నక్షత్రాల్లా గ్రహాలు ఎందుకు మెరవవు ?
నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ కనిపిస్తాయి. కానీ గ్రహాలు, చంద్రుడు అలా ఎందుకు? నక్షత్రాలు పగలు ఎందుకు కనిపించవు? 'పగలే వెన్నెల' అనే పాటలో చెప్పినట్లు శుక్లపక్షపు రోజుల్లో పగటి కాంతిలో కొంతలో కొంత వెన్నెల కాంతి కూడా ఉన్నట్టు భావించవచ్చా?
- టి.శ్రీనాథ్, వరంగల్
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. గ్రహాలు, చంద్రుడు మొదలైన వాటికి స్వయం ప్రకాశకత్వం లేదు. అవి కేవలం సూర్య కాంతిని పరావర్తనం (తీవటశ్రీవష్‌ఱశీఅ) చేసే సాధారణ పదార్థాల గోళీయ రూపాలు మాత్రమే! సూర్యుడు మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం. ఇది మన భూమికి సుమారు 15 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. సూర్యునికి, భూమికి మధ్య ఉన్న ఈ సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణం (aర్‌తీశీఅశీఎఱషaశ్రీ బఅఱ్, aబ) అంటారు. గ్రహాల మధ్య ఉన్న దూరాల్ని, గ్రహాలకు, సూర్యునికి మధ్య ఉన్న దూరాల్ని కి.మీ., సెం.మీ.ల్లో కొలవలేము. ఆ సంఖ్యలు తడిసి మోపెడంత ఉంటాయి. అందుకని అనుకూలత కోసం ఖగోళ ప్రమాణాల్లో (aబ) పెద్ద పెద్ద దూరాల్ని సూచిస్తారు. ఆ కొలతల్లో చూస్తే మనకు సౌరమండలం (రశీశ్రీaతీ రyర్‌వఎ) లో అతి దగ్గరగా ఉన్న గ్రహాలు శుక్రగ్రహం (Vవఅబర), అంగారకగ్రహం (వీaతీర). శుక్రగ్రహం మన భూమికి సుమారు 0.3 aబ (సుమారు 5 కోట్ల కి.మీ.) దూరంలో ఉంది. పరిభ్రమణ కక్ష్య (revolutionary orbi) ప్రకారం శుక్రగ్రహం బుధగ్రహం (వీవతీషబతీy) తర్వాత ఉండే రెండోగ్రహం. భూమి మూడో గ్రహం. భూమి తర్వాత ఉన్నదిఅంగారకగ్రహం (దీన్నే కుజగ్రహం అని కూడా అంటారు). ఇది మన భూమికి సుమారు 0.5aబ (సుమారు 7.5 కోట్ల కి.మీ.) దూరంలో ఉంది. మిగిలిన గ్రహాలు శుక్రగ్రహం కన్నా, అంగారకగ్రహం కన్నా చాలాదూరంలో ఉన్నాయి. అవి మనకు పగలుగానీ, రాత్రిగానీ కంటికి కనిపించవు. వాటిని, ఇతర దూరపు ఖగోళ వస్తువుల్ని కేవలం టెలిస్కోపులతో మాత్రమే గుర్తించగలం. రాత్రుళ్లు మనకు బాగా తేజోవంతంగా ఓ నక్షత్రంలాగా మిణుకు మిణుకు మనకుండా కనిపించేది శుక్రగ్రహం. నక్షత్రంలాగే కనిపించినా కొంత అరుణకాంతితో, మిణుకు మిణుకు మనకుండా కనిపించేది అంగారకగ్రహం. సూర్యుని తర్వాత మనకు అతి చేరువులో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారి. ఇది మనకు సుమారు 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాంతి సంవత్సరం అనేది మరింత పెద్దదూరాల్ని కొలిచే ప్రమాణం. కాంతి ఒక సంవత్సరకాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం (శ్రీఱస్త్రష్ట్ర్ yవaతీ) అంటారని మనకు తెలుసు. (3×105×3600×24×365 94608000×105కి.మీ. 9.5 లక్షల కోట్ల కి.మీ.) ఇదే దూరాన్ని ఖగోళ ప్రమాణాల్లో సూచించినా అది చాలా పెద్ద నంబర్ (63 వేల aబ) అవుతుంది. ఆ తర్వాతి నక్షత్రం
సిరియస్ (light year)) మన భూమికి సుమారు 8.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక సూర్యుడు, ఆల్ఫా సెంటారి, సిరియస్ తర్వాత మనకు చేరువలో ఉన్న 4వ నక్షత్రం సుమారు 320 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 3వ నక్షత్రానికీ, 4వ నక్షత్రానికీ ఇంత వ్యత్యాసం ఉంటే మన పాలపుంత గెలాక్సీలో ఉన్న మిగిలిన లక్షల కోట్లాది నక్షత్రాలు మనకు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఊహించడానికి కూడా కష్టమే! ఇలాంటి నక్షత్రాలు తమలో జరిగే కేంద్రక సంలీన (అబషశ్రీవaతీ టబరఱశీఅ) చర్యల వల్ల విపరీతమైన కాంతి శక్తిని అన్ని వైపులకూ పంపిణీ చేస్తాయి. అందులో కొంత మన భూమికి కూడా చేరుతుంది. ఇలా నమ్రస్థాయిలో భూమివైపు వస్తున్న కాంతి భూ వాతావరణంలో మరింత పరిక్షేపణ (రషa్‌్‌వఅఱఅస్త్ర) కు గురయి బాగా పలుచబడుతుంది. అలాంటి తక్కువకాంతి సౌరకాంతి వల్ల కలిగే నీలాకాశపు రంగులో కంటికి ఆనదు. అందువల్లే పగలు నక్షత్రాలు కనిపించవు. గ్రహాలు సౌరకాంతిని చాలామటుకు శోషించుకొని (abరశీతీజ్‌ూఱశీఅ) కొంతలో కొంత మాత్రమే పరావర్తనం (తీవటశ్రీవష్‌ఱశీఅ) చేస్తాయి. కాబట్టి గ్రహాల, చంద్రుడి కాంతి కూడా ఏమంత గణనీయంగా ఉండదు. అందుకే పగలు అవి కూడా కంటికి ఆనేంత కాంతిని ఇవ్వవు. కానీ భూ వాతావరణాన్ని దాటుకుని ఏదైనా రాకెట్‌లో మనం పైకెళ్లి చూస్తే నక్షత్రాలు, గ్రహాలు, నల్లటి ఆకాశంలో కనిపిస్తాయి. పగటిపూట, నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుని కాంతి కనిపించకపోవడానికి కారణం వాతావరణమే! శుక్లపక్షపు రోజుల్లో సూర్యాస్తమయానికి ముందే చంద్రుడు ఆకాశంలో తూర్పున కనిపిస్తాడు. కృష్ణపక్షపు రోజుల్లో సూర్యోదయం అయిన కొన్ని గంటల తర్వాత కూడా చంద్రుడు పశ్చిమదిక్కున కనిపిస్తాడు. ఇలా పగలే కనిపించే చంద్రుని వెన్నెలను కూడా పగటి కాంతిలో చూడాలనుకుంటే అత్యాశే అవుతుంది. ఒక వ్యక్తి స్టీమర్లో వెళ్తూ తాను తాగగా మిగిలిన రెండు చుక్కల నీటిని సముద్రంలో పోసి 'ఇదుగో చూడండి. ఈ సముద్రపు నీటిలో నా నీరు కూడా కొంతలో కొంత ఉంది' అని సంబరపడినట్లే ఉంటుంది.
రాత్రి మాత్రమే కనిపించే నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ కనిపించడానికి, గ్రహాలు అలా మిణుకు మిణుకు మనకపోవడానికి కూడా భూ వాతావరణమే కారణం. నక్షత్రాల కాంతి వాస్తవంగా గ్రహాల కాంతి కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువయినా భూ వాతావరణాన్ని చేరేటప్పటికి నక్షత్రాల కాంతి తీవ్రత, గ్రహాల నుంచి వెలువడే పరావర్తన కాంతి తీవ్రతతో పోలిస్తే చాలా తక్కువ. భూ వాతావరణం ఓ పారదర్శక యానకం (్‌తీaఅరజూaతీవఅ్ ఎవసఱబఎ). అంతవరకు శూన్యం (ఙaషబబఎ) లో ప్రయాణించిన నక్షత్రాల (లేదా గ్రహాల) కాంతి గాలిలోకి వచ్చినప్పుడు కాంతి వక్రీభవనం (తీవటతీaష్‌ఱశీఅ) చెందుతుంది. అంటే కాంతి భూ వాతావరణంలో నేరుగా కాకుండా కాస్త వంకరగా వస్తుంది. కానీ భూ వాతావరణం అన్ని ప్రాంతాల్లో, అన్ని దూరాల్లో ఒకేవిధమైన సాంద్రత (సవఅరఱ్y) తో లేకపోవడం వల్ల నక్షత్రాల కాంతి వంకరగానే కాకుండా వంకర టింకరగా వస్తుంటుంది. కాబట్టి స్థిరంగా ఒకచోట నిల్చుని చూస్తే కాంతి ఒకసారి కంటిమీద పడడం, మరోసారి పడకపోవడమో లేదా తక్కువ పడడమో ఉంటుంది. అందుకే నక్షత్రాలు మిణుకు మిణుకు మంటు కనిపిస్తాయి. కానీ గ్రహాల కాంతి, సౌరకాంతి, చంద్రుని కాంతి కూడా కొంతలో కొంత వంకర టింకరగా వచ్చినా చాలాభాగం సరాసరి వస్తాయి. కాబట్టి ఆ కాంతులు మిణుకు మిణుకు మనవు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Courtesy with: PRAJA SEKTHY DAILY

No comments:
Post a Comment