అమ్మ... అన్ని రోజులూ అమ్మే!
''అమ్మ అంటే అంతులేని సొమ్మురా! అది ఏనాడూ తరగని భాగ్యమ్మురా!!' అన్నాడో
కవి. అమ్మ అనురాగం గురించి పాటలూ కథనాలూ చాలానే ఉన్నాయి. అమ్మ అనే కమ్మని
మాటలో మమతల మూటలకు లెక్కేలేదు. ప్రపంచంలో ఫలితం ఆశించకుండా చూపించే ప్రేమ
ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. ఓ జీవిని భూమిపైకి తెచ్చే క్రమంలో తను మరో
జన్మనెత్తుతుంది. ఆ తర్వాత అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికీ వెనుకాడని హృదయం
అమ్మలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ భూమిపై అనేక జీవరాశుల్ని పరిశీలించినా
మనకు వాటిల్లోనూ తల్లి ప్రేమ మాధుర్యం కనిపిస్తుంది. అంతటి అపరిమితమైనది
అమ్మ ప్రేమ. అలాంటి అమ్మ ప్రేమ లేకపోతే మన మనుగడే ప్రశ్నగా మారేది. ఇంత
అపూర్వమైన ప్రత్యేకత ఉన్న అమ్మ గురించి ఒకరోజు కేటాయించడం వాణిజ్య దృష్టి
అయినా ఈ పండుగ గురించిన కథనాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ కథలోకి వెళితే..
'మదర్స్ డే' అని ఓ ప్రత్యేకరోజు కేటాయించిన చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాలకు పూర్వమే ఈ 'మదర్స్ డే'ను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. ఏదేమైనా ఈ 'మదర్స్ డే' సంస్కృతి మనది కాదు ఇది విదేశాల నుండి దిగుమతి అయిందే.
చరిత్ర చెప్పేది..
ముఖ్యంగా గ్రీకులు దేవతలకే అమ్మగా కొలిచే 'రెహ'ను పూజిస్తూ ఉత్సవాలు చేసేవారు. తొలినాళ్ళలో క్రైస్తవులు కూడా ప్రతి నాల్గవ ఆదివారం జీసస్ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో ఆరోజును సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. క్రమంగా దీన్ని 'మదరింగ్ హాలీడే'గా ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో ఇంగ్లండ్‌కు చెందిన వలసవాదులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తీరుబడిలేని కార్యకలాపాల్లో మునిగిపోయి, ఈ 'మదరింగ్ డే' ఆచారానికి స్వస్తి పలికారు. అయితే 1872లో జులియా వార్డ్ హౌవె శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒకరోజును 'మాతృ దినం'గా పాటించడం ప్రారంభించారు. ఇది నేడు 'మదర్స్ డే'కి మూలమని చెప్పుకోవచ్చు.
కథనం..
అన్నా ఎం జార్విస్ అనే ఫిలడెల్ఫియాలోని ఓ పాఠశాల టీచర్. ఈమె 1890లో తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరాన్ని వదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ఒంటరి పోరాటం ప్రారంభించారు. 1905లో తన తల్లిని ఖననం చేసిన స్మశానవాటికలో తల్లి సమాధి ఎదుటే ''చనిపోయిన లేదా జీవించి ఉన్న మాతృమూర్తుల పట్ల గౌరవంగా ఏడాదిలో ఒక రోజుని 'మదర్స్ డే'గా గుర్తింపు తీసుకు వస్తా'' అని అన్నా ప్రతిజ్ఞ చేశారు. ఆ క్రమంలో ఆమె 1907లో తన తల్లి అన్నే మరియా రీవిస్ జార్విస్ గౌరవార్థం జాతీయ 'తల్లుల దినాన్ని' నిర్వహించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికోసం ఆమె తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. మొదట ఆమె బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాశారు. అనేక విజ్ఞప్తులు చేశారు. దీంతో ఆమె ఉద్యమానికి ప్రముఖ వర్తకులు, ప్రజాప్రతినిధులు మద్దతు లభించింది. చివరకు 'మదర్స్ డే' జరపడానికి ఏడాదిలో ఒక రోజును నిర్ణయించడానికి దారితీసింది. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి, తమ రాష్ట్రంలో 'మదర్ డే' అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ విధంగా చర్చిలో మొట్టమొదట 'మాతృ దినోత్సవం' అన్నా తల్లి గౌరవార్థం జరిగింది. అన్నా కష్టానికి నిజమైన ఫలితం 1914లో లభించింది. దేశాధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని 'అమ్మ దినోత్సవం'గా పేర్కొంటూ జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
అన్నా పట్టుదలతో అమల్లోకి వచ్చిన ఈ 'మదర్స్ డే' ఉత్తర్వులో ఒక విశేషం దాగి ఉంది. మొత్తం కుటుంబ శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రజారంగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మహిళల్ని మాత్రమే గౌరవించుకునే రోజుగా కాకుండా కేవలం అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా 'మదర్స్ డే' జరుపుకోవడమే అందులోని విశిష్టత.
క్రమంగా 'మాతృ దినోత్సవం' అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు 'మాతృ దినోత్సవాన్ని' వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నాయి. కాకపోతే డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలు మాత్రం 'తల్లుల దినాన్ని' మేనెలలో వచ్చే రెండో ఆదివారం నాడు జరుపుకునేవి. 19వ శతాబ్దం వచ్చే సరికి 'మదరింగ్ సండే'ను జరుపుకోవడం దాదాపు నిలిచిపోయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో వాణిజ్య సంస్థలు ఈ రోజును అమ్మకాలకు ప్రాధాన్యతను కలిగిన రోజుగా పరిగణించేవారు. ఇక నేటికాలానికి వస్తే 'మాతృ దినోత్సవం' అమెరికా, బ్రిటన్, మన భారతదేశం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, చైనా, జపాన్, బెల్జియం దేశాల్లో జరుపుకుంటున్నారు. తమ తల్లులపై ఉన్న ప్రేమను ప్రగాఢంగా ప్రకటించే రోజుగా ఈ రోజును జరుపుకోవడం కొనసాగుతోంది.
ఒక్క మాట..
మార్కెట్ శక్తుల మాయాజాలంలో కొట్టుకుపోకుండా అమ్మను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిత్యం ప్రేమించండి! అమ్మ అంటే అంతులేని ప్రేమను ప్రకటించండి! అమ్మతో మాట్లాడేందుకు కాసేపు సమయం కేటాయించండి. ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోండి. అమ్మ లేని లోటు ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు. అందుకే ఈ 'మదర్స్ డే' సందర్భంగా మాతృమూర్తులందరికీ వందనం.

No comments:
Post a Comment