పెరిగే పెట్రోలు ధరలు చూస్తుంటే నీటితోనో, గాలితోనో నడిచే
వాహనం ఉంటే ఎంత బావుంటుంది అని కలలు కనడం సహజమే. కానీ, ఆ కలని నిజం చేశాడట
ఒక పాకిస్తానీ ఇంజినీరు. ఇతను అభివృద్ధి చేసిన టెక్నాలజీతో పెట్రోలుకు
బదులు నీరు వాడి వాహనాన్ని నడిపించవచ్చట. వకార్ అహ్మద్ తాను రూపొం దించిన
టెక్నాలజీతోనే తన కారులో నీరు నింపి, దాన్ని నడిపి మరీ చూపించాడు. ఒక
లీటరు నీటితో కారు నలభై కిలోమీటర్లు, బైక్ నూట యాభై కిలోమీటర్లు దూరం
వెళ్లిందట. ఈ టెక్నాలజీ లో నీటి నుండి విడుదలైన హైడ్రోజన్ వాయువు ఇంధనంగా
పనిచేస్తుందట. ఇలాంటి పరిశోధనలు కొత్తవి కావుకానీ, ఈ ఫలితాల్ని అన్ని కోణాల
నుంచి నిర్ధారినంచుకోవాల్సి వుంది.
No comments:
Post a Comment