Tuesday, 25 February 2014


అంతర్యానం అంటే ఏమిటి?

                            మన సౌరమండలంలో భూమి, దానిలాగే ఇతర గ్రహాలు తమ తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయన్న సంగతి తెలుసు కదా. అవి ఇలా తిరిగే క్రమంలో కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక గ్రహానికి - సూర్యుడికి మధ్యలో మరో గ్రహం వస్తుంటుంది. దీనినే అంతర్యానం అని అంటారు.
ఉదాహరణకు మన భూమికి సూర్యుడికి మధ్య బుధుడు (మెర్క్యురీ), 
శుక్రుడు (వీనస్‌) అనే రెండు గ్రహాలు ఉన్నాయి కదా. వీటిలో బుధగ్రహం కొన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి - సూర్యుడికి మధ్యలో వస్తుంది. అలాంటి సమయంలో సూర్యగోళంపైన ఒకవైపు నుంచి మరోవైపుకి ఒక చిన్న నల్లటి మచ్చ సాగిపోతున్నట్లుగా కన్పిస్తుంది. సూర్యగ్రహణానికిలాగే దీనిని కూడా మనం చూడవచ్చుగాని, నేరుగా మాత్రం చూడకూడదు. బుధుడి అంతర్యానం ఈ రోజు సంభవించిందని అనుకుంటే సరిగ్గా 13 సంవత్సరాల తరువాత రెండోసారి, ఆ తరువాత 7 సంవత్సరాలకి మూడోసారి, 10 సంవత్సరాలకి నాలుగోసారి, చివరగా 3 సంవత్సరాలకి ఐదోసారి సంభవిస్తుంది. అంటే బుధుడి అంతర్యానం 13-7-10-3 సంవత్సరాలకి ఒకసారి పునరావృతమవుతూ వస్తుంది. బుధుడి అంతర్యానం సాధారణంగా మే 2-8 తేదీల మధ్యన, లేదా నవంబర్‌ 5-15 మధ్యన చోటు చేసుకుంటుంది.
ఇటీవలి సంవత్సరాలలో 1999లోను, ఆ తరువాత 2006లోను బుధుడి అంతర్యానం జరిగింది. అంటే మళ్ళీ 2016లో గాని అది సంభవించదన్న మాట! అన్నట్లు బుధుడి అంతర్యానాన్ని మనం చూడగలిగినప్పటికీ బుధుడి పైనుంచి మాత్రం ఏ గ్రహపు అంతర్యానం కన్పించదు. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!
  
భూతాపం ఎవరి పాపం?



 మనం సమాజాభివృద్ధికి భూమిపై ఉన్న కొండల్ని, అడవుల్ని, ఇసుకని వాడి ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మిస్తున్నాం. అలాగే భూమి లోపల వనరులుగా ఉన్న బొగ్గు, చమురు, గ్యాస్‌ను కరెంటు యంత్రాలను, వంట మొదలైన వాటికి ఉపయోగిస్తు న్నాం. పైన తెల్పిన వాటి అన్నింటివలన ఇప్పటికే భూమి ఉష్ణోగ్రత, కాలుష్యం పెరిగి, పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. మనుషులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాగే మరో 200 సంవత్సరాలు సాగితే భూమి పైనా, లోపలా ఉన్న వనరులన్నీ అయిపోతాయని భావించాల్సి వస్తుంది. అదే జరిగితే అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? ఎలా బతుకుతాం?
- మెట్టు కోటిరెడ్డి, గుంటూరుజిల్లా
అభివృద్ధి అనే మాటకు ఈ మధ్య అర్థాలు మారిపోతున్నాయి. సాధారణ పరిభాషలో 'అభివృద్ధి' అంటే అభ్యుదయం వైపు వెళ్తు న్న సామాజిక గతిని సూచించే పదంగా భావిస్తాము. కానీ ూూ+ (ూఱbవతీaశ్రీఱఝ్‌ఱశీఅ, ూతీఱఙa్‌ఱఝ్‌ఱశీఅ aఅస +శ్రీశీbaశ్రీఱఝ్‌ఱశీఅ) ఆర్థిక విదానాలు ప్రపంచాన్నంతా శాసిస్తున్న తరుణంలో రాజకీయ వ్యవస్థలు, వాటితో పెనవేసుకున్న సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలకు చెందినవారు 'అభివృద్ధి' అనే పదాన్ని ఎవరికి తోచినట్టు వారు వాడుకుంటున్నారు లేదా వక్రీకరిస్తున్నారు. సాపేక్షతా సిద్ధాంతా (ుష్ట్రవశీతీy శీట =వశ్రీa్‌ఱఙఱ్‌y) న్ని గుర్తుకు తెచ్చేవిధంగా నేడు 'అభివృద్ధి'కి భాష్యం అల్లుతున్నారు. కొందరి అభివృద్ధినే చూపిస్తూ, ఎందరో అణగారిపోతున్న ఆ దురవస్థను కనుమరుగు చేస్తూ మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతోంది చూడమంటున్నారు. 
ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకూ మరేచోటా భూమిలాంటి గ్రహం లేదు. ఇన్ని లక్షల జీవజాతులకు, ఇంతటి సుందర నదీనదాలకు, సోయగాలకు మరెక్కడా ఆనవాళ్లు లేవు. ప్రకృతిని శాసించే స్థాయి కేవలం మానవజాతికి తప్ప మరో ఏ ఇతర జీవికీ లేదు. మనం ఏ వూరికెళ్లినా మన గుండె పంపు చేసే రక్తంతోనే బతుకుతాము. మనం ఏ సంస్థలోకి వెళ్లినా మన మెదడునే వాడుకుని నడుచుకొంటాము. ఈ వూర్లో ఓ గుండె, మరో వూర్లో మరో గుండె మనకు ఉండదు. ఆ సినిమా హాల్లో ఈ మెదడు, ఇంకో మైదానంలో రెండో మెదడు వాడము. అలాగే మనం ఎక్కడికి వెళ్లినా, ఎన్ని రోజులైనా ఈ భూమ్మీద ఉండే ఆక్సిజన్‌ను, ఈ భూమి ఇచ్చిన నీటిని, ఈ నేలలో పండిన గింజల్ని తిని, బతుకుతాము. మనము ఈ రోజు భూమిలో దొరికిన బఠాణీలు, మరో రోజు చంద్రుడి నుండి దిగుమతి అయిన బత్తాయి పళ్లు తినము. కాబట్టి ప్రకృతిలో ఉన్న వనరులే మన ఉనికికి కారకాలు. వాటిని వాడుకోకుండా మనం ఏమాత్రం జీవించలేము. అయితే అదే ప్రకృతిలో కొన్ని చక్రీయ వ్యవస్థల ద్వారా మనం, ఇతర జీవజాతులు వనరుల్ని వాడుకున్నా అవి పునరుత్పత్తి అయ్యే అనుకూలత ఉంది. ఉదాహరణకు మనము, చెట్లు, పురుగులు, జీవులు జీవించే క్రమంలో ఆహారాన్ని, గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి రసాయనిక శక్తి ద్వారా బతుకుతున్నాయి. ఆ క్రమంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ విపరీతంగా విడుదలవుతుంది. ఆరు అణువుల ఆక్సిజన్‌ను స్వీకరిస్తే, ఆరు అణువుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేసేలాగా చాలా జీవ పక్రియలు ఉంటున్నాయి. కానీ ఆక్సిజన్‌లో ఉన్న బంధాలకన్నా కార్బన్‌ డై ఆక్సైడ్‌లో ఉన్న బంధాల సంఖ్య ఎక్కువ. బంధాల సంఖ్య తక్కువ ఉన్న అణువుల కన్నా రసాయన బంధాలు ఎక్కువ ఉన్న అణువులే గాలిలో వేడిని పెంచుతాయనేది ఉష్ణగతిక శాస్త్ర నియమం (ూతీఱఅషఱజూశ్రీవ శీట ుష్ట్రవతీఎశీసyఅaఎఱషర). ఉదాహరణకు మానవులకు, లక్షలాది ఇతర వృక్ష జంతు జాతులకు ప్రాణాన్ని ఇచ్చే శ్వాసక్రియలో ఘన (లేదా రక్తంలోను, కణద్రవంలోను కరిగి ద్రవ) స్థితిలో ఉన్న గ్లూకోజు అణువు (జ6న12ఉ6) లో 23 లింకులు ఉన్నాయి. బంధం ద్విబంధం అయినా ఒకే లింకుగా భావించాలి. కానీ ఆరు లింకులే ఉన్న ఆక్సిజన్‌ (ఉ2) తో కలిసి ఆరు నీటి (న2ఉ) అణువుల్ని, ఆరు కార్బన్‌ డై ఆక్సైడ్‌ (జఉ2) అణువుల్ని ఏర్పరుస్తుంది. మొత్తం క్రియాజనకాల్లో వెరసి 29 లింకులున్నాయి. క్రియాజన్యాల్లో మొత్తం 24 లింకులే ఉన్నాయి. కాబట్టి క్రియాజనకాలలోనే ఎక్కువశక్తి దాగి ఉందన్న మాట. కానీ గ్లూకోజు వాయుస్థితిలో లేదు. కేవలం ఆక్సిజన్‌ మాత్రమే వాయుస్థితిలో ఉంది. గాలిలో వేడిని కలిగించే లక్షణం గాలి రూపంలో ఉన్న అణువులకే సాధ్యం. అంటే బంధాల లింకులు దండిగానే ఉన్నా గ్లూకోజు వల్ల గాలికి కలిగే నష్టం లేదు. కానీ క్రియాజన్యాల్లో 24 లింకులూ గాలి రూపంలోనే ఉంటాయి. (ఏర్పడిన నీటి అణువులు కొన్ని నీటి ఆవిరి రూపంలో గాలిలో ఉంటాయి). సేంద్రీయ పదార్థాలైన గ్లూకోజు, పెట్రోలు, బొగ్గు వంటివి మండితే వాతావరణం వేడెక్కుతుంది. దీనినే మనం భౌగోళిక తాపా (+శ్రీశీbaశ్రీ షaతీఎఱఅస్త్ర) నికి దారితీసే చర్యగా భావిస్తున్నాము. అయితే ప్రకృతిలో అదే జఉ2, న2ఉ లను కిరణజన్య సంయోగక్రియ (ూష్ట్రశ్‌ీశీ రyఅ్‌ష్ట్రవరఱర) ద్వారా తిరిగి చక్రీయంగా గ్లూకోజుగా మారే యంత్రాంగం ఉంది. కాబట్టి ప్రకృతిని ప్రకృతి సిద్ధంగా ఉంచినట్లయితే జీవులకు కావలసిన గ్లూకోజును తయారుచేసి వడ్డించడమే కాకుండా, ఆ జీవనచర్యల్లో ఏర్పడే తాప వాయువులు (స్త్రతీవవఅష్ట్రశీబరవ స్త్రaరవర) మితిమీరకుండా సర్దుబాటూ చేస్తుంది. కానీ తాప వాయువుల విడుదలకన్నా వాటి చక్రీయ వినిమయం తగ్గినట్లయితే భౌగోళిక తాపం పెరుగుతుంది. ఇదే మీరన్న అడవుల నరికివేత, పంటపొలాల తగ్గింపు, విపరీతమైన పెట్రోలు, బొగ్గుల వినియోగం, పట్టణీకరణ, వినిమయతత్వం (షశీఅరబఎaతీఱరఎ) వంటి అవాంఛనీయ కార్యకలాపాలు ప్రకృతిలో సమతుల్యం లోపించేలా చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన బాధ్యులు ఎవరు? 
వర్గ దృక్పథంలేని అజ్ఞానంతోను, వర్గ సామరస్యాన్ని ప్రోత్సహించే స్వార్థాలోచనలతోను, సంపన్నుల, బహుళజాతి సంస్థల, సామ్రాజ్యవాద శక్తుల తప్పుల్ని కప్పిపుచ్చే కపట బుద్ధితోను కొందరు పర్యావరణ వాదులు 'మానవుడు స్వార్థజీవి, మానవుడి స్వార్థానికి ప్రకృతి వనరులు సన్నగిల్లుతున్నాయి. మానవుడు తాను కూచున్న కొమ్మను తానే నరుకుతున్నాడు. మానవుడు ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయడం మాననంతవరకు మన మానవజాతికి మనుగడలేదు!' అనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ మొసలి కన్నీరు కారుస్తుంటారు. 'మానవుడు' అంటూ తప్పంతా అందరిదీ అయినట్లు సమస్యను పక్కదారి పట్టించి, పరిష్కారం లేని సమస్యగా చూపుతారు. ప్రపంచంలో ఉన్న సకల వనరుల్లో 90 శాతం పైచిలుకు కేవలం 10 శాతం కన్నా తక్కువ ఉన్న సంపన్నుల చేతిలో ఉన్నాయి. వారి అభివృద్ధికే అవి ఖర్చవుతున్నాయి. మిగిలిన 10 శాతం వనరులే 90 శాతం మంది ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరి వీరెలా ప్రకృతి వినాశనానికి, వనరుల దుబారాకు కారణమవుతారు? మీరన్న సమస్యకు పరిష్కారం కేవలం ప్రజా పోరాటాల ద్వారానే వీలవుతుంది. 'ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు' అంటూ నినదించే జనవిజ్ఞాన వేదిక వంటి అభ్యుదయ సంస్థల కార్యకలాపాలు పెరిగి, ప్రజా సైన్సు ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా నడిస్తేనే సమతౌల్యాభివృద్ధి జరిగి, భవిష్యత్తుకు ఏమాత్రం ఢోకా లేకుండా మానవజాతి భాసిల్లగలదు. ఒక అంచనా ప్రకారం, ''సమసమాజ ఆర్థిక ప్రపంచ ప్రజలందరూ పొందగలరట. పైగా ప్రకృతివనరులు ఇపుడున్న దుబారా కన్నా 200 రెట్లు తక్కువ వినియోగంలోనే అది సాధ్యం కాగలదట. కాబట్టి పరిస్కారం లేని సమస్యగా మీ ప్రశ్నను చూడకూడదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

Wednesday, 12 February 2014


ఈ క్యాలెండర్‌ తేడాగా ఉందే!

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           అక్టోబరు 1582 క్యాలెందర్‌
   ఈ క్యాలండర్‌ చూశారా? 1582 సంవత్సరం నాటి ఈ క్యాలండర్‌లో అక్టోబర్‌ నెలలో ఉండాల్సిన రోజుల కంటే పదిరోజులు తక్కువ ఉన్నాయి. అలా ఎందుకున్నాయో చూద్దాం. అంతకు ముందు జూలియస్‌ క్యాలండర్‌ (రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ పేరున) వాడుకలో ఉండేది. జూలియస్‌ క్యాలండర్‌ను సరిదిద్దారు ఇది ఒక సౌరమాన క్యాలండర్‌. సౌరమానానికి చెందిన క్యాలండర్‌ సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్యలో భూమి తాలూకు స్థానాల్ని సూచిస్తుంది. తన కక్ష్యలో భూమి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు వివిధ ఋతువులు వస్తాయి. క్యాలండర్‌ సరిగా లేకపోతే ఋతువుల రాకకు, క్యాలండర్‌కు పొంతన కుదరదు. క్యాలండర్‌ నెల శీతాకాలాన్ని సూచిస్తే వాస్తవంగా వాతావరణం ఉంటుంది. దాంతో క్యాలండర్‌ ఉపయోగం ఉండదు. జూలియస్‌ క్యాలండర్‌ ప్రకారం ఏడాదికి 365 రోజుల ఐదు గంటల 48 నిమిషాల 46 సెకన్లు (సుమారు 365.2422 రోజులు). అయితే భూమి అప్పటికే తన తదుపరి పరిక్రమలో (365.25-365.2422) కొన్ని రోజులు ముందంజలో ఉంటుంది. మొదట్లో ఈ తేడా అంతగా తెలియదు. కానీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ తేడా పెరుగుతూ పోతుంది. పదహారో శతాబ్దంలో ఆ తేడాను గుర్తించినప్పుడు భూమి పరిక్రమకి క్యాలండర్‌ 10 రోజులు వెనకబడింది. ఆ తప్పును సరి చేయటానికి 1582లో అక్టోబర్‌ నెల నుంచి 10 రోజులు తీసేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఈ క్యాలండర్‌ తయారైంది. వేరే చర్యలు కూడా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. శతాబ్దపు ఏడాదిని 4తో కాకుండా 400తో భాగించి లీప్‌ ఇయర్‌ను గుర్తించాలని నిర్ణయించటం జరిగింది. ఆ విధంగా 2000 సంవత్సరం లీప్‌ ఇయర్‌ అయింది కానీ 1900 సంవత్సరం లీప్‌ ఇయర్‌ కాలేదు. 2100 సంవత్సరం కూడా లీప్‌ ఇయర్‌ అవదు. ఇదివరకు 400 ఏళ్ళ కాలంలో 100 లీప్‌ ఇయర్లు ఉండేవి. సవరించబడిన క్యాలండర్‌లో అవి 97కి తగ్గాయి. దానివల్ల సగటు ఏడాది నిడివి 365.25 రోజుల నుండి 365.2425 రోజులకు తగ్గింది. సవరించిన క్యాలండర్‌ను పోప్‌ గ్రెగరి శ××× జ్ఞాపకార్థం గ్రెగేరియన్‌ క్యాలండర్‌ అని పిలిచారు. దాన్నే మనం ఈ రోజు వాడుతున్నాం. ఈ క్యాలండర్‌లో ఏడాది సగటు నిడివి అసలైన నిడివి కంటే ఒక ఏడాదిలో 0.0003 రోజులు ఎక్కువ. ఆ కారణంగా ప్రతి 10,000 ఏళ్ళకు క్యాలండర్‌ని సరిచేస్తూ ఉండాలి.
జూలియస్‌ క్యాలండర్‌ను సరిచేసి, గ్రెగేరియన్‌ క్యాలండర్‌ను తయారుచేయడంలో కీలకమైన తోడ్పాటు అందించిన వ్యక్తి అలోసియస్‌ లిలియస్‌ (1510-1576) అనే ఒక ఇటాలియన్‌ డాక్టర్‌. చంద్రుడిపై ఉన్న ఒక గుంతకు ఆయన పేరు పెట్టారు.
   ప్రపంచ చరిత్రలో 1917 అక్టోబరు ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. ఆ నెలలోనే రష్యాలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని బోల్షెవిక్కులు కూలదోశారు. ఆ తిరుగుబాటు అక్టోబరు 25న పెట్రోగాడ్‌లో జరిగింది. క్యాలండర్‌లో సవరణ కారణంగా ఆ తారీఖును నవంబరు 7కి మార్చారు. అందుకే ఆ సంఘటనను అక్టోబరు విప్లవం. నవంబరు విప్లవం అని రెండు రకాలుగానూ పిలుస్తారు.
రష్యాలో 1918లో 13 రోజులు తీసేసి గ్రెగేరియన్‌ క్యాలండర్‌ను అమలుపర్చారు. శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడి 1582లో జరిగిన ఈ సవరణ రష్యాలో ఇంత ఆలస్యంగా అమలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రష్యా పూర్వ పాలకులు చాలా మితవాదులు. అందుకే వారు సాంప్రదాయక కాలగణన పద్ధతిని మార్చటానికి ఇష్టపడలేదు. సోషలిస్టు పాలకులు కొత్త క్యాలండర్ని శాస్త్రీయ దృక్పథంతో స్వీకరించారు. దీనికి విరుద్ధంగా ఇంగ్లండ్‌లో ప్రొటెస్టెంట్లు తమను సంస్కరణవాదులని చెప్పుకున్నా రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పోప్‌ వద్ద నుండి వచ్చిన ఉత్తర్వు కారణంగా క్యాలండర్లో మార్పుకి ఒప్పుకోలేదు. సెప్టెంబర్‌ 2, 1752 తర్వాత, 14 సెప్టెంబరు 1752 వస్తుంది. ఇతర దేశాల్లో కూడా ఈ క్యాలండర్‌ మార్పు అక్కడి పాలకుల దృక్పథం మీదే ఆధారపడి ఉంది. ఫ్రాన్సు కొత్త క్యాలండర్ని 10 రోజులు వదిలేసి డిసెంబరు, 1582లోనే స్వీకరించింది. కానీ గ్రీస్‌ 13 రోజులు తీసేసి 1923లో స్వీకరించింది.
మనం కూడా మినహాయింపు కాదు. 1957లో డాక్టర్‌ మేఘనాథ్‌ సాహా నాయకత్వంలో క్యాలండర్‌ సంస్కరణ కమిటీ భారత జాతీయ క్యాలండర్‌ పేరుతో ఒక క్యాలండర్ని ప్రతిపాదించింది. అందులో మొదటి నెల మార్చి 22 నుంచి మొదలవుతుంది. లీప్‌ ఇయర్లలో ఆ నెలలో ఒకరోజు అదనంగా ఉండి, మార్చి 21న మొదలవుతుంది. తర్వాత వచ్చే ఐదునెలలు (వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం) 31 రోజులతో ఉంటాయి. ఆ తర్వాత ఆరునెలలు (ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం) 30 రోజులతో ఉంటాయి.
   ఇలాంటి బెంగాలీ క్యాలండర్‌నే 1965లో అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో అమలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోనూ అదే కొనసాగుతోంది. మనదేశంలో అధికారికమైన క్యాలండర్‌ను చాలా సందర్భాలలో ప్రభుత్వ విధానాలు పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మతపరమైన పండుగలకు సంబంధించి అశాస్త్రీయమైన క్యాలండర్‌ను అనుసరించే ఛాందసవాదులను తృప్తిపరచాలన్నదే ఇందుకు కారణం. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే మనం ముందడుగు వేయాలి.
- డా. మాధవ్‌ చటోపాధ్యాయ 

Courtesy With:PRAJA  SEKTHI DAILY
నానో సాంకేతికాలు
 



                                                                                                                                                                     అత్యంత ఆధునిక సాంకేతికాలలో నానో సాంకేతికాలు ముఖ్యమైనవి. రక్షణ, వైద్యం, ఎలక్ట్రానిక్స్‌, వ్యవసాయం, పెయింట్లు, కాస్మెటిక్స్‌ తదితర రంగాలలో ఈ సాంకేతిక విజ్ఞాన వినియోగం వేగంగా విస్తరిస్తోంది.ఇంతవరకు దాదాపు 800 రకాల నానో ఉత్పత్తులు మార్కెట్లో అమ్మబడుతున్నాయి. ప్రతి రెండు మూడు వారాలకు ఏదో ఒక కొత్త ఉత్పత్తి మార్కెట్లోకి వస్తోంది.
''నానో'' అంటే గ్రీకు భాషలో పొట్టి అని అర్థం. దీనికనుగుణంగానే ఒక మీటర్లో వంద కోట్ల వంతు లేక ఒక సెంటీ మీటర్లో ఒక కోటి వంతు పొడవును ''నానో మీటరు''గా వ్యవహరిస్తున్నారు. ఈ పరిమాణం అణువు, పరమాణువు స్థాయిలో ఉంటుంది. వీటి పొందికను మార్చినప్పుడు ఆయా పదార్థాల గుణగణాలు అవి కలిగిన మామూలు పదార్థాల కన్నా బాగా మారిపోతాయి. ఉదాహరణకు నానో పదార్థం బాధృఢంగా ఉంటుంది.
నానో సాంకేతికంలో అణువు, పరమాణువుల పొందికను మారుస్తూ పెద్ద పరిమాణం గల వస్తువులను తయారు చేస్తారు. వీటికోసం రూపొందించిన సాంకేతికాలే నానో సాంకేతికాలు. ఈ సాంకేతికాలు కేవలం పదార్థ పరిమాణానికి పరిమితమైనప్పుడు నానో సాంకేతికాలుగా వ్యవహరిస్తున్నారు. పదార్థ పరిమాణంతో సంబంధం లేకుండా నానో పదార్థాల గుణగణాలను ఆపాదించే సాంకేతికాలను నానో స్థాయి సాంకేతికాలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సాంకేతిక విజ్ఞానం ఇతర సాంకేతిక విజ్ఞానాలతో సంబంధాలను కలిగి ఉన్నాయి. ఆయా రంగాలలో ఈ విజ్ఞానం వినియోగించబడుతుంది. స్థూలంగా :ఇవి, ఉపరితల విజ్ఞానం (సర్ఫేస్‌ సైన్స్‌), సేంద్రీయ రసాయన విజ్ఞానం, మాలిక్యులర్‌ స్థాయి జీవశాస్త్ర విజ్ఞానం, సెమీ కండక్టర్‌ భౌతిక విజ్ఞానం, సూక్ష్మ స్థాయి నిర్మాణ రూపకల్పన, తదితర రంగాలలో ఈ విజ్ఞానం వినియోగించబడుతుంది.
నానో సాంకేతిక ఆవిష్కరణ
నానో అన్న పదాన్ని మొదట 1986లో ఎరిక్‌ డ్రక్స్‌లర్‌ అనే శాస్త్రజ్ఞుడు వినియోగించాడు. వాడుకలో ఒకటి నుండి వంద నానో మీటర్ల పరిమాణం గల పదార్థ భాగాలు నానో సాంకేతిక పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు, కార్బన్‌ నానో ట్యూబులు లేక నానో కార్బన్‌ దారాలు మామూలు కార్బన్‌ పదార్థాల కన్నా ధృఢంగా, తేలికగా ఉంటాయి. వీటి పరిమాణం కూడా చాలా తక్కువ. ఇవి అధిక వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి. అందువల్ల , నానో పదార్థాల వినియోగం ద్వారా ఆధునిక ఉత్పత్తుల పరిమాణం, బరువు తగ్గడమే కాక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు, నానో ట్యూబ్‌లను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను చంపగల మందును సూటిగా క్యాన్సర్‌ కణాలకే అందేలా వినియోగించవచ్చు. తద్వారా క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించాల్సిన మందు పరిమాణాన్ని బాగా తగ్గించవచ్చు. ఇది రోగిపై మందు చూపే దుష్ప్రభావాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. సేద్యంలో నానో పోషకాలను అతి తక్కువ పరిమాణంలో వినియో గించి అత్యంత సామర్థ్యంతో పంట లని పండించవచ్చు. సస్యరక్షణ మందుల వాడుకలో కూడా ఈ సాంకేతికాన్ని వినియోగించి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిం చవచ్చు.
స్కానింగ్‌, టన్నలింగ్‌ మైక్రోస్కోప్‌
ఇది 1981లో ఆవిష్కరిం చబడింది. ఇది నానో సాంకేతిక విజ్ఞానం ఆవిష్క రణకు, వేగంగా అభివృద్ధి పడటానికి తోడ్పడింది.ఈ మైక్రో స్కోప్‌తో పదార్థాలలో గల అణువు, పరమాణువులను, వాటి మధ్య ఆకర్షణలను (బాండింగ్‌) గుర్తించే వీలు కల్పించింది. ఈ మైక్రోస్కోప్‌తో పదార్థాలలో గల అణువు, పరమాణువుల పొందికను అవసరానికి అనుగుణంగా మార్పు చేయ వీలు కలిగింది. ఉదాహరణకు, కార్బన్‌- కార్బన్‌ బాండింగ్‌ దూరం 0.12 నుండి 0.15 నానో మీటర్లుగా అంచనా వేశారు. కార్బన్‌ ట్యూబ్‌లు, దారాలను రూపొందించడానికి ఇది తోడ్పడింది.
నానో సాంకేతిక రకాలు
పెద్ద పరిమాణం గల వస్తువులను తయారు చేయడానికి స్థూలంగా అణువు పరమాణువుల నుండి పెద్ద వస్తువులను లేక పెద్ద పదార్థాల నుండి చిన్న పరిమాణం గల నానో ఉత్పత్తులను చేసే రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
నానో సాంకేతికాల మరికొన్ని ప్రయోజనాలు
నానో పదార్థమైన టైటేనియం డయాక్సైడ్‌ సన్‌స్క్రీన్‌లలో (సూర్యరశ్మి లోని అతినీలలోహిత కిరణాలను గ్రహించడానికి), కాస్మెటిక్‌లలో ఉపరితలాన్ని కప్పేసేందుకు, కొన్ని ఆహార ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. కొన్ని కార్బన్‌ రూపాలను ప్రత్యేక టేబుల్‌ తయారీకి, ఆహార ప్యాకేజింగ్‌లకు, బట్టలలో, క్రిమి సంహరణకు, గృహ ఉపకరణాలకు వాడుతున్నారు. అలాగే జింక్‌ ఆక్సైడ్‌ను సన్‌స్క్రీన్‌లకు, కాస్మెటిక్‌లు, ఉపరితల పూతకు, పెయింట్లు, బయట ఉండే ఫర్నీచర్‌కు పెయింట్‌ వేసేటప్పుడు వినియోగిస్తున్నారు. నానో టెక్నాలజీ ద్వారా టెన్నిస్‌ బంతులు దీర్ఘకాలం ఉండటానికి, గోల్ఫ్‌ బంతులు సూటిగా ఎగరడానికి, క్రికెట్‌ బంతులు ఎక్కువగా మన్నేలా గట్టిగా ఉండటానికి వీటిని వాడుతున్నారు. మనం వేసే ప్యాంట్లు, సాక్స్‌లు దీర్ఘకాలం ఉంటూ వేసవి కాలంలో కూడా చల్లగా ఉండటానికి వీటి ఉత్పత్తులు పనికి వస్తున్నాయి. ఆపరేషన్‌ సమయంలో చేసే గాయాలను (కోతలు) వేగంగా మానడానికి వినియోగించే బ్యాండేజీలకు వెండి నానో పదార్థాలను వాడుతున్నారు. కార్ల తయారీలో కొన్ని విడిభాగాలనే వాడుతూ ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఇదే విధంగా నానో టెక్నాలజీతో వ్యక్తిగత కంప్యూటర్లు, వేగంగా పనిచేస్తూ అధిక మెమొరీ కలిగి ఉండి, చవకగా తయారుచేయడానికి నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
వైద్య రంగంలో చికిత్స ఖర్చును తగ్గించడానికి, వేగంగా నయం కావడానికి ఈ సాంకేతికాలు ఉపయోగపడుతున్నాయి. కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు నానో టెక్నాలజీగా చెలామణి అవుతున్న సాంకేతికాలు వాస్తవంగా పదార్థాల వినియోగ సాంకేతికాలుగా పని చేస్తున్నాయి. కేవలం నానో ట్యూబ్‌లు, నానో తీగలు తదితరాలను తయారు చేయడానికి కొన్ని ప్రత్యేక పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. తద్వారా ఇతర పరిశ్రమల ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది.
పరిణామాలు
ఆరోగ్యం, పర్యావరణంపై నానో పదార్థాల పరిశ్రమ చూపగల ప్రభావాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వెండి నానో పదార్థాలు బ్యాక్టీరియాను చంపగలిగే శక్తి కలిగి ఉన్నాయి. వీటి తయారీలో పారిశ్రామిక కాలుష్య వ్యర్థ పదార్థాలలో వెండి కలిగి ఉండటంతో పర్యావరణంలో గల బ్యాక్టీరియాలను చంపుతాయని గమనించబడింది. ఇలా పరిసరాలు, సేద్య భూములు కలుషితమవుతున్నాయి. ఇలాగే, నానో దారాల తయారీలో వెలువడే పదార్థాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్ళి అనారోగ్యాన్ని కలిగిస్తుంటాయి. అందువల్ల అందువల్ల నానో సాంకేతికాల వినియోగం, తయారీ పరిశ్రమలపై నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.

Courtesy with: PRAJASEKTHI DAILY


కాంతి వేగాన్ని తొలిసారిగా ఎలా కనుగొన్నారు?


                     కాంతి అనేది కొన్ని శతాబ్ధాల పాటు మనుషులకు ఓ గొప్ప ముఖ్య రహస్యంగా వుండిపోయింది. దాని వేగం అపరిమితంగా వుంటుందని, దానిని ఎవరూ కొలవలేరని చాలా మంది భావిస్తూ వచ్చారు. కాని, క్రీ.శ. 1878లో మిచల్‌సన్‌ అనే ఒక భౌతిక శాస్త్ర బోధకుడు చేసిన ఓ చక్కటి ప్రయోగంతో ఈ అభిప్రాయానికి అడ్డు కట్ట పడింది. రెండు దర్పణాలను, మరో చిన్న పరికరాన్ని ఉపయోగిస్తూ ఆ శాస్త్రజ్ఞుడు చాలా తెలివిగా కాంతి వేగాన్ని కనుగొనేందుకు ప్రయత్నించాడు.
ఈ ప్రయోగంలో భాగంగా మిచెల్‌సన్‌ ఒక దాని కొకటి ఎదురుగా వుండేలా, ఒక దానిపై పడిన కాంతి పరావర్తనం చెంది రెండో దానిపై పడేలా, ఒక దానికొకటి 1986.23 అడుగుల దూరంలో వుండేలా రెండు దర్పణాలను (అద్దాలను) అమర్చాడు. అనంతరం ఓ చిన్న పరికరం సాయంతో వాటిలోని ఒక అద్దం సెకనుకు 256 సార్లు తన చుట్టూ తాను తిరిగేలా చేశాడు. తరువాత ఓ కటకం సాయంతో, స్థిరంగా వుండే అద్దంపై ఓ కాంతి పుంజం పడేలా చేశాడు. ఈ కాంతి దానిపై పడి పరావర్తనం చెంది, గిరగిరా తిరిగే అద్దాన్ని చేరుకుంది. దీనిపై పడిన కాంతిని గమనించేందుకై మిచెల్‌సన్‌ ఓ ప్రత్యేకమైన తెరను ఏర్పాటు చేశాడు. రెండో అద్దం గిరగిరా తిరుగుతున్నందువల్ల, దానిపై పడిన కాంతి కొంచెం పక్కకు జరిగి, తెరపై పడింది. నిలకడగా వున్న అద్దం నుంచి వచ్చిన కాంతి... పడాల్సిన ప్రదేశానికి 133 మి.విూ.ల దూరంలో పడటాన్ని మిచెల్‌సన్‌ గుర్తించాడు. ఈ మొత్తం సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కాంతి వేగం సెకనుకు 1,86,380 మైళ్ళని అతను నిర్ధారించాడు. ఆ తరువాత కొంత కాలానికి, ఆధునిక పరికరాలతో చేసిన ప్రయోగాల ద్వారా కాంతి వేగం సెకనుకు 1,86,282.397 మైళ్ళుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు.
Courtesy with:  PRAJASEKTHI DAILY

Tuesday, 4 February 2014

ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేయడం కూడా మంచిది కాదా?


                          ప్లాస్టిక్‌ వస్తువులతో ఉన్న అతి పెద్ద తలనొప్పి ఏమిటంటే - వాటిని వాడి మనం పారేసినప్పుడు అవి తిరిగి నేలలో 'కలిసిపోవడానికి' కొన్ని వేల నుంచి లక్ష సంవత్సరాల కాలం పడుతుంది. వాటిని కాల్చగా మిగిలిన పదార్ధం కూడా నేలలో అంత సులభంగా కలవదు. పైగా ప్లాస్టిక్‌ వస్తువులను కాల్చేటప్పుడు అనేక విష రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది మనుషుల ఆరోగ్యం విూద మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి వాడిన గాజు, కాగితం, ఇనుము వంటి ఎన్నో పదార్ధాలను ఫ్యాక్టరీలలో 'రీసైకిల్‌' చేసి, తిరిగి ఆ పదార్ధాలతో తÄయారయ్యే వస్తువులను చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడం నేడు సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్‌ వస్తువులను కూడా ఇలా రీసైకిల్‌ చేసి తిరిగి ఆ పదార్ధంతో కొత్తగా వస్తువులను తÄయారుచేస్తున్నారు. అయితే ఇతర వస్తువులను రీసైకిల్‌ చేసినప్పుటి కన్నా ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేసినప్పుడు చాలా హెచ్చు మోతాదులో విష రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఉదాహరణకు ఒక గాజు వస్తువును రీసైకిల్‌ చేసినప్పటి కన్నా, ఒక ప్లాస్టిక్‌ వస్తువును రీసైకిల్‌ చేసినప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ మోతాదులో అనేక కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. వీటిలో క్యాన్సర్‌కి కారణమయ్యే బెంజీన్‌ వంటి మహా ప్రమాదకరమైన పదార్ధాలు కూడా ఉంటున్నాయి.
అంతేకాదు, ప్లాస్టిక్‌ వస్తువులను రీసైకిల్‌ చేసిన ప్రతిసారి ఆ పదార్ధపు నాణ్యత మరింతగా తగ్గిపోతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంది. నేడు బజారులో కన్పించే అతి పలుచని క్యారీబ్యాగ్‌లు (ప్లాస్టిక్‌ సంచులు), రకరకాల చౌకబారు ప్లాస్టిక్‌ వస్తువులు ఈ తరహా ప్లాస్టిక్‌తో తÄయారయ్యేవే. ఇలాంటి చౌకబారు ప్లాస్టిక్‌ కవర్లలోను, బాటిళ్ళలోనూ ఉంచిన చెట్నీలు, సాంబారు, కూరలు, పళ్ళ రసాలు, ఇతర ఆహార పదార్ధాలు ... ఆయా కవర్లలోని సీసం, పాదరసం, కాడ్మియం వంటి విషపదార్ధాలతో రసాయనిక చర్య జరిపి ఆయా ఆహార పదార్ధాలను విషపూరితం చేస్తాయి. అందుకే ప్లాస్టిక్‌ కవర్లలోను, సీసాలలోనూ నిల్వఉంచే ఎటువంటి ఆహారపదార్ధాన్ని వాడవద్దని, అసలు ప్లాస్టిక్‌ వస్తువులనే వాడవద్దని ఆరోగ్యవేత్తలు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులను మనం వాడటం మానేస్తే రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో తÄయారుచేసిన వస్తువులు కూడా క్రమంగా కనుమరుగవుతాయి.

Courtesy with: PRAJA SEKTHI DAILY 
నక్షత్రాల్లా గ్రహాలు ఎందుకు మెరవవు ?














  
                           నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ కనిపిస్తాయి. కానీ గ్రహాలు, చంద్రుడు అలా ఎందుకు? నక్షత్రాలు పగలు ఎందుకు కనిపించవు? 'పగలే వెన్నెల' అనే పాటలో చెప్పినట్లు శుక్లపక్షపు రోజుల్లో పగటి కాంతిలో కొంతలో కొంత వెన్నెల కాంతి కూడా ఉన్నట్టు భావించవచ్చా?
- టి.శ్రీనాథ్‌, వరంగల్‌
       నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. గ్రహాలు, చంద్రుడు మొదలైన వాటికి స్వయం ప్రకాశకత్వం లేదు. అవి కేవలం సూర్య కాంతిని పరావర్తనం (తీవటశ్రీవష్‌ఱశీఅ) చేసే సాధారణ పదార్థాల గోళీయ రూపాలు మాత్రమే! సూర్యుడు మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం. ఇది మన భూమికి సుమారు 15 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. సూర్యునికి, భూమికి మధ్య ఉన్న ఈ సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణం (aర్‌తీశీఅశీఎఱషaశ్రీ బఅఱ్‌, aబ) అంటారు. గ్రహాల మధ్య ఉన్న దూరాల్ని, గ్రహాలకు, సూర్యునికి మధ్య ఉన్న దూరాల్ని కి.మీ., సెం.మీ.ల్లో కొలవలేము. ఆ సంఖ్యలు తడిసి మోపెడంత ఉంటాయి. అందుకని అనుకూలత కోసం ఖగోళ ప్రమాణాల్లో (aబ) పెద్ద పెద్ద దూరాల్ని సూచిస్తారు. ఆ కొలతల్లో చూస్తే మనకు సౌరమండలం (రశీశ్రీaతీ రyర్‌వఎ) లో అతి దగ్గరగా ఉన్న గ్రహాలు శుక్రగ్రహం (Vవఅబర), అంగారకగ్రహం (వీaతీర). శుక్రగ్రహం మన భూమికి సుమారు 0.3 aబ (సుమారు 5 కోట్ల కి.మీ.) దూరంలో ఉంది. పరిభ్రమణ కక్ష్య (revolutionary orbi) ప్రకారం శుక్రగ్రహం బుధగ్రహం (వీవతీషబతీy) తర్వాత ఉండే రెండోగ్రహం. భూమి మూడో గ్రహం. భూమి తర్వాత ఉన్నదిఅంగారకగ్రహం (దీన్నే కుజగ్రహం అని కూడా అంటారు). ఇది మన భూమికి సుమారు 0.5aబ (సుమారు 7.5 కోట్ల కి.మీ.) దూరంలో ఉంది. మిగిలిన గ్రహాలు శుక్రగ్రహం కన్నా, అంగారకగ్రహం కన్నా చాలాదూరంలో ఉన్నాయి. అవి మనకు పగలుగానీ, రాత్రిగానీ కంటికి కనిపించవు. వాటిని, ఇతర దూరపు ఖగోళ వస్తువుల్ని కేవలం టెలిస్కోపులతో మాత్రమే గుర్తించగలం. రాత్రుళ్లు మనకు బాగా తేజోవంతంగా ఓ నక్షత్రంలాగా మిణుకు మిణుకు మనకుండా కనిపించేది శుక్రగ్రహం. నక్షత్రంలాగే కనిపించినా కొంత అరుణకాంతితో, మిణుకు మిణుకు మనకుండా కనిపించేది అంగారకగ్రహం. సూర్యుని తర్వాత మనకు అతి చేరువులో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారి. ఇది మనకు సుమారు 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాంతి సంవత్సరం అనేది మరింత పెద్దదూరాల్ని కొలిచే ప్రమాణం. కాంతి ఒక సంవత్సరకాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం (శ్రీఱస్త్రష్ట్ర్‌ yవaతీ) అంటారని మనకు తెలుసు. (3×105×3600×24×365 94608000×105కి.మీ. 9.5 లక్షల కోట్ల కి.మీ.) ఇదే దూరాన్ని ఖగోళ ప్రమాణాల్లో సూచించినా అది చాలా పెద్ద నంబర్‌ (63 వేల aబ) అవుతుంది. ఆ తర్వాతి నక్షత్రం
సిరియస్‌ (light year)) మన భూమికి సుమారు 8.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక సూర్యుడు, ఆల్ఫా సెంటారి, సిరియస్‌ తర్వాత మనకు చేరువలో ఉన్న 4వ నక్షత్రం సుమారు 320 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 3వ నక్షత్రానికీ, 4వ నక్షత్రానికీ ఇంత వ్యత్యాసం ఉంటే మన పాలపుంత గెలాక్సీలో ఉన్న మిగిలిన లక్షల కోట్లాది నక్షత్రాలు మనకు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఊహించడానికి కూడా కష్టమే! ఇలాంటి నక్షత్రాలు తమలో జరిగే కేంద్రక సంలీన (అబషశ్రీవaతీ టబరఱశీఅ) చర్యల వల్ల విపరీతమైన కాంతి శక్తిని అన్ని వైపులకూ పంపిణీ చేస్తాయి. అందులో కొంత మన భూమికి కూడా చేరుతుంది. ఇలా నమ్రస్థాయిలో భూమివైపు వస్తున్న కాంతి భూ వాతావరణంలో మరింత పరిక్షేపణ (రషa్‌్‌వఅఱఅస్త్ర) కు గురయి బాగా పలుచబడుతుంది. అలాంటి తక్కువకాంతి సౌరకాంతి వల్ల కలిగే నీలాకాశపు రంగులో కంటికి ఆనదు. అందువల్లే పగలు నక్షత్రాలు కనిపించవు. గ్రహాలు సౌరకాంతిని చాలామటుకు శోషించుకొని (abరశీతీజ్‌ూఱశీఅ) కొంతలో కొంత మాత్రమే పరావర్తనం (తీవటశ్రీవష్‌ఱశీఅ) చేస్తాయి. కాబట్టి గ్రహాల, చంద్రుడి కాంతి కూడా ఏమంత గణనీయంగా ఉండదు. అందుకే పగలు అవి కూడా కంటికి ఆనేంత కాంతిని ఇవ్వవు. కానీ భూ వాతావరణాన్ని దాటుకుని ఏదైనా రాకెట్‌లో మనం పైకెళ్లి చూస్తే నక్షత్రాలు, గ్రహాలు, నల్లటి ఆకాశంలో కనిపిస్తాయి. పగటిపూట, నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుని కాంతి కనిపించకపోవడానికి కారణం వాతావరణమే! శుక్లపక్షపు రోజుల్లో సూర్యాస్తమయానికి ముందే చంద్రుడు ఆకాశంలో తూర్పున కనిపిస్తాడు. కృష్ణపక్షపు రోజుల్లో సూర్యోదయం అయిన కొన్ని గంటల తర్వాత కూడా చంద్రుడు పశ్చిమదిక్కున కనిపిస్తాడు. ఇలా పగలే కనిపించే చంద్రుని వెన్నెలను కూడా పగటి కాంతిలో చూడాలనుకుంటే అత్యాశే అవుతుంది. ఒక వ్యక్తి స్టీమర్లో వెళ్తూ తాను తాగగా మిగిలిన రెండు చుక్కల నీటిని సముద్రంలో పోసి 'ఇదుగో చూడండి. ఈ సముద్రపు నీటిలో నా నీరు కూడా కొంతలో కొంత ఉంది' అని సంబరపడినట్లే ఉంటుంది.
రాత్రి మాత్రమే కనిపించే నక్షత్రాలు మిణుకు మిణుకు అంటూ కనిపించడానికి, గ్రహాలు అలా మిణుకు మిణుకు మనకపోవడానికి కూడా భూ వాతావరణమే కారణం. నక్షత్రాల కాంతి వాస్తవంగా గ్రహాల కాంతి కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువయినా భూ వాతావరణాన్ని చేరేటప్పటికి నక్షత్రాల కాంతి తీవ్రత, గ్రహాల నుంచి వెలువడే పరావర్తన కాంతి తీవ్రతతో పోలిస్తే చాలా తక్కువ. భూ వాతావరణం ఓ పారదర్శక యానకం (్‌తీaఅరజూaతీవఅ్‌ ఎవసఱబఎ). అంతవరకు శూన్యం (ఙaషబబఎ) లో ప్రయాణించిన నక్షత్రాల (లేదా గ్రహాల) కాంతి గాలిలోకి వచ్చినప్పుడు కాంతి వక్రీభవనం (తీవటతీaష్‌ఱశీఅ) చెందుతుంది. అంటే కాంతి భూ వాతావరణంలో నేరుగా కాకుండా కాస్త వంకరగా వస్తుంది. కానీ భూ వాతావరణం అన్ని ప్రాంతాల్లో, అన్ని దూరాల్లో ఒకేవిధమైన సాంద్రత (సవఅరఱ్‌y) తో లేకపోవడం వల్ల నక్షత్రాల కాంతి వంకరగానే కాకుండా వంకర టింకరగా వస్తుంటుంది. కాబట్టి స్థిరంగా ఒకచోట నిల్చుని చూస్తే కాంతి ఒకసారి కంటిమీద పడడం, మరోసారి పడకపోవడమో లేదా తక్కువ పడడమో ఉంటుంది. అందుకే నక్షత్రాలు మిణుకు మిణుకు మంటు కనిపిస్తాయి. కానీ గ్రహాల కాంతి, సౌరకాంతి, చంద్రుని కాంతి కూడా కొంతలో కొంత వంకర టింకరగా వచ్చినా చాలాభాగం సరాసరి వస్తాయి. కాబట్టి ఆ కాంతులు మిణుకు మిణుకు మనవు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 
Courtesy with: PRAJA SEKTHY DAILY