పాసివ్ స్మోకింగ్ (ధూమపానం చేసేవారు వదిలిన పొగను
ఇంకొకరు పీల్చడం) ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడుతుందని కొత్త అధ్యయనం
తెలిపింది. 53 శాతం మంది పిల్లలు పాసివ్ స్మోకింగ్ ప్రభావానికి
గురవుతున్నారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వీరు మూడు లేదా అంతకంటే
ఎక్కువసార్లు వైద్యున్ని కలుస్తున్నారు లేదా గత ఏడాది పిల్లికూతలతో అత్యవసర
విభాగంలో చేరుతున్నారు. ఒకటి లేదా వారంలో చాలా రాత్రులు పిల్లికూతల వల్ల
నిద్రభంగంతో బాధపడ్డారు. 'ఆస్తమా రోగులు పాసివ్‌స్మోకింగ్ బారినపడకూడదని
జాతీయ ఆస్తమా మార్గదర్శకాలు సలహా ఇస్తున్నాయి. కానీ వీటిని పాటిస్తున్నారనే
దానిపై అస్పష్టత నెలకొన్నది' అని సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్
ప్రివెన్షన్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్
వైద్యాధికారి లారా జె. అకిన్‌బమి తెలిపారు. 53 శాతం మంది ఆస్తమా పిల్లలు
పాసివ్ స్మోకింగ్ బారినపడ్డారని 2005 నుంచి 2010 వరకు జరిగిన అధ్యయనంలో
వెల్లడైంది.
No comments:
Post a Comment