Friday, 17 January 2014

                    కరెంట్‌ ఖర్చు తగ్గాలంటే...
 



        






                               విద్యుత్తును ఆదా చేస్తే, ఆ మేరకు ఉత్పత్తి చేసినట్లే! విద్యుత్తును ఆదా చేసే మన చేతుల్లోనే ఉన్నాయి.
- అవసరమైన సామర్థ్యం ఉన్న ఫ్రిజ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. దీని వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
- ఫ్రిజ్‌ను సూర్యరశ్మికీ, వేడిని వెలువరించే గ్యాస్‌ పొయ్యికీ, ఇతర పరికరాలకూ దూరంగా అమర్చుకోవాలి. కండెన్సర్‌ కాయిల్స్‌ను ప్రతి మూడు నెలలకోసారి శుభ్ర పరచుకోవాలి.
- ఫ్రిజ్‌ తలుపులు తరచూ తెరవకూడదు. ఒక వేళ తెరిచినా, ఎక్కువ సేపు అలా ఉంచకూడదు. వేడి వస్తువుల్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
- ఫ్రిజ్‌లు, ఏ.సి.లు, ఫ్యాన్లు, విద్యుత్‌ బల్బ్‌లను కొనేటప్పుడు తక్కువ విద్యుత్‌తో నడిచే నక్షత్రం గుర్తు కలిగిన వాటిని ఎంచుకోవాలి. దీనివల్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌ విడుదల కాకుండా చూసుకోవచ్చు.
- ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ కన్నాసాధారణ ప్రెషర్‌ కుక్కర్‌ వాడడం మంచిది.
- నక్షత్రం గుర్తు కలిగి ఉన్న డిష్‌ వాషర్‌ ( గిన్నెలను శుభ్రపరిచే మిషన్‌ )ను వాడడం ద్వారా 25 శాతం మేర విద్యుత్తును ఆదాచేయవచ్చు.
- డిష్‌వాషర్‌ను పూర్తి సామర్థ్యం మేరకు వాడుకోవాలి. ఎందుకంటే చాలా విద్యుచ్ఛక్తి నీటిని వేడి చేయటం కోసమే వినియోగమవుతుంది.
- ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌ బదులు సోలార్‌ వాటర్‌ హీటర్‌ను వాడినట్లయితే 25 శాతం మేర గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ వాయువులు విడుదల కాకుండా చేయవచ్చు.
- వాటర్‌ హీటర్‌ను పంపుకు సాధ్యమైనంత దగ్గరగా బిగించుకోవాలి. అలాగే, తక్షణం నీటిని వేడిచేసే హీటర్‌ను వాడి విద్యుచ్ఛక్తిని ఆదా చేయవచ్చు.
- వాటర్‌ హీటర్‌తో నీటిని వేడి చేస్తున్నప్పుడు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌ను తగ్గించి, థెర్మోస్టాట్‌ను సెట్‌ చేయడం వల్ల చాలా విద్యుత్తును పొదుపు చేయవచ్చు.
- ఇస్త్రీపెట్టెలను కొనేటప్పుడు అవసరానికి తగ్గట్లు ఉష్ణోగ్రతను తనంతట తాను నియంత్రించుకునే ఇస్త్రీ పెట్టెలను తీసుకోవాలి.
- పగటి వేళ వెలుతురు కోసం సాధ్యమైనంత మేరకు విద్యుత్తు వాడకాన్ని తగ్గించి, సూర్యకాంతిని వాడుకోవాలి.
- సాధారణ బల్బులకు బదులు సి.ఎఫ్‌.ఎల్‌ బల్బులను వాడడం వల్ల తక్కువ విద్యుత్తు వినియోగం అవుతుంది. 
Courtesy with: PRAJA SEKTHI DAILY 

No comments:

Post a Comment