంచ దోమల దినం
మలేరియా వ్యాప్తిలో దోమలకున్న పాత్రను నిరూపించిన 20 ఆగస్టును ప్రతి సంవత్సరం 'ప్రపంచ దోమల దినం'గా ఆచరించాలని సర్ రోనాల్డ్ రోస్ ప్రతిపాదించాడు. ఈ దినాన్ని విందూ, వినోదం కోసం కాక మలేరియాలాంటి అంటురోగాల వ్యాప్తి నిరోధానికి దోమల పాత్రను ఎత్తి చూపుతూ, వీటి నియంత్రణ అవసరాన్ని అందరిచేత గుర్తింపచేయడానికి పాటించాలని స్వయంగా రోనాల్డ్ ప్రతిపాదించాడు. మలేరియా ప్రబలంగా ఉండే ప్రాంతాల్లో ఈ దినాన్ని ప్రపంచమంతా జరుపుతున్నారు.
_______________________________________________________
వైరస్ అంటే...
బర్డ్‌ఫ్లూ వైరస్
ఫ్లూ వైరస్ కోళ్ళకు, ఇతర పక్షులకు కూడా రావచ్చు. దీనిని ఏవియన్ ఫ్లూ అని అంటారు. ఇది మానవులకు సామాన్యంగా రాదు. ఇలాంటి సమయాల్లో వ్యాధిసోకిన కోళ్ళను, పక్షులను చంపివేసి మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకకుండా నిరోధించవచ్చు. ఏవియన్ ఫ్లూ నిరోధక 'వాక్సిన్' అందుబాటులో ఉంది.
వైరస్‌లో మార్పు - తీవ్రమవుతున్న ఫ్లూ
ఇప్పటివరకూ అందుతున్న వార్తలనుబట్టి రాష్ట్రంలోని స్వైన్ ఫ్లూ వైరస్‌లలో మార్పులు వస్తున్నాయి. ఫలితంగా స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో ప్రమాదస్థాయిని చేరుకుంటుంది. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు బయటపడిన 24-48 గంటల్లో వ్యాధి తీవ్రరూపం దాల్చి, మరణాలకు కారణమవుతుందని సమాచారం. అందువల్ల స్వైన్ ఫ్లూ చిహ్నాలు ఏమాత్రం కనిపించినా వెంటనే సమీప వైద్యుని సంప్రదించాలి. రోగనిర్ధారణ చేయించుకోవాలి. మందులు తీసుకోవాలి.
జీవాలా? నిర్జీవాలా?
వైరస్‌లు జీవాలా? నిర్జీవాలా? అనేది మీమాంసగా ఉండేది. ముందుగా చెప్పుకున్నట్లే వైరస్‌లు తమంత తాము వృద్ధి చెందలేవు. పరాన్నజీవ కణాలను ఆశ్రయించి వాటిలో వృద్ధి చెందుతాయి. ఇప్పుడు శాస్త్రజ్ఞులంతా వైరస్‌లను జీవరాశుల్లో భాగంగా పరిగణిస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో...
ఫ్లూ నిరోధక టామీ ఫ్లూ మందు
ఇప్పటివరకూ స్వైన్ ఫ్లూ నిరోధక టామీ ఫ్లూ మందు ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా రోగులకు అందుతుంది. కానీ ఇకముందు గుర్తించబడిన కొన్ని మందుల షాపుల ద్వారా అమ్ముతారు. డాక్టర్ ప్రిస్కిప్షన్‌పై అవసరమున్నవారు కొనుక్కోవచ్చు.
__________________________________________________________________________
పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి
టపాకాయలు... కాలుష్యం...
ఈ రోజుల్లో పట్టలేని సంతోషం వచ్చి నప్పుడల్లా టపాసులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నారు. పెళ్లిళ్ల సందర్భంలో, దీపావళి పండుగ సందర్భంలో, నూతన సంవత్సర ప్రారంభంలో, ఇతర ముఖ్య సందర్భాలన్నింటిలో టపాసులను కాలుస్తున్నారు. వీటిని కాల్చడం వల్ల తోటి వారికి అసౌకర్యం, పర్యావరణానికి నష్టం ఎంత కలుగుతుందో పట్టించుకోవడం లేదు.
టపాసులు ప్రధానంగా రెండురకాలు. మొదటిది మిరుమిట్లు గొలిపే రంగు రంగుల కాంతులను ఇచ్చేవి. రెండవరకం పెద్దఎత్తున శబ్దం చేసేవి. ఇవి వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతాయి. మన ఆరోగ్యాలపై దుష్ప్రభావాల్ని కలిగిస్తాయి. అయినా పట్టించుకోవడం లేదు.
వినసొంపుగా ఉండే ధ్వనిని సంగీతంగా (మ్యూజిక్) పిలుస్తున్నాం. సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకున్న సంగీతం మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కష్టాల్ని మైమరిపిస్తుంది. ఉత్సాహాన్నిస్తుంది. వినసొంపుగా లేని ధ్వనిని శబ్దం (నాయిస్) గా పిలుస్తాం. టపాసులు పేల్చినప్పుడు వచ్చే ధ్వని (శబ్దం) కాల్చేవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్దఎత్తున వచ్చే శబ్దం వీరికి ఇంకా ఆనందాన్ని కలిగించవచ్చు. ఇతరులకు మాత్రం చాలా నష్టాన్ని, కష్టాన్ని కలుగజేస్తుంది. అందువల్ల కొంతమందికి వినసొంపుగా ఉండే శబ్దం మరికొరికి బాధను, విసుగును కలిగిస్తుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒకరి ఆనందాన్ని హరించే స్వేచ్ఛ మరొకరికి లేదు. అందుకే శబ్దకాలుష్యాన్ని నియంత్రణ చేయించడానికి నిబంధనలు రూపొందించేలా సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. దీని ఫలితంగా, శబ్దకాలుష్య నియంత్రణ నిబంధనలు 2000 సంవత్సరంలో రూపొందించబడ్డాయి. ఇవి 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద రూపొందాయి.
- విజ్ఞానవీచిక డెస్క్
____________________________________________________
శబ్ద నియంత్రణ నిబంధనలు (2000) (సంక్షిప్తంగా)
* తోల్‌వాలాలు (జడలాగా అల్లే సీమటపాకాయలు) వరుసగా వంద, వెయ్యి, ఐదువేలు, పదివేలు టపాసులతో జడలా చుట్టి తయారుచేస్తున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం ఇవి విడుదల చేసే శబ్ధాన్ని 5లాగ్10× (కలిపిన బాంబుల సంఖ్య)తో లెక్కిస్తారు. ఇలా లెక్కించిన శబ్దం 125 డెసిబెల్స్‌కు మించకూడదు. అందువల్ల 1000 ఆ పైన బాంబులను కలిపి తయారుచేయడం నిబంధనలకు విరుద్ధం.
* ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యే టపాసులు కాల్చాలి. ఇంతకన్నా ముందుగానీ ఆ తర్వాత గానీ కాల్చకూడదు.
* నిశ్శబ్ద ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో 100 మీటర్లలోపు టపాసులను ఏ సమయంలోనూ కాల్చడానికి వీలులేదు. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యాలయాలు, కోర్టులు, దేవాలయాలు, ప్రత్యేకంగా గుర్తించి ప్రకటించిన ఇతర ప్రాంతాలు టపాసులను కాల్చడానికి నిషిద్ధ ప్రాంతాలు.
టపాసులు కాలిస్తే..
* చెత్తాచెదారాన్ని పోగుపరుస్తాయి.
* గాలిలో తేలాడే ఘన రేణువులు శ్వాస సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి.
* విష వాయువులను విడుదల చేస్తాయి.
* వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెంచుతాయి.
* పెద్ద ఎత్తున శబ్దం చేస్తాయి. శబ్ద కాలుష్యాన్ని పెంచుతాయి.
* పెద్దలకు, పిల్లలకు ప్రమాదం కలిగించవచ్చు. కచ్ఛితంగా వీటిని కాల్చడం నిప్పుతో ఆడుకోవడమే.
* ప్రమాదాలు సంభవిస్తాయి.
* పశువులు, పక్షులు భయభ్రాంతులకు లోనవుతాయి.
*ఎంతోమంది ప్రమాదాలకు లోనవుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఎంతోమంది వికలాంగులుగా మారుతున్నారు.
వీటిని ప్రధానంగా తమిళనాడులోని శివకాశిలో తయారుచేస్తున్నారు. ఈ కర్మాగారాల్లో ఎక్కువగా పిల్లలే పని మచేస్తున్నారు. వీరు దాదాపు బానిసలుగా బతుకుతున్నారు. టపాకాయలను కాల్చడం ద్వారా వీరి బానిస జీవనాన్ని పరోక్షంగా ప్రోత్సహించినట్లు అవుతుంది.
గమనిక: టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజాశక్తి ఆదివారం అనుబంధం 'స్నేహా' (11వ తేదీ) లో ప్రచురించాం. గమనించగలరు.
ఆరోగ్యంపై దుష్ప్రభావాలు..
* సరిగ్గా నిద్ర పట్టకపోవడం. లేదా నిద్రలేమితో బాధపడటం.
* రక్తపోటు పెరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం.
* అలిసిపోయినట్లు భావించడం, అనారోగ్యంగా లేదా అసౌకర్య భావన కలిగి ఉండటం.
* మామూలుగా మాట్లాడలేకపోవడం లేదా మాట్లాడినదాన్ని పరస్పరం అర్థం చేసుకోలేకపోవడం.
* పని సామర్ధ్యాన్ని కోల్పోవడం.
* మానవ సంబంధాలను కొనసాగించడంలో ఇబ్బందులు
శరీర ధర్మాలపై దుష్ప్రభావం
* నరాల బలహీనత, మితిమీరిన ఉత్సుకత, ఆందోళన, నిద్రలేమి, రక్తపోటు, మత్తుగా ఉండటం, వాంతి వచ్చే భావన, అలిసిపోవడం, చర్మ వ్యాధులు కలగడం జరుగుతుంది.
* దీర్ఘకాలం పెద్దఎత్తున శబ్దాలు వింటే గర్భస్రావాలు కావచ్చు. పుట్టే పిల్లలలో లోపాలు ఏర్పడవచ్చు.
* పిండం గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది. పిండ నరాల వ్యవస్థలో లోటుపాట్లు వస్తాయి.
* టపాసులు కాల్చేటప్పుడు క్రమంలేని శబ్దాలు వెలువడతాయి. అనుకోకుండా వచ్చే పెద్ద శబ్దాలు ఎంతోమందిని భయభ్రాంతులను చేస్తుంది. ఒక ఉపద్రవం వస్తుందన్న భావన కలిగిస్తుంది.
* వాయు కాలుష్యం జరుగుతుంది. ముఖ్యంగా మిరుమిట్లు గొలిపే టపాకాయలు విష వాయువులను విడుదల చేస్తాయి.
ఆరోగ్యానికి హాని కలిగించే టపాసుల రసాయనాలు
టపాసుల్లోని రసాయనాలన్నీ జీవాలకు హాని కలిగించేవి. ఇందులో రాగి చాలా ముఖ్యమైనది. ఇది శ్వాస సమస్యను కలిగిస్తుంది. కాడ్మియం రక్తహీనతను కలిగిస్తుంది. మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. వీటిలోని సీసం నరాల వ్యవస్థపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. మెగ్నీషియం దుమ్మూ, ధూళి, పొగ జ్వరాన్ని, ఎలర్జీని కలిగిస్తాయి. సోడియంకు తేమతో మండే ధర్మం కలిగి ఉంది. ఇది అన్ని రసాయన మార్పుల్లో పాల్గొంటుంది. చర్మ రోగాన్ని కలిగిస్తుంది. జింకు వాంతులను కలిగిస్తుంది. నైట్రేట్ మానసిక అస్వస్థతకు గురిచేస్తుంది. నైట్రైట్ స్పృహ కోల్పోయేలా చేస్తుంది.
ప్రకృతి పరిరక్షణ సిద్ధాంతాలు
ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కింది సూత్రాలను ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి.
1. నిత్యం వాడే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి.
2. నిత్యం వాడే వస్తువులను అవసరమున్న మేర రూపాలు మార్చి తిరిగి వాడుతూ ఉండాలి.
3. నిరుపయోగమైన వస్తువులను తిరిగి వినియోగించగలిగే రూపంలోకి మార్చాలి.
4. దేన్నైనా కొనేముందు ఇది తప్పనిసరిగా అవసరమా అని ఒకటి రెండు సార్లు ఆలోచించి, తప్పనిసరి అని భావించినప్పుడే కొనాలి.
5. అవసరంలేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.
ఈ దీపావళి పండగ సందర్భంలో వీటిని ఆచరిద్దాం.
_____________________________________________________
గాలిని మానవులే కాదు, ప్రపంచంలో ఏ జీవీ గాలిని చూడలేదు. కానీ గాలి ఉనికిని మనం గ్రహించగలము. గాలి వీచినపుడు మన చర్మంలోని స్పర్శేంద్రియ పరిజ్ఞానం మనకు దాని ఉనికిని తెలియజేస్తుంది. ఒకవేళ గాలి వీచకపోయినా మనం అటూ ఇటూ వేగంగా కదిలినపుడు కదలాడే మన తలవెంట్రుకల ద్వారా, మన చర్మంపై ఏర్పడే వత్తిడి ద్వారా మనం గాల్లో ఉంటున్నట్టు పసిగట్టగలము. మనం శ్వాస పీలుస్తున్నట్టు భావిస్తే అక్కడ గాలి ఉన్నట్టే అర్థం. మన స్నేహితులు లేదా మన ఉపాధ్యాయులు, మన నాయకులు చెప్పే మంచిమాటలు వినగలుగుతున్నామంటే అర్థం మనం గాలిలో మసలుతున్నట్టే. మనం తలెత్తి పైకి చూసినపుడు దూరంగా విమానాలో, హెలికాప్టర్లో, పక్షులో, ఎండుటాకులో, గాలిపటాలో, దూదిపింజలో ఎగురుతున్నాయంటే ఆ చుట్టూతా గాలి ఉన్నట్టే అర్థం. ఎందుకంటే గాలి లేకుండా మనకు శబ్దాలు వినిపించవు. గాలి లేకుంటే మనం శ్వాస పీల్చుకోలేము. మన శరీరమే తన నిర్మాణాన్ని కోల్పోయి ఊదిన బెలూనులాగా పగిలిపోతుంది. గాలిలో ఎగిరే ఏ వస్తువయినా గాలి లేకుంటే కిందపడి ఉండేది. తల్లి గర్భం నుంచి పుట్టిన నాటి నుండి మరణించేంత వరకు మన శరీరం గాలిలోనే పెరుగుతోంది. గాలి మన మీద ఎంతో వత్తిడి కలిగిస్తుంటుంది. ఒక సాధారణ వ్యక్తి మీద సుమారు 8500 కి.గ్రా. బరువున్న బస్తాను నెత్తిమీద పెట్టుకున్నంత గాలి పీడనం వస్తుంది. అందుకే చంద్రమండలం, తదితర వాతావరణం లేని గ్రహాలు, అంతరిక్షంలో పొరపాటున వ్యోమగామిపై ఉన్న రక్షకవస్త్రాలు (Astronaut robes) పగిలిపోతే ఆ వ్యోమగామి పేలిపోతాడు.
కనుక గాలి అన్నట్టు మనం చూడకపోయినా స్పర్శేంద్రియాల (చర్మం) ద్వారా గ్రహించగలము. లేదా ఆకుల కదలికలను చూడ్డం ద్వారా, శబ్దాలను వినడం ద్వారా కూడా గుర్తించగలము. ఒక వస్తువును మనం చూడాలంటే ఆ వస్తువు మీద తగినంత కాంతిపడి అది పరావర్తనం చెంది మన కంటిలోకి చేరాలి. కానీ గాలి (నైట్రోజన్, ఆక్సిజన్ వంటి) అణువులు గాలిలో చాలా తక్కువ ఉంచడం వల్ల, పైగా వాటిమీద పడ్డ కాంతి పరావర్తనం చెందకపోవడం వల్ల మనం కంటితో గాలిని సూటిగా చూడలేము. ప్రధానంగా మనం చూడగలిగిన దృశ్యకాంతి తరంగదైర్ఘ్యం (wavelength) కన్నా గాలి అణువుల సైజు తక్కువ కావడం వల్లే మనం గాలి అణువుల్ని కంటితో చూడలేము.
ఇక మూఢ విశ్వాసుల సంగతి గురించి. ముందే వారిని మూఢ విశ్వాసులు అన్నారు కాబట్టి అదే ఆ ప్రశ్నకు సమాధానం. మూఢుడు చక్రవర్తికంటే బలవంతుడు అంటారు. ఎందుకని? తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని వారు వాదిస్తూనే ఉంటారు. అటువంటి వారికి ఈ విషయంలో మనం కొన్ని ప్రతి ప్రశ్నలు (counter questions) వేయాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం.
మూఢ విశ్వాసుడు: గాలి కనిపించిందా నీకు?
సైన్సు నమ్మకస్తుడు: లేదు. ఎందుకంటే...
మూ.వి: ఆపు, అధికప్రసంగం. అలాగే దేవుడు, దయ్యము, భూతము, ఆత్మ కనిపించదు. అర్థమయిందా?
సై.న.: రెండు వేర్వేరు అంశాల్ని పోల్చినపుడు నీకు అనుకూ లంగా ఎందుకు పోల్చుకుంటున్నావు? నేను ఓ ప్రశ్న వేస్తాను.
నీకు పక్కనున్న గొర్రె కనిపించిందా?
మూ.వి.: కనిపించింది. అయితే?
సై.న. : మరి భూతం, దయ్యం, ఆత్మ ఎందుకు కనిపించవు?
మూ.వి.: ప్రపంచంలో కనిపించే వాటిని, కనిపించని వాటితో పోల్చడం బుద్ధి తక్కువ. కనిపించని వాటికి, కనిపించని వాటితోనే పోల్చాలి. అందుకే కనిపించని గాలిని కనిపించని ఆత్మ, భూతాది విషయాలతో పోలుస్తున్నాను. కాబట్టి గాలిలాగా ఆత్మాది విషయాలున్నాయని ఒప్పుకో.
సై.న.: కనిపించని వస్తువుల్ని కనిపించని వాటితోనే పోల్చుకున్నంత వరకు ఓకే! మరి గాలికి బరువుంది. బెలూన్లో పెడితే కొంత ఘనపరిమాణం వస్తుంది. దానిని చల్లబరిస్తే ద్రవం అవుతుంది. ఇంకా చల్లబరిస్తే మనం పట్టుకోగలగినంత గట్టిగా ఉండే ఘనరూపం కూడా వస్తుంది. మరి ఆత్మ బరువెంత? బెలూన్లో ఊదితే సాగుతుందా? గాజు సీసాలో పెట్టి చల్లబరిస్తే ఆత్మ ద్రవరూపంలోకి వస్తుందా? దాన్ని ఇంకా చల్లబరిస్తే ఘనరూపంలోకి మళ్లించగలమా?
మూ.వి.: గాలిలాగే కనిపించన్నంత వరకే ఆత్మ సంబంధ విషయాల్ని పోల్చాలిగానీ గాలికున్న అన్ని లక్షణాలతో నువ్వు ఆత్మాది విషయాల్ని పోల్చకూడదు. అలా పోల్చడం నీ అవివేకం. మూర్ఖత్వం, మిడి మిడి జ్ఞానంతో నీ కళ్లు మూసుకుపోయాయి.సై.న.: మీ మాటే ఒప్పుకుంటాను. మరి గాలి కనిపించకపోయినా అది ఉన్నట్లు చాలా రకాలుగా, ప్రభావాల ద్వారా గుర్తించగలను. మరి ఆత్మ, దయ్యం, భూతం, దైవం వంటివి ఉన్నట్టు ఏయే ప్రభావాలు ద్వారా తెలుసుకోగలమో తెలియజేయండి స్వామీ!
మూ.వి.: నువ్వు రామగోపాలవర్మ సినిమాలు చూడలేదురా మూర్ఖుడా! దయ్యాలు టి.వి.లను ఆన్ చేస్తాయి. పడబోతున్న బంతిని పడకుండా గాల్లోనే నిలుపుతాయి. చచ్చిన శరీరంలోంచి గాలి బయటికి వచ్చి ఆత్మల రూపంలో మరో శరీరంలోకి వెళతాయి. వాటిని మంత్రతంత్రాలతో వశం చేసుకోవచ్చును.
సై.న: టివిలను ఆన్ చేయాలంటే అందుకు కొంత బలము, టార్క్ అవసరం. ద్రవ్యరాశి కలవాటికే టార్క్ ఉంటుంది. బంతుల్ని కిందపడకుండా ఉండాలంటే గురుత్వాకర్షణశక్తి అవసరం. అది ఉండాలంటే కూడా వస్తువులకు బరువు అవసరం. నీవు భూతాలకు, దెయ్యాలకు ఆపాదించిన కార్యకలాపాలన్నీ జీవులు మాత్రమే చేయగలవు. డిఎన్‌ఎ లేకుండా ఏదీ జీవి చేసే కార్యక్రమాలు చేయదని, డిఎన్‌ఎ కేవలం జీవకణంలో మాత్రమే ఉండగలదనీ, జీవకణాలు ఉన్న వాటినే ప్రాణులు అంటారని విజ్ఞాన శాస్త్రం ఘోషిస్తోంది. దీనికి తిరుగులేని సాక్ష్యాలు, ఋజువులు ఉన్నాయి. కాబట్టి జీవకణాలు లేకుండా జీవులు చేసే కార్యక్రమాలు జరగవు కాబట్టి దయ్యాలు, భూతాలు కూడా ఉండడానికి వీలులేదని గుర్తించండి!్ణ
___________________________________________________
''ఆనంద్‌గారూ!
(పేరు మార్చబడింది). మీది చాలా మంచి జాతక మండీ! జాతకం ప్రకారం మీకు ఇద్దరు
పిల్లలు. ఇద్దరూ మగపిల్లలే. ఇక వధువు జాతకం కూడా చాలా బాగుంది. ఆమె వలన
మీరు చాలా సుఖపడతారు.'' అన్నాడు సిద్ధాంతి రాఘవయ్య ఆనంద్‌తో.
ఆనంద్ చాలా సంతోషించాడు. ఆయనకు వెంకటరమణమ్మతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇద్దరూ ఆడపిల్లలే! ఈలోగా మరో అనుకోని సంఘటన జరిగింది. వెంకటరమణమ్మ క్రైస్తవమతం స్వీకరించింది. ఆనంద్, రమణమ్మ విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరూ సుఖపడతారని చెప్పబడిన జోస్యం అబద్ధమైంది!
ఆనంద్ మరల వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు జానకి. ఆమె జాతకం పంపించమని ఆమె తండ్రి పరంధామయ్యని ఆనంద్ అడిగాడు. పరంధామయ్య ముగ్గురు ప్రముఖ జ్యోతిష్యులచేత అమ్మాయి జాతకాన్ని రాయించుకొని తీసుకువచ్చాడు. ముగ్గురు జ్యోతిష్యులూ అమ్మాయి జాతకం చాలా బాగుందన్నారు. ఆనంద్ జాతకంతో ఆ అమ్మాయి జాతకం సరిగ్గా సరిపోయిందనీ, ఇద్దరూ సుఖపడతారని చెప్పారు. ఆనంద్ ఆనందించి, అమ్మాయి పేదపిల్ల అయినా వివాహం చేసుకున్నారు. కాని వివాహం అయిన కొద్దికాలానికే జానకి ఆనంద్ ఆస్తిని తనపేరున పెట్టమని పోరుపెట్టసాగింది. ఆయన అంగీకరించకపోవడంతో ఇంట్లోంచి పారిపోయింది. అంతేకాదు, అత్తింటివారు తరిమేశారని కేసు బనాయించింది.
జాతకాలు 'సరిగ్గా సరిపోయాయన్నది' ఎటుబోయిందోగాని, జానకి పుట్టింట్లోనే ఉండి భరణం తీసుకుంటోంది. ప్రస్తుతం ఆనంద్ వృద్ధాశ్రమంలో కాలం వెళ్ళదీస్తున్నారు. జ్యోతిష్యులన్నా, జాతకాలన్నా మండిపడుతున్నాడు!
గాలి, దెయ్యాలు ఒకటేనా?

ఏం చెప్పారు? ఏమయింది?
-
(మరో అంశం వచ్చేవారం)
-
విశ్వాసాలు.. వాస్తవాలు... 12

_______________________________________________
దయ్యాల క్వార్టర్...!
-
విశ్వాసాలు.. వాస్తవాలు... 13
నేను ఇంకేమీ ఆలోచించకుండా 'మధుకుమార్‌గారూ! నేను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తనని ఇంతకుముందు ఎ.ఇ.గా ఇక్కడ పనిచేస్తున్నప్పుడే మీకు తెలుసు. దయ్యాలనేవి మన భయం మాత్రమే. అందువలన దయ్యాల భయం నాకు లేదు. ఆ క్వార్టరు నాకు కేటాయించండి' అన్నాను.
'సార్! మీరు ఇంకొక్కసారి ఆలోచించండి. ఆ క్వార్టర్‌లో జిమ్ ఏర్పాటు చేద్దామంటే, జిమ్‌కైనా మేము ఆ క్వార్టర్‌కు రాము అని ఆ కాలనీ వాళ్ళు అన్నారు. అయినా మీకేం అభ్యంతరం లేదా?' అని మధుకుమార్ మళ్ళీ అడిగాడు.
'మధుకుమార్ గారూ! నేను డిపార్ట్‌మెంట్‌లో ఎ.ఇ.గా 28.3.1979న జాయిన్ అయిన వాణ్ణండీ. ఆ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అమావాస్య. అమావాస్య నాడు డిపార్ట్‌మెంటులోకి జాయిన్ అయి ఇప్పటికి 23 ఏళ్ళు అయింది. ఈ 23 ఏళ్ళలో పై అధికార్ల చేత ఒక్క మందిలింపుగానీ, క్రమశిక్షణా చర్యలు గానీ ఏమీ లేవు నాకు. అలాంటి మూఢనమ్మకాల్లేవు నాకు. మీరు నాకు ఆ క్వార్టరు కేటాయింపజేయండి' అని గట్టిగా చెప్పాను. ఆ క్వార్టరు నాకు కేటాయించబడింది. దానిలో మూడేళ్ళున్నాము. ప్రశాంతంగా, సంతోషంగా గడిపి గౌరవప్రదంగా రిటైరైనాను. ఏ ఇబ్బందులూ, కీడులూ, దయ్యాల బాధలూ మాకేమీ ఎదురుకాలేదు. కొసమెరుపు: ఈ సంఘటన జన విజ్ఞాన వేదిక చీరాల నాయకులు కుర్రా రామారావు గారికి 2009లో చెపితే ఆయన 'కాంతారావుగారూ! నేను కూడా నా మోటార్‌సైకిల్‌ను 2002లో అమావాస్య, మంగళవారం నాడు కొన్నాను. ఇప్పటికి ఏడేళ్ళయింది. నా బండికి గానీ, నాకు గానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు' అన్నాడు!
- కె.ఎల్.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)(మరో అంశం వచ్చేవారం...)
_______________________________________________
ఉష్ణోగ్రత డిగ్రీలకు గణితంలో కోణాల డిగ్రీలకు తేడా ఏమిటి?
డిగ్రీ అంటే ఇంగ్లీషులో స్థాయి (level) అని అర్థం. ఉదాహరణకు 'నేను డిగ్రీ చదివాను' అని ఎవరయినా అంటే కళాశాలలో ప్రథమస్థాయికి చేరాను అని అర్థం. అంటే ఇంటర్మీడియట్ అయ్యాక మనకు ఇచ్చే B.A., లేదా B.Com., లేదా B.Sc., B.tech., M.B.B.S., వంటి వాటిని డిగ్రీ అని అంటారు. ఆ తర్వాత పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ అంటారు. M.Sc., MD లాగానన్నమాట. Ph.D. డిగ్రీ అని కూడా అంటారు. డిగ్రీ అనే పదాన్ని ఒకదానికన్నా మరోది ఎక్కువ అని చూపడానికి వాడతారు. అంటే ఆ ఒరవడిలోనే ఉష్ణోగ్రతను, కోణాన్ని డిగ్రీలలో కొలుస్తారు. ప్రతి ఉష్ణోగ్రతా కొలమానానికి సాపేక్షతగా భౌతిక ఘటనలు (Relative Physical States) ఉంటాయి. ఉదాహరణకు సెంటీగ్రేడు డిగ్రీలను (దీనినే సెల్షియస్ స్కేల్ అని కూడా అంటారు) తీసుకుందాం. నీరు సాధారణ వాతావారణ పీడనమైన 760 మి.మీ. పాదరస మట్టం వద్ద గడ్డకట్టే భౌతిక పరిస్థితి చల్లదనానికి చిహ్నం. అది ఒక భౌతిక ఘటన.
అదే నీటిని అదే వాతావరణ పీడనం దగ్గర వేడిచేస్తూ వెళితే అది ఒక ఉష్ణోగ్రత దగ్గర ఆవిరవుతుంది. ఇది మరో భౌతిక ఘటన. ఇక్కడ వేడిగా ఉన్న పరిస్థితిని చూస్తాము. ఈ రెండు ఘటనలు రెండు వేర్వేరు ఉష్ణతాపానికి ప్రతిరూపాలు. నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత (ఉష్ణ + ఉగ్రత) కన్నా నీరు సలసల కాగే ఉష్ణోగ్రత ఎక్కువే కదా! మరి మధ్యలో కూడా తాప స్థాయీలుంటాయి. అంటే గడ్డకట్టే పరిస్థితితో సాపేక్షంగా కొన్ని కొన్ని స్థాయిలలో (డిగ్రీలలో) ఉష్ణోగ్రత పెరిగి నీరు ఆవిరయ్యే స్థాయికి చేరుకొన్నట్టు అర్థం. అంతర్జాతీయంగా నీరు సాధారణ పీడనం (1atm లేదా 760 మి.మీ. పాదరసమట్టం) దగ్గర ఐసు గడ్డగా మారే స్థానం (freezing point) నుంచి నీరు ఆవిరయ్యే స్థానం (boiling point) వరకు 100 స్థాయిలను ఆమోదించారు. ఒక్కోస్థాయి పేరు 1 డిగ్రీ. వందలో ఒకభాగం కాబట్టి ఈ డిగ్రీని 1 సెంటీగ్రేడు డిగ్రీ అన్నారు. శాస్త్రవేత్తల పేరుతో ప్రమాణాలుండడం ఆనవాయితీ. ఈ 1 డిగ్రీని 1 సెల్షియస్ ప్రమాణం అని సెల్షియస్ శాస్త్రవేత్త పేరును కూడా వాడారు. అంటే మన శరీర ఉష్ణోగ్రత 37 oC. అంటే మన శరీరంలోని ఉష్ణతాపం నీరును గడ్డ కట్టించే తాపం కన్నా 37 డిగ్రీల మేర అదనంగా ఉన్నట్టు అర్థం. అలాగే వేసవికాలంలో రామగుండంలో ఉష్ణోగ్రత 50 oC. అంటే అక్కడ శరీర ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువగా వాతావారణ ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట.
మరి ఇక కోణం సంగతేమిటి? కోణం (angle) అంటే రెండు రేఖల(lines) మధ్య లేదా రెండు ఉపరితలాల (surfaces) మధ్య ఉన్న సందు (gap of diversion) గా భావిస్తాము. ఆ రెండు రేఖలు ఒకే బిందువు దగ్గర మొదలై అటూయిటూ వేరుపడతాయనుకుందాం. అపుడు ఎంత తీవ్రతతో పరస్పరం దూరంగా జరుగుతున్నాయన్న విషయం ఆ రెండు రేఖల మధ్య ఉన్న సందు ఆవిష్కరిస్తుంది. దాన్నే ఆ రెండు రేఖలు ఆ కలిసే బిందువు వద్ద చేసే కోణం (angle) రూపంలో చెబుతాము. రెండు రేఖలు, లేదా రెండు పార్శాలు (తెరిచిన ఫైలు అట్టల్లాగా) తాము కలిసిన అంచు (edge) లేదా బిందువు (point) దగ్గర చేసే సందును బట్టి ఆ రేఖల మధ్య, లేదా తలాల మధ్య ఎడబాటును గుర్తిస్తాయి. రెండు రేఖలు కలిసి ఒకే దిశలో ఉంటే వాటి మధ్యనున్న కోణం సున్నా (శూన్యం) ఉన్నట్టు అర్థం. ఇది ఒక భౌతిక పరిస్థితి లేదా ఘటన. ఆ రెండు రేఖలు తమ ఒకవైపు చివరలను కలిపి ఉంచుకొని మరోవైపు చివరలను వేరుపరుస్తూ ఉంటే వాటి మధ్య కోణం పెరుగుతూ ఉందన్నమాట. అలా అలా పెరుగుతూ పెరుగుతూ పోతే చివరికి మళ్లీ కలిసే స్థితి వచ్చిందనుకుందాం. అది రెండో ఘటన లేదా పరిస్థితి. దీన్నే ఒక వలయం (cycle) పూర్తవడం అంటాము. విడివడకుండా ఉన్న పరిస్థితిలోని ఘటన నుంచి పూర్తిగా విడిపడి తిరిగి యథాస్థితికి రావాలంటే వాటి మధ్య కోణం పెరగాలి. మొదటి ఘటనను 'సున్న' కోణంతో చూపిస్తే సందు పెరిగే కొద్దీ పెరిగే కోణపు విలువలు రావాలి.
ఉష్ణోగ్రత విషయంలో సెల్షియస్ ప్రమాణానికి నీటి ఘనీభవన ((freezing), భాష్పీభవన (boiling) స్థానాల్ని రెండు వేర్వేరు భౌతిక ఘటనలుగా తీసుకొని, ఆ మధ్యలో దొర్లిన ఉష్ణోగ్రతా వ్యత్యాసాన్ని 100 సాపేక్ష స్థాయీలు (డిగ్రీలు)గా సంభావించినట్లే (convention) రేఖాగణిత సంబంధ కోణాన్ని లెక్కించడానికి గడియారంలోని ముళ్ల స్థానాలను పరిగణిస్తారు. గడియారంలోని నిముషాల ముల్లు, సెకన్ల ముల్లు ఒకే స్థానంపై ఉన్న సంఘటనను 'సున్న' ప్రమాణాలు అనుకొంటే తిరిగి అవి బయలుదేరిన స్థానానికే రావడానికి పట్టే సమయం 3600 సెకన్లు అవుతుంది. అంటే సెకన్లముల్లు, నిముషాల ముల్లు మధ్య నిడివి పెరిగి, తిరిగి శూన్యం కావడం, మళ్లీ పెరిగి గరిష్టం చేరి తిరిగి శూన్యం కావడం సంభవిస్తూ ఉంటుంది. సెకన్లముల్లు 3600 సెకన్లు చేసిన సందర్భంలో గంటల ముల్లు, నిముషాల ముల్లు మధ్య సందు పెరిగి ఒక పూర్తి వలయం (cycle) అయ్యాక తిరిగి కలుసుకొంటాయి. లేదా 10 సెకన్లకాలం పాటు సెకన్ల ముల్లు తిరిగే సమయంలో గంటల ముల్లు, నిముషాల ముల్లు మధ్య ఏర్పడే కోణాన్ని ఒక స్థాయి (డిగ్రీ)గా భావించారు. అందుకే మొత్తం వలయంలో 3600/10 = 360 డిగ్రీల కోణం ఉన్నట్లు రేఖాగణిత కోణానికి భాష్యం చెప్పారు. కాబట్టి పూర్తి వలయంలో 360శీ కోణం ఉన్నట్లు, సరళరేఖపై అందులో సగమైన 180శీ ఉన్నట్లు, లంబకోణంలో 90శీఉన్నట్లు ఆచరణలో వ్యక్తమవుతుంది.
సాపేక్షంగా ఫలాని దానితో పోల్చితే మరోది ఈ విధంగా ఉంది అని ఉటంకించడానికి 'డిగ్రీ'ని వాడతారన్న భావనలోనే ఉష్ణోగ్రతలను, కోణాలను డిగ్రీలతో కొలుస్తున్నారు. ఏ రెండు భౌతిక ఘటనలకు సంబంధం లేకుండా కొలిచే ఉష్ణోగ్రతల ను పరమ ఉష్ణోగ్రత (absolute temperature) అంటారు. అంటే ఉష్ణోగ్రతకు కారణభూతమైన పదార్థ గమనం పూర్తిగా శూన్యమయ్యే స్థితిని పరమశూన్యం (absolute zero) గా భావిస్తాము. అక్కడి నుంచి పెరిగే ఉష్ణోగ్రతను కెల్విన్ ప్రమాణాలతో కొలుస్తారు. అయితే ఇక్కడ సాపేక్షత లేదు కాబట్టి ఈ ఉష్ణోగ్రతను ఫలాని కెల్విన్‌లు అనాలి తప్ప ఫలాని డిగ్రీల కెల్విన్‌లు అనడానికి వీల్లేదు. ఉదాహ రణకు 25 oC ను పరమ ఉష్ణోగ్రతతో చూపితే 298 K అవుతుంది. దీనిని 298 oK అని రాయకూడదు. అదే విధంగా వలయం (cycle) లో వృత్తపరిధి (perimeter), వృత్త వ్యాసాని (diameter)కి ఎప్పుడూ స్థిర నిష్పత్తి ఉంటుంది. దీనిని 'పై' (p) అంటారు. వృత్తంలో రెండు వ్యాసార్థాల చివరలు కలిసి విడివడి, తిరిగి కలవాలంటే 2p కోణం మధ్యలో ఉంటుంది. ఈ కోణాన్ని 2జూ రేడియన్లు అంటారు. వీటిని 2po రేడియన్లు అనరు. కాబట్టి 2p రేడియన్లు = 360శీ కోణము అవుతుంది.
_______________________________________________
డెభ్భైఏళ్ళ నాటి సంఘటన ఇది. తెనాలిలో మా అమ్మమ్మ, అమ్మ
(చిన్నపిల్ల), తాతయ్య ఉండేవారు. మా తాతయ్య ఒక బట్టలషాపులో పనిచేసేవారు.
ఒకరోజు ఉదయం షాపుకు వెళ్ళాడు. సమయం ఉదయం 11గంటలయింది. మా అమ్మ అనారోగ్యంతో
బాధపడుతున్నది. ఆ చిన్నపిల్లను సముదాయిస్తూ మా అమ్మమ్మ తన పనులు
చేసుకొంటోంది. ఇంతలో బైట నుండి 'అమ్మా! బిక్షం' అంటూ ఒక బిచ్చగత్తె కేక
వినిపించి మా అమ్మమ్మ బయటకు చూసింది. బయట ఒక బిచ్చగత్తె ఒక పసిపిల్లవాణ్ణి
ఎత్తుకొని నిలబడి ఉంది. మా అమ్మ్మ దోసిటి నిండా బియ్యం తీసుకొని వెళ్ళి
బిచ్చగత్తె జోలెలో వేసి వెనుదిరిగింది. 'అమ్మా' అనే పిలుపుతో బిచ్చగత్తె
వైపు తిరిగింది. 'చేతిలో పిల్లనగ్రోవి, నెత్తిన నెమలి పింఛం పెట్టుకొని
ఊరూరా తిరుగుతున్న ఒక మహానుభావుడు నీకు కనిపించాడా?' అని ఆ బిచ్చగత్తె
అడిగింది. మా అమ్మమ్మ తాను చూడలేదంది. బిచ్చగత్తె కొనసాగించింది. ''ఆ
మహానుభావుడి ఆశీర్వాదంతో నా బిడ్డ రోగం నయమయింది. ఆయనను ఒక్కసారి కలుసుకొని
బిడ్డను ఆయన కాళ్ళమీద పడేయాలని చూస్తున్నాను' అంది.
ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇక మా అమ్మమ్మకు ఆందోళన మొదలైంది. ఆ మహానుభావుడు ఒక్కసారి కనిపిస్తే ఆయన ఆశీర్వాదం తన బిడ్డకు ఇప్పించాలనీ, దానితో తరచూ అనారోగ్యానికి గురవుతున్న తన బిడ్డ ఆరోగ్యవంతురాలౌతుందనీ భావించసాగింది. ఇంతలో మధ్యాహ్నం ఒంటిగంట అయింది. మా తాతయ్య వచ్చాడు. ఆయనకు భోజనం వడ్డించి తీరికగా ఉదయం జరిగిన సంఘనను, తన మనస్సులోని ఆలోచనను ఆయనకు చెప్పింది. ఆయన నవ్వుతూ ''అయితే ఆ నెమలి పింఛం వేషధారి కన్పిస్తే అమ్మాయికి అతని ఆశీర్వాదం కావాలని అడుగుతావా?' అని అడిగాడు. అమ్మమ్మ 'అవును' అంది. 'అయితే రేపు ఉదయం ఆ నెమలి పింఛం వేషధారి మురళి ఊదుతూ మన ఇంటి ముందు కనిపిస్తాడు. నీవు బయటికి వెళ్ళి చూడు. ఆ బిచ్చగత్తె వీధి చివరలో నిలబడి ఉంటుంది' అన్నాడు. మా అమ్మ ఆశ్చర్యంతో 'మీరు చెప్పేది నాకర్థం కావడం లేదు' అంది. 'పిచ్చిదానా! వాళ్ళిద్దరూ ఒక ముఠాలో సభ్యులు. ఆమె ఇలా ఇంటింటి ముందు నిలబడి అతనిని గూర్చి పొగుడుతూ మాట్లాడి వెళ్తుంది. మరునాడు ఆ వీధికి అతనిని తీసుకువచ్చి దూరం నుంచి ఇళ్ళు చూపించి వీధి చివరనే ఆగిపోతుంది.
ఎవరైనా అమాయకులు వాళ్ళ వలలో పడితే ఆ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి ఆశీర్వాదాల నాటకంతో ఇల్లు గుల్ల చేసి వెళతారు.' అని మా తాతయ్య వివరించారడు. 'నేను నమ్మలేకపోతున్నానండీ' అంది మా అమ్మమ్మ. 'రేపు నువ్వే చూస్తావుగా?' నవ్వుతూ అన్నాడు మా తాతయ్య. మరునాడు ఉదయం మా తాతయ్య షాపుకు వెళ్లాడు. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇంటిముందు మురళీరవం విన్పించసాగింది. మా అమ్మమ్మ బయటికి చూస్తే నెమలి పింఛం వేషధారి వేణువు ఊదుతూ కన్పించాడు. ఆమె గబగబా బయటికి వచ్చి వీధి చివరవరకూ దృష్టి సారించింది. ఆశ్చర్యం! వీధి చివర ఆ బిచ్చగత్తె నిలబడి ఉంది. ముసిముసిగా నవ్వుకుంటూ 'పోయిరా బాబూ!' అంది మా అమ్మమ్మ. చేసేది లేక మరో ఇంటివైపు కదిలాడు కృష్ణ వేషధారి!
కొసమెరుపు: ఈ సంఘటన జరిగిన 40 ఏళ్ళ తర్వాత, అంటే ఇప్పటికి 30 ఏళ్ళ క్రితం ఇదే పద్ధతిలో ఒక ముఠా ఒక ఇంటిని గుల్లచేశారని పేపరల్లో చదివాను. అంటే ఒక ముఠా వంశపారంపర్యంగా ఇదే మోసపు వృత్తిని అవలంబిస్తోందన్నమాట. తస్మాత్ జాగ్రత్త!
- కె.ఎల్.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)( మరో అంశం వచ్చేవారం...)
అడుక్కునే కృష్ణుడు
-
విశ్వాసాలు.. వాస్తవాలు... 14

వాస్తుపై వాదోపవాదాలు
-
విశ్వాసాలు.. వాస్తవాలు... 17
''మేము వాస్తుకు విరుద్ధంగా ఒక ప్లాన్ ఇస్తాం. ఈ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళ్ళే మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా 20కి.మీ. దూరంలోపు గ్రామాలలో మాత్రమే ఇంటిని నిర్మించాలి. ఇలాంటి ఇంట్లో ఐదేళ్లు కాపురం ఉండాలి. ఈ ఐదేళ్లలో ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగల్గితే గౌరువాస్తు ప్రకటిస్తున్న రెండు లక్షల రూపాయలు ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తీసుకోవచ్చు. అలా జీవించలేకపోతే వారు డిపాజిట్ చేసిన రెండు లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. ''ఆ ప్లానులో ఆయన సూచించిన వాస్తుదోషాలేమిటంటే (1) పశ్చిమ నైరుతిలో గేటు (2) నైరుతిలో నుయ్యి (3) దక్షిణ-పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ ఉంచడం. ఈ మూడు దోషాలు మరణాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని వాస్తుదోషాలుగా పేర్కొనబడిన ఇంటిని సూచించారు. వాటి కారణంగా పురుషుల జీవితాలకు ఘోరకలి అనీ, సుదతుల సుఖాలను నలగదంచుతుందనీ, అంతులేని అరిష్టాలొస్తాయనీ అస్పష్ట ఫలితాలు సూచించారు. దానికి నేనిచ్చిన సమాధానాన్ని, దానికి గౌరుగారి సమాధానాన్ని 'గౌరువాస్తు' అక్టోబరు 5లో ప్రచురించారు. నేను నా సమాధానంలో ఇలా పేర్కొన్నాను.
''మీ సవాల్‌లో మీరు సూచించిన వాస్తుదోషం ఉన్న ఇంట్లో ఐదు సంవత్సరాలు 'ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగలిగితే'' రెండులక్షల రూపాయలు ఇస్తామన్నారు. వాస్తును సైన్సుగా మీరు పరిగణిస్తున్నారు. కాబట్టి, మీ సవాలు మరింత శాస్త్రబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ వాస్తు దోషం కారణంగా ఏకాలంలో ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాని 'ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా' అని అస్పష్టంగా ప్రకటిస్తే ఎలా? ఐదు సంవత్సరాలపాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయా? దానిని కూడ మీరు మీ ఒడిదుడుకుల జాబితాలో చేర్చవచ్చుగదా? అందువలన, వాస్తు దుష్ఫలితాలను స్పష్టంగా ప్రకటించండి. అంతేకాదు. 'వాస్తుదోషం' ఉన్న ఇళ్ళవాళ్లు పట్టణాల నుండి, నగరాల నుండి మీ వద్దకు వందల సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి నివారణా పద్ధతులు చెప్పకుండా మా జనవిజ్ఞాన వేదిక సభ్యులకు కనీసపు అద్దెకీయమనండి. పైన నేను పేర్కొన్నట్లు 'ఆ ఇళ్ళలోని వాస్తు దుష్ఫలితాన్ని' మీరు స్పష్టంగా పేర్కొనండి. మీ సవాలును ఎదుర్కొనడానికి మా కార్యకర్తలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని హైదరాబాద్-ప్రొద్దుటూరు మెయిన్‌రోడ్డుకు 20 కి.మీ. దూరంగా ఉండే గ్రామంలో ఏ ఉద్యోగస్థుడైనా, వ్యవసాయదారుడైనా ఐదు సంవత్సరాలు ఎలా ఉండగలడు? ఏం పెట్టుకొని తినగలడు? కాబట్టి మీరు మరింత వాస్తవిక దృక్పథంతో విషయాన్ని పరిశీలించి సవాలును విసిరితే, ఆ సవాలును స్వీకరించడానికి జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.''
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో వచ్చే వారం ఇదే శీర్షికలో చదవండి...
_____________________________________________________
వాస్తుపై వాదోపవాదాలు
-
-
విశ్వాసాలు.. వాస్తవాలు...17ఎ
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో ఈ వారం చదవండి...
''మీరు
ప్రశ్న వేయడంలో తికమకపడ్డారు. అయినా, మేము సరిగ్గానే సమాధానం చెబుతున్నాం'
అంటూ మొదలుపెట్టి 'మా సమాధానాన్ని సవాలుగా పరిగణించకుండా ఆలోచించండి. ఏ
వాస్తు వక్రత కల్గిన ఇంట్లో ఉండటం వల్ల దానికి సంబంధించిన దుష్ఫలితమే
కనిపిస్తుంది. అలా ఐదేళ్ళ వరకూ కనిపించకపోతే.. మేము కూడా మీలాగే వాస్తును
శాస్త్రం కాదని ఒప్పుకుంటాం. మేము నిర్ణయించిన ప్రాంతంలోనే, అక్కడ ఏర్పాటు
చేసిన వక్ర వాస్తు గృహంలోనే నివసించాలి. అది ఏ జిల్లాలో ఉంది? ఏ ప్రాంతంలో
ఉంది? అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. సవాలు చేసింది మీరు. జవాబు
చెబుతున్నది మేము. మా జవాబును మేము నిరూపించుకుంటాం. కాబట్టి స్థల నిర్ణయం
మాదే. అది న్యాయం కూడా'' అంటూ కొనసాగించారు.
గౌరు ఇంకా ఇలా
రాశారు. 'ఇక మీరు కోరిన ప్రకారం హైదరాబాదు నుండి ప్రొద్దుటూరు రహదారిలో
కాకుండా, హైదరాబాదులోనే మేము వాస్తు వక్రతగల స్థలాన్ని సూచిస్తాం. కాని
హైదరాబాదులోని స్థలాల రేట్లు మీకు తెలియనవి కావు. అందుకు కూడా మీరు
సిద్ధపడినట్లయితే మీరు కోరిన ప్రకారం మేము సూచించిన స్థలాన్ని కొని, ఇల్లు
నిర్మించుకోవచ్చు. హైదరాబాదు నుండి ప్రొద్దుటూరు రహదారికి ఇరువైపులా 20
కి.మీ. దూరంలోపు అని మేమెందుకు అన్నామంటే, అక్కడైతే స్థలాల రేట్లు చాలా
తక్కువగా ఉంటాయి. పైగా మేము పరిశీలించడానికి అనువుగా ఉంటుంది.
ఆలోచించగలరు.''
ఇంక ఆలోచించేందుకేముంది? హైదరాబాదులో స్థలం
కొని స్వంత ఇల్లు కట్టుకునే ఆర్థికస్తోమత, అవసరం ఉన్న కార్యకర్త దొరకాలి.
ఆయన కొన్ని లక్షలు ఖర్చుపెట్టి స్థలాన్ని కొని, ఇల్లు కట్టాలి. ఇంతా చేసి ఈ
ప్రయోగం ఒకే ఒక ఇంటికే పరిమితమౌతుంది. అలాకాక హైదరాబాద్, విజయవాడలాంటి
నగరాలలో, పట్టణాలలో ఉన్న వాస్తు విరుద్ధమని వారనుకొంటున్న, డజన్ల సంఖ్యలో
ఉన్న ఇళ్ళను మా కార్యకర్తలకు అద్దెకిప్పించడం వాస్తవికమనిపించుకొంటుంది.
కనీసం కొన్ని డజన్ల ఫలితాలను విశ్లేషించడం ప్రగయోమనిపించుకొంటుందిగాని,
ఒక్క ఇంటినే పరిశీలించడం ప్రయోగమనిపించుకోదు. కాబట్టి గౌరు అలాంటి
ప్రయోగానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలం
నిరీక్షిస్తున్నాం. ఇంకా నిరిక్షీస్తూనే ఉంటాం.
ఈ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.
- కె.ఎల్.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)
_______________________________________________
కెమెరా ఎలా పనిచేస్తుంది?
కెమెరా ఎలా పని చేస్తుంది? - జి.సతీష్‌కుమార్, కెవిఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా
మీరు ఏదైనా ఓ భూతద్దం (convex lens లేదా కుంభాకార కటకం లేదా giant glass)
తీసుకుని ఓ గదిలో కిటికీకి అభిముఖంగా ఉన్న గోడ దగ్గర నిలువుగా పట్టుకొని
చూడండి. తెల్లని గోడమీద కిటికీ బయట ఉన్న దృశ్యం (landscape) తలకిందులుగాను
(inverted),చిన్నదిగాను కనిపిస్తుంది. ఇలా తెర(screen) పై పడే బొమ్మను
వాస్తవ ప్రతిబింబం లేదా నిజ ప్రతిబింబం (true image) అంటారు. అదే
భూతద్దాన్ని ఉపయోగించి చిన్నవిగా కంటికి సరిగా ఆనని అక్షరాల్ని చూడ్డానికి
కూడా వాడతాము కదా! ఆ విధంగా పెద్దగా కనిపించే వస్తువు ప్రతిబింబాన్ని మనం
తెరమీద పట్టలేము. ఇలాంటి ప్రతిబింబాల్ని మిథ్యా ప్రతిబింబాలు (virtual
images) అంటారు. ఈ రెండూ ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే భూతద్దంతో ఓ
విధంగా నిజమైన సూక్ష్మ ప్రతిబింబాన్ని, మరో విధంగా పెద్దగా కనిపించే
మిథ్యా ప్రతిబింబాన్ని పొందవచ్చును అని. మొదటి ఉదాహరణలో చెప్పిన విధంగా
చేసినపుడు సుదూరంగా కిటికీ ఆవల ఉన్న దృశ్యం గోడ (screen) మీద పడ్డప్పుడు ఆ
గోడకు, భూతద్దానికి మధ్య ఉన్న దూరాన్ని ఆ కటకపు నాభ్యంతరం (focal length)
అంటాము.
దీనర్థం ఏమిటంటే కుంభాకార కటకానికి ఓవైపున దూరంగా ఉన్న వస్తువుల నుంచి
వచ్చే కాంతి సమాచారం అదే కటకానికి ఆవలివైపునున్న తెరమీద నాభ్యంతరమంత దూరంలో
సూక్ష్మంగా కేంద్రీకరించుకుంటుందన్న మాట. సరిగ్గా ఇదే సూత్రం ఆధారంగా
కెమెరా (నేడు మనం ఉపయోగించే డిజిటల్ కెమెరా కూడా) పనిచేస్తుంది. కెమెరాకు
గుండెకాయలాంటిది ఓ కుంభాకార కటకం. ఆ కుంభాకార కటకానికి వెనుకవైపు కెమెరాలో
తెర ఉంటుంది. పాత కెమెరాలలో ఫిల్ము ఉండగా నేటి ఆధునిక ఎలక్ట్రానిక్
డిజిటల్ కెమెరాలలో కాంతి విద్యుద్గ్రాహకాల (photoelectrical sensors)
చట్రం(array / pannel) ఉంటుంది. ఈ చట్రం మీదుండే విద్యుద్గ్రాహకాలను
picture elements లేదా పిక్చల్ (pixel) అంటారు. ఆరు మెగా పిక్సల్ కెమెరా
చట్రం మీద 60 లక్షల విద్యుద్గ్రాహకాలు ఉంటాయని అర్థం. కెమెరాలో కటకం నుంచి
తప్ప మరే ఇతర మార్గాల ద్వారా లోనికి కాంతి వెళ్లే అవకాశం ఉండదు. సాధారణ
సమయాలలో కెమెరాలోని కటకం వెనుక ఓ తలుపులాంటి అమరిక ఉంటుంది. దీనినే షట్టర్
(shutter) అంటారు. కెమెరాను నొక్కినపుడు కేవలం క్షణికంగా మాత్రమే షట్టర్
తెరుచుకుంటుంది. ఆ సమయంలోనే బయటి కాంతి కెమెరా కటకం ద్వారా లోనికి వెళ్లి
తెరమీద పడుతుంది. కెమెరా కూడా మన కన్నులాంటిదే. ఎదురుగా ఉన్న వస్తువు నుంచి
వచ్చే కాంతి సమాచారం మన కంటిలోని కటకం ద్వారా కేంద్రీకృతమైన మన కంటి వెనుక
భాగాన ఉన్న రెటీనా అనే తెరమీద పడుతుంది.
పగలు ఎదుట ఉన్న దృశ్యం మీద సరిపడినంత కాంతిపడి పరావర్తనం (reflection)
చెంది ఆయా వస్తువులలోని పలు ప్రాంతాల దృశ్య సమాచారం (visual profile)
అన్నివైపులకూ విస్తరిస్తుంది. ఎదురుగా మనముంటే మన కంటికి, కెమెరా ఉంటే
కెమెరా కటకానికి అందుతుంది. కెమెరాను 'క్లిక్' చేయడం అంటే మనం కనురెప్పలు
తెరిచినట్లే. ఆ సమయంలో వస్తువు నుంచి పరావర్తనం చెంది బయలుదేరిన కాంతి
సమాచారం కటకం గుండా లోనికెళ్లి కెమెరాలోని తెరమీద పడుతుంది. ఒకవేళ ఎదుట
వున్న వస్తువు చీకట్లో ఉంటే మనం టార్చిలైటు వేసి చూసినట్లే కెమెరాలో
ఫ్లాష్ వెలిగించి వస్తువు మీద బలమైన కాంతిపడేలా చూస్తాము. కెమెరా
కటకానికి, కెమెరాలోని ప్రతిబింబం పడే ప్రాంతానికి ఉన్న దూరం ఆయా కెమెరాలలో
కటకం లేదా కటక సముదాయపు (lens assembly)నాభ్యంతరమేనన్న విషయం మరువవద్దు.
కంటికీ, కెమెరాకూ పోల్చడం వెనుక ఓ కారణం ఉంది. చాలామంది ప్రజల్లో 'దిష్టి'
అనే మూఢనమ్మకం ఉంది. శోచనీయమైన విషయమేమిటంటే శాస్త్ర సాంకేతికరంగాల ఆధారంగా
పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కుప్పలు తెప్పలుగా 'దిష్టి' అనే
మూఢనమ్మకం ఆధారంగా ఎన్నో ఛాందస ప్రకటనలు వస్తున్నాయి. ఫలాని అష్టముఖీ
రుద్రాక్షమాలను మెడలో వేసుకొంటే మీకేవిధమైన దిష్టితగలదని మనల్ని మభ్య
పెడుతుంటారు. నిజానికి 'దిష్టి' అంటూ ఏదీలేదు. తమాషా ఏమిటంటే ఆ ప్రకటనల
దృశ్యాల్లో 'చూడలేని వాళ్ల' కళ్లలోంచి సరళమార్గంలో తెల్లని చారల్లాగా
దిష్టి కాంతి రేఖలు వచ్చి 'దిష్టి తగిలిన' వాళ్లమీద పడ్డట్టు చూపుతారు. ఇలా
ఎవరి కంట్లోంచి తెల్లని కాంతి రేఖలు బయటికిరావు. ఎందుకంటే ఎవరి కళ్లూ
టార్చిలైట్లు కావు. కంటిలోకి కాంతి వెళ్తుందిగానీ కంటి నుంచి కాంతి బయ టకు
రాదు. కెమెరాలో ఫొటో తీసుకుంటే కెమెరా దిష్టి ఎవరిమీదా పడనట్టే మనం
ఎవర్నయినా ఎంత కోపంతో చూసినా మన దృష్టి అంటూ ఏదీ వాళ్లమీద పడదు. కెమెరా
పనిచేసే విధానం తెలుసుకోవడంతో పాటు 'దిష్టి' అనేది లేదని, అది కేవలం
మూఢనమ్మకమని కూడా తెలుసుకున్నాం.
___________________________________________________________
ఈ రెండో, మూడో తరం సెల్‌ఫోన్ సేవలు సాంకేతిక ఆధునికతను,
తద్వారా పొందగలిగే అదనపు సౌకర్యాలను సూచిస్తున్నాయి. మొదటి తరం (1జి) కన్నా
ఇవి ఆధునికం. రెండవ తరం (2జి) నుండి మారిన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం
శబ్ద స్పష్టతను, వేగాన్ని పెంచింది. ఎస్‌ఎమ్మెస్‌లు, ఇ మెయిల్ సౌకర్యాలు
అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ వినియోగం తక్కువ. దుశ్చర్యలు, ముఖ్యంగా
ఒకే నంబర్‌పై రెండు మూడు ఫోన్‌లు పనిచేయించే అవకాశం తగ్గింది. 3జి
సెల్‌ఫోన్‌లో టీవి ప్రసారం కూడా చూడవచ్చు. డేటాను పంపి, పొందవచ్చు. నంబర్
మార్చుకోకుండా కంపెనీలను మార్చుకోవచ్చు. ఎస్‌బ్యాండ్ తరంగాలు (2.5
గీగాహార్డ్స్) అంతర్జాతీయ ఈ మొబైల్ సర్వీసులకు వాడుతారు. 4జి (నాలుగో
తరం) సెల్‌ఫోన్ సేవలకు పనికొస్తుంది.
_________________________________________________________________________________________________________________________
2జి, 3జి సెల్‌ఫోన్ సేవలు
విద్యుదయస్కాంత తరంగాలు.. వాడకం.. వాణిజ్యం..
విద్యుత్... అయస్కాంతం...మన అవగాహనలో వేరు వేరు భౌతిక శక్తులు. ఈ శక్తుల సంయుక్త ప్రమేయం విశ్వమయం. భూగోళంపై కొనసాగుతున్న పరిణామ క్రమంలో ఈ తరంగాల శక్తే మూలం. సముద్ర తలంపై అలలు అలలుగా 'ఫోటాన్లు' తరంగాల రూపంలో ఈ శక్తి విడదలవుతుంది. ప్రసరిస్తుంది.
విద్యుదయస్కాంత తరంగాల విస్తృతి అపారం. రేడియో తరంగాల నుండి గామా తరంగాల వరకు విస్తరించిన ఈ తరంగాలలో మనకు నేరుగా చూపునిచ్చేది చాలా స్వల్ప భాగమే (385-760 ఎన్.యెమ్).
వైర్‌లెస్, రాడార్, రేడియో, టీవి, సెల్‌ఫోన్‌లాంటి ప్రసారాలన్నీ 300 హర్డ్స్ కన్నా తక్కువ ఫ్రీక్వేన్సీ (వేవ్‌లెంగ్త్) తరంగ పొడవు పదివేల కిలో మీటర్ల కన్నా ఎక్కువ) లో జరుగుతాయి.
గామా, ఎక్స్‌రే, ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ తరంగాల నుండి చికిత్స, ఇతర పరిశోధనల ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాం. రేడియో తరంగాల నుండి సామాన్యులు కూడా రేడియో, టెలివిజన్, సెల్‌ఫోన్ వంటి సాధానాల ద్వారా ప్రయాజనాలను పొందుతున్నారు.
సెల్‌ఫోన్‌ల ద్వారా అందుబాటులోకి తేబడ్డ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనూహ్య వేగంతో విస్తరిస్తుంది. దీనిలో భాగంగా వచ్చిందే 2జి, 3జి, ఎస్ బ్యాండ్ సేవలు.
ప్రత్యేకంగా రూపొందించిన శాట్‌లైట్ ద్వారా టెలివిజన్, సెల్‌ఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికపరంగా ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి.
అంతర్జాతీయ నియంత్రణ
ప్రసార సంకేతాలు ఒకదానితో మరొకటి పోటీపడి కలిసిపోయి గజిబిజిగా, అర్థంచేసుకోలేని శబ్దాలుగా మారకుండా అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు), అంతర్జాతీయ మొబైల్ టెలి కమ్యూనికేషన్ 2000లో (ఐఎంటి-2000) వివిధ దేశాలకు విద్యుదయస్కాంత విస్త్రృతిని కేటాయించాయి. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి.
కృత్రిమంగా ప్రయోగించే శాట్‌లైట్లు నిర్దేశించిన విధంగా, నిర్దేశించిన ప్రాంతాలకు ప్రసార సంకేతాలను సేకరించి పంపుతున్నాయి. వీని ఆధారంగా వివిధ ప్రసార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందిన, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమకు కేటాయించిన ప్రసార తరంగాలను తమ ఆధీనంలో ఉంచుకుని దేశ ప్రయోజనాలకు వాడుతున్నాయి. ఐతే రేడియో, టీవి, సెల్‌ఫోన్ల నిర్వహణలో ప్రైవేట్ కంపెనీలకు భాగస్వామ్యం కల్గిస్తూ వాటికి లైసెన్స్‌లు ఇచ్చి ప్రభుత్వాలు పెద్ద మొత్తాలను ఆర్జిస్తున్నాయి. ఇవి సేవారంగంలో భాగం. దీని ద్వారా ప్రైవేట్ కంపెనీలు అపార అనూహ్య లాభాలను పొందుతున్నాయి.
2జి, ఎస్ బ్యాండ్‌ల కేటాయింపులో అనుసరించిన అసంబద్ధ పద్ధతి వల్ల లక్షల కోట్ల ఆదాయం నష్టపోయినట్లు వార్తలు సూచిస్తున్నాయి.
_______________________________________________________
మీకు తెలుసా
*విద్యుదయస్కాంత తరంగాల్ని తరచుదనం (ఫ్రీక్వెన్సీ), తరంగ దూరం (వేవ్‌లెంగ్త్), లేక ఫోటాన్ శక్తితో దేనితోనైనా నిర్వచించవచ్చు. తరంగ గుణగణాలను ఇవి నిర్థారిస్తాయి.
* తరంగ తరచుదనాన్ని (సెకండ్‌కు) హర్ట్ ్జ ్జ్జన్గ) చూపుతారు.
కిలో, మెగా, గిగా, టెరా, హర్డ్స్‌లు అంటే వేయి, పది లక్షలు, వందకోట్లు, లక్షకోట్ల హర్ట్ ్జలు అని అర్థం.
* తరంగ దూరం, తరంగ శక్తి పరస్పర విరుద్ధం. తరంగ దూరం అతి తక్కువగా గల గామా, కిరణాల శక్తి అత్యధికం. అత్యధిక తరంగ దూరం గల రేడియో తరంగాల శక్తి అత్యల్పం
* విద్యుదయస్కాంత తరంగ విస్తృతి అపారం. ఫ్రీక్వెన్సీ ఒక హర్ట్ ్జ నుండి 2.4 ఞ1023 హర్ట్ ్జల వరకు ఉంటుంది. తరంగ దూరం ఒక ఎన్‌ఎం (నానో మీటర్స్) నుండి 10వేల కిలోమీటర్లకు పైగా ఉంటుంది.
* ఒక నానో మీటర్ అంటే ఒక మిల్లీ మీటర్‌లో 10 లక్షల వంతు.
*విద్యుదయస్కాంత తరంగ ప్రయోజనం తరంగ మొత్తం విస్తృతిలోని స్థానం మీద ఆధారపడి ఉంటుంది.
______________________________________________________________
వాస్తు మార్పులు చేస్తే డివిజనే మూతపడింది !
- విశ్వాసాలు.. వాస్తవాలు... 61
అది హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన హిందూస్థాన్ మెషీన్‌టూల్స్
(హెచ్.ఎమ్.టి.) కర్మాగారం. అది లాంప్స్, వాచీల కేసులు, ప్రెస్,
మెషిన్‌టూల్స్ అనే విభాగాలతో ప్రజోపయోగకరమైన అనేక వస్తువులను ఉత్పత్తి
చేస్తూ లాభాలబాటలో సాగుతోంది. ఆ స్థితిలో సంస్థ జనరల్ మేనేజర్ (జి.ఎం.)
చెవిలో ఎవరో ఒక విషయాన్ని ఊదారు. అదేమిటంటే.. 'కర్మాగారం వాస్తు బాగాలేదనీ,
ఎవరైనా వాస్తు నిపుణుడ్ని పిలిపించి, వాస్తు లోపాలను సరిచేస్తే, ఇక సంస్థ
లాభాలు ఇబ్బడి, ముబ్బడిగా పెరిగిపోతాయనీ'. ఈ సలహా జిఎం గారికి నచ్చింది.
ఆయన ఆదేశం మేరకు వాస్తు నిపుణులు గౌరు తిరుపతిరెడ్డిని హెచ్.ఎమ్.టి.కి
పిలిపించారు. ఆయన కర్మాగారాన్నంతా పరిశీలించి, పరీక్షించి, కర్మాగారంలో
వాస్తుదోషాలున్నాయని నిర్థారించారు. దోషాల నివారణకు కింది మార్పులు
సూచించారు.
* ఉత్తరంవైపున ఉన్న మెషిన్‌టూల్స్ విభాగానికి వెళ్ళే గేటును మూసివేయాలి. ఈశాన్య మూలన పెద్దదైన కొత్త గేటును పెట్టించాలి.
* ఎకౌంట్స్ విభాగంలోని 'పర్సనల్' ఉప విభాగం వాళ్ళ సీట్లు ఉత్తరం నుంచి
దక్షిణానికి, 'పర్ఛేజెస్' ఉపవిభాగం వాళ్ళ సీట్లు దక్షిణం నుంచి ఉత్తరానికి
మార్చాలి.
* 'లాంప్స్ కూర్పు' సెక్షన్ ముందు ఖాళీస్థలంలో ఉన్న రాగిచెట్టును కొట్టివేయాలి.
పై మూడు వాస్తు మార్పులూ జి.ఎం. గారి ఆదేశంతో అమలుచేయబడ్డాయి. గేట్లు,
సీట్ల మార్పుతోబాటు పర్యావరణాన్ని పరిరక్షించే పచ్చని చెట్టూ
కొట్టివేయబడింది. ఎప్పుడు? 1987లో. దాని ఫలితం? ఆ తరువాత కర్మాగారం
క్రమక్రమంగా నష్టాలపాలైంది. చివరకు 1997లో 'లాంప్స్ విభాగం' పూర్తిగా
మూసివేయబడింది. కార్మికులు వీధినబడ్డారు. తర్వాత వచ్చిన మార్పులు ఇవే. ఈ
కర్మాగారం మూతకు దాని యజమాని (ప్రభుత్వం) అనుసరించిన సరళీకరణ,
ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలేనని మూతబడ్డ మరెన్నో కర్మాగారాలు,
ఫలితంగా వీధినబడ్డ కార్మికుల పరిస్థితే తెలియజేస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలు
వాస్తుదోషాల బండారాన్ని, వాటి నివారణ శక్తి లేమిని తెలియజేస్తున్నాయి.
కొసమెరుపు: కార్మికులలో అమాయకులు 'శ్రీగౌరు తిరుపతిరెడ్డి పరిశోధనలకు అందని
వాస్తు దోషాలేమైనా ఉన్నాయా?' అని ఆలోచించసాగారు. విచక్షణతో ఆలోచించేవారు
మాత్రం 'లాంప్స్ డివిజన్ మూసివేతకు కారణం నష్టదాయకమైన, విదేశీ బహుళజాతి
కంపెనీలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలే' అని గుర్తించారు. ఆ విధంగా ఇతరులకు
వివరించడం ప్రారంభించారు.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
______________________________________________________
Posted: 17 Feb 2012 11:21 PM PST
ఆర్కిమిడీసె సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో వస్తువులని నీట్లో ముంచి, తీసి, తూచి తిప్పలు పడ్డ అనుభవం చాలా మంది తెలియనితనంలో పొందే వుంటారు. అలాగే స్నానాల తొట్టెలో దీర్ఘంగా ఆలోచిస్తుండగా స్ఫురించిన ఆలోచనకి సంబరం పట్టలేక ఇబ్బందికరమైన వేషంలో నగర వీధుల వెంట ‘యురేకా’ అంటూ ఉరకలు వేసిన ఆర్కిమిడీస్ గురించి చాలా మంది వినే వుంటారు.
పాశ్చాత్య గణితలోకంలో త్రిమూర్తులుగా మూడు పేర్లు చెప్పుకుంటారు – వాళ్లు ఆర్కిమిడీస్, న్యూటన్, గౌస్. వీరిలో న్యూటన్, గౌస్ లు కేవలం శతాబ్దాల క్రితం జీవించిన వారైతే, ఆర్కిమిడీస్ క్రీ.పూర్వం వాడు. సిసిలీ ద్వీపంలోని సిరక్యూస్ నగరంలో క్రీ.పూ. 287 లో జన్మించాడు ఆర్కిమిడీస్. తన తండ్రి ఫైడియాస్ ఓ ఖగోళవేత్త. ఆ రోజుల్లో సిరక్యూస్ ని పాలించిన రెండవ హీరోకి ఆర్కిమిడీస్ బంధువు అని చెప్పుకుంటారు. యవ్వనంలో చదువు కొంతకాలం ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో జరిగింది. భూమి వ్యాసాన్ని అంచనావేసిన ఎరొటోస్తినీస్ ఇతడికి సమకాలికుడు.
ఆర్కిమిడీస్ కనుక్కున్న ప్రఖ్యాత సూత్రం వెనుక ఒక కథ వుంది. మహారాజు రెండవ హీరో ఒకసారి గుళ్ళో విగ్రహాన్ని అలంకరించేందుకు గాను ఓ స్వర్ణకారుణ్ణి పురమాయించి ఓ బంగారు కిరీటం చేయించాడు. కిరీటానికి కావలసిన బంగారం కూడా రాజే సరఫరా చేశాడు. అయితే తీరా కిరీటం తయారయ్యాక బంగారానికి బదులు కాస్త వెండి కలిపాడేమోనని రాజుకు స్వర్ణకారుడి మీద సందేహం వచ్చింది. సందేహం రావడంతోనే స్వర్ణకారుణ్ణి పిలిచి ఉరి తీయించకుండా ముందు సందేహం నిజమో కాదో తేల్చుకోవాలని అనుకున్నాడు. ఆర్కిమిడీస్ ని పిలిచి ఏదైనా ప్రయోగం చేసి నిజం నిర్ధారించమని కోరాడు.
ఆర్కిమిడీస్ ఆలోచనలో పడ్డాడు. కల్తీ జరిగిందో లేదో తెలియాలంటే కిరీటం సాంద్రత కనుక్కోవాలి. కిరీటం బరువు కనుక్కోవడం సులభమే. కాని ఘనపరిమాణం తెలుసుకోవడం ఎలా? ఏ ఘనమో, శంకువో అయితే ఘనపరిమాణాన్ని అంచనా వెయ్యడానికి కచ్చితమైన సూత్రాలు ఉన్నాయి. కాని ఇలాంటి క్రమరహిత రూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడం ఎలా? దీని గురించి ఆలోచిస్తూ ఓ రోజు స్నానం చేద్దామని స్నానాల తొట్టెలో కి దిగాడు. తను లోపలికి దిగుతుంటే తొట్టెలో నీటి మట్టం నెమ్మదిగా పైకి రావడం గమనించాడు. పెరిగిన నీటి మట్టానికి తన ఒంటి ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని గుర్తించాడు. వస్తువు రూపం ఎలా ఉన్నా ఈ అత్యంత సులభమైన పద్ధతిలో దాని ఘనపరిమాణం ఎలా కనుక్కోవాలో ఆ క్షణం అర్థమయ్యింది. ఇక ఉత్సాహం పట్టలేక ఉన్న పళంగా సిరక్యూస్ పురవీధుల్లో ‘యురేకా’ అని ఉరికాడట! తదనంతరం ఆ పద్ధతిని ఉపయోగించి కిరీటంలో వెండి కలిసిందని నిరూపించాడు ఆర్కిమిడీస్.
అయితే కేవలం స్థానభ్రంశం చెందిన నీటి ఘనపరిమాణం సహాయంతో కిరీటం ఘనపరిమాణాన్ని కచ్చితంగా కొలవడం కొంచెం కష్టం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా అసలు ఈ కిరీటం సమస్య గురించి ఆర్కిమిడీస్ సొంత రచనల్లో ఎక్కడా లేదు. మర్కస్ విట్రీవియస్ అనే రోమన రచయిత, ఇంజినీరు ఈ కథ గురించి రాశాడు. అయితే ఆర్కిమిడీస్ ‘తేలే వస్తువులు’ అన్న పుస్తకంలో ఇలాంటి అంశాలు ఎన్నో చర్చించాడు. అందులోనే మనం ప్రస్తుతం చెప్పుకునే ఆర్కిమిడీస్ సూత్రం ప్రస్తావన వస్తుంది.
నీట్లో (లేక మరే ద్రవంలో అయినా) మునిగిన వస్తువు దాని ఘనపరిమాణంతో సమానమైన నీటి మొత్తాన్ని స్థానభ్రంశం (displace) చేస్తుంది. అలా స్థానభ్రంశం అయిన నీటి భాగం మునిగిన వస్తువుని పైకెత్తుతూ ఉంటుంది. దీన్నీ ప్లవనం (buoyancy) అంటారు. దీని వల్ల మునిగిన వస్తువు ఎంత బలంతో పైకి ఎత్తబడుతుందో ఆ బలాన్ని ప్లవన బలం (force of buoyancy) అంటారు. వస్తువు బరువు కన్నా ఈ బలం ఎక్కువ అయితే వస్తువు పూర్తిగా తేల్తుంది.
వస్తువు బరువు కన్నా ప్లవన బలం తక్కువైతే వస్తువు మునుగుతుంది గాని, గాలిలో ఉన్నప్పటి కన్నా నీట్లో మునిగి వున్న స్థితిలో బరువు కాస్త తగ్గుతుంది.స్థానభ్రంశం చెందిన నీటి ఘనపరిమాణం, వస్తువు ఘనపరిమాణం ఒక్కటే కనుక ఇక్క బరువులని పోల్చేబదులు సాంద్రత (=బరువు/ఘనపరిమాణం) ని పోల్చితే సరిపోతుంది. సాంద్రత పరంగా ఈ సూత్రాన్ని చెప్పుకోవాలంటే, నీటి సాంద్రత కన్నా వస్తువు సాంద్రత తక్కువైతే వస్తువు తేల్తుంది, లేకుంటే మునుగుతుంది.
ఈ సూత్రాన్ని ఈ కింది చిత్రంలో ప్రదర్శించబడుతున్న ప్రయోగంలో స్పష్టంగా చూడొచ్చు. చిత్రంలో కనిపిస్తున్న మూడు గ్లాసుల్లో మూడు కోడిగుడ్లు ఉన్నాయి. ఎడమ పక్క ఉన్న గ్లాసులో మంచి నీరు ఉంది. మధ్యలో ఉన్న గ్లాసులో ముందు మంచి నీరు తీసుకుని, అందులో నాలుగు చెంచాల ఉప్పు కలిపారు. కుడి పక్క ఉన్న గ్లాసులో ముందు మంచి నీరు తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పే కలిపారు. ఉప్పు కలపడం వల్ల నీటి సాంద్రత పెరుగుతుంది.
ఎడమ పక్క గ్లాసులో నీటి సాంద్రత తక్కువ కనుక గుడ్డు మునిగింది. కుడి పక్క గ్లాసులో నీటి సాంద్రత మరి కాస్త ఎక్కువ కనుక గుడ్డు తేలకుండా, మునగకుండా మధ్యస్థంగా ఉండిపోయింది. మధ్యలో ఉన్న గ్లాసులో నీటి సాంద్రత అన్నిటికన్నా ఎక్కువ కనుక గుడ్డు తేలింది.
ఈ సూత్రాన్ని ఉపయోగించి ‘కిరీటం సమస్యని’ సులభంగా పరిష్కరించొచ్చు. కచ్చితంగా కిరీటం బరువుతో సమానమైన బరువున్న శుద్ధ బంగారపు ముక్కని తీసుకోవాలి. ఇప్పుడు కిరీటాన్ని, బంగారపు ముక్కని ఓ త్రాసు మీద ఉంచి, రెండిట్నీ నీట్లో ముంచాలి. రెండు వస్తువుల సాంద్రత ఒకటే అయితే, త్రాసు సరిగ్గా తూగుతుంది. కల్తీ జరగడం వల్ల కిరీటం సాంద్రత బంగారం సాంద్రత కన్నా తక్కువైతే, బంగారం ఉన్న వైపు త్రాసు మొగ్గు చూపుతుంది.
References:
2. Socoolscienceshow
(ఆర్కిమిడీస్ రూపొందించిన యంత్రాల గురించి మరో పోస్ట్ లో
Posted: 19 Feb 2012 06:59 AM PST
ఆర్కిమిడీస్ భౌతిక శాస్త్ర సూత్రాలని కనుక్కోవడమే కాక ఎన్నో అద్భుత
సాంకేతిక పరికరాలని కూడా రూపొందించాడు. అలాంటి పరికరం ఒకటి ‘ఆర్కిమిడీస్
స్క్రూ’. ఈ పరికరంతో నీళ్లు తోడడానికి వీలవుతుంది. దీని రూపకల్పనకి కూడా ఒక
విధంగా రెండవ హీరో రాజే కారణం. నౌక్రాటిస్ కి చెందిన ఎథెనేయియస్ అనే రచయిత
ఈ కథనం అంతా ఓ పుస్తకంలో వర్ణించాడు. అందులో 600 మంది ప్రయాణించగలిగేవారట.
అందులో ఓ క్రీడారంగం (జిమ్నేషియమ్) ఉంటుంది. గ్రీకుల ప్రేమదేవత అయిన
అఫ్రొడైటీ కి అంకితం చెయ్యబడ్డ ఓ ఆలయం కూడా ఉండేదట. అంతపెద్ద ఓడలో ఎక్కడైనా
చిల్లులు పడి నీరు ఓడ లోపలికి వస్తే ఆ నీటిని తోడి బయటికి పంప్
చెయ్యాల్సిన సమస్య వచ్చి పడింది. అందుకోసమే ఈ ప్రత్యేకమైన ‘స్క్రూ’ ని
కనిపెట్టాడు ఆర్కిమిడీస్. ఈ స్క్రూ ఇప్పటికీ ప్రపంచంలో పంట పొలాలకి నీరు
అందించే ప్రయోజనాల కోసం వాడుతున్నారు. బొగ్గు లాంటి ఘనపదార్థాలని ఎత్తుకి
ఎత్తించేటందుకు కూడా వీటిని వాడతారు. ఇలాంటి స్క్రూ నే తొలుత బాబిలోన్
నగరంలోని ప్రఖ్యాత ‘వేలాడే తోటలకి’ (Hanging gardens of Babylon) నీరు
సరఫరా చెయ్యడానికి వాడేవారని చెప్తారు. ఆ పాత స్క్రూ యొక్క మరింత అధునాతన
రూపమే ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్క్రూ అని అంటారు.
ఆర్కిమిడీస్ పంజా
ఆర్కిమిడీస్ పంజా
ఆర్కిమిడీస్ కేవలం శాంతియుతమైన ప్రయోజనాలు గల పరికరాలు మాత్రమే కాక
యుద్ధంలో పనికొచ్చే యంత్రాలని కూడా రూపొందించాడు. ఉదాహరణకి ఆర్కిమిడీస్
పంజా అని పిలువబడే ఓ యంత్రం సిరక్యూస్ నగరానికి యుద్ధంలో గొప్ప రక్షణ
కల్పించింది. ‘క్రేన్’ ఈ యంత్రం కోట గోడల మీద స్థాపించబడి వుంటుంది. ఆ
యంత్రం నుండి పంజా లాంటి పరకరాన్ని కిందికి దించుతారు. కోట గోడలకి అవతల
సముద్రం మీదుగా గోడలకి మరీ దగ్గరగా వచ్చిన శత్రు నౌకల మీదికి ఈ పంజాని
ప్రయోగిస్తారు. ఆ పంజా ఓడకి తగులుకోగానే పైనుండి తాళ్లతో ఓడలని లాగుతారు.
కొంత ఎత్తువరకు తాళ్లు లాగి ఒక్కసారిగా వదిలేస్తారు. ఆ దెబ్బకి ఓడలు పక్కకి
ఒరిగి నీట మునుగుతాయి.
ఆర్కిమిడీస్ ప్రయోగించిన “మరణ కిరణం”
ఆర్కిమిడీస్ ప్రయోగించిన “మరణ కిరణం”
క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందిన లూసియన్ అనే రచయిత సిరక్యూస్ యుద్ధం
గురించి రాస్తూ ఆ యుద్ధంలో ఆర్కిమిడీస్ అగ్నిని ప్రయోగించి శత్రు నౌకలని
ధగ్ధం చేశాడని వర్ణిస్తాడు. “ఆర్కిమిడీస్ వేడి కిరణం” గా చెప్పుకోబడే ఈ
సాధనంతో సూర్యకాంతిని ఓడ మీదకి కేంద్రీకరించి ఓడని ధగ్ధం చేస్తారు.
అయితే నిజంగానే అల్లంత దూరంలో ఉన్న ఓడల మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించి
నాశనం చెయ్యడం జరిగేపనేనా, అది అతిశయోక్తి కాదా అని ఎంతో మంది ఈ విషయంలో
సంశయం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ తాత్వికుడు రేనే దేకార్త్ అదంతా వట్టి
పుక్కిటి పురాణం అని కొట్టి పారేశాడు. అయితే ఆర్కిమిడీస్ కాలంలో అందుబాటులో
ఉండే సాధన సామగ్రితో అలాంటి ఫలితం సాధ్యం కావచ్చని కొందరు ఆలోచించారు.
రాగితో గాని, కంచుతో గాని చేయబడ్డ కవచాలని బాగా మెరుపు వచ్చేలా రుద్ది,
వాటిని అద్దాలలా వాడుకుంటూ, సముద్ర తీరం మీద పారాబోలా ఆకారంలో వాటిని
నిలిపి, సూర్యకాంతిని శత్రు నౌక మీదకి కేంద్రీకరిస్తే నిజంగానే ఓడని ధగ్ధం
చెయ్యొచ్చని వాదనలు జరిగాయి.
1973 లో అయోనిస్ సక్కాస్ అనే గ్రీకు శాస్త్రవేత్త నిజంగానే ఈ వాదనని ప్రయోగించదలచాడు. ఏతెన్స్ నగరానికి బయట స్కరమాగాస్ అనే రేవులో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగంలో 70 అద్దాలు వాడారు. 5 X 3 అడుగుల పరిమాణం ఉన్న ఈ అద్దాలకి రాగి పూత వేశారు. ప్లై వుడ్ తో తయారు చేసిన రోమన్ యుద్ధనౌక యొక్క నమూనాని

160 అడుగుల దూరంలో ఉంచారు. అద్దాలని కచ్చితంగా నిలిపి కిరణాలని నౌక మీదకి
కేంద్రీకరిస్తే క్షణాల్లో నౌక భగ్గుమంది. పైగా నౌక మీద తారు పూత పూశారు.
దాని వల్ల కూడా నౌక మరింత సులభంగా నిప్పు అంటుకుని ఉంటుంది. నీరు ఓడ
లోపలికి రాకుండా తారు పూత పూయడం ఆ రోజుల్లో పరిపాటి.
అక్టోబర్ 2005 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన
విద్యార్థుల బృందం ఒకటి ఈ ప్రయోగాన్ని మళ్లీ చేసి చూసింది. ఈ ప్రయోగంలో 1
చదరపు అడుగు వైశాల్యం ఉన్న 127 అద్దపు పలకలని తీసుకున్నారు. వాటి సహాయంతో
100 అడుగుల దూరంలో ఉన్న ఓ నమూనా ఓడ మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించారు. ఓడ
మీద కాంతి పడ్డ ప్రాంతంలో మాత్రమే నిప్పు అంటుకుంది. అయితే ఆకాశంలో మేఘాలు
లేని పరిస్థితుల్లో, ఓడ కదలకుండా పది నిముషాల సేపు ఉన్నప్పుడే ప్రయోగం పని
చేసింది. ఈ సారి ఓడ మీద కాంతి పడ్డ చోట కాస్త మంట వచ్చింది, కాస్త
మసిబారింది.
ఇదే ప్రయోగాన్ని ఆ ఎమ్. ఐ. టి. బృందం సాన్ ఫ్రాన్సిస్కో తీరం మీద కూడా చేసి చూసింది. ‘మిత్ బస్టర్స్’ అనే టీవీ షోలో భాగంగా ఆ ప్రయోగం జరిగింది. మూడనమ్మకాలని పరీక్షించి వాటి గుట్టు రట్టు చెయ్యడం ఈ టీవీ షో లక్ష్యం. ఈ సారి చెక్కతో చేసిన ఓ జాలరి పడవ మీద ఈ సారి కాంతిని కేంద్రీకరించారు. అయితే ఓడ సమూలంగా దగ్ధం కాలేదు. చెక్క నిప్పు అంటుకోవాలంటే దాని ఉష్ణోగ్రత స్వయం జ్వలన బిందువు (autoignition temperature) ని, అంటే 300 oC ని, చేరుకోవాలి.
ఈ ఫలితాలన్నీ గమనించాక ‘మిత్ బస్టర్స్’ షో లో ఈ ప్రయోగం విఫలం అయినట్టు ప్రకటించారు. ఓడ మీద ఎంతో కొంత ప్రభావం లేకపోయినా, అనుకున్నట్టు ఓడ దగ్ధం కాదని ఆ షో ఖండితంగా చెప్పింది. అంత కష్టపడి అద్దాలతో సూర్యకాంతిని కేంద్రీకరించి అంత అల్పమైన ఫలితాన్ని సాధించే బదులు, సాంప్రదాయక ఆయుధాలైన నిప్పుబాణాలు, ఫిరంగులు మొదలైనవి మరింత సఫలదాయకంగా ఉంటాయని ఆ షో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
_____________________________________________________
మాయలు, మహిమల పేరుతో కొంత మంది బాబాలు, స్వామీజీలు మోసం
చేస్తుంటా రు. వాటినిచూసి వారి దగ్గర ఏదో అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మి
మోసపోతుంటాం. మహిమల వెనుకున్న గుట్టు, రహస్యాలు తెలియనంతకాలం వాళ్ళ
దగ్గరేవో శక్తులున్నాయని అనుకుంటాం. తెలిసిన తరువాత 'ఇంతేనా' అనుకుంటాం.
అలాంటి మాయల రహస్యాలను, దానిలో ఇమిడి వున్న శాస్త్రవిజ్ఞానాన్ని
కొన్నింటిలో పరిశీలిద్దాం.
నిప్పుల మీద నడక..
కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. మహిమ వలన కాలదని చెపుతారు. మహిమ గల వారే నడవాలని చెపుతారు. నిజంగా మహిమకలవారే నడవాలా? ఎవరైనా నడవవచ్చు. ఇందుకు ఏ మహిమా అవసరం లేదు. సైన్స్ తెలిసుంటే చాలు. ఏ పదార్థానికైన కొన్ని ధర్మాలుంటాయి. ఏ వస్తువు పొయ్యి మీద పెట్టగానే వేడెక్కదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలాగే మన కాలు నిప్పుమీద పెట్టగానే వెంటనే కాలదు. కొన్ని సెకన్ల సమయం పడు తుంది. నిప్పుమీద కాలు ఆనగానే కొంత భయం ఏర్పడుతుంది. దానివలన చెమ టపడుతుంది. అందువలన కాలదు. అయితే ఆ కొద్ది సెకన్ల కాలంలోనే మనం అడుగుతీసి అడుగువేయాలి. అందుకు నిప్పులపై వేగంగా నడవాలి. అంతేకానీ మాయ మహిమ అనేవేమీ లేవు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞు లైన వారు లేకుండా ప్రయత్నించరాదు. నిప్పుల మీద బూడిద లేకుండా చూసు కోవాలి. వేగంగా నడవాలి. భయపడి మధ్యలో ఆగరాదు. ధైర్యంగా ఉండాలి.
నీటితో మంటలు..
ఒక స్వామీజీ నా మహిమ చూడండి నేను నీటితో మంటలను మండిస్తానని చెప్పాడు. అందరు ఎలా మండిస్తాడోనని చూస్తున్నారు. నడవండని అందరినీ బయటకు తీసి కెళ్ళాడు. కాసేపు అటూ ఇటూ తిప్పి ఆగండి అన్నాడు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నీళ్ళున్నాయా? అని అడిగాడు. ఒకరిద్దరు తమ దగ్గరున్న నీళ్ళ బాటిల్స్ ఇవ్వబోయారు. మీరే ఆ నీళ్ళను ఈ భూమిపై పోయమని చెప్పాడు. వాళ్ళు అలాగే పోశారు. వెంటనే ఒక అగ్గిపుల్లతో అక్కడ మంట పెట్టాడు. ఆశ్చర్యం మంట వస్తుంది. నీళ్ళుపోస్తున్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. చూశారా నా మహిమ అంటూ అందరివైపు ఒక్కసారి చూశాడు. అంతే అందరూ 'స్వామీ!' అంటూ ఆయన కాళ్ళమీద పడ్డారు. ఈ మహిమ ఏంటో చూద్దామని వెళ్ళాం. పరిశీలన తరువాత మాకు తెలిసింది ఏమిటంటే ముందుగానే ఆ భూమిలో కాల్షియంకార్బైడ్ అనే రసాయనాన్ని అతని సహాయకులు ఉంచారు. అక్కడికి రాగానే వారు సైగ చేశారు. అక్కడే నీళ్ళు పోయమన్నా డు. నీళ్ళు పోయగానే రసాయన ప్రక్రియ జరిగి ఎసిటిలీన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువుకు మండే లక్షణం ఉంది. అందుకే మండించగానే ఈ వాయువు మండుతుంది. నీళ్ళు పోస్తున్న కొద్దీ వాయువు వస్తుంది. మంట మండుతూనే ఉంటుంది.
ఇళ్లు తగలబడడం..
ఊర్లో ఎవరో చేతబడి చేశారని, మంత్రాలు చేశారని ఇళ్లు తగులబడుతున్నాయని అనేకసార్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇలాంటి అనేక గ్రామాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పరిశీ లించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో పచ్చభాస్వరం అనే రసాయన పదార్థాన్ని వినియో గిస్తారని గుర్తించాం. పచ్చభాస్వరంను నీటిలో భద్రపరుస్తారు. నీటిలో నుండి బయటకు తీయగానే భగ్గున మండుతుంది. దీనిని తడిగుడ్డలో చుట్టి ఇళ్ల మీద పడేస్తే లేదా చూరులో పెడితే తడి ఆరిన తరువాత పచ్చభాస్వరం మండుతుంది. ఆ మంటతో ఇళ్లు తగలబడతాయి. ఇదీ దీనిలోని అసలు సంగతి. అంతేగానీ చేతబడి, మంత్రాలు కారణంకానే కాదు.
ఇదే ప్రయోగాన్ని ఆ ఎమ్. ఐ. టి. బృందం సాన్ ఫ్రాన్సిస్కో తీరం మీద కూడా చేసి చూసింది. ‘మిత్ బస్టర్స్’ అనే టీవీ షోలో భాగంగా ఆ ప్రయోగం జరిగింది. మూడనమ్మకాలని పరీక్షించి వాటి గుట్టు రట్టు చెయ్యడం ఈ టీవీ షో లక్ష్యం. ఈ సారి చెక్కతో చేసిన ఓ జాలరి పడవ మీద ఈ సారి కాంతిని కేంద్రీకరించారు. అయితే ఓడ సమూలంగా దగ్ధం కాలేదు. చెక్క నిప్పు అంటుకోవాలంటే దాని ఉష్ణోగ్రత స్వయం జ్వలన బిందువు (autoignition temperature) ని, అంటే 300 oC ని, చేరుకోవాలి.
ఈ ఫలితాలన్నీ గమనించాక ‘మిత్ బస్టర్స్’ షో లో ఈ ప్రయోగం విఫలం అయినట్టు ప్రకటించారు. ఓడ మీద ఎంతో కొంత ప్రభావం లేకపోయినా, అనుకున్నట్టు ఓడ దగ్ధం కాదని ఆ షో ఖండితంగా చెప్పింది. అంత కష్టపడి అద్దాలతో సూర్యకాంతిని కేంద్రీకరించి అంత అల్పమైన ఫలితాన్ని సాధించే బదులు, సాంప్రదాయక ఆయుధాలైన నిప్పుబాణాలు, ఫిరంగులు మొదలైనవి మరింత సఫలదాయకంగా ఉంటాయని ఆ షో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
_____________________________________________________
మాయలు మహిమల బండారం
నిప్పుల మీద నడక..
కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. మహిమ వలన కాలదని చెపుతారు. మహిమ గల వారే నడవాలని చెపుతారు. నిజంగా మహిమకలవారే నడవాలా? ఎవరైనా నడవవచ్చు. ఇందుకు ఏ మహిమా అవసరం లేదు. సైన్స్ తెలిసుంటే చాలు. ఏ పదార్థానికైన కొన్ని ధర్మాలుంటాయి. ఏ వస్తువు పొయ్యి మీద పెట్టగానే వేడెక్కదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలాగే మన కాలు నిప్పుమీద పెట్టగానే వెంటనే కాలదు. కొన్ని సెకన్ల సమయం పడు తుంది. నిప్పుమీద కాలు ఆనగానే కొంత భయం ఏర్పడుతుంది. దానివలన చెమ టపడుతుంది. అందువలన కాలదు. అయితే ఆ కొద్ది సెకన్ల కాలంలోనే మనం అడుగుతీసి అడుగువేయాలి. అందుకు నిప్పులపై వేగంగా నడవాలి. అంతేకానీ మాయ మహిమ అనేవేమీ లేవు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞు లైన వారు లేకుండా ప్రయత్నించరాదు. నిప్పుల మీద బూడిద లేకుండా చూసు కోవాలి. వేగంగా నడవాలి. భయపడి మధ్యలో ఆగరాదు. ధైర్యంగా ఉండాలి.
నీటితో మంటలు..
ఒక స్వామీజీ నా మహిమ చూడండి నేను నీటితో మంటలను మండిస్తానని చెప్పాడు. అందరు ఎలా మండిస్తాడోనని చూస్తున్నారు. నడవండని అందరినీ బయటకు తీసి కెళ్ళాడు. కాసేపు అటూ ఇటూ తిప్పి ఆగండి అన్నాడు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నీళ్ళున్నాయా? అని అడిగాడు. ఒకరిద్దరు తమ దగ్గరున్న నీళ్ళ బాటిల్స్ ఇవ్వబోయారు. మీరే ఆ నీళ్ళను ఈ భూమిపై పోయమని చెప్పాడు. వాళ్ళు అలాగే పోశారు. వెంటనే ఒక అగ్గిపుల్లతో అక్కడ మంట పెట్టాడు. ఆశ్చర్యం మంట వస్తుంది. నీళ్ళుపోస్తున్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. చూశారా నా మహిమ అంటూ అందరివైపు ఒక్కసారి చూశాడు. అంతే అందరూ 'స్వామీ!' అంటూ ఆయన కాళ్ళమీద పడ్డారు. ఈ మహిమ ఏంటో చూద్దామని వెళ్ళాం. పరిశీలన తరువాత మాకు తెలిసింది ఏమిటంటే ముందుగానే ఆ భూమిలో కాల్షియంకార్బైడ్ అనే రసాయనాన్ని అతని సహాయకులు ఉంచారు. అక్కడికి రాగానే వారు సైగ చేశారు. అక్కడే నీళ్ళు పోయమన్నా డు. నీళ్ళు పోయగానే రసాయన ప్రక్రియ జరిగి ఎసిటిలీన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువుకు మండే లక్షణం ఉంది. అందుకే మండించగానే ఈ వాయువు మండుతుంది. నీళ్ళు పోస్తున్న కొద్దీ వాయువు వస్తుంది. మంట మండుతూనే ఉంటుంది.
ఇళ్లు తగలబడడం..
ఊర్లో ఎవరో చేతబడి చేశారని, మంత్రాలు చేశారని ఇళ్లు తగులబడుతున్నాయని అనేకసార్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇలాంటి అనేక గ్రామాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పరిశీ లించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో పచ్చభాస్వరం అనే రసాయన పదార్థాన్ని వినియో గిస్తారని గుర్తించాం. పచ్చభాస్వరంను నీటిలో భద్రపరుస్తారు. నీటిలో నుండి బయటకు తీయగానే భగ్గున మండుతుంది. దీనిని తడిగుడ్డలో చుట్టి ఇళ్ల మీద పడేస్తే లేదా చూరులో పెడితే తడి ఆరిన తరువాత పచ్చభాస్వరం మండుతుంది. ఆ మంటతో ఇళ్లు తగలబడతాయి. ఇదీ దీనిలోని అసలు సంగతి. అంతేగానీ చేతబడి, మంత్రాలు కారణంకానే కాదు.
____________________________________________________
మూఢ నమ్మకాలు ప్రజల్లో ఎందుకుంటాయి? శాస్త్రవిజ్ఞానం ఒకేవిధంగా ఉన్నా అందరూ ఎందుకు హేతువాదులు కాదు?
తాను అనుకున్న దానినే గుడ్డిగా (మూర్ఖంగా) నమ్మే వ్యక్తికి మూఢనమ్మకం ఉందంటాము. ఎవరూ పనిగట్టుకొని గుడ్డిగా దేన్నీ నమ్మరు. ఏదో ఒక హేతువు ఆధారంగానే మూఢ నమ్మకస్తుడూ నమ్ముతుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరూ పదహారణాల మూఢనమ్మక స్తులు కాదు. అదేవిధంగా విశ్వాసానికి, నమ్మకానికి ఆధారాన్ని ఆపాదించుకునే వ్యక్తిని హేతువాది అంటాము. ఈ ప్రపంచంలో ఏ ఆధారమూ, ఏ హేతువూ లేకుండా ఏ వ్యక్తీ ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోడు. అంటే అర్థం ఏమి టంటే వైద్యపరంగా పిచ్చివాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతివ్యక్తీ ఏదోవిధంగా హేతువాదే!
మరి ఎందుకని కొందర్ని హేతువాదులనీ మరి కొందర్ని (నిజం చెప్పాలంటే ప్రజానీకంలో అధికభాగంగా ఉన్నవారిని) మూఢనమ్మ కస్తులనీ, ఛాందసవాదులనీ, అంధవిశ్వాసులనీ ముద్ర వేస్తున్నాము?
కేవలం శాస్త్రం ఆధారంగా ఏర్పడ్డ హేతువాద దృక్పథపు మోతాదుకూ, అశాస్త్రీయ ఆధారాలతో ఏర్పడ్డ నిర్హేతుక నమ్మకాల మోతాదుకూ ఉన్న నిష్పత్తిని బట్టే కొందరు హేతువాదులుగానూ, మరికొందరు ఛాందసవాదులుగానూ పరిగణింపబడుతున్నారు. నిజమైన హేతువాదులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయా లతో ఉండరు. పరస్పర విరుద్ధ ఆధారాలపైన తమ నమ్మకాల్ని నిలబెట్టుకోరు. కానీ నిర్హేతుకవాదులు, మూఢనమ్మకస్తులకు హేతువు ఉంటుందిగానీ ఆ హేతువులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మూఢవిశ్వాసంలో ఉన్నవాడు కూడా కొంత దూరం హేతువుతో వెళతాడు. కానీ ఈయనకు నిన్న ఒక హేతువు, నేడు ఒక హేతువు, సమయానుకూల హేతువులు ఉంటాయి. ఉదా: కింది సంభాషణ గమనించండి. అద్భు తాల్ని గట్టిగా విశ్వసించే ఒకవ్యక్తి (అద్భుతాల విశ్వాసి) సంధించిన ప్రశ్నలకు ఒక మూఢవిశ్వాసి, ఒక హేతువాది ఎలా స్పందిస్తారో కింది ఉదాహరణలో గుర్తించండి.
అద్భుతాల విశ్వాసి : రాయి నీళ్లలో ఎందుకు మునిగింది? (ప్రశ్న)
మూఢ విశ్వాసి : బరువున్నవి నీళ్లలో మునుగుతాయి. తేలికైనవి తేలతాయి. (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మనిషి మునుగుతాడా? (ప్రశ్న)
మూఢ విశ్వాసి : మునుగుతాడు. ఆ మధ్య చాలామంది విద్యార్థులు గోదాట్లో ఈతకెళ్లి మునిగిపోయారు కదా! (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మనుషులందరూ దాదాపు ఒకటే కదా! అంటే శరీరధర్మాలు, శరీర నిర్మాణం మొదలైన విషయాల్లో!
మూఢ విశ్వాసి : అవును. అందర్లోనూ రక్తం ఉంది. అందరూ అన్నమే తింటారు. కొందరు రాళ్లు తినరు. అందరూ కళ్లతోనే చూస్తారు. నోటితోనే తింటారు. కొందరు నోటితో, మరికొందరు చెవులతో భోంచేయరు కదా! (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మరి ఆ మధ్య మన ఊరి చెరువులో ఓ వ్యక్తి ఏమాత్రం ఈత కొట్ట కుండా, కాళ్లాడించకుండా, చేతులు కదిలించకుండా గంటసేపు నీళ్లపై వెల్లికిలా పడు కొని తేలాడుతూ ఉన్నప్పుడు మన ఊరి వారందరూ అతనికి గొప్ప నైవేద్యాలు ఇచ్చారు. మీరు కూడా అందులో ఒకరు. అతనెలా మునిగిపోలేదు? (కారణం ఏమిటన్న ప్రశ్న)
మూఢ విశ్వాసి : అతనికి మహిమలున్నాయి. అతడు ప్రత్యేకం. అందరిలాంటివాడు కాదు. దైవాంశసంభూతుడు. అందుకే అందర్లా మునిగిపోకుండా తేలగలిగాడు. (ప్రశ్నకు సమా ధానం ఇవ్వడం హేతువే. ఆ మేరకు ఈ మూఢవిశ్వాసి హేతువాదే! కానీ అశాస్త్రీయమైన ఆధారాన్ని హేతువుగా భావించాడు).
పై ప్రశ్నల్లో చివరిది తప్ప మిగిలిన ప్రశ్నలన్నింటికీ ఓ నిజమైన హేతువాది కూడా అవే సమాధానాలిస్తాడు. కానీ చివరి ప్రశ్నకు మాత్రం హేతువాది ఇలా జవాబిస్తాడు. ఇతనికి శాస్త్రం తెలియకపోవచ్చును. కానీ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు.
హేతువాది: అలా తేలియాడుతున్న వ్యక్తులు నిజంగానే మిగిలిన వ్యక్తులతో పోలిస్తే భిన్నంగా ఉంటారు. మిగిలిన వ్యక్తుల్లాగా ఆ వ్యక్తులు మునిగిపోకుండా తేలుతూ ఉండడం కూడా నిజమే. కానీ అందుకు కారణం వాళ్లకి మహిమలుండడం కాదు. ఏదో శాస్త్రీయ ఆధారం ఉండే ఉంటుంది. నాకైతే తెలీదుగానీ వీరు తేలడానికి మహిమలైతే కారణం కాదు. ఎందుకంటే మహిమలు అంటూ ఎవరి దగ్గరా లేవు. వీళ్లు అందరిలాగా మునగట్లేదు. కానీ వీరు అందరికంటే భిన్నంగా ఉన్నారు. అదే తేడా. మునగకపోవ డానికీ వారికున్న ఊబకాయానికీ ఏదైనా సంబంధముందేమో! (హేతువు చూడగలగడం, ఆ హేతువు నిజ భౌతిక ప్రపంచపు పరిశీలనల ఆధారంగా ఏర్పడడం మనం ఇక్కడ చూస్తాము).
ఇదే ప్రశ్నను శాస్త్రం తెలిసిన వ్యక్తి (ఉదా: జెవివి కార్యకర్త) ఇలా జవాబిస్తాడు.
జెవివి కార్యకర్త: వీరు అందర్లాగా మునిగి పోలేదన్నది వాస్తవం. అందర్లాగే శరీరధర్మా లు ఉండడమూ వాస్తవమే. అయితే వీరు ఊబకాయులు. వీరి ఊబకాయానికి కారణం శరీరంలో పేరుకుపోయిన కొవ్వు. కొవ్వుకు నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. కాబట్టి వీరి నికర సాంద్రత మిగిలినవారి సాంద్రత కన్నా కొంచెం తక్కువ. వీరి ఎముక నిర్మాణం అందర్లాగే ఉంటుంది. కాబట్టి వీపు మీద కొవ్వుతో కూడిన కండర కణజాలం వెన్నెముకకు అటూ యిటూ కాలవగట్టులాగా ఉంటుంది. వీరు బోర్లా కాకుండా జాగ్రత్తగా వెల్లకిలా నీటిపైన బల్లపరుపుగా పడుకో వడం వల్ల వీపుమీద ఉన్న గాడి (groove) కి, నీటికి మధ్య గాలిబుడగ ఏర్పడుతుంది. ఇది వారిని తేలేలా చేస్తుంది. పైగా వీరి సాంద్రత ఇతరులకంటే తక్కువ. ఈ రెండింటి ఫలితంగా వీరు ఈతకొట్టకున్నా తేలగలుగుతున్నారు. ఇదే వ్యక్తులు నిలువుగా నిల్చో లేరు. మునిగిపోతారు. బోర్లాపడుకొని తేలలేరు. మునిగి పోతారు. నేను ఛాలెంజ్ చేస్తాను. కావాలంటే ప్రయోగంచేసి చూడండి. మహిమలే ఉంటే వీరు ఏ భంగిమలో నీళ్లలో నిలబడ్డా మునగకూడదు. ప్రజల్లో ఉన్న పరిమితజ్ఞానాన్ని, అద్భుతాలపైగల విశ్వాసాల్ని ఆధారం చేసుకొని వారిని మోసం చేస్తూ కొందరు డబ్బులు కూడబెట్టుకొంటున్నారు. అలాగే సముద్రపు నీటిలో ఇలా తేలడం మరింత సులువు. దీనికి కారణం ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువ వుండడంతో దీని సాంద్రత మామూలు నీటి కన్నా ఎక్కువగా ఉండటమే. అందుకే మృతసముద్రం (డెడ్ సీ)లో అక్కడి ప్రజలు ఇలాగే నీటిలో పడుకుని దినపత్రిక చదువుకుంటారంట.
ఒకవైపు దేవుడి సృష్టి అద్భుతం, అందమైన విశ్వం అంటూనే వారానికి రెండు రోజులు మంచివికావని, దుర్ముహూర్తాలనీ, మంచిరోజులనీ, రాహూకాలమనీ, చెడ్డదిక్కులనీ, పదార్థాల, కాలాల ఆంతరంగిక లక్షణాలకు బయట ఉన్న సార్వత్రికత (universality) కు రంగుల్ని పూస్తారు. అశాస్త్రీయ కారణాల్ని హేతువులుగా చూపుతారు. పాఠ్యపుస్తకాల్లోనూ, తరగతిగదుల్లోనూ ఒకే విధమైన ప్రకృతి సూత్రాల్ని నేర్చుకొనే విద్యార్థులందరికి ఆ ప్రకృతిసూత్రాల పరిజ్ఞానంతో అబ్బవలసిన హేతువాద దృక్పథం, శాస్త్రీయ తత్పరతకన్నా అధికమోతాదులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, భయాన్ని, ఆందోళనలనూ, అభద్రతనూ, అశాస్త్రీయతనూ, అసమానతా భావాలనూ, ఛాందస త్వాన్నీ, వివక్షనూ, వైషమ్యాల్నీ నేర్పించే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.
తరగతిగదుల్లోనూ సరైన శాస్త్రీయ విద్య ఉండడం లేదు. పాఠాలు బోధించే సైన్సు టీచర్లలో చాలామందికి వాస్తు, జ్యోతిష్యం, బాబాల భక్తి, మహిమలు, మంత్రతంత్రాలు, పునర్జన్మ, కర్మ, ముహూర్తాలు, జాతకాలు అంటూ మూఢవిశ్వాసాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లేని సైన్సు తరగతిగదుల్లో శాస్త్రీయవిద్య ఎలా వీలు పడుతుంది?
బడిలో చేరకముందే భయాలనూ, దయ్యాలనూ పరిచయం చేసే కుటుంబ సామాజికవ్యవస్థలో మనం ఉన్నాము. అందుకే వృత్తిపరంగా ద్రవ్యశక్తి నితృత్వ సూత్రాన్ని ప్రబోధించే భౌతికశాస్త్ర ప్రొఫెసర్లే సత్యసాయిబాబా శూన్యం నుంచి బంగారు నగల్ని సృష్టించడాన్ని ప్రశ్నించడం లేదు. పైగా అది మహిమ అంటూ శ్లాఘిస్తున్నారు. ఈ విశ్వంలో కొలతలకు వీలుగాని అంశం అంటూ ఏదీ లేదు. ఏ దృగ్విషయమైనా ద్రవ్యరాశి (mass), స్థలం (space), కాలం (time), విద్యుత్ప్రవాహం (current) అనే అక్షరమాలలో ఒదగాల్సిందే. కానీ 'మహిమ' అనే రాశికి ఏ కొలతలుండవు. కాలం ఉండదు. స్థలం ఉండదు. సంఖ్యామానం ఉండదు. ప్రయోగ నిర్ధారణ కూడా ఉండదు. వేదనను మర్చిపోవడానికి పేదవాడు ఏదో ఒక ఆధారాన్ని ఆసరా చేసుకొని సంభాళించు కొంటాడు. పాలకోసం ఏడ్చే పసిబిడ్డకు పాలకు బదులు ప్లాస్టిక్ పీకను నోటికిచ్చి, దాన్నే తల్లిపాలిండుగా భావించమంటూ మోసం చేసినట్లే సర్వజ్ఞానానికీి, సుఖసంతోషాలకూ, సంపూర్ణ మానవీయ వికాసానికీ అర్రులు చాచే ప్రజాబాహుళ్యానికి మూఢవిశ్వాసాలనూ, ఛాందసత్వాన్నీ, కర్మవాదాన్నీ దోపిడీవర్గం అలవాటు చేసి, అందులోనే సుఖప్రాప్తి పొందమంటూ మోసం చేస్తుంది.
మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? శాస్త్ర విజ్ఞానం ఒకేలా ఉన్నా అందరూ హేతువాదులు కాదు ఎందుకు?

_________________________________________________
ఇటీవల
డా|| సుభాష్‌కాక్ రచించిన 'వేదాలలో సైన్సు ఉందా?' అనే గ్రంథం చదివాను.
దానిలో 'మన పురాతన భారతీయ విజ్ఞానశాస్త్ర శాఖల న్నింటికీ వేదమే మూలం' అని
రాశారు. (పేజి13). అలాగే అనేకమంది పండితులు తమ వ్యాసాలలో వేదాలలో
అత్యాధునిక శాస్త్ర విజ్ఞాన విశేషాలు ఉన్నాయని రాస్తున్నారు. ఉదాహరణకు
'భవిష్యవాణి' అనే మాసపత్రిక మార్చి 2007 సంచికలో ఆర్.వి.విజయ అనే రచయిత
'ఋగ్వేదంలో ఓడలు, విమానం, రైలు, టెలిగ్రామ్, ఆధునిక శాస్త్రములు ఉన్నవి
అనీ, యజుర్వేదంలో గణిత విద్య, అంతరిక్ష విద్య మొదలగునవి కలవు' అనీ రాశారు.
ఇలాగే, 'హిందూ దినపత్రిక'తో సహా అనేక పత్రికలు, గ్రంథాలు వేదాలలో ఉన్న అనేక
ఆధునిక విజ్ఞానశాస్త్రాలను గూర్చి పేర్కొనబడిందని నిరంతరం ప్రచారం
జరుగుతోంది. ఈ ప్రచారంలోని వాస్తవికతను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం
ఉంది. ఎందుకంటే, ఈనాటికీ అనేకమంది విద్యాధికులు వేదాలలోనే విమాన
నిర్మాణశాస్త్రం, అణుబాంబు నిర్మాణ పరిజ్ఞానం వంటివన్నీ ఉన్నట్లూ, ఆ
వేదాలను పాశ్చాత్యులు దొంగలించి విమానాలు, అణుబాంబులను తయారుచేసినట్లు
నమ్ముతున్నారు. ఈ విశ్వాసాలలోని వాస్తవాలను తెలుసుకోవాలి. తద్వారా, మన
విజ్ఞాన వారసత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి వీలుకలుగుతుంది. ఆనాటి
ఆవిష్కరణలను సగర్వంగా చాటుకుంటూనే, ఆనాడు మనకు తెలియని విషయాలను వినమ్రంగా
తెలుసుకోడానికీ దోహదపడుతుంది.
ఇప్పుడు వేదాలలో ఉన్న సైన్సును తెలుసుకుందాం:
1. ఇంద్రుడు ఇనుముగల వజ్రమును రెండుచేతులా పట్టినాడు (ఋగ్వేదం 1వ మండలం, 52వ సూక్తం, 8వ మంత్రం)
2. 'ఓడలు' అనే పదం ఋగ్వేదం 1-46-7లో వాడబడింది.
3. 'మేడలు' అనే పదం ఋగ్వేదం 1-121-1లో వాడబడింది.
4. బంగారము, వెండి, రాగి అనే లోహాలను గూర్చి ఋగ్వేదం 1-183-1లో వివరించబడింది.
5. 'స్వర్ణకారుడు బంగారమును కరిగించినట్లు' అనే విషయం ఋగ్వేదం 6-3-4లో వివరించబడింది.
6. పడుగుపేకలు - బట్టనేయడాన్ని గూర్చి ఋగ్వేదం 6-9-2లో వర్ణించబడింది.
7. 'వరుణుడు మాకు మూడంతస్థుల మేడ ఇవ్వవలెను. (ఋగ్వేదం 8-42-2)
8. 'పట్టు లేక నూలు వస్త్రమా!.... కంబళమా' అని శుక్ల యజుర్వేదం 10-8లో వర్ణింపబడింది.
పై అంశాలనుబట్టి వేద ఋషులకు బంగారం, వెండి, ఇనుము, రాగి ఆభరణాలు, ఆయుధాలు తయారుచేసే వృత్తి, నేర్పరితనం ఉందనీ, మూడు, నాలుగంతస్థుల మేడలు నిర్మించగల సివిల్ ఇంజనీర్లు వారిలో ఉన్నారనీ, ఓడల నిర్మాణం, ప్రయాణం వారికి తెలుసుననీ అర్థమవుతోంది. నాలుగు వేదాలు వెతికినా, వారికి ఇంతకుమించిన సైన్సు పరిజ్ఞానం లేదని రూఢి అవుతుంది.
ఇక వారి ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పరిశీలిద్దాం..
1. 'భూమి, అంతరిక్షము స్థిరముగా ఉన్నవి' (ఋగ్వేదం 1-22-14)
2. 'ఇంద్రా! నీవు మహంతము, అనంతము, చలనశీలమగు భూమిని సమభావమున దాని స్థానమున నిలిపినావు (ఋగ్వేదం-3-30-9)
3. సకల భూతములకు సుఖములు గలిగించు 'ద్యావా పృధ్వ'లను సృష్టించినాడు. ఆ రెంటినీ కదలకుండా మేకులతో బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్ఠుడు' (ఋగ్వేదం 1-160-4)
4. 'ధృవాసిభూమీ!' అంటే 'భూమీ నీవు స్థిరత్వము కలదానవు'. (కృష్ణయజుర్వేదము 1-1-13-6)
5. 'భూమి దేవనిర్మిత నౌక. అది మహాజలములపై తేలియాడుచున్నది' (కృష్ణయజుర్వేదము 1-5-11-18)
6. పూర్వము సూర్యుడు భూలోకమున ఉండెను. దేవతలు 'సామిధేనీ ఋక్కు'ను ఉచ్చరించినారు. అందువలన సూర్యుడు భూలోకము నుండి ఎత్తి 'ద్యులోకము'న స్థాపించినారు' (కృష్ణ యజుర్వేదము 2-5-8-2)
7. 'భూమి స్థిరమైనది గదా!' (కృష్ణ యజుర్వేదము 2-6-5-24)
8. 'స్థిరము, విస్తారమగు భూమికి నమః' (అధర్వవేదము 12-3-1-11) అంటే, వేదాలన్నిటిలోను భూమి స్థిరముగా ఉంటుందనిగానీ, నీటిపై తేలుతుంటుందనిగానీ, అది మేకులతో బిగించబడి ఉంటుందనిగానీ చెప్పబడింది. అంతేకాని, భూమి గుండ్రంగా ఉంటుందనిగానీ, దానికి భ్రమణం, పరిభ్రమణం ఉంటాయనిగానీ చెప్పబడలేదన్నమాట. ఇదీ వైదిక ఋషుల ఖగోళ విజ్ఞానం!
ఇక్కడ సుభాష్‌కాక్ పది అడుగులు వెనుకకు వేసి 'సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని అంగీకరించబడింది. ఈ పద్ధతికి ఆధారాలు పురాతన ఖగోళశాస్త్ర గ్రంథాలలో మనకు లభిస్తాయి' అని 'వేదాలలో సైన్సు ఉందా?' అనే గ్రంథం 33వ పేజీలో రాశారు. ఇది రుజువు చేయబడిన సైన్సును అవహేళన చేయడం కాదా?
ఇక వైదిక ఋషుల వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్ని పరిశీలిద్దాం.
1.జలోదరరోగీ! నీవు అబద్ధము ఆడినావు. అసత్యము మహాపాపము. అదే జలోదర కారణము' (అధర్వవేదము 1-1-4-3)
2. 'సర్వ విష చికిత్స కొరకు మంత్రముచే గడ్డిని కాల్చి పాము ముందు వేయునది' (అధర్వవేదము 7-8-2- వినియోగము6)
3. 'సర్వజ్వర చికిత్సకు కప్పను కట్టి మంచము కింద వైచి మంచము మీద, రోగిమీద 9,10 మంత్రములచే (పైన చెప్పబడినవి) నీటిని చల్లునది'. (అధర్వవేదము 7-10-3 వినియోగం7)
4. 'ఈ వ్యక్తికి వచ్చు వరుసజ్వరము కప్పను చేరునుగాక! (అధర్వవేదము 7-10-3-4-2).
ఇవీ వేదాలలో చెప్పబడిన జ్వర కారణా లు, చికిత్సా పద్ధతులు. ఇవి వేద ఋషుల యొక్క వైద్య పరిజ్ఞానాన్ని సూచిస్తున్నది.
ఇక సృష్టిని గూర్చి, జీవ పరిణామాన్ని గూర్చి వేదం ఇలా తెలియజేస్తుంది.
'ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను, పశువుల ను సృష్టించదలచినాడు. అట్లు తలచినవాడు తన ఉదరము నుండి 'వపను' ఖండించి, తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందునుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడు అయినాడు. ప్రజలను, పశువులను సృజించినాడు' (కృష్ణ యజుర్వేదం, 2-1-1-7) డార్విన్ నిరూపించిన జీవపరిణామ సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం కాదా?
ఇదీ వేద ఋషుల శాస్త్ర పరిజ్ఞానం! వేదాలలో ఎంత కాగడా పట్టి వెతికి చూసినా విమానం, రైలు, అంతరిక్ష విద్య మొదలగు వాటి గురించిన విజ్ఞానం కనిపించదు.
ఇక వేదాలను పాశ్చాత్యులు దొంగిలించారనే విషయాన్ని పరిశీలిద్దాం.
వేదాలకు 'శృతులు' అనే మరో పేరు కూడ ఉంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి గురువు గారి నోటి నుండి వచ్చిన వేద శ్లోకాలను విని, శిష్యులు నేర్చుకుంటున్నారు. అవి లిఖితపూర్వకంగా 70, 80 ఏళ్ళ కిందటి వరకూ లేవు. అందుకే వెయ్యేళ్ళనాటి బైబిల్ ప్రతిగానీ, ఖురాన్ ప్రతిగానీ దొరుకుతుందిగానీ వెయ్యేళ్ళ నాటి వేదాల లిఖిత ప్రతి ఎక్కడా లేదు. 70, 80 ఏళ్ళ నుండి కూడా వేదాల లిఖిత ప్రతిని తయారు చేయదలచిన వారు, వేద పండితులచే అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇక వేదాల లిఖిత ప్రతులను పాశ్చాత్యులు కాజేయడమనే ప్రశ్న రానేరాదు.
కాబట్టి, వేదాలను మన ప్రాచీన వారసత్వ సంపదగాను, సారస్వత భాండాగారంగానూ గుర్తించాలిగానీ 'అన్నీ వేదాలలోనే ఉన్నాయిష!' అనే అగ్నిహోత్రావధానులులాగా ప్రకటనలీయడం సమంజసం కాదు.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
వేదాల్లో ఉన్న సైన్సు..!

________________________________________________
'వాస్తు దెబ్బ'కు కాలపరిమితి లేదా?
- విశ్వాసాలు.. వాస్తవాలు...99
'ఏంటి విశేషం' అడిగాను నేను.
'ఈ వార్త చూడు' అంటూ ఒక హెడ్డింగు చూపి పేపరు నాకిచ్చాడు.
అది 11.9.2011 నాటి 'ఈనాడు' పత్రిక. దానిలో 'వాస్తుదెబ్బ' అనే శీర్షికతో ఉన్న వార్తను చదివాను. టివీ9 లోనూ చూపించారు. 'అయితే ఏమంటావ్?' ప్రశ్నించాను సుబ్బారావును.
'చదివావు గదా? గాలి జనార్దనరెడ్డి అనే 'వేల కోట్ల' ఆస్తి ఉన్న వ్యక్తి గనుల అక్రమాల కేసులో అరెస్టయ్యాడు. జైలుకి వెళ్లాడు. దీనికంతటికీ కారణం అతని ఇంటి ప్రధానద్వారం వాస్తు విరుద్ధంగా ఉందని. దానికి అడ్డంగా ఒక్కరోజులో గోడకట్టి మూసేశారు. దీనిపై నీ అభిప్రాయమేంటి?'
'సుబ్బారావ్! ఆ వార్తలో గాలి జనార్దనరెడ్డి ఆ ఇంట్లో 2003 నుంచి ఉంటున్నారనీ, ఆ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారనీ కూడా ఉంది గదా? అంటే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి అయ్యాడు. అప్పటి నుండి ఆయన రోజువారీ ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంది. ఎనిమిదేళ్ళ నుంచి రోజుకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. అప్పుడు లేని వాస్తుదోషం ఇప్పుడు సడన్‌గా ఎలా వచ్చింది? ఆయన ఇంటి వెనుకభాగంలో ఎత్తయిన కొండలు ఉన్నాయనీ, అలా కొండలు ఉండటం వాస్తు ప్రకారం మంచిదని వాస్తు పండితులు చెప్పారనీ ఆ వార్తలో ఉంది. మరి ఇన్నేళ్ళబట్టి అంత బలంగా ఉన్న వాస్తు ఇప్పుడు బలహీన పడిందా? అసలు వాస్తు గ్రంథాలలో ఏముందో తెలుసా?
శ్లో|| పక్షేణ మాసేజా ఋతుత్రయేణ
సంవత్సరేణాపి ఫలం విధత్తే|| (విశ్వకర్మ ప్రకాశిక)
అంటే 'వాస్తు ఫలితం పక్షంరోజుల్లోగానీ, నెలరోజుల్లోగానీ, ఆరునెలల్లోగానీ, సంవత్సరంలోగానీ సంభవిస్తుంది' అని అర్థం. సంవత్సరంలోపు ఎప్పుడో ఒకసారి సంభవిస్తుందని చెప్పడమే సైన్సుకు వ్యతిరేకం. ఉదా: నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆవిరి అవుతుంది. అంతేకానీ 10 డిగ్రీల దగ్గరో, 20 డిగ్రీల దగ్గరో, 50 డిగ్రీల దగ్గరో, 95 డిగ్రీల దగ్గరో ఆవిరి అవుతుందని చెబితే అది సైన్సు కాదు. ఊహాగానమవుతుంది. ఇక 'విశ్వకర్మ ప్రకాశిక'లో చెప్పిన విషయం పరిశీలిద్దాం. వాస్తు దోషం యొక్క ఫలితం సంవత్సరంలోపు జరగాలి. అంతేగానీ, 8 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 40 ఏళ్ళకో ఏదైనా అశుభం జరిగితే దాన్ని వాస్తుదోష ఫలితమనవచ్చా?
సంతోష్ హెగ్డే అనే ఓ పెద్దాయన చెప్పినట్లు 8 ఏళ్ళపాటు 'రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి'ని ఎదురులేకుండా ఏలిన జనార్దనరెడ్డి ఇంటికి వాస్తుదోషం ఉందనడం, ఆ ఇంటివారు నమ్మడం.. ఇదంతా అసంబద్ధం. ఆయన వేల కోట్లు సంపాదించడానికీ, ఈనాడు జైలు పాలవడానికీ వాస్తవ కారణాలు వేరే ఉన్నాయి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తనకు అత్యంత సన్నిహితులైన వారు ముఖ్యమంత్రులుగా ఉండటం (లేదా) వారిని సన్నిహితులుగా మార్చుకొనడం ఆయన ఎదుగుదలకు కారణం. చట్టానికున్న బలమైన చేతులు నెమ్మదిగానైనా ఆయనను చుట్టుముట్టడం ఆయన జైలు పాలవడానికి అసలు కారణం. ఇలా వాస్తవ కారణాలను వదిలి అవాస్తవ కారణాలను నమ్మడం మన అమాయకత్వం. ఇక ఆ వార్తలోని మరో అంశాన్ని పరిశీలించు. 'జనార్దనరెడ్డి బెయిల్ పిటీషన్‌పై సోమవారం నాడు అంటే 12.11.2011న సి.బి.ఐ. కోర్టులో విచారణ జరగనున్నందున ప్రధాన ద్వారానికి అడ్డంగా నిర్మాణాన్ని శనివారం సాయంత్రానికే పూర్తిచేశారు' అని ఉంది. ఇపుడు విచారణా పూర్తయ్యింది. బెయిలూ రాలేదు. జైలులోనే ఉండాల్సి వచ్చింది. చట్టం చేతులు ఎంత దృఢమైనవో ఇప్పుడు తెలిసిందా?! '
ఒకరోజు కాదు, రెండునెలలకు పైగా గడిచాయి. అయినా, జనార్దనరెడ్డికి బెయిలు దొరకలేదు. జైల్లోనే మగ్గుతున్నాడు!
ఆ తర్వాత ఒకరోజు సుబ్బారావు ఫోనుచేసి 'నిజమే లక్ష్మీకాంతం! చట్టం చేతులు వాస్తవం. వాస్తు అవాస్తవం' అన్నాడు.
నేను నవ్వాను.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
______________________________________________
జంతువులు 4 కాళ్లతో, మనుషులు 2 కాళ్లతోనే నడుస్తున్నారెందుకు? నిమ్మకాయ ఉప్పునీటిలో ఎందుకు తేలుతుంది?
సూటి సమాధానం ఒకటే. మనిషికి రెండే కాళ్లున్నాయి. అందుకే రెండు కాళ్లతో నడుస్తాడు. చతుష్పాద జంతువులకు నాలుగు కాళ్లున్నాయి కాబట్టి నాలుగు కాళ్లూ ఉపయో గిస్తాయి. కోడిలాంటి పక్షి జంతువులూ, నాలుగు కాళ్లున్నా రెండే ఉపయోగపడే కంగారూ, డైనోసారు వంటి జంతువులు, రెక్కలున్న పెంగ్విన్ వంటి క్షీరదాలూ రెండుకాళ్లతోనే నడుస్తాయి. గొంగళిపురుగు, సాలెపురుగు, జర్రి వంటి పురుగులు నాలుగుకన్నా ఎక్కువ కాళ్లతో నడుస్తాయి.
ఇపుడిక అసలు విషయానికి వద్దాము. కాళ్ల సంఖ్య ఎక్కువయితే శరీరం నేలకు సమాంతరంగా ఉండాల్సి ఉంటుంది. తద్వారా చుట్టుపక్కల అన్నివైపులా తొందర తొందరగా చూడలేవు. కేవలం ముందువైపు మాత్రమే ఎక్కువ దృష్టి సారించగలవు. అంతేకాదు. నాలుగు కాళ్లున్న ప్పుడు శరీరపు ముఖ్య జ్ఞానేంద్రియాలు (sensory organs) ఉన్న ముఖం నేలకు చేరువలో ఉంటుంది. అంటే ముందువైపు సుదూరంగా ఉన్న వస్తువుల్ని, ప్రమాదాల్ని గుర్తించలేవు. కానీ పరిణామక్రమంలో ఈ పరిమితులు పోయి మరింత ప్రకృతి వరణాని (national selection) కి అనువుగా ఉన్న శరీరాకృతి ఏర్పడింది. వెనకాలి రెండుకాళ్ల మీద నడవడం, ముందుకాళ్లు చేతులుగా అభివృద్ధి కావడం ఓ గుణాత్మక ప్రక్రియ. తద్వారా పరికరాల వినియోగానికి, పరిసరాలను పట్టుకొని ఆసరా పొందడానికి, యంత్రలాభం (lever gain) పొందడానికి, చేతుల్తో పట్టుకొని ఊగడం ద్వారా దూరాలకు లంఘించడానికి వీలైంది. కేవలం రెండు కాళ్ల మీద మాత్రమే నిలబడగలగడం వల్ల శరీరం నేలకు సమాంతరం (horizontal) గా కాకుండా నిలువు (verticle) గా కుదుర్చుకొనేందుకు అవకాశం వచ్చింది. అంటే నేలకు మరింత ఎత్తులో తలను ఉంచగలగడం మరింత దూరానికి చూపుల్ని సారించగలగడం వల్ల దారి తెలుసుకొనేందుకు, ఆహారపు స్థావరాల పరిశీలనకు, ప్రమాదాలను గమనించేందుకు, శత్రువుల ఉనికిని తెలుసుకొనేందుకు వీలైంది. నేలమీంచి చూడ్డం కన్నా గుట్ట ఎక్కి చూసినపుడు మనకు అన్ని ప్రాంతాలూ బాగా కనిపిస్తాయి కదా! అలాగే క్షితిజ సమాంతరంగా తల ఉన్న 80 కిలోల పులికన్నా, క్షితిజ లంబంగా ఉన్న 80 కిలోల మనిషికి ఎక్కువ దూరం కనిపిస్తుంది. ఒకే విధమైన కండర దారుఢ్యం ఉన్నపుడు నాలుగు కాళ్లను సమన్వయపరుస్తూ నడవడం కన్నా రెండుకాళ్లను సమన్వయం చేయడం మెదడుకు సులువు కూడాను.
మంచినీటిలో నిమ్మకాయ మునుగుతుంది. కానీ ఉప్పునీటిలో అదే నిమ్మకాయ తేలుతుంది. ఎందుకు?
- టి.చెన్నకేశ్వరి, రామచంద్రాపురం
స్వచ్ఛమైన నీటి సాంద్రత (density) సాధారణ ఉష్ణోగ్రతల దగ్గర ఒక గ్రా / ఘ.సెం.మీ. (1 gcm-3) ఉంటుంది. అంటే ఒక మిల్లీలీటరు ఘనపరిమాణం (volume) ఉన్న నీటి బరువు ఒక గ్రామన్నమాట. ఒక లీటరు నీటిలో సుమారు 500 గ్రాముల ఉప్పును కలిపినపుడు ఆ ద్రావణపు (solution) ఘనపరిమాణం పెద్దగా మారదు. అంటే లీటరు నీటికున్న ఒక కి.గ్రా. బరువుతోపాటు 500 గ్రాముల బరువు జత కలవడం వల్ల ఆ ఉప్పునీటి సాంద్రత ఇపుడు 1.5 గ్రా / ఘ.సెం.మీ. అయినట్లే కదా! సాధారణ నిమ్మకాయ నికర సాంద్రత సుమారు 1.2 గ్రా./ ఘ.సెం.మీ ఉంటుంది. మీరు ప్లవన సూత్రాలు (laws of floatation) పేరుతో పాఠ్యపుస్తకాలలో నేర్చుకొన్నదేమిటంటే ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే మునుగుతుందనీ, తక్కువైతే తేలుతుందనేగా! మరి నిమ్మకాయ సాంద్రత స్వచ్ఛమైన నీటి సాంద్రతకన్నా ఎక్కువ కాబట్టి మునిగింది. కానీ ఉప్పునీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి ఉప్పునీటి మీద తేలుతుంది. అదే తేడా!
_______________________________________________
స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత మన పరిశోధనా
స్థానాల్లో జరుగుతున్న పరిశోధన లు ఉన్నతవర్గాలకే పరిమితమవుతున్నా యని,
సామాన్యులకు అందటంలేదని కొంత మంది శాస్త్రజ్ఞులు బలంగా అభిప్రాయపడుతుండే
వారు. దీనికి విరుగుడుగా, ఈ విజ్ఞానాన్ని సామాన్యులకూ అందించాలనే లక్ష్యంతో
వారి భాషలోనే ఈ శాస్త్రజ్ఞులు విజ్ఞాన ప్రచారాన్ని చేప ట్టారు. ఈ
ప్రయత్నాలే ఆ తర్వాత ప్రజా సైన్స్ ఉద్యమాలుగా మారాయి. ఈ వారసత్వం తోనే
నేటి ప్రజాసైన్స్ ఉద్యమం కొనసాగు తుంది. ప్రజాసమస్యలను అభివృద్ధి ఎజెండా
లోకి తేవ డమే ఈ ఉద్యమ లక్ష్యం. సాక్షరతా ఉద్యమం, మహిళా సాధికారత, అభివృద్ధి
వికేంద్రీకరణ స్థానిక సంస్థల ప్రజాస్వామీకరణ ఇలా వచ్చినవే. ఈ అనుభవంతోనే,
రాబోయే కాలంలో ప్రజా సైన్స్ ఉద్యమం తీసుకోవాల్సిన కార్యక్రమాల స్వభావాల్ని
నిర్ధారించేందుకు కేరళలోని త్రిచూర్ పట్టణంలో డిసెం బర్ 27-31 మధ్య '13వ
అఖిల భారత సైన్స్ ఉద్యమాల సమన్వయ మహాసభలు' జరిగాయి. ఈ వివరాలను
రేఖామాత్రంగా తెలిపేందుకు వ్యవసాయ శాస్త్రవేత్త, జనవిజ్ఞాన వేదిక స్థాపక
సభ్యులు, హైదరాబాద్ నగర జెవివి ఆవిర్భావ కమిటీ మొదటి కన్వీనర్ డాక్టర్
అరిబండి ప్రసాదరావు సహకారంతో మీ ముందుకొచ్చింది నేటి 'విజ్ఞానవీచిక'.
సైన్స్ (విజ్ఞానశాస్త్రం). స్వతహాగా అన్ని వర్గాలకూ సంబంధించింది. కానీ దీని ఆధారంగా ఆవిష్కరింపబడి, వినియోగింపబడే సాంకేతిక విజ్ఞానం రాజకీయం మీద, పాలకవర్గ స్వభావం మీద ఆధారపడి ఉంది. దీన్నే మరోమాటలో చెప్పాలంటే విజ్ఞానశాస్త్రానికీ, సాంకేతిక విజ్ఞానానికీ, సమాజానికీ గల పరస్పర సంబంధాలను అర్థం చేసుకోకుండా అభివృద్ధి దిశను నిర్ధారించలేం. సరిగ్గా ఎంపిక చేసుకునే సాంకేతిక విజ్ఞానం సామాజిక విప్లవానికి దోహదపడుతుంది. దీనిలో విఫలమైతే సాధించిన అభివృద్ధి తిరోగమనంలో పడుతుంది. ప్రపంచీకరణ విధానాల్లో నేడు మనం చూస్తున్నది ఇదే. కొనసాగుతున్న రైతుల దుర్భిక్షం, ఆత్మహత్యలు, క్షీణిస్తున్న శ్రామికుల జీవితాలు దీనినే ప్రతిబింబిస్తున్నాయి.
మన దేశాభివృద్ధి బ్రిటిష్‌కాలంలో జరిగిన విజ్ఞానశాస్త్రం అభివృద్ధిలో భాగంగాకాక, స్వాతంత్య్ర పోరాటాల వెనుకగల రాజకీయశక్తుల ప్రమేయం వల్ల సాధ్యమైంది. దేశ స్వాతం త్య్రం, సార్వభౌమ పటిష్టతలకు, స్వయంపోషక విధానాలు ఈ విధంగానే చేపట్టబడ్డాయి. అణగారిన శక్తుల, విముక్తికి ఒక మేర ఇవి దోహదపడతాయి. విస్తరించిన ప్రజాసైన్స్ ఉద్యమం దీనికి తోడ్పడుతుంది. ఈ ఉద్యమంతో శాస్త్రజ్ఞులు కాక, సామాజిక కార్యకర్తలు అగ్రభాగాన నిలిచారు. గ్రామ ఉపాధ్యా యులు, తల్లులు, యువకులు, విద్యార్థులు వంటి వర్గాలు సైన్స్ ఉద్యమంలో భాగస్వాముల య్యారు. వీరికి శాస్త్రజ్ఞులు, శాస్త్ర కార్యకర్తలు తోడయ్యారు.
భారత సైన్స్ ఉద్యమ విస్తరణ లో 1962లో ఏర్పడిన కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆవిర్భావం ఒక ప్రధానఘట్టం. మళయాళ భాషలో విజ్ఞానశాస్త్రాన్ని అందించాలనే ప్రధానలక్ష్యంతో ఇది మొదట ప్రారంభమైంది. కానీ, 'సామాజిక విప్లవానికి విజ్ఞానశాస్త్రం' అనే నినాదం చేపట్టడం ద్వారా ప్రజాసైన్స్ ఉద్యమ లక్ష్యాలనే విస్తృతపరిచింది. విజ్ఞానశాస్త్రం, సార్వత్రిక విద్యకు గల విముక్తి శక్తిని ప్రజల ముందు పెట్టింది. 1979లో ఏర్పడిన ఢిల్లీ సైన్స్ ఫోరం దేశంలో సైన్స్ ఉద్యమ విస్తరణకు, బలపడడానికి ఎంతో దోహదపడింది. మన రాష్ట్రంలో 1987లో ఏర్పడిన 'జన విజ్ఞాన వేదిక' 'ప్రజా సైన్స్ ఉద్యమ' వ్యాప్తికి దోహదపడుతోంది. ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు, ఉపాధ్యాయులు ప్రజాసైన్స్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 1990లో ప్రారంభమైన సాక్షరతా (అందరికీ విద్య) ఉద్యమం ప్రజాసైన్స్ ఉద్యమం బలపడడానికి, విస్తరణకు ఎంతో తోడ్పడింది. విద్య హక్కుగా ఏర్పడింది.
భారత స్వయంపోషకత్వం కోసం దోపిడీ, అజ్ఞానం, పేదరికం, మూఢవిశ్వాసాల నుండి విముక్తికి కృషి చేసింది. తద్వారా, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారపు హక్కు, లింగ వివక్ష, మహిళా సాధికారత వంటి వాటిని అభివృద్ధిలో ఎజెండాగా ప్రజాసైన్స్ ఉద్యమం దేశం ముందుకు తీసుకురాగలిగింది. కానీ వేగంగా అమలు చేయబడుతున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు సాధించిన అభివృద్ధిని తిరోగమనంలో పడేస్తున్నాయి. ఫలితంగా ప్రజా సైన్స్ ఉద్యమం పాలకులు అనుసరించే అభివృద్ధి వ్యూహాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది.
కేరళలో...
కేరళ మానవాభివృద్ధి సూచికలు... అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలతో పోల్చదగినవి. కొన్ని అంశాలలో ఈ దేశాలకంటే మెరుగైనవి కూడా. పరిమిత వనరులు కలిగి, భారత రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ భారీ పరిశ్రమల నిర్మాణం లేకుండా, కేంద్ర నిధుల కేటాయింపులో (రాజకీయ కారణాల వల్ల) ఒక విధమైన వివక్షకు గురవుతూ, బహుళపార్టీ వ్యవస్థలు కలిగి, తరచుగా అధికారపార్టీలు మారుతున్నప్పటికీ ఈ అభివృద్ధి ఎలా సాధ్యమైనది? దీని రహస్యమే మిటి? ఈ ప్రశ్నలు మనల్నే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి. వీటి సమాధానం కోసమే 'కేరళ అభివృద్ధి నమూనా'పై వివిధ దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు మూడు వేల మంది శాస్త్రజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, అంతర్జాతీయ నిపుణుల మూడవ సమావేశం తిరువునంతపురంలో డిసెంబర్ చివరిన జరిగింది. అదే సమ యంలో, అఖిలభారత సైన్స్ ఉద్యమ 13వ మహాసభలు (ఎఐపిఎస్‌ఎన్) కూడా జరిగాయి. గత 22 ఏళ్ళుగా కొనసాగిన సైన్స్ ఉద్యమ అనుభవాల్ని, ఫలితాల్ని అంచనా వేస్తూ రాబోయే కాలం లో అనుసరించాల్సిన విధానాల్ని రూపొందించే లక్ష్యంతో ఈ మహాసభ జరిగింది. ఇంత ముఖ్య సమావేశాలు రెండూ ఒకేసారి జరగడం ఆ రాష్ట్ర అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికాల అమలు జరిగిన తీరు ప్రాధాన్యతను, విజయాలను తెలియజేస్తోంది.
నిత్యజీవితంలో అనుసరించిన అభివృద్ధి నమూనాలో విజ్ఞానశాస్త్రం, ముఖ్యంగా సాంకేతిక విజ్ఞానాల ఎంపిక, ఆ తర్వాత కార్యక్రమాల నిర్వహణలో ప్రజలకు కలిపించిన భాగస్వామ్యం కేరళ అభివృద్ధి రహస్యమని చెప్పవచ్చు. అధికార వికేంద్రీకరణ, ప్రజాస్వామ్యకీకరణ దీనికి ప్రధాన ఆయుధాలు. కేరళ శాస్త్ర, సాహిత్య పరిషత్ దీనికి సారథ్యం వహించింది. దీని ప్రమేయంలేని అభివృద్ధి పార్శ్వం కేరళలో ఏ రంగమూ లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. పార్టీల, విశ్వాసాల పరిధుల్ని దాటి, ఈ సంస్థ పనిచేస్తూ అందరికీ అభివృద్ధి ఆలోచనల్లో, కార్యాచరణలో భాగస్వామ్యం కల్పించింది. వీరందరి భాగస్వామ్యంతో కింది నుండి పైస్థాయి వరకూ అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. అన్ని పాఠశాలలో, ఉన్నత విద్యాలయాలలో ఈ పరిషత్ యూనిట్లు చురుగ్గా పనిచేస్తున్నాయి. వీటిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇవే కేరళ అభివృద్ధికి మూలస్థంభాలు.
నిత్య జీవితంలో ముఖ్యంగా సాంస్కృతిక, సాంఘిక అంశాలలో సైన్స్ ఒక భాగంగా ఇమిడి పోయింది. సైన్స్ వీరి నిత్య జీవితంలో ఎంతగా పెనవేసుకు పోయిందంటే టీబడ్డీలు, హోటళ్లలో మూలికలతో కాసిన వేడి నీటిని సరఫరా చేయడం ఇక్కడ అలవాటుగా మారింది. గురవ య్యార్ గుడిలో చిన్న అరటిపండ్లను ప్రసాదంగా వినియోగిస్తున్నారు. శబరి (అయ్యప్ప) లాంటి దేవాలయాల ఆచారాల్లో సైన్స్, నిరాడంబరత, ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి. నిరాడంబర జీవితం, అందరికీ కనీస అవసరాలు కలిగించాలనే దృఢ సంకల్పం, ప్రకృతి పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, వీటికి దోహదపడే సాంకేతిక విజ్ఞానాల ఎంపిక, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు కల్పించిన భాగస్వామ్యం ఆధునిక కేరళ అభివృద్ధి నమూనాలో ముఖ్యాంశాలు.
ఈ అభివృద్ధికంతటికీ మూలాధారం భారత రాజ్యాంగ పరిమితికి లోబడి అమలుపరిచిన భూసంస్కరణలు. ఈ అభివృద్ధి నమూనాను మన రాష్ట్ర అభివృద్ధి నమూనాతో పోల్చుకుంటే మనమెక్కడున్నాం? ఎటుబోతున్నాం? కేరళ స్థాయికి చేరడానికి మనమేం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచించాల్సి వస్తుంది.
మన రాష్ట్రంలో...
ప్రజా జీవితాల్లో అభ్యుదయ మార్పులు తీసుకురావడంలో జనవిజ్ఞాన వేదికలాంటి సైన్స్ ఉద్యమాలకు మన రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయి. స్థానిక సమస్యలు, అవసరాల ప్రాతిపదికన సాగే సైన్స్ ఉద్యమ కార్యక్రమాల్లో నిజంగా ప్రజల అభివృద్ధిని కాంక్షించే వారందరూ తోడ్పడతారు. తోడ్పడాలి. ఈ కార్యక్రమం ప్రజల్ని ఐక్యపరుస్తుంది. ఇది సైన్స్ ఉద్యమ పటిష్టతకు, విస్తరణకు కూడా దోహదపడుతుంది. వీటి ఆధారంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రూపొందే అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి తోడ్పడతాయి. పార్టీ, విశ్వాసాల పరిధుల్ని దాటి రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలు మనందరి జీవితాల్ని మెరుగుపర్చడానికి దోహదపడతాయి. దీనికి ప్రజాసైన్స్ ఉద్యమం చొరవ తీసుకొని, నాయకత్వం వహించాలి.
కర్తవ్యాల దిశ..
ప్రజాసైన్స్ ఉద్యమ కార్యక్రమాలు ఈ దిశలో కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది.
* అణుశక్తి సంబంధ విషయాలలో, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధి, తదితర కార్యక్రమాలలో పనిచేస్తున్న బృందాలతో సమన్వయం కోసం అవసరమైన పద్ధతుల్ని రూపొందించుకొని పనిచేయడం.
* సుస్థిర జీవనశైలి, అభివృద్ధికి అవసరమైన సంక్లిష్ట శాస్త్ర, సాంకేతిక విధానాలను సమన్వయం చేయడం.
* ప్రాంతీయ స్థాయిలో శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించడం.
* ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.
* ప్రతి ఏడాది కనీసం 10 ప్రధానాంశాలపై అధ్యయనపత్రాలను విడుదల చేయడం.
* గ్రామీణ పరిశ్రమలు, సమన్వయ గ్రామీణ సాంకేతిక కేంద్రాలు, తదితర సంస్థల అనుభవాలను, నైపుణ్యాలను అవసరమున్నవారు పంచుకునేలా విశాలవేదికగా పనిచేయడం.
* మహిళలతో సహా వివిధ సామాజిక తరగతులకు అభివృద్ధిఫలాలు అందించేందుకు భాగస్వామ్యం కల్పించే కార్యక్రమాలను ద్విగుణీకృతం చేయడం.
* వివిధ సోదర సంస్థలు, ఉద్యమాలతో ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక పరిశోధనా స్థానాలతో సంబంధాలను పెంపొందించుకోవడం, తద్వారా ప్రజాసైన్స్ ఉద్యమాన్ని బలోపేతం చేయడం.
* వివిధ స్థాయిల్లోని శాస్త్రజ్ఞులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు ఇతరుల ఐక్యత పెంపొందేలా కృషిచేస్తూ, సామాజిక విప్లవానికి కృషి చేయడం.
* ప్రజాసైన్స్ ఉద్యమ నిర్వహణలో ఆర్థికంగా స్వయంపోషకత్వాన్ని సాధిస్తూ కార్యక్రమాల్ని విస్తృతపర్చడం.
ఆహ్వానం
'ప్రజల నుండి ప్రజల కొరకు' శీర్షిక ఉద్దేశం నెరవేరాలంటే..
సైన్స్‌కు సంబంధించి, మీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు కనుగొన్న ఆవిష్కరణలను పంపండి. అంతేకాకుండా ఏ ఇతర మార్గాల్లో పరిష్కారం దొరకని మీ సమస్యలనూ మాకు రాయండి. మీ సమస్యకు సంబంధిత నిపుణులతో చర్చించి, సమాధానం ఇస్తాం. సమాధానం దొరకకపోతే ఈ సమస్యకు పరిష్కారం తెలపమని ప్రచురించి, ప్రజల్నే కోరతాం. పూర్తి వివరాలను తెలియజేయగోరుతున్నాం.
సైన్స్ ఉద్యమాలు ... ప్రజా సమస్యలు

_____________________________________________
భూమి
గుండ్రంగా ఉంది. ఇది గంటకు 1620 కి.మీ. వేగంగా తిరుగుతుందని
తెలుసుకున్నాము. కానీ నా సందేహం ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు (భ్రమణం) మనం
ఎందుకు కొంచెం కూడా కదలటం లేదు? అంతేగాకుండా 3/4 వంతు ఉన్న ఈ జలావరణము
మొత్తం ఈ భూభాగాన్ని ముంచేయాలి కదా! కాని ఎందుకు అలా జరగటం లేదు? ఎందుకో
దయచేసి జవాబు ఇవ్వగలరు.- బి.గౌతమ్, హార్వెస్ట్ కాన్సెప్ట్ స్కూల్,
పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా.
మీరన్నట్లు భూమి గుండ్రంగానే ఉంది. అది చాలా వేగంగా కూడా తిరుగుతోంది. సాకర్ బంతిలాగా అన్నివైపుల నుంచి ఒకే వ్యాసార్థం (radius) ఉండే సౌష్టవ గోళాకారం (perfect sphere) లో కాకుండా ధృవాల వైపు నుంచి తక్కువ వ్యాసార్థం (సుమారు 6357 కి.మీ.) తో, భూమధ్యరేఖ (equator) మీదుగా అయితే కొంచెం ఎక్కువ వ్యాసార్థం (సుమారు 6379 కి.మీ.) లోనూ ఉంది. అంటే ఇటు భూమధ్య రేఖ నుంచి బయల్దేరి భూకేంద్రం (centre by earth) ద్వారా అటువైపున్న భూమధ్య రేఖను చేరడానికి పట్టే దూరం 12,758 కి.మీ. కాగా ఉత్తరధృవం నుంచి బయల్దేరి భూకేంద్రం గుండా దక్షిణ ధృవానికి చేరడానికి పట్టే దూరం 12,714 కి.మీ. అవుతుందన్నమాట. మరోమాటలో చెప్పాలంటే ధృవాలగుండా వ్యాసం (diameter) కన్నా భూమధ్యరేఖ మీదుగా వ్యాసం 44 కి.మీ. ఎక్కువ.
ఇది చెప్పుకోదగినంత పెద్ద తేడా కాదు కాబట్టి మీరన్నట్టే భూమి గుండ్రంగా ఉందనే అనుకోవచ్చును. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ (spin) సూర్యుని చుట్టూ తిరుగుతోంది (revolution). దీన్నే భ్రమణం అంటాము. ఒక చక్రం తన చుట్టూ తాను తిరిగేపుడు చక్రం మీదున్న అన్ని బిందువులు ఒకే వడి (speed)తో తిరగవు. ఇరుసు (axis)కు దగ్గరగా ఉన్న బిందువులు తక్కువ వేగంతోనూ దూరంగా ఉన్న బిందువులు ఎక్కువ వేగంతోనూ తిరుగుతాయి. కాబట్టి భూమి విషయంలో భ్రమణ వేగం గరిష్టంగా భూమధ్య రేఖ మీద ఉన్న ప్రాంతాలకు ఉంటుంది. ఇది గంటకు సుమారు 1,675 కి.మీ. (ఇది మీరనుకుంటున్న 1,620 కి.మీ.కు చాలా దగ్గరే ఉంది కాబట్టి మీరంటున్న వేగం భ్రమణ వేగమనే భావించాలి.) అంతేకాకుండా భూమి సూర్యుని చుట్టూ శూన్యాకాశం (space)లో కూడా తిరుగుతోంది.
ఈ గమనాన్ని పరిభ్రమణం (revolution) అంటారని పైన తెలుసుకొన్నాం. ఆ విధంగా భూకేంద్ర బిందువు గంటకు సుమారు 1,07,200 కి.మీ. వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అంటే భ్రమణ వేగమైనా, పరిభ్రమణ వేగమైనా భూమి విషయంలో చాలా ఎక్కువే. సాధారణ పరిస్థితుల్లో గాలిలో శబ్ద వేగం (sound velocity) గంటకు సుమారు 1,240 కి.మీ. అంటే భూభ్రమణ వేగము, భూ పరిభ్రమణ వేగము రెండూ కూడా ధ్వని వేగానికన్నా ఎక్కువే! ఓ వస్తువు గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు దాని వేగం ధ్వని వేగం కన్నా ఎక్కువయితే అపుడు షాక్ తరంగాలు గాలిలో ఏర్పడి పెద్దపెట్టున భయంకరమైన, కర్ణకఠోరమయిన శబ్దాలు వస్తాయి. అందుకే సూపర్ సోనిక్ విమానాలు (గాలి వేగం కన్నా వేగంగా వేళ్లేవి) మామూలు విమానాల్లాగా కాకుండా చాలా ఎత్తులో గాలి పీడనం బాగా తక్కువ ఉన్నచోట ప్రయాణిస్తాయి.
కాబట్టి మీరడిగిన ప్రశ్నలాగే 'భూమి భ్రమణ వేగం, భూమి పరిభ్రమణ వేగం రెండూను ధ్వనివేగం కన్నా ఎక్కువ కాబట్టి మరి మనకెందుకు ఈ భూచలనాల వల్ల కర్ణకఠోరమైన శబ్ధాలు రావడం లేదు?' అని కూడా మరో పాఠకుడు / పాఠకురాలు ప్రశ్నిస్తే కూడా మీకు చెప్పే సమాధానమే దాదాపు సరిపోతుంది. అతుకుల, గతుకుల రోడ్డుమీద బస్సు వేళ్లేపుడు బస్సులో ఉన్న మనం అటూయిటూ కదులుతాము. సాఫీగా రైలుపట్టాల మీద వెళ్లే రైలులో మనం ప్రయాణించేపుడు మనకు కుదుపులు అంతగా ఉండవు. అంటే వాహనం కదులుతున్న పథం(path)లేదా మార్గం లేదా నేల వల్ల కలిగే ఘర్షణ (friction) లో తేడాలు వచ్చినపుడు వాహనము, వాహనంతోపాటు వాహనంలో ఉండే ప్రయాణికులు కుదుపులకు లోనవుతారు. అసలు ఘర్షణే లేకుంటే కుదుపులే లేవు కదా! పాదార్థిక మార్గమే ఘర్షణను యిస్తుంది. పాదార్థిక మార్గం కాకుండా శూన్య మార్గమే (vacuum space) దారి అయినపుడు ఘర్షణకు వీలేది? కుదుపులకు అవకాశమేది? భూమి తనతో పాటు తన గాలిని, తన మీదున్న మనల్ని కలుపుకొని ఓ నిర్దిష్ట విశ్వవాహనం (universal vehicle)గా శూన్యంలో ప్రయాణిస్తోంది. భూమి గమనానికి బస్సుల్లాగా హైవే, రైలుకులాగా పట్టాలు, విమానాలకు లాగా గాలి మాధ్యమాలుగా లేవు. కాబట్టి భూ చలనాల్లో కుదుపులు ఉండవు.
ఇక మీరడిగిన రెండో ప్రశ్న విషయానికొద్దాం. భూమిపై 3/4 వంతు జలావరణం (Hydrosphere) ఉంది. అంటే దీని అర్థం భూమికున్న మొత్తం ద్రవ్యరాశి (6x1024kg అంటే 6 తర్వాత 24 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యాన్ని కిలోగ్రాములు). ముప్పావువంతు (4.5x1024kg;అంటే 4.5 తర్వాత 24 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యాన్ని కిలోగ్రాములు) అని అర్థంకాదు. కేవలం నేలపరంగా మాత్రమే చూడాలి. అంటే భూమి ఉపరితల వైశాల్య భాగంలో 75 శాతం మేరకు నీరే ఉంది. అయితే ఆ నీరు నేల మీద మైదాన ప్రాంతాల్లో (planes) చెరువులు, నదులు, సరస్సుల రూపంలో కన్నా ఎక్కువగా లోతైన సముద్రాల్లో ఉంది. ఎలాగయితే ఇంటి ఆవరణలో బావిలో నీరు చాలానే ఉన్నా మన ఇంట్లోని మంచాలు మునిగిపోవో, అలాగే లోతైన సముద్రాల్లో, మహాసముద్రాల్లోనే 98 శాతంగా నీరు ఉండడం వల్ల భూభాగాల్లో ఉన్న మనం మునిగిపోవడం లేదు.
ఒకవేళ భూమినంతా సున్నిపిండిలాగా మొత్తం దంచివేస,ి ముద్దచేస్తే నేలభాగపు సాంద్రత నీటిసాంద్రత కన్నా ఎక్కువ కాబట్టి నేల (మట్టి) భాగం లోపలివైపునకు ఉండగా, నీరు పైభాగాన పొరలాగా ఏర్పడుతుంది. అంటే బత్తాయి పండులోని గుజ్జు (flesh) భాగం నేల అనుకుంటే బత్తాయి పండు తొక్క (peel) భాగం నీరు అవుతుందన్నమాట. అపుడా నీటి లోతు ఎంతో తెలుసా? దాదాపు రెండు కిలోమీటర్లు. భూమి బరువు 6x1024 కి.గ్రా. కాగా, భూమి మీదున్న నీటి బరువు సుమారు 1.4 x 1020 కి.గ్రా. లేదా సుమారు 14 కోట్ల 40 లక్షల ఘన కిలోమీటర్ల ఘన పరిమాణం. భూమి మొత్తం బరువుతో పోలిస్తే ఇది సుమారు 40,000 రెట్లు తక్కువ. పైగా చాలా భాగపు నీరు మంచుగడ్డల రూపం (ice mountains) లోనూ, హిమశిలల (ice hergs) రూపంలోనూ ఉండడం వల్ల ముంపు ప్రమాదం మరింత తక్కువయింది.
భూ భ్రమణంతో పాటు మనం కొంచెం కూడా ఎందుకు కదలడం లేదు?

____________________________________________
శూన్యంలో ధ్వని విన్పించదా?
పిల్లలూ మీరు రకరకాల ధ్వనులను
వింటూనే వుంటారు కదా! మనం మాట్లాడినా, లేక గట్టిగా అరిచినా ధ్వని
పుడుతుంది. అలాగే ఏవేనీ రెండు వస్తువులు పరస్పరం ఒకదానికొకటి తాకిడి
జరిగినపుడు కూడా శబ్దం పుడుతుంది. అయితే కంపించే అన్ని వస్తువుల శబ్దాలనూ
మనం వినలేం. వినగలిగే శబ్దాలను మా త్రమే మనం ధ్వనులుగా పేర్కొంటాం. శబ్ద
మనేది యాంత్రిక తరంగం. ఈ తరంగం ప్రసరిం చాలంటే యాన కం కావాలి. ఘన, ద్రవ,
వాయు పదార్థాలలో ఏదో ఒకటి ఉన్నపðడు మాత్రమే కంపనలో ధ్వని పుడుతుంది.
శూన్యంలో యానకం ఉండదు, కాబట్టి కంపనలు జరగవు. అందువల్ల ధ్వని జనించదు.
కాబట్టి శూన్య ప్రదే శంలో ధ్వని వేగం సున్నా. దానికెలాంటి వేగం ఉండనందున
మనకు ధ్వని విన్పించదు. అలాగే చంద్రమండలం కూడా శూన్య ప్రదేశమే అయి నందువల్ల
అక్కడ కూడా ధ్వని విన్పిం చదు. అందుకే చంద్ర మండలం మీద మనిషికి మామూలుగా
మాట్లాడడానికి వీలు కాదు. చంద్ర మండలంలో మనం చప్పట్లు కొట్టినా, తుపాకీ
పేల్చినా వాటి శబ్దాలను మనం వినలేము. శూన్యప్రదేశంలో, చంద్రమండలంలో ధ్వని
అనే యాంత్రిక తరంగం ప్రసరించేందుకు యానకం లేనందువల్ల అక్కడ ధ్వని మనకు
వినపడదని పేర్కొంటున్నారు పరిశోధకులు.
________________________________________________
________________________________________________
తామరాకుపై నీరెందుకు అంటదు
బాలలూ.. 'తామరాకుపై నీటిబొట్టన్న
చందంగా' అన్న సామెత మీరు వినే వుంటారు. అంటే అర్థమేమిటంటే తామరాకుపై నీటి
బొట్లు నిలవవని అర్థం. అంటే అంటీ అంటనట్లుగా నీటి బొట్లు ఉంటాయన్న మాట.
నీటిలో ఉన్నా కూడా తామరాకు తడవదు. తామరాకుపై నీటిబొట్టు పడితే, అది ఆకుపై
తేలుతూ జారిపోతూ వుంటుంది. ఇది చూచినవారికి ఎందుకు నీరు నిలువదు అన్న
సందేహం కలుగవచ్చు.
తామరాకుల్లోని కణాలలో సెల్యులోజన అనే పదార్థం ఉంటుంది. అది కొన్ని మార్పులు చెంది క్యూటికల్ అనే పొరను ఏర్పరస్తుంది. ఆ పొరలో నున్నగా ఉండే ఆమ్లాలు, ఆల్కహాల్, కార్బన్ వంటి అణువులు ఉంటాయి. అవి నీటితో ఎలాంటి చర్యనూ జరపవు. అందుకే తామరాకు నీటిలో తడవదు. క్యూటికల్ పొర ఉన్న ఆకుపై పడే నీరు తలతన్యత కారణంగా గుండ్రటి బిందువులుగా మారుతుంది. బిందువులు నున్నగా జారిపోతాయి. అందుకే తామరాకుపై పడిన నీరు నిలవదు, తామరాకు తడవదు.
తామరాకుపై నీరు గుండ్రటి బిందువులుగా ఎందుకేర్పడతాయో, తామరాకు ఎందుకు తడవదో ఇపðడు అర్థమైంది కదా బాలలూ! దీన్నుంచే పైన చెప్పిన సామెత పుట్టింది..!
_________________________________________________
'మాష్టారూ! కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్‌లో వరాహస్వామి
విగ్రహమొకటి సంవత్సరానికొక సెంటిమీటరు చొప్పున పెరుగుతుందట. టి.వి.9
ఛానల్‌లో ఈ విషయం చూపించారు. అది దేవుడి మహిమ అని అందరూ చెప్పుకుంటున్నారు.
నిజమా? 'దేశభక్తి' క్లాసు తీసుకోవడానికి తరగతిగదిలోకి అడుగిడగానే
ప్రశ్నించాడు వంశీ.
''వంశీ! ఆ వరాహస్వామి విగ్రహం భూమిలో నుండి పైకి వచ్చిన రాయిలో చెక్కబడిన విగ్రహం. దానిని నిన్ననే విన్నాను. ఇది భూగర్భంలోని రాతికి సంబంధించిన విషయం కనుక శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో జియోలజీశాఖ ప్రొఫెసర్ హనుమంతుని సంప్రదించాను. ఆయన చెప్పిన విషయాల సారాంశమేమంటే - 'ఈ భూగోళం యొక్క వ్యాసార్థం 6378 కి.మీ. అందులో పైభాగం 68 కి.మీ. మందంగల గట్టిగా పెంకులాగాను, లోపలిభాగం 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడితో కరుగుతున్న 'లావా' అనబడే చిక్కటి ద్రవపదా ర్థంతోను నిండి ఉంటుంది. పై భాగమైన గట్టి రాతి పదార్థం అనేక పొరలుగా ఉంది. ఆ పొరల ను టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఆ ప్లేట్లు అనేక దిశలలో నిరంతరం కదులుతూ ఉంటాయి. ఆ కదిలే పొరలు ఒకదానినొకటి ఢకొీన్నా, ఒక్క సారిగా విడిపోయినా భూకంపాలు లేక బ్రహ్మాండమైన లోయలు ఏర్పడవచ్చు. అలా కాకుండా ఒక పొర మీదికి మరొక పొర నెమ్మదిగా ఎక్కితే అప్పుడు పైనున్న టెక్టానిక్ పొర పైకి లేచి, భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. అది క్రమంగా భూమిలో నుండి పెరుగుతున్న రాయిలాగా కనిపిస్తుంది. కొన్ని వేల ఏళ్ళకు ఆ రాయి, లేక రాళ్ళ సముదాయం ఒక గుట్టలాగా కనిపిస్తాయి. కొన్ని లక్షల ఏళ్ళకు ఆ రాళ్ళు మహాపర్వతాలుగా పెరుగుతాయి. మీకొక విచిత్రం చెప్పమంటారా?' అని చెప్పడం ఆపాను.
'పిల్లలందరూ ఆసక్తిగా నావైపు చూడసాగారు. నేను చెప్పడం ప్రారంభించాను. 'ఇప్పటికి 15 కోట్ల సంవత్సరాల క్రితం ఈనాటి హిమాలయపర్వతాలే లేవు. అసలు టిబెట్‌కు దక్షిణాన ఇండియా దేశమే లేదు. అక్కడ ఒక సముద్రముండేదట. ఆ కాలంలో ఇండియా, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా కలిసి ఉండేవి. కావాలంటే, 'భూమి, 15 కోట్ల సంవత్సరాల క్రితం' అని అంతర్జాలంలో వెదకండి. నేను చెప్పినట్లుగా భూగోళం ఉంటుంది. అప్పటి నుండి కిందనున్న టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా ఇండియా భూభాగం క్రమంగా కదలి, కొంతకాలానికి టిబెట్ భూభాగాన్ని తాకింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని పొరమీదికి మరో పొర ఎక్కసాగింది. అలా కదులుతున్నప్పుడు పైపొర క్రమంగా భూమిలో నుండి పైకి వచ్చి ఈనాటికి 8,848 మీటర్లు ఎత్తుగానున్న హిమాలయ పర్వతాలుగా రూపొందింది. అది ఈనాటికీ సంవత్సరానికి ఒక సెంటీమీటరు చొప్పున పెరుగుతూనే ఉందని' ఆ ప్రొఫెసర్ చెప్పారు. అంతెందుకు? అనేక ప్రదేశాల్లో, పొలాల్లో రాయి ఎత్తు పెరిగిందని గ్రామాలలోని ముసలివాళ్ళు చెప్పడం నేను విన్నాను. అంతేకాదు మన రాష్ట్రంలోనే యాగంటి అనే తీర్థయాత్ర స్థలంలో ఒక విశేషం జరుగుతోంది. దానిని గూర్చి మీరెవరైనా విన్నారా? ఎవరైనా వెళ్ళి చూశారా?''
'నేను వెళ్ళి చూశాను మాస్టారూ!' అంది సాయిలక్ష్మి.
'ఏం చూశావమ్మా?'
'యాగంటిలో నంది విగ్రహం భూమిలో నుండి 20 సంవత్సరాలకొక అంగుళం చొప్పున పెరుగుతోంది. అక్కడ గవర్నమెంటు ఒక బోర్డును కూడా పెట్టింది!' అంది సాయిలక్ష్మి.
'ఆ విగ్రహం ఎందుకలా పెరుగుతోందో తెలుసా?'
'ఇంతకు ముందు తెలియదుగానీ ఇప్పుడు అర్థమైంది మాస్టారూ! ఆ విగ్రహాన్ని ఒక పీఠం మీద పెట్టలేదు. భూమిపైనున్న రాతితోనే మలిచారు. అక్కడ టెక్టానిక్ ప్లేటు పైకి లేస్తున్న కారణంగా, ఆ ప్లేటులో భాగమైన నంది విగ్రహం కూడా పైకి పెరుగుతోంది' అంటూ వివరించింది సాయిలక్ష్మి.
'అవునమ్మా! అయితే ఒక చిన్న సవరణ. హిమాలయాల ఎత్తు పెరుగుదల మాక్రో (అంటే చాలా పెద్ద సైజుగల) టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల జరుగుతోంది. యాగంటిలో నంది విగ్రహం మైక్రో (అంటే చాలా చిన్న సైజులో ఉన్న) టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా పెరుగుతోంది. అంతేకాదు, యాగంటిలోని శిలలన్నీ భూమి మీద ఉండే అవక్షేప శిలలోని క్వార్ట్‌జైట్ లేక సున్నపురాళ్ళు అనే రకానికి చెందినవి. అవి గాలి లేక నీటి తాకిడికి చీలవచ్చు లేక ఉబ్బవచ్చు. అందువల్లనే యాగంటిలో కొండలు నిలువుగా చీలినట్లుంటాయి. నంది విగ్రహం క్రమంగా ఉబ్బటానికి ఆ రాతి లక్షణం కూడా కొంత కారణం. ఇలా పెరుగుతున్న విగ్రహాలన్నీ ఒక పీఠం మీద ప్రతిష్టించినవి కాకుండా, భూమిలోని రాతిలోనే మలచబడి నవి కావడం కూడా మనం గమనించవలసిన మరో ముఖ్య విషయం. 'ఇలాగే ఇకముందు కూడా, అమాయకులు మహిమలని భావించే వాటిని గూర్చి ఆ అంశానికి సంబంధించిన శాస్త్రజ్ఞులనడిగి వాస్తవాన్ని తెలుసుకోండి' అన్నాను.'అలాగే మాస్టారూ' అన్న పిల్లల మాటతో తరగతి గదంతా ప్రతిధ్వనించింది.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
______________________________________________________
పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? నీళ్లు ఎందుకు పారదర్శకంగా ఉంటాయి? - డి.శ్వేత, రేణిగుంట,చిత్తూరు
తెల్లనివన్నీ పాలు కావు అన్న మాటలో ఎంత నిజం ఉందో నల్లనివన్నీ నీళ్లు కావు అనడమూ అంతే పాక్షిక సత్యం. ఎందుకంటే అసలు నీళ్ళే నల్లగా ఉండవు. నువ్వన్నట్లు నీళ్లు పారదర్శకం (transparent) గా ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కాకపోయినా పాలలాగా తెల్లగా కనిపించే పదార్థాల తెలుపునకు మాత్రం కారణం దాదాపు ఒకటే. పదార్థాలతో కాంతికున్న పరిచర్యం (interaction) విశ్వంలో ఉన్న అనేక గొప్ప దృగ్విషయాలలో చాలా మౌలికమైంది. కాంతి (light) కి కణ (corpuscular) స్వభావం, తరంగ (షaఙవ) స్వభావం కలగలిసే ఉంటాయి. కాంతి స్వభావరీత్యా విద్యుదయస్కాంత లాక్షణి (electromagnetic entity). ఈ తరంగాలు ఎన్ని సెకనుకు ఒక బిందువు నుంచి కదుల్తాయో ఆ సంఖ్యను ఆ తరంగాల పౌనః పున్యం (frequency) అంటాము. పౌనఃపున్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ తరంగాలకు అంత ఎక్కువ శక్తి ఉన్నట్టు అర్థంచేసుకోవాలి. తరంగం అంటే నీటి ఉపరితలం మీద అలల్లాగా కదిలే రూపమే. మరి నీటి తరంగాలలో కొన్నిచోట్ల ఎత్తులు (crests) గా మరికొన్ని చోట్ల లోతులు (troughs) గా ఉంటుంది కదా! అతి దగ్గరగా ఉన్న రెండు పక్కపక్క లోతుల మధ్య దూరాన్నిగానీ లేదా రెండు పక్కపక్కనే ఉన్న శిఖరాల మధ్య దూరాన్నిగానీ ఆ తరంగపు తరంగదైర్ఘ్యం (wavelength) అంటారు.
ఒక తరంగపు తరంగదైర్ఘ్యాన్ని‘l’ (lamda) అనే గ్రీకు అక్షరంతో చూపుతారు. అలాగే పౌనఃపున్యాన్ని‘n’(nu) అనే అక్షరంతో చూపుతారు. కాంతి తరంగాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రైలు తన పెట్టెల్ని (బోగీల్ని) వెంట బెట్టుకొని వెళ్తున్నట్లే కాంతి అనే రైలు తరంగాలు అనే బోగీలను మోసుకెళ్తూ ఉంటుంది. దీన్నే కాంతి ప్రయాణం (transit of light) అంటాము. ఒక సెకను సమయంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతివేగం (velocity light) అంటాము. దీనిని‘c’అనే ఇంగ్లీషు అక్షరంతో చూపుతారు. దీని విలువ శూన్యం (vacuum) లో సుమారు మూడు లక్షల కిలోమీటర్లని గత గురువారం తెలుసుకొని ఉంటారు. ఒక సెకనులో కాంతి జరిగే తరంగాల్ని‘n’ అని, ఒక్కో తరంగం పొడవు‘l’ అని అంటారు కాబట్టి ఒక సెకనులో కాంతి అశ్రీ దూరం ప్రయాణిస్తుందని అర్థం కదా! కాబట్టి c=nl.
కాంతికున్న తరంగదైర్ఘ్యం లేదా పౌనఃపున్యం ఆధారంగా కాంతిని స్థావరాలు (zones) గా వర్గీ కరించారు. 400 నుంచి 800 నానోమీటర్ల మధ్యలో తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తరంగా లను దృశ్యకాంతి (visible light) అంటాము. 100 నుంచి 400 నానోమీటర్ల మధ్య ఉన్న కాంతిని అతినీలలోహిత (ultra violet) కాంతి అనీ, 800 నుంచి 10000 నానోమీటర్ల మధ్య కాంతిని పరారుణ (infra red) కాంతి అని అంటారు.కాంతి తరంగపు తరంగదైర్ఘ్యం కన్నా ఆ కాంతి పదార్థంలో ప్రయాణించే సమయంలో తాను ఎదుర్కొనే పదార్థపు కణాల సైజు తక్కువ అయినట్లయితే కాంతి తరంగాలకు అడ్డు ఏమీ ఉండదు. అపుడు ఆ పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి.
మన కంటికి పారదర్శకంగా ఉన్నంత మాత్రాన అన్నిరకాల కాంతులకు పదార్థాలు పారదర్శకం కానక్కర్లేదు. నీటి అణువుల సైజు సుమారు 5A (Angstrom)) ఉంటుంది. పది A విలువ ఒక నానోమీటరుగా గుర్తించండి. కానీ దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాలు 4000 నుంచి 8000 A వరకూ ఉంటాయి. కాబట్టి ఆ కాంతి తరంగదైర్ఘ్యాల కన్నా నీటి అణువుల సైజే చిన్నది. కాబట్టి ఆ తరంగాలు అన్నీ నీటి నుంచి దూసుకుపోతాయి. అంటే నీటిగ్లాసుకు ఆవలవైపున్న వస్తువు దృశ్యం మొత్తం ఈవలకి వస్తుంది. కాబట్టి నీరు పారదర్శకంగా కనిపిస్తుంది. కానీ కాంతి తరంగదైర్ఘ్యం కన్నా పదార్థపుకణాలు పెద్దగా ఉన్నట్లయితే ఆ కణాలు ఆ తరంగాలకు అడ్డుపడ్డం వల్ల ఆవలి కాంతి ఈవలికి రాదు. అలాంటి పదార్థాలు కాంతి నిరోధకాలు (opaque) గా పనిచేస్తాయి.
నల్ల కాగితం, రేకులు, కిటికీ చెక్కలు, పాదరసం, తలుపులు, గొడుగు ఇలాంటి పదార్థాలలో అన్ని కణాలు బహ్వణువులు (polymeric),లేదా బహుపరమాణుక (polyatomic) ఘన (solid) లేదా ద్రవ (liquid) సంఘటిత (condensed) పదార్థాలు. కాబట్టి అవి కాంతి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇపుడు మూడో తరహా పరిస్థితి ఒకటుంది. కాంతి తరంగాల తరంగ దైర్ఘ్యానికీ, పదార్థ కణాల సైజు చేరువలోగానీ, దాదాపు సమానంగాగానీ ఉన్నట్లయితే ఆ పదార్థ కణాలు ఆ కాంతి తరంగాల్ని పూర్తిగా ఆపవు. అలాగని పూర్తిగా దూసుకుపోనివ్వవు. మరేం చేస్తాయి? కాంతి తరంగాల్ని అటూ ఇటూ చెల్లాచెదురుగా వెళ్లేలా చేస్తాయి. ఈ ప్రక్రియను విక్షేపణం (scattering) అంటారు.
ఒకవేళ మనం చూడగలిగిన దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాల రేంజ్ అయిన 4000-8000 Aశీమధ్యలోనే పదార్థంలోని కణాల సైజు ఉన్నట్లయితే ఆ కణాలు ఈ దృశ్యకాంతిని అన్నివైపులా చెల్లాచెదరుగా వెదజల్లుతాయి. అన్ని దృశ్యకాంతి తరంగాల్ని కలిపి చూస్తే మన మెదడు 'తెలుపు' అని అర్థంగా తీసుకుంటుంది. చాక్‌పీస్, సిగరెట్ పొగ, కట్టెలపొయ్యి పొగ, ఫినాయిల్ కలిపిన నీళ్లు, పాలు, జిల్లేడు పాలు, ముగ్గుపిండి, సున్నం వంటి పదార్థాలలోని కణాల సైజు 8000 నుంచి 4000 A మధ్య ఉండడం వల్ల అవి దృశ్యకాంతిని అన్నివైపులకు విక్షేపణం చెందిస్తాయి. అలా విక్షేపణం చెందిన కాంతిలో దృశ్యకాంతిలోని ఏడురంగులూ కలగలిసి ఉండడం వల్ల మనకవి తెల్లగా కనిపిస్తాయి.
_________________________________________________________
తొలిరోజుల్లో రూపొందించిన రాకెట్లు వాటి ఇంధనంఅయిపోగానే
పేలిపోయేవి. అసలు అలా పేలేటట్టే వాటినితయారుచేసేవారు. మరి వస్తువులనుగానీ,
మనుషులను గానీతీసుకెళ్లడమెలా. ఆ సమస్యను పరిష్కరించింది అతి మామూలు
బెలూన్! మరీ అంతరిక్షంలోకి కాకపోయినా, దాని గుమ్మంవరకూ తీసుకువెళ్లే వీలు బెలూన్ కల్పించింది. స్విట్జర్లాండ్‌లో
జన్మించిన బెల్జియన్ భౌతికశాస్త్రవేత్త, అగస్ట్ పికార్(1884-1962) 1930లో ఒక భారీ బెలూన్‌నుతయారుచేశాడు. దాని సాయంతో అతను కాస్మికకిరణాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఈకిరణాలను భూమి వాతావరణం పొర అడ్డుకుని,అవి భూమిని ాకకుండా చేస్తుంది. కాబట్టిఅటు వంటి కిరణాల గురించి తెలుసుకోవాలంటే వాతావరణ పొరను దాటి పైకి వెళ్లాల్సి ఉంటుంది. పికార్డ్ న్నో ప్రయాసల కోర్చి, తక్కువ పీడనంలో కూడా మానవులు మామూలుగా ఉండగలిగే గనులను రూపొందించాడు. అటువంటి కాబిన్‌లో అతను 55,563 అడుగుల ఎత్తుకు వెళ్లగలిగాడు! ఇది జరిగింది 1932లో. ఆ మరుసటి ఏడాది సోవియట్ యూనియన్‌కు చెందిన బెలూనిస్టులు పికార్డ్ నమూనా సాయంతో 60,700 అడుగుల ఎత్తు ఎగరగలిగారు. అదే ఏడాది
చివర్లో అమెరికన్లు బెలూన్లను ఉపయోగించి 61,221 అడుగుల ఎత్తుకు ఎగిరారు. బెలూన్‌లు మానవులను గాలిలోకి
తీసుకెళ్లగలుగుతున్నాయి గానీ, స్ట్రాటోస్ఫియర్ పొరను దాటి పైకి వెళ్లలేకపోయాయి. ఎందుకంటే, వాటిని పైకి తీసుకెళ్లడానికి భూమి
వాతావరణం సహాయపడాలి. దాంతో అంతరిక్షం అంతు చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. అయితే ప్రపంచయుద్ధ సమయంలో వాడిన వి2 రాకెట్లను మెరుగుపరిచి, వాతావరణ పొరల అవతల వరకూ పంపే ప్రయత్నాలను ముమ్మరం
చేశారు. యుద్ధం తరువాత 'సౌండింగ్ రాకెట్' తయారైంది. భూమి వాతావరణ పొరల అవతల శబ్దాలను తెలుసుకోడానికి ఈ తరహా
రాకెట్లను రూపొందించారు. ఈ రాకెట్లు గంటకు 5000 మైళ్ల వేగంతో దూసుకు పోగలిగేవి. ఇవి దాదాపు 20 మైళ్ల ఎత్తుకు
వెళ్లేటప్పటికి వాటి ఇంధనం అయిపోయేది. అయినా, ఆ చలన వేగంతో అవి ఓ వంద మైళ్ల వరకూ సాగిపోయేవి. ఇక ఆ తరువాత
ఆ రాకెట్ నేలమీద పడిపోయేది. దాంతో ఆ రాకెట్‌తో పాటు పైకి వెళ్లిన పరికరాన్ని ఎలాగోలా సురక్షితంగా నేలమీద పడేలా చేయవలసి వచ్చింది. ఆ దశలో చాలా ఎత్తుకు దూసుకెళ్లగల రాకెట్ తయారుచెయ్య డమే కాకుండా భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్లగలిగే వేగాన్ని అందుకోవడం ముఖ్యమైన లక్ష్యంగా ఉండేది. ఒకవేళ అటువంటి వేగాన్ని సాధించగలిగితే భూమి చుట్టూ తిరిగే
ఉపగ్రహాలని తయారుచేసే వీలు చిక్కుతుంది. అటువంటి వేగాన్ని అందుకోవడానికంటే ముందే వి2 తరహా రాకెట్లలో ఇంధనం
అయిపోయేది. ఆ సమయంలో మళ్లీ గోడార్డ్ ఆలోచన ఉపయోగపడింది. గోడార్డ్ డిజైన్లో అంచెలంచెల రాకెట్ ఉంది. అసలు రాకెట్‌నే ఇంధనం మోసుకెళ్లే పెట్టెలుగా చేస్తే, చివరి (కింది నుంచి మొదటిది) ఇంధనం పెట్టి ఖాళీ అవ్వగానే కింద పడిపోతూ, దాని పైనున్న పెట్టెను అంటిస్తుంది. అలా అంచెలంచెలుగా, ఖాళీ అయిన పెట్టెలు పడిపోతూ, రాకెట్‌ను మరింత తేలికగా చేస్తూ చాలా దూరం వెళ్లవచ్చు! (ఇప్పటికీ ఈ తరహా రాకెట్లే వాడుకలో ఉన్నాయి). 1950 వ దశకంలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే
ఆలోచన ఊపందుకుంది. అందుకు అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ సంసిద్ధతను తెలియజేశాయి. అయితే
అమెరికాకు ఆశ్చర్యం కలిగేలా సోవియట్ యూనియన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి, అలా చేసిన తొలి దేశం అయ్యింది. రష్యన్ భాషలో
'ఉపగ్రహం' అనే అర్థం ఉన్న 'స్పుత్నిక్' పదాన్నే ఉపగ్రహానికి పేరుగా పెట్టింది. అక్టోబరు 4, 1957న స్పుత్నిక్-1 అంతరిక్షంలోకి వెళ్లింది. ఆ 83.25 కిలోల ఉపగ్రహం 201 కి.మీ. ఎత్తున గంటకు 28,980 కి.మీ. వేగంతో తిరిగింది. ఈనాటి ఉపగ్రహాలతో పోల్చితే స్పుత్నిక్-1ని చాలా పురాతనమైన దానికిందే జమకట్టాలి. అంతరిక్షం నుండి అప్పుడప్పుడూ ఒక రేడియో సిగ్నల్ ఇవ్వడం మినహా మరేం చేసేది కాదు. అసలు స్పుత్నిక్ చేయడానిక్కూడా ఏమీ పనిలేదు. కాని అది చేసింది ఒకటుంది. అంతరిక్ష యుగానికి పునాది వేసింది. అంతరిక్ష యుగం జన్మించింది. అంతరిక్ష పోటీలు ప్రారంభమయ్యాయి.
- డాక్టర్ విజరు
________________________________________________
మనలో
చాలామందికి అసలు టైంతో అంత కచ్ఛితంగా పని లేదు. కొన్ని గంటలు అటూ ఇటూ
అయినా పెద్దగా పట్టించుకోం. కానీ, పరిశోధనల్లో ప్రతి సెకనూ విలువైనదే.
సెకనే కాదు అంతకంటే తక్కువకాల విభజనలు కూడా కొన్నిసార్లు కీలకమవు తాయి.
మామూలు ప్రజానీకం 'సుమారు' సమయాలు పాటి స్తుంటే శాస్త్రవేత్తలు కచ్చితమైన
టైంని పాటిస్తారు. దీనికోసం ఉన్న పరిమాణు వాచ్‌లు (అటామిక్‌వాచ్)
ఇప్పటివరకూ సమయాన్ని కచ్చితంగా లెక్కకడుతున్నాయి. ఇప్పుడు ఇంకా మరీ
కచ్చితమైన మరో గడియారం రానుంది. ఒక అణువులోని కేంద్రకం చుట్టూ తిరిగే
నూట్రాన్‌కి అనుసంధానం చేసే ఒక కొత్తరకం గడియారాన్ని ప్రతిపాదించారు
పరిశోధకులు. ఈ తరహా గడియారం ఎంత కచ్చితంగా టైం చెబుతుందంటే 14 బిలియన్
సంవత్సరాల (విశ్వపు వయస్సు)కు ఒకసారి ఒక సెకనులో 20వ వంతు మాత్రమే మార్పు
ఉంటుందట. ఇప్పుడున్న గడియారాల్లో ఇది ఇప్పటి అత్యంత మేటి అని, ఇది అటామిక్
వాచ్‌ల కన్నా వందరెట్లు మెరుగైంది అనీ అంటున్నారు. ఈ వాచ్‌వల్ల ప్రాథమిక
భౌతికశాస్త్ర అధ్యయనానికీ, అప్లైడ్ భౌతికశాస్త్రానికీ అమితమైన మేలు
జరుగుతుందట. అంతేకా కుండా, కాల కొలతల విషయంలో ఈ కొత్త 'న్యూక్లియర్
వాచ్'లు ఎంతో ఉపయోగపడతాయని నెవెడా యూనివర్శిటీ పరిశోధకులు భావిస్తున్నారు.
తామరాకుల్లోని కణాలలో సెల్యులోజన అనే పదార్థం ఉంటుంది. అది కొన్ని మార్పులు చెంది క్యూటికల్ అనే పొరను ఏర్పరస్తుంది. ఆ పొరలో నున్నగా ఉండే ఆమ్లాలు, ఆల్కహాల్, కార్బన్ వంటి అణువులు ఉంటాయి. అవి నీటితో ఎలాంటి చర్యనూ జరపవు. అందుకే తామరాకు నీటిలో తడవదు. క్యూటికల్ పొర ఉన్న ఆకుపై పడే నీరు తలతన్యత కారణంగా గుండ్రటి బిందువులుగా మారుతుంది. బిందువులు నున్నగా జారిపోతాయి. అందుకే తామరాకుపై పడిన నీరు నిలవదు, తామరాకు తడవదు.
తామరాకుపై నీరు గుండ్రటి బిందువులుగా ఎందుకేర్పడతాయో, తామరాకు ఎందుకు తడవదో ఇపðడు అర్థమైంది కదా బాలలూ! దీన్నుంచే పైన చెప్పిన సామెత పుట్టింది..!
_________________________________________________
విగ్రహాలు ఎందుకు పెరుగుతాయి?
- విశ్వాసాలు.. వాస్తవాలు...93
''వంశీ! ఆ వరాహస్వామి విగ్రహం భూమిలో నుండి పైకి వచ్చిన రాయిలో చెక్కబడిన విగ్రహం. దానిని నిన్ననే విన్నాను. ఇది భూగర్భంలోని రాతికి సంబంధించిన విషయం కనుక శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో జియోలజీశాఖ ప్రొఫెసర్ హనుమంతుని సంప్రదించాను. ఆయన చెప్పిన విషయాల సారాంశమేమంటే - 'ఈ భూగోళం యొక్క వ్యాసార్థం 6378 కి.మీ. అందులో పైభాగం 68 కి.మీ. మందంగల గట్టిగా పెంకులాగాను, లోపలిభాగం 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడితో కరుగుతున్న 'లావా' అనబడే చిక్కటి ద్రవపదా ర్థంతోను నిండి ఉంటుంది. పై భాగమైన గట్టి రాతి పదార్థం అనేక పొరలుగా ఉంది. ఆ పొరల ను టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఆ ప్లేట్లు అనేక దిశలలో నిరంతరం కదులుతూ ఉంటాయి. ఆ కదిలే పొరలు ఒకదానినొకటి ఢకొీన్నా, ఒక్క సారిగా విడిపోయినా భూకంపాలు లేక బ్రహ్మాండమైన లోయలు ఏర్పడవచ్చు. అలా కాకుండా ఒక పొర మీదికి మరొక పొర నెమ్మదిగా ఎక్కితే అప్పుడు పైనున్న టెక్టానిక్ పొర పైకి లేచి, భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. అది క్రమంగా భూమిలో నుండి పెరుగుతున్న రాయిలాగా కనిపిస్తుంది. కొన్ని వేల ఏళ్ళకు ఆ రాయి, లేక రాళ్ళ సముదాయం ఒక గుట్టలాగా కనిపిస్తాయి. కొన్ని లక్షల ఏళ్ళకు ఆ రాళ్ళు మహాపర్వతాలుగా పెరుగుతాయి. మీకొక విచిత్రం చెప్పమంటారా?' అని చెప్పడం ఆపాను.
'పిల్లలందరూ ఆసక్తిగా నావైపు చూడసాగారు. నేను చెప్పడం ప్రారంభించాను. 'ఇప్పటికి 15 కోట్ల సంవత్సరాల క్రితం ఈనాటి హిమాలయపర్వతాలే లేవు. అసలు టిబెట్‌కు దక్షిణాన ఇండియా దేశమే లేదు. అక్కడ ఒక సముద్రముండేదట. ఆ కాలంలో ఇండియా, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా కలిసి ఉండేవి. కావాలంటే, 'భూమి, 15 కోట్ల సంవత్సరాల క్రితం' అని అంతర్జాలంలో వెదకండి. నేను చెప్పినట్లుగా భూగోళం ఉంటుంది. అప్పటి నుండి కిందనున్న టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా ఇండియా భూభాగం క్రమంగా కదలి, కొంతకాలానికి టిబెట్ భూభాగాన్ని తాకింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని పొరమీదికి మరో పొర ఎక్కసాగింది. అలా కదులుతున్నప్పుడు పైపొర క్రమంగా భూమిలో నుండి పైకి వచ్చి ఈనాటికి 8,848 మీటర్లు ఎత్తుగానున్న హిమాలయ పర్వతాలుగా రూపొందింది. అది ఈనాటికీ సంవత్సరానికి ఒక సెంటీమీటరు చొప్పున పెరుగుతూనే ఉందని' ఆ ప్రొఫెసర్ చెప్పారు. అంతెందుకు? అనేక ప్రదేశాల్లో, పొలాల్లో రాయి ఎత్తు పెరిగిందని గ్రామాలలోని ముసలివాళ్ళు చెప్పడం నేను విన్నాను. అంతేకాదు మన రాష్ట్రంలోనే యాగంటి అనే తీర్థయాత్ర స్థలంలో ఒక విశేషం జరుగుతోంది. దానిని గూర్చి మీరెవరైనా విన్నారా? ఎవరైనా వెళ్ళి చూశారా?''
'నేను వెళ్ళి చూశాను మాస్టారూ!' అంది సాయిలక్ష్మి.
'ఏం చూశావమ్మా?'
'యాగంటిలో నంది విగ్రహం భూమిలో నుండి 20 సంవత్సరాలకొక అంగుళం చొప్పున పెరుగుతోంది. అక్కడ గవర్నమెంటు ఒక బోర్డును కూడా పెట్టింది!' అంది సాయిలక్ష్మి.
'ఆ విగ్రహం ఎందుకలా పెరుగుతోందో తెలుసా?'
'ఇంతకు ముందు తెలియదుగానీ ఇప్పుడు అర్థమైంది మాస్టారూ! ఆ విగ్రహాన్ని ఒక పీఠం మీద పెట్టలేదు. భూమిపైనున్న రాతితోనే మలిచారు. అక్కడ టెక్టానిక్ ప్లేటు పైకి లేస్తున్న కారణంగా, ఆ ప్లేటులో భాగమైన నంది విగ్రహం కూడా పైకి పెరుగుతోంది' అంటూ వివరించింది సాయిలక్ష్మి.
'అవునమ్మా! అయితే ఒక చిన్న సవరణ. హిమాలయాల ఎత్తు పెరుగుదల మాక్రో (అంటే చాలా పెద్ద సైజుగల) టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల జరుగుతోంది. యాగంటిలో నంది విగ్రహం మైక్రో (అంటే చాలా చిన్న సైజులో ఉన్న) టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా పెరుగుతోంది. అంతేకాదు, యాగంటిలోని శిలలన్నీ భూమి మీద ఉండే అవక్షేప శిలలోని క్వార్ట్‌జైట్ లేక సున్నపురాళ్ళు అనే రకానికి చెందినవి. అవి గాలి లేక నీటి తాకిడికి చీలవచ్చు లేక ఉబ్బవచ్చు. అందువల్లనే యాగంటిలో కొండలు నిలువుగా చీలినట్లుంటాయి. నంది విగ్రహం క్రమంగా ఉబ్బటానికి ఆ రాతి లక్షణం కూడా కొంత కారణం. ఇలా పెరుగుతున్న విగ్రహాలన్నీ ఒక పీఠం మీద ప్రతిష్టించినవి కాకుండా, భూమిలోని రాతిలోనే మలచబడి నవి కావడం కూడా మనం గమనించవలసిన మరో ముఖ్య విషయం. 'ఇలాగే ఇకముందు కూడా, అమాయకులు మహిమలని భావించే వాటిని గూర్చి ఆ అంశానికి సంబంధించిన శాస్త్రజ్ఞులనడిగి వాస్తవాన్ని తెలుసుకోండి' అన్నాను.'అలాగే మాస్టారూ' అన్న పిల్లల మాటతో తరగతి గదంతా ప్రతిధ్వనించింది.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
______________________________________________________
పాలు తెల్లగా, నీళ్లు పారదర్శకంగా ఎందుకుంటాయి?
తెల్లనివన్నీ పాలు కావు అన్న మాటలో ఎంత నిజం ఉందో నల్లనివన్నీ నీళ్లు కావు అనడమూ అంతే పాక్షిక సత్యం. ఎందుకంటే అసలు నీళ్ళే నల్లగా ఉండవు. నువ్వన్నట్లు నీళ్లు పారదర్శకం (transparent) గా ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కాకపోయినా పాలలాగా తెల్లగా కనిపించే పదార్థాల తెలుపునకు మాత్రం కారణం దాదాపు ఒకటే. పదార్థాలతో కాంతికున్న పరిచర్యం (interaction) విశ్వంలో ఉన్న అనేక గొప్ప దృగ్విషయాలలో చాలా మౌలికమైంది. కాంతి (light) కి కణ (corpuscular) స్వభావం, తరంగ (షaఙవ) స్వభావం కలగలిసే ఉంటాయి. కాంతి స్వభావరీత్యా విద్యుదయస్కాంత లాక్షణి (electromagnetic entity). ఈ తరంగాలు ఎన్ని సెకనుకు ఒక బిందువు నుంచి కదుల్తాయో ఆ సంఖ్యను ఆ తరంగాల పౌనః పున్యం (frequency) అంటాము. పౌనఃపున్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ తరంగాలకు అంత ఎక్కువ శక్తి ఉన్నట్టు అర్థంచేసుకోవాలి. తరంగం అంటే నీటి ఉపరితలం మీద అలల్లాగా కదిలే రూపమే. మరి నీటి తరంగాలలో కొన్నిచోట్ల ఎత్తులు (crests) గా మరికొన్ని చోట్ల లోతులు (troughs) గా ఉంటుంది కదా! అతి దగ్గరగా ఉన్న రెండు పక్కపక్క లోతుల మధ్య దూరాన్నిగానీ లేదా రెండు పక్కపక్కనే ఉన్న శిఖరాల మధ్య దూరాన్నిగానీ ఆ తరంగపు తరంగదైర్ఘ్యం (wavelength) అంటారు.
ఒక తరంగపు తరంగదైర్ఘ్యాన్ని‘l’ (lamda) అనే గ్రీకు అక్షరంతో చూపుతారు. అలాగే పౌనఃపున్యాన్ని‘n’(nu) అనే అక్షరంతో చూపుతారు. కాంతి తరంగాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రైలు తన పెట్టెల్ని (బోగీల్ని) వెంట బెట్టుకొని వెళ్తున్నట్లే కాంతి అనే రైలు తరంగాలు అనే బోగీలను మోసుకెళ్తూ ఉంటుంది. దీన్నే కాంతి ప్రయాణం (transit of light) అంటాము. ఒక సెకను సమయంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతివేగం (velocity light) అంటాము. దీనిని‘c’అనే ఇంగ్లీషు అక్షరంతో చూపుతారు. దీని విలువ శూన్యం (vacuum) లో సుమారు మూడు లక్షల కిలోమీటర్లని గత గురువారం తెలుసుకొని ఉంటారు. ఒక సెకనులో కాంతి జరిగే తరంగాల్ని‘n’ అని, ఒక్కో తరంగం పొడవు‘l’ అని అంటారు కాబట్టి ఒక సెకనులో కాంతి అశ్రీ దూరం ప్రయాణిస్తుందని అర్థం కదా! కాబట్టి c=nl.
కాంతికున్న తరంగదైర్ఘ్యం లేదా పౌనఃపున్యం ఆధారంగా కాంతిని స్థావరాలు (zones) గా వర్గీ కరించారు. 400 నుంచి 800 నానోమీటర్ల మధ్యలో తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తరంగా లను దృశ్యకాంతి (visible light) అంటాము. 100 నుంచి 400 నానోమీటర్ల మధ్య ఉన్న కాంతిని అతినీలలోహిత (ultra violet) కాంతి అనీ, 800 నుంచి 10000 నానోమీటర్ల మధ్య కాంతిని పరారుణ (infra red) కాంతి అని అంటారు.కాంతి తరంగపు తరంగదైర్ఘ్యం కన్నా ఆ కాంతి పదార్థంలో ప్రయాణించే సమయంలో తాను ఎదుర్కొనే పదార్థపు కణాల సైజు తక్కువ అయినట్లయితే కాంతి తరంగాలకు అడ్డు ఏమీ ఉండదు. అపుడు ఆ పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి.
మన కంటికి పారదర్శకంగా ఉన్నంత మాత్రాన అన్నిరకాల కాంతులకు పదార్థాలు పారదర్శకం కానక్కర్లేదు. నీటి అణువుల సైజు సుమారు 5A (Angstrom)) ఉంటుంది. పది A విలువ ఒక నానోమీటరుగా గుర్తించండి. కానీ దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాలు 4000 నుంచి 8000 A వరకూ ఉంటాయి. కాబట్టి ఆ కాంతి తరంగదైర్ఘ్యాల కన్నా నీటి అణువుల సైజే చిన్నది. కాబట్టి ఆ తరంగాలు అన్నీ నీటి నుంచి దూసుకుపోతాయి. అంటే నీటిగ్లాసుకు ఆవలవైపున్న వస్తువు దృశ్యం మొత్తం ఈవలకి వస్తుంది. కాబట్టి నీరు పారదర్శకంగా కనిపిస్తుంది. కానీ కాంతి తరంగదైర్ఘ్యం కన్నా పదార్థపుకణాలు పెద్దగా ఉన్నట్లయితే ఆ కణాలు ఆ తరంగాలకు అడ్డుపడ్డం వల్ల ఆవలి కాంతి ఈవలికి రాదు. అలాంటి పదార్థాలు కాంతి నిరోధకాలు (opaque) గా పనిచేస్తాయి.
నల్ల కాగితం, రేకులు, కిటికీ చెక్కలు, పాదరసం, తలుపులు, గొడుగు ఇలాంటి పదార్థాలలో అన్ని కణాలు బహ్వణువులు (polymeric),లేదా బహుపరమాణుక (polyatomic) ఘన (solid) లేదా ద్రవ (liquid) సంఘటిత (condensed) పదార్థాలు. కాబట్టి అవి కాంతి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇపుడు మూడో తరహా పరిస్థితి ఒకటుంది. కాంతి తరంగాల తరంగ దైర్ఘ్యానికీ, పదార్థ కణాల సైజు చేరువలోగానీ, దాదాపు సమానంగాగానీ ఉన్నట్లయితే ఆ పదార్థ కణాలు ఆ కాంతి తరంగాల్ని పూర్తిగా ఆపవు. అలాగని పూర్తిగా దూసుకుపోనివ్వవు. మరేం చేస్తాయి? కాంతి తరంగాల్ని అటూ ఇటూ చెల్లాచెదురుగా వెళ్లేలా చేస్తాయి. ఈ ప్రక్రియను విక్షేపణం (scattering) అంటారు.
ఒకవేళ మనం చూడగలిగిన దృశ్యకాంతి తరంగదైర్ఘ్యాల రేంజ్ అయిన 4000-8000 Aశీమధ్యలోనే పదార్థంలోని కణాల సైజు ఉన్నట్లయితే ఆ కణాలు ఈ దృశ్యకాంతిని అన్నివైపులా చెల్లాచెదరుగా వెదజల్లుతాయి. అన్ని దృశ్యకాంతి తరంగాల్ని కలిపి చూస్తే మన మెదడు 'తెలుపు' అని అర్థంగా తీసుకుంటుంది. చాక్‌పీస్, సిగరెట్ పొగ, కట్టెలపొయ్యి పొగ, ఫినాయిల్ కలిపిన నీళ్లు, పాలు, జిల్లేడు పాలు, ముగ్గుపిండి, సున్నం వంటి పదార్థాలలోని కణాల సైజు 8000 నుంచి 4000 A మధ్య ఉండడం వల్ల అవి దృశ్యకాంతిని అన్నివైపులకు విక్షేపణం చెందిస్తాయి. అలా విక్షేపణం చెందిన కాంతిలో దృశ్యకాంతిలోని ఏడురంగులూ కలగలిసి ఉండడం వల్ల మనకవి తెల్లగా కనిపిస్తాయి.
_________________________________________________________
బెలూన్ నుండి ఉపగ్రహం వరకూ..
బెలూన్! మరీ అంతరిక్షంలోకి కాకపోయినా, దాని గుమ్మంవరకూ తీసుకువెళ్లే వీలు బెలూన్ కల్పించింది. స్విట్జర్లాండ్‌లో
జన్మించిన బెల్జియన్ భౌతికశాస్త్రవేత్త, అగస్ట్ పికార్(1884-1962) 1930లో ఒక భారీ బెలూన్‌నుతయారుచేశాడు. దాని సాయంతో అతను కాస్మికకిరణాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఈకిరణాలను భూమి వాతావరణం పొర అడ్డుకుని,అవి భూమిని ాకకుండా చేస్తుంది. కాబట్టిఅటు వంటి కిరణాల గురించి తెలుసుకోవాలంటే వాతావరణ పొరను దాటి పైకి వెళ్లాల్సి ఉంటుంది. పికార్డ్ న్నో ప్రయాసల కోర్చి, తక్కువ పీడనంలో కూడా మానవులు మామూలుగా ఉండగలిగే గనులను రూపొందించాడు. అటువంటి కాబిన్‌లో అతను 55,563 అడుగుల ఎత్తుకు వెళ్లగలిగాడు! ఇది జరిగింది 1932లో. ఆ మరుసటి ఏడాది సోవియట్ యూనియన్‌కు చెందిన బెలూనిస్టులు పికార్డ్ నమూనా సాయంతో 60,700 అడుగుల ఎత్తు ఎగరగలిగారు. అదే ఏడాది
చివర్లో అమెరికన్లు బెలూన్లను ఉపయోగించి 61,221 అడుగుల ఎత్తుకు ఎగిరారు. బెలూన్‌లు మానవులను గాలిలోకి
తీసుకెళ్లగలుగుతున్నాయి గానీ, స్ట్రాటోస్ఫియర్ పొరను దాటి పైకి వెళ్లలేకపోయాయి. ఎందుకంటే, వాటిని పైకి తీసుకెళ్లడానికి భూమి
వాతావరణం సహాయపడాలి. దాంతో అంతరిక్షం అంతు చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. అయితే ప్రపంచయుద్ధ సమయంలో వాడిన వి2 రాకెట్లను మెరుగుపరిచి, వాతావరణ పొరల అవతల వరకూ పంపే ప్రయత్నాలను ముమ్మరం
చేశారు. యుద్ధం తరువాత 'సౌండింగ్ రాకెట్' తయారైంది. భూమి వాతావరణ పొరల అవతల శబ్దాలను తెలుసుకోడానికి ఈ తరహా
రాకెట్లను రూపొందించారు. ఈ రాకెట్లు గంటకు 5000 మైళ్ల వేగంతో దూసుకు పోగలిగేవి. ఇవి దాదాపు 20 మైళ్ల ఎత్తుకు
వెళ్లేటప్పటికి వాటి ఇంధనం అయిపోయేది. అయినా, ఆ చలన వేగంతో అవి ఓ వంద మైళ్ల వరకూ సాగిపోయేవి. ఇక ఆ తరువాత
ఆ రాకెట్ నేలమీద పడిపోయేది. దాంతో ఆ రాకెట్‌తో పాటు పైకి వెళ్లిన పరికరాన్ని ఎలాగోలా సురక్షితంగా నేలమీద పడేలా చేయవలసి వచ్చింది. ఆ దశలో చాలా ఎత్తుకు దూసుకెళ్లగల రాకెట్ తయారుచెయ్య డమే కాకుండా భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్లగలిగే వేగాన్ని అందుకోవడం ముఖ్యమైన లక్ష్యంగా ఉండేది. ఒకవేళ అటువంటి వేగాన్ని సాధించగలిగితే భూమి చుట్టూ తిరిగే
ఉపగ్రహాలని తయారుచేసే వీలు చిక్కుతుంది. అటువంటి వేగాన్ని అందుకోవడానికంటే ముందే వి2 తరహా రాకెట్లలో ఇంధనం
అయిపోయేది. ఆ సమయంలో మళ్లీ గోడార్డ్ ఆలోచన ఉపయోగపడింది. గోడార్డ్ డిజైన్లో అంచెలంచెల రాకెట్ ఉంది. అసలు రాకెట్‌నే ఇంధనం మోసుకెళ్లే పెట్టెలుగా చేస్తే, చివరి (కింది నుంచి మొదటిది) ఇంధనం పెట్టి ఖాళీ అవ్వగానే కింద పడిపోతూ, దాని పైనున్న పెట్టెను అంటిస్తుంది. అలా అంచెలంచెలుగా, ఖాళీ అయిన పెట్టెలు పడిపోతూ, రాకెట్‌ను మరింత తేలికగా చేస్తూ చాలా దూరం వెళ్లవచ్చు! (ఇప్పటికీ ఈ తరహా రాకెట్లే వాడుకలో ఉన్నాయి). 1950 వ దశకంలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే
ఆలోచన ఊపందుకుంది. అందుకు అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ సంసిద్ధతను తెలియజేశాయి. అయితే
అమెరికాకు ఆశ్చర్యం కలిగేలా సోవియట్ యూనియన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి, అలా చేసిన తొలి దేశం అయ్యింది. రష్యన్ భాషలో
'ఉపగ్రహం' అనే అర్థం ఉన్న 'స్పుత్నిక్' పదాన్నే ఉపగ్రహానికి పేరుగా పెట్టింది. అక్టోబరు 4, 1957న స్పుత్నిక్-1 అంతరిక్షంలోకి వెళ్లింది. ఆ 83.25 కిలోల ఉపగ్రహం 201 కి.మీ. ఎత్తున గంటకు 28,980 కి.మీ. వేగంతో తిరిగింది. ఈనాటి ఉపగ్రహాలతో పోల్చితే స్పుత్నిక్-1ని చాలా పురాతనమైన దానికిందే జమకట్టాలి. అంతరిక్షం నుండి అప్పుడప్పుడూ ఒక రేడియో సిగ్నల్ ఇవ్వడం మినహా మరేం చేసేది కాదు. అసలు స్పుత్నిక్ చేయడానిక్కూడా ఏమీ పనిలేదు. కాని అది చేసింది ఒకటుంది. అంతరిక్ష యుగానికి పునాది వేసింది. అంతరిక్ష యుగం జన్మించింది. అంతరిక్ష పోటీలు ప్రారంభమయ్యాయి.
- డాక్టర్ విజరు
________________________________________________
న్యూక్లియర్ గడియారం..!
Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 14 Mar 2012, IST
No comments:
Post a Comment