అతి శుద్ధమైనది సహజవాయువే!
విజ్ఞాన వీచిక - డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 2 Jan 2013, IST
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన
వాతావరణానికి దోహదపడే ముఖ్యమైన ఇంధన మూలం సహజవాయువు. సహజవాయువులో
ప్రాథమికంగా 'మీథేన్' వాయువు ఉంటుంది. అది మండినపుడు కార్బన్ డై
ఆక్సైడ్, నీటి ఆవిరి ఉత్పత్తవుతాయి. ఆ రెండు పదార్థాలు కూడా వాతావరణానికి
అతిగా హాని చేయవు. బొగ్గు, ఇతర ఇంధన తైలాలు వాడినపుడు అధిక మోతాదుల్లో
కార్బన్ డై ఆక్సైడ్‌ని, ఇతర కాలుష్య కారకాల్ని విడుదల చేస్తాయి. ఆ కారణంగా
వీటి హరిత గృహ ప్రభావం అధికంగా ఉంటుంది. అనేక ఇంధనాలపై జరిపిన అనేకానేక
పరిశోధనల తరువాత సహజ వాయువే ప్రస్తుతానికి అతి స్వచ్ఛమైన, సురక్షితమైన
ఇంధనంగా తేల్చారు.
Courtesy: Prajasekthi Daily
No comments:
Post a Comment