గత పాతికేళ్ళ నుండీ అంధత్వంతో బాధపడుతున్న క్రిస్‌జేమ్స్
అనే వ్యక్తికి డాక్టర్లు అతని కంటి వెనక ఒక మైక్రోచిప్ అమర్చారు. ఇప్పుడు
అతను ఆకారాలను చూడగలుగుతున్నాడు. బహుశా త్వరలో స్పష్టంగా చూడగలడేమో! అతనిలో
అమర్చిన బయానిక్ కన్ను కాంతికి స్పందించి, ఒక ఎలక్ట్రానిక్ సంకేతాన్ని
'దృష్టి నాడి' ద్వారా మెదడుకు చేరవేస్తుంది. తద్వారా కంటిలో ఉండే కాంతి
గ్రాహక కణాలు దెబ్బతిని, చూపు కోల్పోయిన వారిలో క్రమ క్రమంగా చూపు వచ్చే
అవకా శాలు ఉంటాయి. రెటీనా ఇంప్లాంట్ అనే జర్మన్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ
బయానిక్ కన్ను కంటి వెనుకభాగంలో ఉండే అతి సున్నితమైన రెటీనా పై అమర్చవలసి
ఉంటుంది. ఆ చిప్‌కి కావలసిన విద్యుచ్ఛక్తి చెవి వెనుక అమర్చబడి ఉంటుంది.
బయానిక్ కన్నులో రెటీనా విధులన్నీ ఇమడ్చబడి ఉంటాయి. దాదాపు 1500 కాంతి
గ్రాహక డయోడ్లు, అనేక ఎలక్ట్రోడ్లు కలిసి చూపును కలిగిస్తాయి. అయితే కేవలం
నలుపు తెలుపు చిత్రాలే, అదీ అరచెయ్యి వెడల్పులో మాత్రమే కనిపిస్తాయి. బహుశా
రానున్న కాలంలో ఈ టెక్నాలజీ మెరుగుపడి, మరింత మంచి ఫలితాలను ఇస్తుందేమో
చూడాలి.
No comments:
Post a Comment