- డాక్టర్ కాకర్లమూడి విజయ్
మనదేశంలోనూ,
పాకిస్తాన్‌లోనూ లభించే ఒక మొక్కతో కాన్సర్‌ను అరికట్టవచ్చని పరిశోధకులు
చెబుతున్నారు. 'వర్జిన్ మాంటిల్' అనే మొక్క కాన్సర్ కణాలను ఏకంగా
చంపేస్తుందట! ఈ మొక్క ఆకులతో చేసిన టీని బ్రెస్ట్ కాన్సర్ ఉన్న మహిళలు
సేవించడం గ్రామీణ పాకిస్తాన్‌లో మామూలే. ఆ మొక్కలోని పదార్థాలు కేవలం ఐదు
గంటలలో కాన్సర్ కణాలను నిలువరించడమే కాకుండా 24 గంటలలో వాటిని చంపగలవని
పరిశోధనల్లో గుర్తించారు. విశేషమేమిటంటే, కీమోథెరిపీ (మందుతో చేసే చికిత్స)
లాగా ఇది మామూలు కణాలకు ఎటువంటి హానీ చేయదు. ఆఫ్రికా, యూరప్‌లో కొన్ని
ప్రదేశాలలో కూడా కనిపించే ఈ దివ్య ఔషధమొక్కల శాస్త్రీయ నామం 'ఫాగోనియా
క్రేతికా'.
No comments:
Post a Comment