టీకాలు (వ్యాక్సిన్)..
ఇన్‌ఫెక్షన్ వచ్చిన తర్వాత చికిత్సకు బదులు ముందుగానే టీకాల (వ్యాక్సిన్) ద్వారా అసలు రోగకారక క్రిములు శరీరంలో ప్రవేశించిన తర్వాత పునరుత్పత్తిని నియంత్రించే పద్ధతి మంచిది. అయితే ఈ టీకాలకు పనిచేయని కొత్త సూక్ష్మజీవుల రకాలూ రూపొందొచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి ఏడాది టీకా మందును మార్చి మార్చి ఉత్పత్తి చేయాలి. ఇలా చేస్తున్నారు కూడా (ఉదా: హెపటైటిస్, ఇన్‌ఫ్లూయెంజ, ఫ్లూ టీకాలు ఇటువంటివే).
ఆస్ట్రేలియాలో కోళ్లు, పశువుల దాణాలో యాంటిబయాటిక్‌లకు బదులు శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే సైటోకిన్స్‌లను వినియోగిస్తూ ఎదుగుదలకు దోహదపడే దాణాను తయారుచేస్తున్నారు. దీనివల్ల వాటిల్లోగానీ లేదా వాటి ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకున్న మన శరీరంలోగానీ నిరోధకశక్తి ఆవిర్భావం కాదు.
No comments:
Post a Comment