Tuesday, 11 March 2014

ఉప్పుతో పళ్ల ఆరోగ్యం


     






                              కొంతమంది మాట్లాడుతున్నా, నవ్వుతున్నా నోటిలో దుర్వాసన వస్తుంది. ఇలా రావడానికి పళ్లు సరిగ్గా బ్రష్‌ చేయకపోవడం, చిగుళ్ల సమస్యతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి, ఎన్నిసార్లు శుభ్ర పర్చుకున్నా పోకపోవడం.. వంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, నోటి దుర్వాసనను నివారించడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం...
కొంచెం ఉప్పు తీసుకొని, దాంట్లో నీళ్లుపోసి, పేస్ట్‌లా చేసుకొని బ్రష్‌తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపే గుణం ఉప్పులో ఉంటుంది కాబట్టి, చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఇదెంతో దోహద పడుతుంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు ఉప్పు, బేకింగ్‌ సోడా సమానపాళ్లలో కలిపి, పళ్లపొడిని తయారుచేసుకొని, రోజూ పళ్లు తోముకోవడానికి ఉపయోగించవచ్చు. కొంచెం మిరియాలపొడి, పసుపు, ఉప్పు కలిపి, దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి, పేస్ట్‌లా చేసి చిగుళ్లకు రుద్దితే చిగుళ్లు వ్యాధులు తగ్గుతాయి. పళ్లపై ఉండే పచ్చటి చారలు పోవాలంటే స్ట్రాబెర్రీపై కొంచెం ఉప్పు కలిపి పళ్లను తోమాలి. బ్రెడ్‌ను కాల్చి పొడిచేసి అందులో తేనె, కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోమాలి. పళ్లు మెరుస్తూ ఉండాలంటే రెండు చెంచాలు ఉప్పు, రెండు చెంచాల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఒక పెద్ద గ్లాసెడు వేడినీటిలో కలిపి, పుక్కిలించాలి. పేస్ట్‌పై కొంచెం ఉప్పువేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి

No comments:

Post a Comment