థియోడోలైట్‌ను దేనికి ఉపయోగిస్తారు?
సమాంతర, నిట్టనిలువు కోణాలను కొలిచే సర్వే సాధనమే థియోడోలైట్. భూమి మీద గల వివిధ స్థలాలు, వాటికి మధ్య సంబంధాలను దీని ద్వారా కొలిచి మ్యాపులు తయారు చేస్తారు. రోడ్లు, భూగర్భ రహదారులు, ఇతర నిర్మాణాలలో ఖచ్చితమైన కోణాల కొలతలకు దీనిని వినియోగిస్తారు. క్షితిజ రేఖపై భూతలంమీంచి రెండు స్థలాలలో చంద్రునికి గల కోణాలను రోదసీ యాత్రికులు దీనితో కొలవగలరు. ఈ కోణాల నుండి భూమినుంచి చంద్రునికి గల దూరాన్ని లెక్కగడతారు. లెనార్డు డిగ్గెస్ అనే ఆంగ్ల గణితశాస్త్రవేత్త 16వ శతాబ్దంలో ఈ పరికరాన్ని రూపొందించాడు. గత నాలుగు దశాబ్దాలలో ఇది అనేక మార్పులు పొందింది. ఖచ్చితమైన కొలతలను ఇచ్చేందుకు ఇది ఒక త్రిపాదిపై అమర్చబడి ఉంటుంది. కదల్చగలిగే థియోడోలైట్‌లో పైన అమర్చబడిన టెలిస్కోపును బయటకు తీయవచ్చు. థియోడోలైట్‌ను కెమెరాతో కలిపితే అది ఫోటో థియోడోలైట్ అవుతుంది. మ్యాపుల తయారీలో అవసరమైన క్షేత్ర ఫోటోగ్రామెట్రీ కి దీనిని వినియోగిస్తారు.
Posted on: Mon 06 Apr 22:23:46.65838 2015

No comments:
Post a Comment