Wednesday, 1 August 2012

గుడ్డు ఆకారపు కారు..!


సాన్‌ డియోగోలోని కొందరు ఒక వినూత్న కారుని రూపొందించారు. గుడ్డు ఆకారంలో ఉండే ఈ కారు విద్యుత్‌తో నడుస్తుంది. ఇందులోని విశేషం ఏమిటంటే ఇది ఎంతటి రద్దీలోనైనా సునాయాసంగా దూసుకుపోతుంది. గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే ఈ కారు పేరు 'ఎగ్గాసస్‌'. దీనికి మూడు చక్రాలే ఉంటాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు. వాతావరణ సమస్యల నుండి రక్షిస్తూ ట్రాఫిక్‌ జామ్‌లలో కూడా సులువుగా నడపగలిగే వాహనంగా ఇది ప్రజాదరణ పొందగలదని దీని రూపకర్తలు చెప్తున్నారు. వచ్చే ఏడాది అమెరికాలో దీనిని విడుదల చేసే యోచనలో ఉన్నారు. సుమారు ఐదువేల డాలర్లు (సుమారు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు) ఖరీదు చేసే ఈ ఎగ్గాసస్‌ వాహనంలో ఇద్దరు మాత్రమే కూర్చోగలరు.

No comments:

Post a Comment