పాటలు పాడటం అటు కోయిలకీ, ఇటు మానవులకీ మాత్రమే చేతనయ్యే
పని అని ఇప్పటివరకూ అనుకుంటున్నాం. కానీ, ఏనుగులు కూడా పాటలు పాడగలవని
శాస్త్రజ్ఞులు గమనించారు. పైగా, అవి అచ్చం మనలాగే పాడగలవట. కాకపోతే, వాటి
పాట ఫ్రీక్వెన్సీ మాత్రం చాలా తక్కువగా, మనం వినలేని స్థాయిలో ఉంటుందట.
అటువంటి పాటలను పాడుతూ ఏనుగులు తమ మంద నుండి తప్పిపోకుండా, మగవి తోడు
వెదకడానికి ఉపయోగించుకుంటున్నాయట. మనుషులకి ఆ పాటలు వినిపించకపోయినా, తోటి
ఏనుగులకు మాత్రం అవి సుమారు ఆరు మైళ్ల దూరంలో ఉన్నా వినిపిస్తాయట.
విశేషమేమిటంటే పిల్లుల్లా కాకుండా స్వరపేటిక నుండి గాలి బయటికి వదిలి
(మనుషులు చేసినట్టే) ఏనుగులు శబ్దాన్ని పుట్టిస్తాయి.
No comments:
Post a Comment