రాత్రి డ్యూటీలు చేసేవారిలో లయ తప్పిన అనారోగ్యకర ఆహారపు
అలవాట్లూ, నిద్ర సమయాల వల్ల ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పలు
అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీరిలో ప్రత్యేకంగా హృద్రోగ సమస్యలు అధికం
అవుతున్నాయట. రాత్రి డ్యూటీ వల్ల ఆరోగ్య సమస్యలు అనేకం వస్తున్నా చాలామంది
వాటిని పట్టించుకోవడం లేదు. కానీ అటువంటి వేళల మార్పుపై పరిశోధనలు మాత్రం
చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటివారిలో సుమారు 25 శాతం హృద్రోగ
ప్రమాదం అధికంగా వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి.
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
No comments:
Post a Comment