Saturday, 18 July 2015

ఈ పంజాబీ రైతు పంటలు పండించడు - కరెంటు పండిస్తాడు!

భాగ్సార్‌, జూలై 18: ఆయనో సాధారణ పంజాబీ రైతు. పోయింది పోగా మిగిలిన భూమి కేవలం 12 ఎకరాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట వేయడం, వరదలు రావడంతో ఆ పంట మొత్తం నీళ్లపాలు కావడం, మళ్లీ ఏదో ఒకటి చేసి మళ్లీ పంటవేయడం... ఇదీ ఏటా జరిగే తంతు. ఇక లాభం లేదనుకున్నాడు జగ్‌దేవ్‌ సింగ్‌. ఇక పంటలు వేయడం మానేసి, తన భూమిని సౌర విద్యుత్‌ ఉత్పాదనకు వినియోగించుకోవాలని సింగ్‌ నిర్ణయించుకున్నాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ సోలార్‌ మిషన్‌ క్రింద సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన రోజుకు 5500 యూనిట్ల సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వేసవి కాలంలో అయితే ఈ మొత్తం ఉత్పత్తి దాదాపు పదివేల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

సింగ్‌ గారి దగ్గరనుంచి పాతికేళ్లపాటు విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు పంజాబ్‌ ప్రభుత్వం కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి రూ. 17.90కి విక్రయించే జగ్‌దేవ్‌ సింగ్‌ అదే కరెంటును రూ.8.40కే విక్రయిస్తాడు. ఒకానొకనాడు భూమిని కాపాడుకోవడం ఎలారా భగవంతుడా అనుకున్న జగ్‌దేవ్‌ సింగ్‌ ప్రస్తుతం అదే భూమిని నమ్ముకుని రోజకి సుమారు రూ.50వేలు సంపాదిస్తున్నాడు! అందుకే ముక్త్‌సార్‌ జిల్లావాసులు జగ్‌దేవ్‌ సింగ్‌ గురించి ఆయన పంటలు పండించడు... కరెంటు పండిస్తాడు.. అని ప్రేమతో ప్రశంసిస్తున్నారు.
Courtesy  with Andhra Jyothi Daily

Wednesday, 15 July 2015

Posted On Tue 14 Jul 2105
             సౌరమండలం మధ్యలో ఉన్న సూర్యుడి బరువెక్కువా? లేక సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల బరువెక్కువా? సూర్యుడికి తన చుట్టూ గ్రహాల్ని తిప్పుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? గ్రహాల గతుల్ని నిర్దేశించే శక్తి ఏదో తెలుసుకోలేకే ఆ శక్తినే 'దేవుడు' అన్నారని విన్నాను. అది నిజమేనా? అబద్ధమా?
- విద్యార్థి బృందం, మహబూబ్‌నగర్‌
ఒకే పెద్ద ప్రశ్నలో ఓవైపు విజ్ఞానశాస్త్రానికి, మరోవైపు తాత్వికతకు, ఇంకోవైపు నమ్మకాలకు సంబంధించిన అంశాల్ని సంధించారు. ముందు విజ్ఞానపరమైన అంశాల్ని ప్రస్తావిస్తాను.
గతంలో పలుమార్లు ప్రస్తావించినట్లుగానే మన సౌరమండలం (రశీశ్రీaతీ రyర్‌వఎ) సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందింది. 'రూపొందింది' అనడానికి 'ఉద్భవించింది' లేదా 'పుట్టింది' అనడానికి చాలా తేడా ఉంది. శూన్యం నుంచి ఏర్పడితే 'ఉద్భవించిందనో' 'పుట్టిందనో' అనేవాణ్ని. కానీ ఈ విశ్వంలో ఎప్పుడూ ఏదీ శూన్యం నుంచి పుట్టదు, పదార్థంలో జరిగే మార్పుల ప్రస్థానంలో ఒక రూపం నుంచి మరో రూపం ఏర్పడుతుంది. శక్తి కూడా పదార్థ రూపమేనని ఆధునిక భౌతికశాస్త్రం ఋజువు చేసింది. నెబ్యులా అనే పాదార్థిక మేఘం నుంచే సౌరమండలం రూపొందింది. మొదట్లో ఉబ్బిన పూరీలాగా ధృతి (శ్రీబఎఱఅశీబర) తో ఉన్న ఈ సౌరఫలకం (రశీశ్రీaతీ సఱరష) దీపావళిలో మీరు నేల మీద మండించే భూచక్రంలాగా తిరిగేది. క్రమేపీ అపకేంద్రబలాల (షవఅ్‌తీఱటబస్త్రaశ్రీ టశీతీషవర) ప్రభావం వల్ల అంచుల్లో ఉన్న పదార్థభాగం గ్రహాలు తదితర ఖగోళ వస్తువులు (షశీరఎఱష bశీసఱవర) గా మారగా మధ్యలో ఉన్న పదార్థం సూర్యుడిగా నిలిచింది. మొదట్లో సౌరఫలకం అంతా కేంద్రక సంలీనచర్యలు (అబషశ్రీవaతీ టబరఱశీఅ) ద్వారా వెలుగును, వేడిని చిమ్ముతూ ఉండేవి. కానీ సుమారు 550 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహాలలో పెద్ద పెద్ద పరమాణువులు ఏర్పడిన క్రమంలో అవి స్వయం ప్రకాశకత్వాన్ని కోల్పోయాయి. కానీ సూర్యుడిలో ఇంకా చిన్న పరమాణువులైన హైడ్రోజన్‌ బాగా ఉండడం వల్ల అది వెలుగులు చిమ్ముతూనే ఉంది.
సౌరమండలంలో సూర్యుడు మధ్యలో ఉన్న నక్షత్రం. దాని బరువు (నిజానికి ద్రవ్యరాశి లేదా ఎaరర) విలువ సుమారు 2×1030 కిలోగ్రాము అంటే 2 పక్కన 30 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని కిలోగ్రాముల ద్రవ్యరాశి సూర్యుడిది. భూమి ద్రవ్యరాశి సుమారు 6 × 1024 కి.గ్రా అంటే 6 పక్కన 24 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య ఎంతో అన్ని కిలోగ్రాముల ద్రవ్యరాశి భూమిది. ఈ లెక్కన సూర్యుని ద్రవ్యరాశి సుమారు మూడు లక్షల భూముల ద్రవ్యరాశికి సమానం. సూర్యుని వెలుగును చిమ్మేందుకు కేంద్రక సంలీన చర్యలో ప్రతి సెకనుకు సుమారు 50 కోట్ల టన్నుల (లేదా 50 వేల కోట్ల కి.గ్రా) హైడ్రోజన్‌ పాల్గొంటుంది. ఈ లెక్కన సూర్యుడు మరో 10వేల కోట్ల సంవత్సరాల పాటు వెలుగును ఇవ్వగలడు. ఆ క్రమంలో అది విస్తరించి గ్రహలను మింగేస్తూ చివరకు ఓ శ్వేతకుబ్జగా (ఔష్ట్రఱ్‌వ ణషaతీట) గా మారుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధాంతరీకరించారు. అది వేరే విషయం.
సూర్యుడి ద్రవ్యరాశి తెలుసుకున్నాం. ఇక సూర్యుడి చుట్టూ బుధుడు (వీవతీషబతీy), శుక్రుడు (Vవఅబర), భూమి (జుaత్‌ీష్ట్ర), అంగారకుడు (వీaతీర), బృహస్పతి (ఖజూఱ్‌శీతీ), శని (ూa్‌బతీఅ) యురెనస్‌ (ఖతీaఅబర), నెప్ట్యూన్‌ (అవb్‌బఅవ) అనే గ్రహాలు తిరుగుతున్నాయి. ఇందులో కొన్ని గ్రహాలకు, భూమికి చంద్రుడిలానే ఉపగ్రహలు (ఝ్‌వశ్రీశ్రీఱ్‌వర) ఉన్నాయి. అంగారకుడికి, బృహస్పతికి మధ్య లక్షకు పైగా చిన్నా చితక రాళ్లూరప్పలూ ఉన్నాయి. వీటినే ఆస్టరాయిడ్లు అంటారు.
ఇందులో సుమారు 950 కి.మీ వ్యాసమున్న సెరెస్‌ అనే పెద్ద ఆస్టరాయిడ్‌ నుంచి ఊరూ పేరూ లేని అవగింజంత సైజున్న ఆస్టరాయిడ్లు ఉన్నాయి. నెప్ట్యూన్‌ తర్వాత మొన్న మొన్నటివరకు గ్రహహోదా (ర్‌a్‌బర శీట a జూశ్రీaఅవ్‌) ను అనుభవించిన ప్లూటో కూడా ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సుమారు తొమ్మిదేళ్ళ క్రితం ప్రయోగించిన న్యూహోరైజాన్స్‌ (చీవష నశీతీఱఓశీఅర) వ్యోమనౌక సుమారు 500 కోట్ల కి.మీ. గంటకు సుమారు 50వేల కి.మీ దూరాన్ని వేగంతో ప్రయాణించి, నిన్నటికి నిన్న (14.7.15 నాడు) ప్లూటోకు అతి దగ్గరగా వెళ్లి చాయఛిత్రాలను సేకరించింది. ప్లూటో సంగతులు మరికొన్ని తెలిపే అవకాశం ఉందన్న మాట.
ప్లూటో తర్వాత మరికొన్ని ఖగోళ వస్తువులు ఉన్నాయి. 'ఉర్ట్‌ ్జ మేఘం (ఔబత్‌ీఓ జశ్రీశీబస) లో ఉన్న పదార్థాలు కూపర్‌ బెట్టీ (ఖబజూవతీ దీవ్‌్‌) అనే స్థానంలో ఉన్న పదార్థాలు అడపా దడపా వచ్చే తోక చుక్కలు (షశీఎవ్‌ర) ఇలా ఎన్నో గ్రహాలు, గ్రహేతర ఖగోళ వస్తువులు సౌర మండలంలో తమ తమ స్థావరాల్లో, తమ తమ పద్ధతుల్లో, తమ తమ గతుల్లో చరిస్తున్నాయి.
పరిణతి చెందుతున్నాయి. ఇంతటి పెద్ద సంక్లిష్ట సౌరమండలపు ద్రవ్యరాశి 10,014 సూర్యుల ద్రవ్యరాశికి సమానం. అంటే మొత్తం సౌరమండలపు ద్రవ్యరాశి 10,014 ప్రమాణాలనుకొంటే ఒక సూర్యుడి ద్రవ్యరాశే 10,000 ప్రమాణాలుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే సౌరమండలం అనే కుటుంబంలో సూర్యుడు అష్టగ్రహాలు, లక్షలాది ఆస్టరాయిళ్లు, డజన్ల కొద్దీ ఉపగ్రహాలు, ఇంకా ఎన్నో ఖగోళ వస్తువులుండగా ఆ కుటుంబంలోని అందరి దగ్గర సుమారు 10,014 రూపాయలుంటే కేవలం సూర్యుడి జేబులోనే 10,000 రూపాయలున్నట్లు అర్థం. లేదా సౌరమండలపు ద్రవ్యరాశిలో సూర్యునిది 99.86 శాతం ద్రవ్యరాశి కాగా, భూమి, బృహస్పతి, శని వంటి ఎందరో ఉన్న మిగిలిన సౌరమండలపు ద్రవ్యరాశి శాతం కేవలం 0.14 శాతం మాత్రమే!
ఇక రెండో ప్రశ్న తాత్వికతకు సంబంధించింది. సూర్యుడు తన చుట్టూ గ్రహాల్ని తిప్పుకోవడం లేదు. గ్రహాలే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయనడం మరింత నిజం. మన సమాజంలో యజమాని పనిమనిషిని తనచుట్టూ తిప్పుకుంటున్నట్టు గ్రహాలు సూర్యుడికి బానిసలు కావు. అలాగే సూర్యుడు గ్రహాలకు యజమాని కూడా కాదు. సౌర మండలంలో సూర్యుడికెంత హక్కు ఉందో గ్రహాలకు, గ్రహేతర తదితర ఖగోళ వస్తువులకూ అంతే పరపతి ఉంది. సూర్యుడి వెలుగు వల్లనే భూమ్మీద జీవం ఏర్పడిందన్నదెంత నిజమో, సూర్యుడి వెలుగు వల్లనే బుధుడి మీద జీవం లేదనాలి. కాబట్టి జీవం ఆవిర్భవించడానికి భూమి మీదున్న పరిస్థితులు ప్రధానం. ఆ హోదా, హంగు భూమికి ఉన్నాయి. అది భూమికున్న గొప్పగుణం. ఆ గుణాన్ని సూర్యుడు భూమికి బహుమతిగా ఇవ్వలేదు. ఈ విశాల విశ్వంలో భూమికున్న స్థావర ప్రభావం వల్ల, కాల, మాన ప్రభావం వల్ల సిద్ధించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సౌకర్యం పోతుంది. భూమి మాత్రమే కాదు సూర్యుడికీ గతి ఉంది. మునుపు చెప్పినట్లు ఆ సూర్యుడు శ్వేతకుబ్జగా మారతాడు. అపుడక్కడ వెలుగు ఉండదు. ఇంకా అక్కడెక్కడో ఉన్న నక్షత్రాల కాంతిని పరావర్తనం చేసే మామూలు వస్తువుగా మిగిలిపోతాడు. గ్రహాలను నిర్దేశించే శక్తి ఏదో తేలీకే, దాన్ని 'దేవుడు' అన్నారని విన్నట్లు చెప్పారు. నిజమే. ఆ రోజుల్లో గ్రహణాలు ఎందుకొస్తాయో, తోకచుక్కలు ఎందుకొస్తాయో, ఎపుడొస్తాయో తేలీదు. భూమి గుండ్రంగా ఉన్నట్లు తెలీదు. పగలు రాత్రి ఎందుకొస్తాయో, పగలు సూర్యుడుండగా రాత్రి ఎక్కడికెళ్తాడో తెలీదు. ఆ రోజుల్లో ఇలాంటి ఎన్నో విషయాలకు సమాధానం తెలీదు కాబట్టి వీటికి కారణాన్ని 'దేవుడ'ను కొన్నారనే అనుకొందాం. అందులో కొంచెం నిజం కూడా ఉంది.
మరి నేడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సవివరంగా, సమగ్రంగా తెలుసు కాబట్టి ఇంకా ఆ శక్తికీ, ఆ గతులకూ కారణం 'దేవుడు' అనుకోకూడదు కదా! అందరూ శాస్త్రాన్నే గౌరవించాలి కదా! కానీ 14వ తేదీ నాడు అద్భుతంగా న్యూ హోరయిజాన్స్‌ ప్లూటోగ్రహానికి అతి దగ్గరగా వెళ్లి ఫొటోలు తీయడం గురించిన ప్రచారం కన్నా అర్థంపర్థం లేకుండా నదీజలాల్ని కలుషితం చేసే గోదావరి పుష్కరాలకు వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు, రాజకీయ ప్రముఖులూ, పాలకులూ, సేవకులూ, ప్రజలూ బ్రహ్మరథం పట్టారు, పడుతున్నారు. ఎవరి విశ్వాసాలు వారివి అనుకున్నా భక్తులకు బస్సు నిచ్చిన డీజిల్‌ శాస్త్రవేత్తను, వారికి రైళ్లనిచ్చిన స్టీఫెన్‌సన్‌ శాస్త్రవేత్తను, కుళాయిలకు, పైపులకు రూపాన్నిచ్చిన లోహ సంగ్రహణ శాస్త్రవేత్తలను, ప్రకృతి గురించి ఎంతో నేర్పిన, నేర్పుతున్న విజ్ఞానశాస్త్రాన్ని విశ్వసించాలి కదా!
ఆఖరికి నిన్నటికి నిన్న రాజమండ్రి పుష్కరాల్లో దేవుడిని నమ్మి వెళ్లిన కొందరు భక్తుల్ని తొక్కిసలాటలో చనిపోకుండా ఏ దేవుడూ కాపాడలేకపోయాడు. వారెందుకు తొక్కిసలాటలో చనిపోయారో విజ్ఞానశాస్త్రం తెలుపుతోంది. తొక్కిసలాటలో తృటిలో ప్రాణాలు నిలబెట్టుకొని, గాయాలు పాలయినవారు గోదాట్లో మునిగితే గాయాల నుంచి బయటపడలేదు. చివరికి వారు విజ్ఞానశాలలైన వైద్యశాలల్లోనే చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడేది వైద్యమే!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు చెకుముకి, 
జనవిజ్ఞాన వేదిక.
Courtesy with: PRAJA SEKTHI DAILY

Friday, 29 May 2015

నీరు - చెట్టు


- ప్ర‌తి నీటి బొట్టూ‌...ప‌చ్చ‌ని చెట్టు‌కి!
            నీరే మనిషికి జీవనాధారం, చెట్లు - ప్రగతికి మెట్లు, ప్రకృతి సమతౌల్యం ప్రపంచానికి హితం, మనిషి ఎవరితో స్నేహం చేయకపోయినా పరవాలేదు కానీ, పర్యావరణానికి మాత్రం మిత్రుడిగా ఉండి తీరాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఎకో ఫ్రెండ్లీ ఇల్లుతో తనవంతు బాధ్యతని నిర్వర్తిస్తున్నారు డాక్టర్‌ ఎస్‌.వి. రమణ. ఇంతకీ ఆయన ఏం చేశారు...
            తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఒకటే ఉరుకులు, పరుగులు. ఏం చేస్తున్నాం... ఎంత సంపాదిస్తున్నామన్నది తప్ప, ప్రకృతి ఏమౌతోంది, పర్యావరణం ఎంత ప్రమాదకరంగా మారుతున్నది అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఆ వైద్యుడు మాత్రం అందరిలా కాకుండా పర్యావరణ హితంగా ఎకో ఫ్రెండ్లీ ఇల్లును కట్టారు. ఆ ఇంటితో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 
వాననీరు ఆదా, మొక్కల పెంపకాల్లో కొత్త పుంతలు తొక్కుతూ విశేషంగా కృషి చేస్తున్నారు. స్వచ్ఛమైన వర్షపునీటిని ఒడిసిపట్టి, దాంతో ఇంటిని పచ్చని నందనవనంగా మార్చేశారు. దాదాపు 3వేల మందికి మొక్కలు పంచి, వాటి ఆవశ్యకతను చాటిచెప్పారు. ఈ ప్రకృతి ప్రియుడు చెబుతున్న స్ఫూర్తిదాయకమైన ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
            నా పేరు డాక్టర్‌ ఎస్‌వి రమణ. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పిహెచ్‌సిలో వైద్యాధికారిగా పని చేస్తున్నాను. జిల్లా కేంద్రంలోని పిఎస్‌ఆర్‌ కాలనీలో ఉంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలన్నా... వాటిని పెంచడమన్నా చాలా ఇష్టం. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తరువాత అందరిలాగే నేనూ ఒక ఇల్లు కట్టాలనుకున్నాను. ఆ ఇంటితోనే ప్రస్తుత సమాజానికి, తోటి వారికి ఒక సందేశం ఇవ్వాలన్నది నా లక్ష్యం. ఎంతో మంది ఇంజనీర్లతో మాట్లాడాను. కానీ చివరిగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విశ్వనాధ్‌ సలహాలతో ఆర్కిటెక్ట్‌ సహకారంతో ఇంటి నిర్మాణం ప్రారంభించాను. తొలుత ఇంటికి రెండు వైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశాను. ఆ ప్రాంతంలో నేలమీద పడే ప్రతి వర్షపు చుక్కను నిల్వచేసేందుకు ఇది తోడ్పడుతుంది. దీంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా చేయొచ్చన్నది నా ఆశ. తరువాత ఎక్కడికి వెళ్లినా ఒక మొక్కను తెచ్చి ఇంట్లో నాటడం మొదలు పెట్టాను.
            అంతే... ఈ రోజు నా ఇల్లు ఎకోఫ్రెండ్లీ పరిరక్షణకు నాందిగా మారింది. నందనవనంలా తయారయ్యింది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం నా సొంతమైంది. దీని కోసం ఎంతో శ్రమించాను. ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఒక తోటమాలిగా మారతాను. ఈ రోజు నేను లెక్కపెట్టలేనన్ని మొక్కలు నా ఇంట్లో ఉన్నాయి. 100 జాతులకు పైగా మొక్కలు పెంచుతున్నాను. నా పెరట్లోనే కాకుండా పడక గదిలోనూ మొక్కలు పెంచే పద్ధతులను అవలంభిస్తున్నాను. హుదూద్‌తో చాలా వరకు మొక్కలు దెబ్బతిన్నాయి. కానీ తక్కువ సమయంలోనే వాటిని తిరిగి బతికించాం. నాతో పాటు నా కారుడ్రైవరు, తోటమాలి ఎంతో కష్టబడ్డారు. నా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ మొక్కలను పెంచమని చెబుతుంటాను. నిజానికి నా ఇల్లే ఒక పెద్ద సందేశం.
గృహ ప్రవేశం సమయంలో 3వేల మొక్కలు పంపిణీ
ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత గృహ ప్రవేశానికి బంధువులను, స్నేహితులను పిలిచాను. వచ్చిన వారికి ఇతర బహుమతులు కాకుండా నూజువీడు నుంచి 3వేల మొక్కలను తీసుకొచ్చి అందరికీ అందజేశాను. ఈ రోజు ఎవరు కనిపించినా మీరిచ్చిన మొక్కలు బాగున్నాయని చెబుతున్నారు. అలా విన్నపుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటినా...స్వఛ్చ భారత్‌, నీరు-చెట్టు లాంటి కార్యక్రమాల కంటే మంచి ఫలితాలను సునాయాసంగా సాధించవచ్చు.
ఇంట్లోనే కాయగూరలు
ఇంట్లోనే కుటుంబానికి సరిపడా ఆరోగ్యకరమైన కాయగూరలు పండిస్తున్నాను. ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండా సేంద్రీయ విధానంతోనే కూరగాయలు పండుతున్నాయి. వ్యవసాయాధికారులతో భూసార పరీక్షలు నిర్వహించి వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆనప, బీర, తోటకూర, పాలకూర, పచ్చిమిర్చి, కాకర వంటి ఎన్నో కూరగాయలను సీజన్లను బట్టి పండిస్తున్నాం.బంధువులకు, స్నేహితులకు కూరలు ఇచ్చి, మొక్కలు పెంచాలని చెబుతున్నాం.
నీరు-చెట్టూ ఆవశ్యకత అందరికీ తెలియాలి
ఇంటి నిర్మాణ ప్లాన్‌కి అనుమతి ఇచ్చేటప్పుడు ఇంకుడు గొయ్యి ఏర్పాటు నిబంధనని పాటించారా లేదా చూడాలి. కానీ ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతి గృహ ప్రవేశంలోనూ నీరు-చెట్టు ఆవశ్యకతపై చర్చ జరగాలి. మన వంతుగా మొక్కలు నాటడం సమాజం పట్ల మనకున్న బాధ్యత. పదండి... మనిషికొక మొక్కను నాటుదాం.
- వి.నాగరాజు, 
విజయనగరం, ప్రజాశక్తి ప్రతినిధి

Friday, 24 April 2015

అంతరిక్షంలో ఇస్రో అద్భుతం....


చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్‌ కోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు.
న్నత స్థాయి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకుంటూ అంతరిక్ష శక్తుల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ‘ఇండియన్‌ రీజియనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం’ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) అనే వ్యవస్థను భారత్‌ సొంతంగా ఏర్పాటు చేసుకుంటోంది. అందుకు మొత్తం 29 ప్రయోగాల్లో తొలి ఒక్కటి తప్ప వైఫల్యమే ఎరుగని ఇస్రో రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ మార్చిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్ష్యకు చేర్చి వినువీధిలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా యూకేకు చెందిన డీఎంసీ ఇమేజింగ్‌ ఇంటర్నేషనల్‌ (డీఎంసీఐఐ)కు చెందిన మూడు ఉపగ్రహాలను ఎప్పుడు ప్రయోగించేది శుక్రవారం ఇస్రో ప్రకటించనుంది.
జీపీఎస్‌ (అమెరికా), గ్లోనాస్‌ (రష్యా), గెలీలియో (యూరప్‌), బైద (చైనా) మాదిరిగానే భారత్‌ కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనే ఉప్రగ్రహ ఆధారిత గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ సేవల్ని సొంతంగా సమకూర్చుకుంటోంది. ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఇది నాలుగోది. త్వరలో ప్రయోగించే మరో మూడు ఉపగ్రహాలతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో ఖ్యాతి ఇనుమడించింది. స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు మళ్లించే లక్ష్యంతో భారత్‌లో 1972లో అంతరిక్ష విభాగం ఏర్పాటైంది. 1983లో భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్ఠ (ఇన్‌శాట్‌)ను నెలకొల్పారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, టెలి-మెడిసిన్‌, టెలి-ఎడ్యుకేషన్‌, వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ కోసం ఇస్రో ఇప్పటిదాకా 30 సమాచార ఉపగ్రహాలను రోదసికి పంపింది. తర్వాత 1988లో భారత రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎస్‌) ఆవిర్భవించింది. ఖనిజ వనరులు, జల వనరులు, మత్స్యసంపద, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అంశాలపై సమాచార సేకరణ గ్రామీణాభివృద్ధి - పట్టణ ప్రణాళికల రూపకల్పన, వ్యవసాయోత్పత్తుల అంచనాల తయారీ, ప్రకృతి విపత్తులపై అధ్యయనం కోసం ఇస్రో దాదాపు పాతి రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను పంపింది. వీటిలో 2 రోసోర్స్‌ శాట్స్‌, 4-కార్టో శాట్స్‌, 2 రైశాట్స్‌, ఓషనశాట్‌, మేఘాట్రోపిక్స్‌, సరళతో కలిపి ప్రస్తుతం 11 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి. ఇవే కాకుండా భారత్‌ 40 దాకా విదేశీ ఉపగ్రహాల్ని సైతం కక్ష్యకు చేర్చి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది.
2011-15 మధ్యకాలంలో 15 విదేశీఉపగ్రహ ప్రయోగాల ద్వారా 40 మిలియన్ల యూరోలు (రూ.270 కోట్లు) సంపాదించింది. ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో అనూహ్య మలుపులు, ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠతో అంతరిక్షంలో సాగే ఇతివృత్తంగా ‘గ్రావిటీ’ అనే హాలివుడ్‌ సినిమా ఖర్చు కంటే చౌకగా ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ (మామ్‌) ప్రయోగాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. భూమికి గరిష్ఠంగా 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహానికి కేవలం రూ. 450 కోట్లు ఖర్చుతో మామ్‌ లేదా మంగళయాన్‌ ప్రయోగించి భారత్‌ చరిత్ర సృష్టించింది. మామ్‌ ప్రాజెక్టుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మన త్రివర్ణపతాకాన్ని అంతరిక్షంలో సమున్నతంగా నిలిపింది. దాంతో అరుణ గ్రహాన్ని అందుకున్న దేశాలు/సంస్థల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచి యావత్ప్రంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఇవాళ ఇన్నేసి స్పూర్తిదాయక విజయాలు సాధిస్తున్నా మొదట్లో ఇస్రో పయనం కష్టాలు, సవాళ్ల ముళ్లబాటలోనే సాగింది. తొలినాళ్ళలో 1980లలో సోవియట్‌ ‘వోస్తాక్‌’ లాంచర్లపై ఆధారపడిన ఇస్రో, అనంతరం సొంతంగా శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ), ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఏఎస్‌ఎల్‌వీ), పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) వంటి రాకెట్లను దశలవారీగా రూపొందించింది. కానీ భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే భూ స్థిర కక్ష్యను అందుకోవాల్సిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల విషయంలో మాత్రం పరాధీనత తప్పలేదు. భారత్‌ ఈ ప్రయోగాల కోసం యూరోపియన్‌ ‘ఏరియన్‌’ రాకెట్లపై ఆధారపడవలసి వస్తోంది. పీఎస్‌ఎల్‌వీ కంటే మెరుగైన జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)ని ఇస్రో తయారు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు క్రయోజెనిక్‌ ఇంజన్లతో కూడిన రాకెట్లను తయారు చేయవలసి ఉంటుంది. క్రయోజెనిక్‌ పరిజ్ఞానం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనాల సొత్తు. 1991లో ఇస్రో, సోవియట్‌ అంతరిక్ష సంస్థ గ్లవ్‌కాస్మోస్‌ మధ్య ఆ పరిజ్ఞానం మార్పిడిపై ఒప్పందం కుదిరినా, అమెరికా మోకాలడ్డింది. రష్యాపై ఒత్తిడి పెరగడంతో క్రయోజెనిక్‌ పరిజ్ఞానం మనకు అందకుండా పోయింది. కేవలం క్రయోజెనిక్‌ రాకెట్లను మాత్రమే రష్యా మనకు అందించింది. 20 ఏళ్ళ పాటు నిర్విరామ కృషితో సొంత క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అమర్చి జీఎస్‌ఎల్‌వీ-డీ 5 రాకెట్‌ నిరుడు జీశాట్‌-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం గల దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో మానవసహిత రోదసీయాత్రల కోసం ‘జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3’ రాకెట్లను ఇస్రో రూపొందించింది. చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. దీనికోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు. ఇద్దరేసి వ్యోమగాముల్ని రోదసికి తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు వీలుగా రష్యన్‌ సోయజ్‌ కేప్యూల్‌ను రీ డిజైన్‌ చేసి సొంత క్రూ మాడ్యూల్‌ను తీర్చిదిద్దనున్నారు. భావి వ్యోగాముల కోసం బెంగళూరులో శిక్షణా సంస్థ ఏర్పాటు, శ్రీహరికోటలో మూడోల్యాంచ్‌ప్యాడ్‌ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. గ‘ఘన’తలాన మువ్వన్నెల పతాక రెపరెపలాడాలి.
జమ్ముల శ్రీకాంత్‌
ఫ్రీలాన్సర్‌
Courtesy with:  Andhra Jyothi 

Tuesday, 7 April 2015

జీవం అంటే ఏమిటి?
Posted on: Tue 07 Apr 20:06:43.924176 2015
     గతవారం డార్వినిజంపై దాడి గురించి చెప్పుకున్నాం. ఈ వారం జీవం అంటే ఏమిటో తెలుసుకుందాం.
Third International Conference on Science and Scientists -2015  నినాదమైన “The Scientist is able for explain Science but is Science able to explain Scientist?” ''శాస్త్రవేత్త శాస్త్రాన్ని వివరించగలుగుతున్నారు కానీ, శాస్త్రం శాస్త్రజ్ఞుణ్ణి వివరించగలుగుతుందా?'' అన్న ప్రశ్నకు మరికొంత సమాధానాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
                  ఇక్కడ నిర్వాహకుల వెనుక ఉన్న ఛాందసవాద భావజాలం, దోపిడీవర్గాలకు వత్తాసునిచ్చే విధంగా తికమకలోకి సైన్సును నెట్టే కుహనా తాత్వికత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సైన్సును సైంటిస్టు నుండి వేరుచేసి, రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వస్తువులు (వఅ్‌ఱ్‌ఱవర) గా చూపుతున్నారు. సైన్సు ఎపుడూ సైంటిస్టుని వదిలి ఉండదు. భౌతికవాద సూత్రాల ప్రకారం, చారిత్రక భౌతికవాదం ప్రకారం ప్రతి మనిషి సైంటిస్టే. తరతమ భేదాల్లో ప్రకృతి వాస్తవికతా ఆవిష్కరణల్లో పాలుపంచుకోవడం ఉంటుందిగానీ ప్రజలందరూ శాస్త్రవేత్తలే.
                  ప్రజల్ని విడిచి శాస్త్రం ఉండదు. శాస్త్రం అంటే ఓ సూర్యుడో, చందమామో, ఫసిఫిక్‌ మహాసముద్రమో కాదు. సైన్సు అంటే మానవజాతి సమస్తం తమ బతుకుదెరువు కోసం, ప్రకృతిపై పట్టు సాధించడం కోసం, ప్రకృతి రహస్యాల్ని ఛేదించి, ఆ రహస్యాల ఆధారంగా సాంకేతికతను సాధించడమే. అందుకే మానవజాతికే సైన్సు ఉందిగానీ పురుగుల గుంపునకు, తేనెటీగల తుట్టెలకు, పూల తోటలకు, గొర్రెల మందకు సైన్సు ఉండదు. నిర్దిష్టమైన సంఖ్యల్ని, నియమాల్ని ఇతర జంతువులు, జీవజాతులు తమ తదుపరి తరాలకు గ్రంథ రూపేణా, చెరిగిపోని సంకేతాల రూపేణా దాఖలు చేయవు. వాటికి ఆ వరవడి, సంప్రదాయాలు లేవు.
సైంటిస్టు సైన్సును కేవలం వివరించడు. సైంటిస్టు సైన్సును ఆవిష్కరిస్తాడు. సేకరించుకొంటాడు. ఆ సైన్సులో తాను అంతర్లీనమవుతాడు. తన శరీర అవయవ నిర్మాణం గురించి, ఆలోచనలకు కారణమైన నాడీతంత్రుల గురించి, మెదడు నిర్మాణం గురించి ఆరా తీస్తాడు. సైన్సు, సైంటిస్టు ఒకే నాణేనికి ఇరు పార్శ్వాల కింద అర్థంచేసుకోవాలి. ఆ సదస్సు నిర్వాహకులకు ఒక్కటే ఇష్టం. సైన్సు ఛాందసభావాల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి, దాన్ని తక్కువ చేసి చూపాలి. మానవుడు అనే వస్తువులోని జీవానికి సైన్సు కారణం చెప్పదనడం వారి వాదన. మనిషి, తదితర జీవులు సృష్టించబడ్డాయని తీర్మానించడం వారి పరమావధి. జీవం అంటే మరణం లేకపోవడమన్న కనీస సత్యాన్ని వారు విస్మరిస్తారు. మరణానికి కారణమైనవేమిటో సైన్సు వివరిస్తోంది.
నీటిలో పడి ఊపిరి ఆగిపోతే మనిషి మరణిస్తాడు. ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం వల్ల కణాలకు సరిపడినంత శక్తి కావాలంటే గ్లూకోజు అణువులు ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందాలన్న వాస్తవం మృగ్యం కావడం వల్లనే నీటిలో మునిగిన వ్యక్తి చనిపోతాడు. తాచుపాము కాటుకు మనిషి ఎందుకు మరణిస్తాడు? ఆ విషంలోని ప్రోటీన్లు రక్తం ద్వారా మెదడుకు చేరి దాని చర్యలను చిన్నాభిన్నం చేయడం ద్వారా గుండె కదలికలకు జరగాల్సిన సంకేతాలు ఆగిపోవడం వల్ల చనిపోతాడు. ఉరి వేసుకొంటే మనిషి ఎందుకు చనిపోతాడు? ముసలి ప్రాయంలో ఎందుకు మరణిస్తాడు? రోడ్డు ప్రమాదాల్లో ఎందుకు మరణిస్తాడు? క్యాన్సరు వస్తే ఎందుకు మరణిస్తాడు; గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది వచ్చినపుడు ఎందుకు దాదాపు మరణానికి చేరువవుతాడు? ఎయిడ్స్‌ వ్యాధి వల్ల ఎందుకు మరణం తథ్యం? భోపాల్‌ గ్యాసు ప్రమాదం వల్ల వేలాదిమంది ప్రాణాలు ఎందుకు పోయాయి? ముషీరాబాదు ప్రాంతంలో ఆ మధ్య కలుషిత నీరు తాగితే చాలామంది పేదవారు ఎందుకు మరణించారు? యుద్ధంలో తుపాకీ తూటాలకు లోనైనవారు మరణించిందెందుకు? రైలు బోగీలకు, బస్సులకు నిప్పంటుకొంటే ఎందుకు ప్రయాణీకులు మరణిస్తారు? చాలాకాలంగా ఎండిపోయిన బావుల్లోకి దిగిన ఆరోగ్యవంతుడు ఎందుకు చనిపోతాడు?... ఇలా ఎన్నో మరణాలకు కారణాల్ని సైన్సు పూర్తివివరాలతో తెలుపుతోంది. శరీరంలో ప్రతి కణం, కణజాలం కీలకావయవాలు, సున్నితభాగాలు సరియైన పాదార్థిక నిర్మాణంతోను, దరిమిలా సక్రమమైన పాదార్థిక చర్యలతోనూ ఉండడమే జీవం.
ఉదాహరణకు ఓ లేటెస్టు మొబైల్‌ ఫోనును తీసుకోండి.. అందులో ఉన్న ఏ వస్తువుకూ జీవం లేదు. జీవంలాగా తనంత తాను కదలదు. ప్రక్కనే ఎన్ని పదార్థాలను పెట్టినా తనలాంటి మరో సెల్‌ఫోన్‌ను సృష్టించలేదు. కానీ ఆ సెల్‌ఫోన్‌లో కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు జరుగుతాయి. ఫొటోలు తీస్తుంది, బయటి నుంచి వచ్చే మాటల్ని వినిపిస్తుంది. మన మాటల్ని బయటికి పంపుతుంది. చేయి తగిలితే టచ్‌స్క్రీన్‌ మీద బొమ్మలు మారతాయి. సినిమాలు, పాటలు, వీడియోలు ఆడిస్తుంది. స్క్రీను మీదే బొమ్మలు వస్తున్నాయి కదాని సెల్‌ఫోను స్క్రీనును ఊడబెరికి ప్రక్కనబెడితే అందులోంచి బొమ్మలు రావు. సెల్‌ఫోను నడవాలంటే లోపలున్న బ్యాటరీ ముఖ్యం కాబట్టి, బ్యాటరీని టేబుల్‌పై ఉంచితే అదే బ్యాటరీ సెల్‌ఫోను చేసే పనుల్ని చేయదు. సెల్‌ఫోనులోని అన్ని వస్తువుల సమగ్ర, సంక్లిష్ట అమరికలోనే సెల్‌ఫోను నిర్మాణం, దాని పనితీరు నిబిడీకృతమై ఉన్నాయి. పనిచేయని సెల్‌ఫోనులో బ్యాటరీ బాగున్నా, స్క్రీన్‌ బాగున్నా, మరేదో బాగలేకపోవడం వల్లనే పనిచేయడం లేదు. అలాగే మనిషి లేదా ఓ జీవకణం సెల్‌ఫోను కన్నా సంక్లిష్టమైన నిర్మాణపూరితం. సెల్‌ఫోను చరిత్ర కొన్ని దశాబ్దాలది మాత్రమే. కానీ జీవకణం చరిత్ర వందల కోట్ల సంవత్సరాలది. శాస్త్రవేత్త అనే మనిషి శాస్త్రాన్ని సృష్టించే ధీశాలి కావచ్చు. అయితే అదే శాస్త్రం శాస్త్రవేత్తలో ఉన్న తెలివితేటలకు సృజనాత్మకతకు, నడవడికకు, జ్ఞానానికి, పరిజ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, ఆకలిదప్పులకు, ఆలోచనాసరళికి పాదార్థిక భూమికను ఆపాదిస్తోంది. ఓ మనిషికున్న భావస్ఫోరకత సైన్సు పరిధిలోకి రాదని ఆ సదస్సు నిర్వాహకుల భావన. మనిషి ఆలోచన మెదడులోనే ఉంటుంది. మెదడు అనే పదార్థంలో ఉంటుంది. అయితే ఆ పదార్థం ఓ గుండుగుత్తగా బెల్లం ముద్దలా, బంగారపు బిస్కెట్‌లాగా లేదు. అందులో ఎంతో పాదార్థిక విశిష్టత ఉంది. గుణాత్మకత, పరిమాణాత్మకత ఉన్నాయి. ప్రతి మెదడు కణంలో ఉన్న డిఎన్‌ఎ లేదా ఆర్‌ఎన్‌ఎలలో ఉన్న కోడాన్ల సంఖ్య, అమరిక ఆయా మెదడు కణాల లక్షణాల్ని వ్యక్తీకరిస్తాయి. ఆరోగ్యంగా అన్నీ బాగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో నవ్వుతూ సరదాగా ఉన్న మనిషిని ఆసుపత్రి ఆపరేషను థియేటర్‌లో నైట్రస్‌ ఆక్సైడు అనే వాయువును కాసేపు పీల్పింపజేస్తే మత్తులోకి వెళ్తాడు. ఎన్ని జోకులు వేసినా అపుడు నవ్వలేడు. ఎదురుగా పిల్లల్ని దండిస్తున్నా ఏడవలేడు. పంచభక్ష్య పరమాన్నాల్ని ముందుపెట్టినా అబగా చూడలేడు. ఆయనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని ఎంత బాగా వినిపించినా ఆనందించలేడు. కేవలం ఓ నిర్జీవ నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు అణువుల ప్రభావంతో ఆయనలోని కళాపోషణ, భావుకత, అరిషడ్వర్గాలు, ఆకలిదప్పులు, ఆర్ద్రత, వాత్స్యలం, దయాకారుణ్యాలు, కోపతాపాలు, శృంగార కామాలు, నియమ నిష్టలు, కృత నిశ్చయాలు, భయ విహ్వలతలు, నవరస భావాలేమీ ఉండవు. చేష్టలుడిగి, కేవలం పరిమిత స్వతంత్ర నాడీవ్యవస్థ పరిధిలోకి నెట్టబడి బతకుతుంటాడు. కాబట్టి మనిషికున్న సకల బాహ్య, అంతరంగిక, చైతన్యపూరిత ప్రకటనల వెనుక జీవిస్తుండడం (మరణం లేకుండా ఉండడం) వెనుక పాదార్థిక భూమిక ుంది.. ఎవరు ఎందుకు ఎపుడు నవ్వుతారో, పిచ్చివారు అంటే ఎవరో, నడవడిక బాగా ఉన్నవారు ఎవరో, దొంగలెవరో, దొంగబుద్ధులెవరివో, తెలివి ఎవరిదో, తెలివి తక్కువతనం ఎందుకో, ఆకలి ఎపుడో, ఆకలి లేనిదెపుడో, ఇలాంటి ప్రతి భావ స్పురణ వెనుక పాదార్థిక నేపథ్యం ఉంది. సామాజిక పరిసరాలు కూడా మనిషి ఆలోచనలను నియంత్రిస్తాయి. సామాజిక పరిస్థితులంటేనే ఏమి తింటున్నాడు, ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అన్న ఎన్నో భౌతిక వాస్తవాలే!
(పైవారం డార్విన్‌ 'నిజం' గురించి సంక్షిప్తంగా)
ప్రొ|| ఎ. రామచంద్రయ్య

సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

Monday, 6 April 2015

థియోడోలైట్‌ను దేనికి ఉపయోగిస్తారు?
Posted on: Mon 06 Apr 22:23:46.65838 2015
                   
                  సమాంతర, నిట్టనిలువు కోణాలను కొలిచే సర్వే సాధనమే థియోడోలైట్‌. భూమి మీద గల వివిధ స్థలాలు, వాటికి మధ్య సంబంధాలను దీని ద్వారా కొలిచి మ్యాపులు తయారు చేస్తారు. రోడ్లు, భూగర్భ రహదారులు, ఇతర నిర్మాణాలలో ఖచ్చితమైన కోణాల కొలతలకు దీనిని వినియోగిస్తారు. క్షితిజ రేఖపై భూతలంమీంచి రెండు స్థలాలలో చంద్రునికి గల కోణాలను రోదసీ యాత్రికులు దీనితో కొలవగలరు. ఈ కోణాల నుండి భూమినుంచి చంద్రునికి గల దూరాన్ని లెక్కగడతారు. లెనార్డు డిగ్గెస్‌ అనే ఆంగ్ల గణితశాస్త్రవేత్త 16వ శతాబ్దంలో ఈ పరికరాన్ని రూపొందించాడు. గత నాలుగు దశాబ్దాలలో ఇది అనేక మార్పులు పొందింది. ఖచ్చితమైన కొలతలను ఇచ్చేందుకు ఇది ఒక త్రిపాదిపై అమర్చబడి ఉంటుంది. కదల్చగలిగే థియోడోలైట్‌లో పైన అమర్చబడిన టెలిస్కోపును బయటకు తీయవచ్చు. థియోడోలైట్‌ను కెమెరాతో కలిపితే అది ఫోటో థియోడోలైట్‌ అవుతుంది. మ్యాపుల తయారీలో అవసరమైన క్షేత్ర ఫోటోగ్రామెట్రీ కి దీనిని వినియోగిస్తారు.
ఏప్రిల్‌ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
Posted on: Mon 06 Apr 22:38:06.764362 2015
                      మన ఆరోగ్య సంరక్షణలో పోషకాహారానికి ఉన్న ప్రాధాన్యత కొత్తగా చెప్పనవసరం లేదు. ఆహారం విషయంలో పోషక విలువలు ఎంతముఖ్యమో పరిశుభ్రత అంతే ముఖ్యం. పరిశుభ్రత లోపించిన లేదా కల్తీచేయబడిన ఆహార పదార్థాల వలన విరేచనాలు మొదలు కొని క్యాన్సర్‌ల వరకు 200 రకాల వ్యాధులు వస్తాయి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన వచ్చే విరేచనాలతో యేటా ప్రపంచ వ్యాపితంగా 22 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ఇందులో ప్రధాన వాటా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలదే! దీర్ఘకాలిక పోషకాహార లోపానికి, వ్యాధులకు అపరిశుభ్రమైన ఆహారం కూడా ఒక ముఖ్య కారణం. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మొదలుకొని ఈ సంవత్సరమంతా ''పొలం నుంచి పళ్లెం వరకు ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచండి'' అనే నినాదంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు.
ఆహారసంబంధ వ్యాధులు -కారణాలు..
ఆహార పదార్థాలలో బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు వంటివి చేరడం వల్ల, లేదా హానికారక రసాయనాలు కలవడంవల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. ఆహారం కలుషితమయినప్పుడు తలెత్తే వాంతులు, విరోచనాలు శరీరం విషతుల్యం కావడం వంటి తక్షణ సమస్యలే కాకుండా దీర్ఘకాలం పాటు కలుషిత ఆహారాన్ని తింటే ఊపిరితిత్తులు, నాడీమండల, శ్వాసకోశవ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు తలెత్తుతాయి.
ఏవి ప్రమాదకరమైన ఆహారాలు?
సరిగా ఉడికించని మాంసపు ఉత్పత్తులు, శుభ్రపరచని పండ్లు, కూరగాయలు, సముద్ర విషపదార్థాలతో కలుషితమైన చేపలు వంటివి.
కల్తీకి గురయ్యే ఆహారపదార్థాలు : పాలు, నెయ్యి, వంటనూనెలు, మసాలా పొడులు, గోధుమపిండి, టీ పొడి, కాఫీపొడి, మిరి యాలు, పసుపు, చక్కెర, బెల్లం, కందిపప్పు, తేనె మొదలగునవి.
ఆహారం ఇలా కలుషితం అవుతుంది..
పొలంలో పండించిన దగ్గర నుండి (శాకాహారం) లేదా ఫారాలలో పెంచేదశ నుండి (మాంసాహారం) -వాటిని సేకరించ డం, శుద్ధి చేయడం, ప్యాకింగ్‌ చేయడం, రవాణా చేయడం, నిల్వ వుంచడం, వండి వడ్డించే వరకు వివిధ దశలలో ఆహారం ఎక్కడైనా కలుషితం అయ్యే అవకాశం వుంది.
మితిమీరి వాడుతున్న ఎరువులు, పురుగుమందులు, జంతువుల ఆహారంలో కలుపుతున్న ఔషధాల వలన.
హోటళ్లలో, దుకాణాలలో పదార్థాల తయారీలో, నిల్వ ఉంచడంలో తగిన పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు పాటించనందున.
ఆహారం దీర్ఘకాలం నిల్వఉండడానికి, పండ్లు త్వరగా పండడానికి, మంచి రంగులో కనిపించడానికి కలిపే రసాయనాల వలన.
పదార్థాల పరిమాణం పెంచేందుకు చేసే కల్తీ కారణంగా.
ఆహార పరిశుభ్రత - అందరిబాధ్యత..
ప్రభుత్వాలు: పట్టిష్టమైన చట్టాలు రూపొందించి అమలు చేయాలి. దేశంలో వివిధ ప్రాంతాలలో తలెత్తుతున్న ఆహార సంబంధ వ్యాధులను గుర్తించడానికి ప్రాంతీయ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. తగిన సంఖ్యలో ఆహార తనిఖీ అధికారులను నియమించాలి. వారు పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించేలా చూడాలి. ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, రవాణా, విక్రయం వంటి దశలలో పాటించ వలసిన జాగ్రత్తలను, నిబంధనలను స్పష్టంగా స్థానిక భాషలో తెలియచేయాలి. అవి పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు తమ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, కల్తీలను గుర్తించి నివారించు కోవడానికి కావలసిన అవగాహన కల్పిం చాలి. ఇందుకు జన విజ్ఞానవేదిక వంటి సైన్సు ప్రచార సంస్థలు, పౌర సంఘాలు, వినియోగ దారుల సంఘాల సహకారం తీసుకోవచ్చు.
పౌర సంఘాలు : తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ప్రజలకు అవగాహన కలగచేయాలి.
విద్యాసంస్థలు : తమ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆహార పరిరక్షణపై అవగాహన కలిగించాలి.
ప్రజలు : ఆహార పరిశుభ్రతకు తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ఆహార సంబంధ వ్యాధులపై అవగాహన పెంచుకుని పరిశుభ్రత పాటించాలి. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు వాడేటప్పుడు లేబుల్‌పై ఉన్న సూచ నలను పాటించాలి. కల్తీని గుర్తించి ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
- జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ కమిటీ

Tuesday, 31 March 2015

డార్వి ‘నిజం’పై దాడి
Posted on: Tue 31 Mar 22:28:42.319414 2015

                మీడియా ద్వారా, ఆధునిక సమాచార ప్రసార సాధనాల ద్వారా మూఢనమ్మకాలను, మతఛాందసత్వాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి కదా! వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి?
- ఎం. జగన్మోహనరెడ్డి, వరంగల్‌
                 మీరన్నట్టు మారిన పాలకవర్గాల నైజం ఆధారంగా, ఆ వర్గాల కనుసన్నలలో పరోక్షంగా మత రాజకీయాల్ని ప్రబలం చేయడానికి అన్ని కోణాల్లోంచి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ముఖాముఖి మనుషుల మధ్య సంబంధాలు లేకున్నా గ్రూప్‌ మెయిల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మిథ్యా ప్రపంచంలో అంతర్జాలంలో పరస్పరం సంభాషించుకొంటున్నారు. పరస్పరం ప్రభావితులవుతున్నారు. ఉదాహరణకు, ఈ మధ్య నాకు కొన్ని ఆహ్వానాలు అందుతున్నాయి. 'ఫలానా సంఘంలో చేరండి!' అని. ఇలాంటి ఆహ్వానాలు వేలాదిమందికి అంది ఉంటాయి. చాలామంది వారి ఉచ్చుల్లో పడి ఉంటారు. ఇది ఆందోళనకరం. వారికి సంస్కారం ఎంత ఉందో మనకు తెలీదుగానీ, అభ్యుదయ భావాలున్న మనకు ఉన్న సంస్కారం రీత్యా వారి పేర్లు చెప్పకుండా, వారు ఆహ్వానించిన సంస్థలు లేదా సంఘాల పేర్లు చెప్పకుండా మా మధ్య ఇ-మెయిల్‌ ద్వారా జరిగిన సంభాషణల్ని టూకీగా చెబుతాను.
తాజా ఇ-మెయిల్‌ సంవాదం:
నాకొక ఆహ్వానం :Third International Conference on ‘Science and Scientists-2015’ (http://scsiscs.org/conference)
తృతీయ అంతర్జాతీయ సదస్సు : అంశం: శాస్త్రము - శాస్త్రజ్ఞులు - 2015
నినాదం : “The scientist is able to explain science but… is science able to explain the scientist?” (''శాస్త్రజ్ఞుడు శాస్త్రమంటే ఏమిటో వివరించగలుగుతున్నాడు. మరి శాస్త్రము శాస్త్రజ్ఞుణ్ని గురించి వివరించగలదా?'')
నా అభిప్రాయం: ఇక్కడ శాస్త్రాన్ని తక్కువ చేసి 'శాస్త్రజ్ఞుడు' అనే వ్యక్తిని లేదా 'ప్రాణి'ని అధికం చేసేందుకే ఈ నినాదం. ఇదే మెయిల్‌లో డార్విన్‌ మీద దాడి ప్రత్యక్షంగా ఉంది. శాస్త్రవేత్తలనబడే కొందరి వ్యాఖ్యానాల్ని, వ్యాఖ్యల్ని (quotations) మాత్రమే తీసుకొని డార్విన్‌ పరిణామ వాదాన్ని తిరస్కరించే విధంగా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని వ్యాఖ్యలు (తెలుగులో అనువదించాను) ఇక్కడ చూడండి.
(1) నీల్స్‌భోర్‌ (Niels Bohr) ను ఉటంకిస్తూ:
''భౌతిక ప్రపంచంలో క్వాంటం సిద్ధాంతంతోనే విశ్వం ప్రారంభమయినట్లు ఋజువు చేసినట్లుగానే జీవ ప్రపంచం కూడా విశ్వంతోపాటే ఏర్పడింది. అలాకాకుండా మరోలా జీవాన్ని వివరించేందుకు ఆధారాలు లేవు. అసలు పరమాణువులు ఎందుకు స్వతహాగా స్థిరంగా ఉన్నాయో చెప్పడం ఎంత కష్టమో, జీవం అనే వాస్తవానికి భౌతిక రసాయినక చర్యలే ప్రాతిపదిక అని చెప్పడానికి అంతే కష్టం (నీల్స్‌భోర్‌,భౌతికశాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి విజేత)''
మరో వ్యాఖ్య ఆల్బెర్ట్‌ గ్యోర్గిని ఉటంకిస్తూ:
''అందరి జీవశాస్త్రవేత్తల్లానే నేనూ జీవాన్ని, జీవవ్యవస్థను

అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాను. అతిక్లిష్టమైన స్థాయి నుంచి అంచెలంచెలుగా లోలోపలికి వెళ్లి పరికించాను. కణజాలాలు, ఆ తర్వాత అణువులు, అణువుల తర్వాత పరమాణువులు, అటు పిమ్మట ఎలక్ట్రాన్లు, జీవి నుంచి ప్రారంభించి, నిర్జీవులయిన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను చేరాను. ఎక్కడో నా పరిశీలనలో 'జీవం' మాత్రం కళ్ళు కప్పి పారిపోయింది. మళ్ళీకింది నుంచి పై
స్థాయికి వెళ్లితే 'జీవం' ఆనవాలు దొరుకుతుందేమో ఈ ముసలి ప్రాయంలో నేను పరీక్షించాలి. (ఆల్బెర్ట్‌ జెంట్‌ గ్యోర్గీ, వైద్యరంగపు నోబెల్‌ బహుమతి గ్రహీత).''‘science’   అనే ప్రముఖ పరిశోధనా వ్యాసాల పత్రికను ఉటంకిస్తూ మరో వ్యాఖ్యానం:
''1871లో చార్లెస్‌ డార్విన్‌ ఏమి చెప్పారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద ఉండే వేడి వేడి నీలి సరస్సుల్లో జీవ రసాయనాలు ఉండేవనీ, అవే క్రమేపీ జీవాణువులుగా మారి తొలి జీవుల్ని ఏర్పర్చాయని. ఇది ఒక అద్భుత వర్ణచిత్రం. అందమైన స్వాప్నిక దృశ్యం. కానీ ప్రియమైన డార్విన్‌ మిత్రమా! నూతన ఖగోళ పరిశోధనల ప్రకారం నీవు ఊహించిన జీవజలం అంటూ ఏదీ లేదు. ఏ సముద్రంలోను, ఏ నదీ, సరస్సుల్లోనూ తొలి జీవ రసాయనాల కణద్రవ్యం  (primordial organic liquid in warm little pond) లేదు సుమా!'' (‘Science’ magazine)..
ఇంకా ఏయే వ్యాఖ్యానాలు ఉటంకించారో వాటికి నా వివరణ, సమాధానం ఏమిటో పై వారం తెలుపుతాను.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక. 

Courtesy with PRAJA SEKTHI DAILY 

Sunday, 29 March 2015

పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
Posted on: Sun 29 Mar 00:47:59.4828 2015
- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌
                 అది శ్రీహరి కోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌.... సమయం సాయంత్రం ఐదు గంటలు.. భానుడి భగభగలు ఇంకా చల్లారలేదు. మరో వైపు అర్ధాకారంలో చంద్రుడు నీలాకాశం తెరపై కనిపిస్తున్నాడు.... ఆకాశం నిర్మలంగా ఉంది... అందరి చూపూ భూమ్యాకాశాలను ఏకంచేసే వైపే ఉంది.... అంతా నిశ్శబ్ధం. నరాలు తెగే ఉత్కంఠ... 59.30 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసింది. చివరి క్షణం ముగిసింది... కచ్చితంగా 5.19 నిమిషాలకు ఒక్కసారిగా పిఎస్‌ఎల్‌వి సి-27 రాకెట్‌ నింగిలోకి ఎగసింది. రెండో వేదిక నుంచి పచ్చని చెట్ల నడుమ నిప్పులు జిమ్ముతూ దూసుకెళ్లింది. 19.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అనుకున్న సమయానికి నిర్ణీత కక్ష్యలోకి చేరింది. 1,400 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డి ఉపగ్రహాన్ని జయప్రదంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌ కుమార్‌ అందరికీ అభినందనలు తెలిపారు.
                 ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరినట్లయింది. భారతదేశం నేవిగేషన్‌ వ్యవస్థలో మరో మైలురాయి దాటింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో శనివారం సాయంత్రం పిఎస్‌ఎల్‌వి సి-27 ప్రయోగం విజయవంతమైంది. భూమికి 284 కిలోమీటర్లలో దగ్గరగా, 20,650 కిలోమీటర్ల దూరంలో దీర్ఘ వృత్తాకార ఉప భూ బదిలీ కక్ష్యలోని 19.2 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టింది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వెంటనే రెండు సౌర పలకాలు విచ్చుకున్నాయి. వెంటనే కర్నాటకలోని హసన్‌ కేంద్రానికి అవి అనుసంధానమయ్యాయి. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. నేవిగేషన్‌లో పూర్తిస్థాయిలో సేవలు పొందాలంటే మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. ప్రస్తుత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌-1డితో నాలుగు విజయవంతమయ్యాయి. నింగిలోకి పంపిన ఉపగ్రహానికి రూ. 125 కోట్లు, రాకెట్‌కు రూ. 90 కోట్లు ఖర్చయింది.
ఇస్రో చేపట్టిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 29వది. 28 విజయవంతమయ్యాయి. ఒకటి మాత్రమే విఫలమైంది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగంలో ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఈ రకంగా ఆరు ఎక్స్‌్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించడంలో ఇది 8వ ప్రయోగం. పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి స-ి22, పిఎస్‌ఎల్‌వి సి-25, పిఎస్‌ఎల్‌వి సి-24, 26 ప్రయోగాలు స్ట్రాఫాన్‌ మోటార్లతో జరిగాయి. ఇండియన్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టంలో మొత్తం ఏడు ప్రయోగాలు జరగాలి. ఇందుకోసం రూ. 1,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే మూడు ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో చేపట్టింది. జూలై 2013, 2014 ఏప్రిల్‌, 2014 అక్టోబరు పిఎస్‌ఎల్‌వి సి-22, సి-24, 26 ద్వారా మూడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎఫ్‌ 1ఎ, 1బి. 1సి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 1డి నాలుగోది. మరో మూడింటిని ప్రయోగించాల్సి ఉంది. అవి విజయవంతమైతే నావిగేషన్‌ సిస్టంలో భారత్‌ సంపూర్ణ విజయం సాధిస్తుంది. భారతదేశానికి 1,500 కిలోమీటర్ల పరిధిలో నేవిగేషన్‌ సిస్టం సేవలందిస్తుంది. ఇప్పటి వరకూ విదేశీ సహకారం తీసుకుంటున్న భారత్‌కు ఇకపై ఆ అవసరం ఉండదు.
భారత్‌లో పటిష్టమైన  ఉపగ్రహ నేవిగేషన్‌ వ్యవస్థ
                 దేశ అవసరాల నిమిత్తం తయారుచేసిన నేవిగేషన్‌ ఉపగ్రహాలు అన్ని శీతోష్టస్థితుల్లోనూ 24 గంటలపాటు సేవలందిస్తాయి. ప్రస్తుత ఉపగ్రహం రెండు రకాల సేవలందిస్తుంది. సామాన్య ప్రజలకు ఎస్‌టిఎస్‌ నిర్దిష్ట స్థానం తెలుపుతుంది. దీని మొత్తం సాఫ్ట్‌వేర్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరచడానికి కర్నాటకలోని బైలాలులో భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ఉపగ్రహాలకు మెదడు లాంటిది. వినియోగదారులకు సేవలందించడానికి, వ్యవస్థను సక్రమంగా నడపడానికి బైలాలు, హసన్‌, భోపాల్‌, దేశంలోని పలు రాష్ట్రాల్లో శాటిలైట్‌ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 మోనటరింగ్‌ కేంద్రాలు, ఒక నెట్‌వర్క్‌, ఒక కాల కేంద్రం, అంతరిక్ష దిక్సూచి కేంద్రం, ఒక ఉపగ్రహ నియంత్రణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉపగ్రహం ఉపయోగాలు
                 ప్రస్తుత ఉపగ్రహం ద్వారా విస్తృత సేవలందుతాయి. భూమి, సముద్రం, ఆకాశ మార్గంలో వెళ్లే వాహనాల స్థితి, స్థానం, దిక్కులు ఎప్పటికప్పుడు అది తెలియజేస్తుంది. భూ మార్గంలో బస్సు, కారు, రైలు, ఇతర రవాణా వాహనాల్లో నేవిగేషన్‌ సిస్టం ఉంటే ఎప్పటికప్పుడు సమాచారం మన చేతుల్లో ఉన్నట్లే! సముద్ర మార్గంలో ఓడల గమనాన్ని పర్యవేక్షించొచ్చు. ఆకాశంలో విమానాల గమనాన్ని తెలుసుకోవచ్చు. ఆపద సమయంలో ఆదుకోవాడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
                 అలాగే వాహనదారునికి దృశ్య, శ్రవణ విధానంలో దిశానిర్దేశం చేస్తుంది. వాహనం ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. భూ గోళం విషయాలను కనుగొంటుంది. ఇస్రో ఛైర్మన్‌ ఎఎస్‌ కిరణ్‌కుమార్‌ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యాన తొలిసారి ప్రయోగం జరుగుతుం డడంతో ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు, చంద్రదత్తన్‌, కున్ని కృష్ణన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.
Curtsey with PRAJA SEKTHI DAILY 
సోడా సోడా.. ఆంధ్రా సోడా!
Posted on: Sun 29 Mar 20:48:19.339931 2015
                   దాదాపు నలభై అయిదేళ్ళ క్రితం వచ్చిన 'లక్ష్మీ నివాసం' అనే సినిమాలో హాస్యనటుడు పద్మనాభం నాటకాల మీద విచ్చలవిడిగా ఖర్చుపెట్టేసి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితికి వస్తాడు. అతనికి ఇష్టమైన మరో వ్యాపకం అస్తమానం సోడా తాగుతూ ఉండడం. చివరకు సోడాల బండి తిప్పుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆరుద్ర రాసిన 'సోడా...సోడా...ఆంధ్రా సోడా' పాట అతని మీద చిత్రీకరించారు. జనసామాన్యానికి గోళీసోడాగా బాగా పరిచయమైన సోడా మీద వచ్చిన ఆ పాట, సోడా పాపులారిటీ ఎలాంటిదో చెబుతుంది. ఇటీవల కూడా '' నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ...'' అని ఓ సినీ కవి ఆంధ్రుల అభిమాన సోడాను ఓ పాటలో జ్ఞాపకం చేశాడు. బహుళజాతి కంపెనీల ఉత్పత్తులతో సహా రకరకాల శీతలపానీయాలు మార్కెట్‌ను ముంచెత్తిన రోజుల్లో అందరికీ ఇష్టమైనదేకాక, చవకగా లభిస్తూ వచ్చిన పానీయం ఇది. ఎంతోమందికి ఉపాధి కల్పించిన గోళీసోడా ఇప్పుడు దాదాపు నిన్నటి జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. గోళీసోడా అంటే తెలియనివారే నేడు ఎక్కువ మంది.

                         ఇటీవలివరకూ మండుటెండలో కాలినడకన వెళ్ళే వారు దాహం తీర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది గోళీసోడాకే. తక్కువ ధరకే లభించే ఈ పసందైన పానీయం అనేక రంగుల్లో, రుచులలో దాహార్తిని తీర్చేది. కొన్ని దశాబ్దాలుగా గొంతుకలో హిమాలయం చల్లదనం నింపుతూ వచ్చిన ఈ గోళీసోడా గురించే కాని, దీని సృష్టికర్త గురించి తెలుసుకోవడం తక్కువ. సౌత్‌ఈస్ట్‌ లండన్‌కు చెందిన హీరమ్‌ కాడ్‌ అనే వ్యాపారి గోళీసోడాను 1872వ సంవత్సరంలో తయారు చేశాడు. ఆయన గోళీ సోడా పేటెంట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మందమైన గాజుతో, మూత భాగంలో రబ్బరు వాషరును అమర్చి, మధ్య భాగంలో రెండువైపులా నొక్కినట్లు ఈ సీసాను రూపొందించారు. సోడా తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రంలో ఒకేసారి మూడు సోడాలను సిద్ధం చేయవచ్చు. ఆ యంత్రానికి కార్బన్‌డయాక్సైడ్‌ సిలెండర్‌ అమర్చబడి ఉంటుంది. శుభ్రం చేసిన సీసాలలో మనం కోరుకునే ద్రవాన్ని, రుచికోసం ఉపయోగించే వాటిని కలిపి యంత్రంలో అమర్చుతారు. తర్వాత యంత్రానికి ఉండే పిడి(హేండిల్‌)ని ముందుకు వెనక్కి మూడు, నాలుగుసార్లు తిప్పుతారు. అలా తిప్పడంతో కార్బన్‌డయాక్సైడ్‌ ఒత్తిడికి గోళీ రబ్బరువాషరు దగ్గర స్థిరంగా బిగుసుకుపోతుంది. అంటే సోడాకు గోళీ ఒక మూతలా ఉపయోగపడుతుంది. అలా కార్బన్‌డయాక్సైడ్‌తో నిండిన సోడాను కొన్ని రోజలుపాటు నిలవ ఉంచవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన సాంకేతికతగా గుర్తింపుపొందింది.
బహుళ జాతి పానీయాల దెబ్బ
                         నేడు మార్కెట్‌లో రకరకాల శీతలపానీయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ గోళీసోడాను ఇష్టపడేవారు నేటికీ ఉన్నారు. మంగళూరు వంటి ప్రాంతాలలో వీటికి ఆదరణ తగ్గలేదు. దాహార్తిని తీర్చడానికి మంచి సాధనంగా ఇక్కడి ప్రజలు గోళీసోడాను భావిస్తారు. పిల్లలు, యువకులు సోడా లో ఉండే గోళీని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సీసా లోపలకు గోళీ ఎలా వెళ్ళిందో తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సీసా పగలకుండా గోళీని బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసేవారు. కానీ వారి ప్రయత్నం వృధా అయ్యేది. గోళీసోడా దుకాణాల్లో మాత్రమే కాదు, వీధుల్లోనూ దొరికేది. చెక్కతో అరలు అరలుగా చేసిన తోపుడు బండిలో ఒక్కొక్క అరలో ఒక్కో సీసాను ఉంచి అమ్మేవారు. ఇప్పుడు ఆ దృశ్యం అదృశ్యమైందన్నా ఆశ్చర్యంలేదు.
సోడా కొట్టినవాడే వీరుడు!
                         గోళీని లోపలికి నొక్కి సోడా తాగాలి. నొక్కడానికి అంటే సోడా కొట్టడానికి అనువుగా ఒక చెక్క వస్తువును ఉపయోగిస్తారు. అయితే సోడా కొట్టడం అందరికీ చేతనయ్యేదికాదు. అందుకే అవలీలగా సోడా కొట్టేవాణ్ణి ఆశ్చర్యంగా చూసేవారు. వాళ్ళుకూడా 'వీరు'ల్లా పోజిచ్చేవారు. పరికరం వాడకుండా వేలితో నొక్కి సోడా కొట్టినవాడు ఇంకా పెద్ద 'వీరుడు!'. సోడా కొట్టినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్‌ బయటకు వస్తూ వినసొంపైన శబ్దం వచ్చేది. పిల్లల్ని ఈ శబ్దం బాగా ఆకట్టుకునేది. కొత్తవారు సోడా తాగేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. గోళీ అడ్డంపడి లోపలి నీరు రాకుండా చేస్తుంది. గోళీసోడా తాగేందుకు ఒక కిటుకు ఉంటుంది. సీసాలోపల గోళీ ఏటూ కదలకుండా ఉండేందుకు ఒక చోటు ఉంటుంది. అటువైపుగా తిప్పి తాగితే నీరు సులభంగా నోటికి అందుతుంది. అల్లంసోడా, ఆరెంజ్‌ సోడా, సుగంధీసోడా, చప్పని సోడా ఇలా గోళీసోడాలలో రకరకాలు అందుబాటులో ఉండేవి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం తర్వాత సోడా తాగడం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుందని చాలా మంది అనుకునేవారు.
నిలిచిపోయిన సీసాల తయారీ
                         మన రాష్ట్రంలో గోళీ సోడా సీసాలు తయారు చేసే కంపెనీలు కృష్ణా జిల్లా ఉయ్యూరులోనూ, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు సీసాల తయారీని నిలిపివేశాయి. ''కాలం మారిపోయింది. నేటి యువతకు గోళీసోడా రుచి తెలియదు. ఏటా వేసవి సమయంలో గోళీసోడాకు మంచి గిరాకీ ఉండేది. సీసాల తయారీ లాభదాయకంగా లేకపోవడంతో కొత్త సీసాలు రావడంలేదు. సోడా తాగేందుకు ప్రజలు పూర్తిగా ఆసక్తి చూపకపోవడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండేళ్ళు కొనసాగితే ప్రజలకు ఈ అద్భుత పానీయం దూరమయినట్లే'' అంటూ ఇరవైయ్యేళ్ళుగా సోడాలు అమ్ముతున్న రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ పొందిన గోళీసోడాలు, అక్కడ కూడా వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పెద్ద వయసువారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు మినహా యువత వీటిని తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు...
                         ''మా నాన్న గోళీసోడా అమ్మేవాడు. నేనూ అదే చేస్తున్నాను. అప్పట్లో గోళీసోడా మంచి వ్యాపార వ్యాపార వస్తువుగా ఉండేది. సినిమా థియేటర్లకు రోజుకు నాలుగుసార్లు తిరుగుతూ అందించేవాళ్ళం. సినిమా విరామ సమయంలో పోటీపడి సోడాలను తాగేవారు. దుకాణాలకు సోడాలను అందేంచేందుకు కూలీలను కూడా పెట్టుకునేవారు. దీన్నే జీవనోపాధిగా నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉండేవి. ఇప్పుడూ ఇదే వ్యాపారం చేస్తున్నాను. కానీ అప్పుడంత గిరాకీలేదు. ఓ చిన్న పాన్‌షాప్‌ పెట్టుకున్నాను. సైకిల్‌పైన తీసుకెడుతూ చిన్నచిన్న దుకాణాలకు వెళ్ళి రోజుకు ఇరవై, ముప్పై సోడాలను అందిస్తున్నాను'' అంటూ పశ్చిమగోదావరికి చెందిన రహీం బాషా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. చాలా మంది వ్యాపారులు ఒక్క గోళీసోడాలపైనే ఆధారపడకుండా ఇతర పానీయాల అమ్మకాలు కూడా జరుపుతున్నారు.
నేటి కంపెనీలకు ఒరవడి
                         మనదేశంలో బంటా బాటిల్‌, కంచా బాటిల్‌, గోలీ బాటిల్‌, సోడా బాటిల్‌ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ప్రాచుర్యం పొందింది గోళీసోడా. సాధారణ నీటిలో కార్బన్‌డైయాక్సైడ్‌ను కలిపి తయారు చేసే ఈ పద్ధతినే పెద్దపెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి. నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మిగతా పానీయాల్లో కార్బన్‌డైయాక్సైడ్‌ను నింపి గోళీకి బదులుగా ఇనుప, ప్లాస్టిక్‌ మూతలు వినియోగిస్తున్నారు. కార్బానిక్‌ యాసిడ్‌గాస్‌, సోడియం బైకార్బనేట్‌ సొల్యూషన్‌ వాయువులను వీటిలోనూ ఉపయోగిస్తారు. జనాభిమానం పొందుతూ చాలా కాలం ఒక వెలుగు వెలిగిన గోళీసోడా, '' గోళీసోడానా? అదేమిటి, ఎలా ఉంటుంది'' అని అడిగే దశకువచ్చింది. కాలం మహిమ!

Courtesy with PRAJA SEKTHI DAILY