చైనాలోని ఒక గుహలో తవ్వకాలు జరుపుతున్న బృందానికి సుమారు
20వేల సంవత్సరాల క్రితం నాటి కుండ పెంకులు దొరికాయి. అంటే, అవి భూమిపై
దట్టమైన మంచు పెళ్ళలు కప్పబడి వున్న 'మంచు యుగం' నాటివి. అటువంటి శీతల
పరిస్థితులలో ఆహారం లభించడం బహు కష్టమైన పని. కాబట్టి వేడిని 'ఉత్పత్తి'
చేయడానికి ఉడికించడం అవసరమై ఉంటుంది. అయితే, ఆ నాటి మంచు యుగంలో మానవులు
గుహలలో ఏం వండుకున్నారో తెలియరాలేదు. బహుశ వాళ్ళు నత్తలూ, ఆల్చిప్పలూ
వండుకుని వుండవచ్చు. ఎందుకంటే, ఆ గుహలో భారీ సంఖ్యలో నత్తల ఆనవాళ్ళు
కనిపించాయట. విశేషమేమిటంటే, వ్యవసాయం ఆరంభించిన తరువాతే కుమ్మరి పనులు
మొదలయ్యాయి అనుకుంటున్నాము. కానీ, ఇప్పటివరకూ అనేక ప్రదేశాలలో లభించిన
ఆధారాల వల్ల కుండలు చేయడం వ్యవసాయం కంటే కనీసం 10 వేల సంవత్సరాలకు ముందే
ఆరంభమైందని సూచనలు వస్తున్నాయి..
No comments:
Post a Comment