మన శరీరంలో భాస్వరం (phosphorus) ఉపయోగం ఏమిటి?
భాస్వరం ప్రతి జీవిలోను ఉంటుంది. జీవకణం అంటే అందులో విధిగా DNA,RNA ఉండాలి. DNA లేదా RNAలో పూసల్లాగా న్యూక్లియోసైడులు ఉంటాయి. DNAలో అయితే ప్రతి న్యూక్లియోసైడులో ఓ నత్రజని క్షారం (Nitrogen bases), డీఆక్సీ రైబోస్ అనే చక్కెర అణువు సంధానించుకొని ఉంటాయి.RNA లోనైతే నత్రజని క్షారం రైబోస్ చక్కెర అణువుకు సంధానించుకొని ఉంటాయి. రైబోస్ చక్కెర లేదా డీఆక్సీ రైబోస్ చక్కెరలో కర్బన పరమాణువులు వలయాకృతి (cyclic) తో సంధానించుకొని ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం అందులో ఉన్న కర్బన పరమాణువులను అంకెల వరసతో చూపుతాము. పటం 1 లో రైబోస్ చక్కెరలను, డీఆక్సీ రైబోస్ చక్కెరలోను ఉన్న ఐదు కర్బనాలను ఏ విధంగా చూపించారో గమనించండి. RNA లో రైబోస్ చక్కెర, DNA లో డీఆక్సీ రైబోస్ చక్కెర పాల్గొంటాయని తెలుసుకున్నాక ఇపుడిక DNA సంగతే చూద్దాం. DNA లో డీఆక్సీ రైబోస్ చక్కెరతో పాటు నాలుగు ప్రధానమైన నత్రజని క్షారాల (Nitrogen bases) లో ఏదో ఒకటి ఉంటుంది. ఈ నాలుగు నత్రజని క్షారాలు సైటోసీన్(c), గ్వానైన్(g), అడినైన్ (A), థయమిన్(T) లో వృత్తంతో గుర్తించబడిన (H) పరమాణువు డీఆక్సీ రైబోస్ చక్కెరలో (1)వ కార్బన్ మీదున్న (ఉన) సమూహం కలిసి నీరు (న2ఉ)గా బయటికి వెళ్లిపోతే నత్రజని క్షారానికి డీఆక్సీ రైబోస్ చక్కెరలోని 1వ కార్బన్‌కు సంధానం ఏర్పడుతుంది. ఈ సమూహాన్నే న్యూక్లియోసైడు (nucleoside) అంటాము. ఇలాంటి రెండు న్యూక్లియోసైడుల్ని ఫాస్ఫేటు సంధానం చేస్తుంది. భాస్వరం మధ్యలో ఉన్న ఫాస్ఫేటు కారకం (Radical) ఎలా ఉంటుందో పటం 3 లో చూడండి. ఇందులో ఉన్న (ఉన) సమూహం అటువైపు న్యూక్లియోసైడులోని 3వ కార్బన్ మీదున్న (ఉన) లోని (న) తో కలిసి ఇటువైపు 5వ కర్బనం మీదున్న (ఉన) సమూహంలోని (న) తో కలిసి నీటిని ఇవ్వడం ద్వారా బంధించుకొంటుంది. ఇలా ప్రతి రెండు న్యూక్లియోసైడుల మధ్య సంధానకర్తగా ఫాస్ఫేటు ఉండడం వల్లనే ణచీA పేలిక ఏర్పడుతుంది. పటం 4లో ఈ వివరణ ఉంది. ఇలాంటి రెండు పేలికలు నత్రజని క్షారాల మధ్య ఏర్పడే హైడ్రోజన్ బంధాల ద్వారా జంట పేలిక (నిచ్చెనలో లాగా) ఉన్నDNAఎలా ఏర్పడిందో పటం 5 లో చూడండి. ఇలా ప్రాణానికి ఆయువుపట్టయిన DNAలోను, RNA లోను భాస్వర పరమాణువు పాస్ఫేటు రూపంలో ఉంది. అలాగే ప్రాణి ప్రతి కదలికకు కారణమైన జీవశక్తిని ఇచ్చేది ATP (Adenosine Triphosphate). ఇది AణూADP (Adenosine Diphosphate) నుంచి ఏర్పడుతుంది. ఇందులో ఉన్నదీ ఫాస్ఫేట్. ఇంకా ముఖ్యమైన భాగం ఎముకలు, దంతాలు, పుర్రె. ఇందులో ఉన్న పదార్థం పేరు కాల్షియం ఫాస్ఫేటు (Ca3(PO4)2). ఇది చాలా గట్టిది. ఇంకా కణాల గోడలు ఫాస్ఫో లిపెడ్లు అనే పదార్థంతో తయారవుతాయి. ఇందులోను భాస్వరం ఉంది. కాబట్టి భాస్వరం జీవానికి స్వరం. సర్వస్వ భాసురం జీవావసర సర్వస్వభావసారం భాస్వరం.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:
Post a Comment