వాటర్ ఫిల్టర్‌ల 'మాయా'జలం
నిత్య జీవితంలో నీటి వినియోగం ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరు కూడా చాలా తక్కువగా అందుతుంది. ఆ వచ్చే నీరు కూడా కలుషిత నీరు ఎక్కువగా సరఫరా అవుతుంది. వీటి వినియోగం వలన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నీటిని శుద్ధి చేసుకోవడానికి వాటర్‌ఫిల్టర్‌లను ఆశ్రయిస్తున్నాం. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు ఏదైనా ఉంది అంటే అది వాటర్‌ఫిల్టర్ మాత్రమేనని కచ్చితంగా చెప్పవచ్చు. వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధయిన నీటిని వినియోగించడం వలన ఇంట్లో అందరి ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగకుండా ఉండాలని మనం కోరుకుంటాం. కాని ఇప్పుడు మార్కెట్‌లో పలురకాల వాటర్ ఫిల్టర్‌లు లభిస్తున్నాయి. వాటిలో తయారు చేసేందుకు వాడే సాంకేతికతలో మార్పుండవచ్చు, వాడే విధానంలో మార్పుండవచ్చు అలా ఉన్న వాటర్ ఫిల్టర్‌లలో మాములుగా ఉండే వాటర్ ఫిల్టర్స్, అతినీలలోహిత కిరణాలతో పనిచేసేవి, క్లోరిన్ వాటర్ ఫిల్టర్స్, ఆర్.ఓ (రివర్స్ ఆస్‌మోసిస్) లాంటి అనేక రకాల వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. కాని వాటి లక్ష్యం మాత్రం నీటిని శుద్ధి చేయడం. కాని ఈ ప్యూరిఫై చేయడంలోనే ఉంది అసలు కిటుకంతా. ఇలా వాటర్ ఫిల్టర్స్‌ను దీర్ఘకాలంపాటు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా.
ఆర్.ఓ వాటర్ ఫిల్టర్: ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇదే. ఆర్.ఓ (రివర్స్ ఆస్‌మోసిస్) వాటర్ ఫిల్టర్ ద్వారా 4,5 లీటర్ల నీటిని శుద్ధి చేయడం ద్వారా ఇక లీటర్ నీరు ఉత్పత్తి అవుతుంది. అంటే 60 శాతం పైగా నీళ్ళు వృధా అవుతున్నాయన్న మాట. అసలే నీళ్ళు లేక చచ్చిపోతుంటే ఇక వాటర్‌ను వేస్ట్ చేసే శుద్ధి యంత్రాన్ని వాడటం అవసరమా? దీని సాంకేతికత సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మంచినీరుగా మలచడానికి తయారుచేశారు. ఈ ఆర్.ఓ సాంకేతికతను కార్పోరేట్ వ్యవస్థ ఇంట్లో వాడుకునే వాటర్‌ఫిల్టర్‌ల తయారీలో ఉపయోగించింది. దీనివలన ఇంట్లో వాడే నీళ్ళు వృధా అవుతున్నాయి. కాని ఎక్కువ మంది భారతీయులు ఈ నీటి శుద్ధి యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే కనుక నీటిలోని బాక్టీరియా ద్వారా వచ్చే జబ్బులే కారణమని తెలుస్తుంది. అనారోగ్య కారకాలు చుట్టుముట్టకుండా ఉండేందుకే ఈ ఆర్.ఓ వాటర్ ఫిల్టర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాని ఆర్.ఓ యంత్రం వలన నీరు పూర్తిగా శుద్ధి అవుతుందనే దానికి ఎలాంటి ఆధారం లేదు. వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిని చూసి మాత్రమే ప్రజలు ఇలాంటి అపోహాలకు పోతున్నారని చెప్పవచ్చు. దీని వలన నీరు వృధా తప్ప ఎలాంటి లాభం లేదు.
యు.వి కిరణాల ద్వారా నీటిని శుద్ధి చేయడం: అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన నీటిని శుభ్రపరిచే యంత్రం ద్వారా నీటిని శుద్ధిచేయడం వలన అనారోగ్యకారక బాక్టీరియాలను నాశనం చేస్తుంది. కాని యు.వి కిరణాల ద్వారా శుద్ధియైన నీటిని ఎక్కువ సమయం నిల్వ ఉంచితే నాశనమైన బాక్టీరియా తిరిగి పునర్జీవనం పొందుతుంది. ఇక నీరు శుద్ధిచేసి ఏం లాభం. కరెంట్ దండగ తప్ప.
క్లోరిన్ వాటర్ ఫిల్టర్స్: మార్కెట్‌లో ప్రముఖంగా ఉన్న మరొక వాటర్ ఫిల్టర్ క్టోరిన్ ద్వారా నీటిని శుద్ధి చేయడం. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా క్టోరిన్‌ను ఉపయోగించి నీటిలోని సూక్ష్మజీవులను నశింపజేసి, క్లోరిన్ ద్వారా నీటిని శుద్ధి చేయడం. క్టోరిన్‌ను ఉపయోగించి ప్రతిచర్య జరపడం ద్వారా నీటిలో క్లోరిన్ శాతం పెరుగుతుంది. దీనివలన ప్రమాదకర మైన సంకలిత పదార్థం ఏర్పడుతుంది. ఇది మానవ శరీరంపై దుష్ఫప్రభావాన్ని కలిగిస్తుందని ప్రపంచంలోని అనేక మంది శాన్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. క్లోరినేటేడ్ నీటిని దీర్ఘకాలం పాటు వాడటం వలన క్యాన్సర్ బారిన పడటంతో పాటు, అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
సిల్వర్ నానో టెక్నాలజీ వాటర్ ఫిల్టర్: ప్రముఖ బ్రాండ్‌ల ద్వారా ఉత్పత్తి అవుతున్న మరొక ముఖ్యమైనది సిల్వర్ నానో టెక్నాలజీ వాటర్ ఫిల్టర్. తక్కువ ఖర్చుతో ఎలాంటి విద్యుత్ వినియోగం లేకుండా నీటిలోని సూక్ష్మజీవులను చంపడంలో అత్యంత ప్రభావవంతమైన వాటర్ ఫిల్టర్ ఇది. అయినా దీనిని ఎక్కువ కాలం ఉపయోగించడం వలన మానవ జీవితంపై ఎలాంటి దుష్పభావాన్ని చూపదనే గ్యారంటీ లేదు. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్న నానో టెక్నాలజీ కాబట్టి ఇది ఎలా ఉంటుందనే దాని మీద ఇంకా ఎలాంటి పరిశోధనలూ లేవు. కాని సాంప్రదాయకంగా వాడే సిల్వర్ లాగా ఉంటుందనేది కూడా చెప్పడం కష్టం.
బార్క్ శాస్త్రవేత్తలు కూడా ఒక నీటి శుద్ధి యంత్రాన్ని తయారుచేస్తున్నారు. ఇదైనా సమర్ధవంతంగా నీటిని శుద్ధి చేస్తుందని భావిద్దాం. మనం ఎలాంటి వాటర్ ఫిల్టర్‌ను వాడినా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాడటం మాత్రం ఉత్తమం. ఇన్ని రకాల నీటిశుద్ధి యంత్రాలు ఉన్నా వాటిలో ఏది మంచిదో? ఏది చెడ్డదో చెప్పడం కష్టం. వీటిలో ఎన్ని సుగుణాలున్నా, వాటిలో ముఖ్యమైన లోపం కనబడుతోంది. ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యంకాదు కదా!. అందుకే వీటన్నింటికన్నా కాచి, చల్లార్చి, వడబోసుకున్న నీటిని తాగడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. కాదంటారా?!

Courtsey with: PRAJA SEKTHY DAILY
No comments:
Post a Comment