మానవ హృదయాన్ని కుంచింపజేయడం ద్వారా హృద్రోగ నివారణలో
మెరుగైన ఫలితాలు పొందవచ్చని బ్రిటిష్ పరిశోధ కులు అంటున్నారు. ఆ దిశలో
ఎలుకలపై తొలి ప్రయోగాలు చేశారు. ఈ ఎలుకలు సుదీర్ఘ కాలం జీవించి ఉన్నాయి.
రక్తాన్ని పంప్‌చేసే శక్తి బల హీనపడినప్పుడు గుండెలో అధికరక్తం నిలువ ఉండి
కాల క్రమేణా గుండె విశాలమవు తుంది. అలా వెడల్పైన కొద్దీ సమస్యలూ
జటిలమవుతాయి. ఆ పరిస్థితి నుండి కాపాడటానికి శాస్త్రవేత్తలు గుండె
పరిమాణాన్ని చిన్నదిగా చేయడంపై దృష్టి సారించారు. పేస్‌మేకర్ వంటి ఒక
పరికరాన్ని గుండెకు వెళ్ళే 'వేగస్' నాడికి అమర్చుతారు. దానిద్వారా
విద్యుత్‌ను పంపితే అద్రినాలిన్ అనే హార్మోన్ ప్రభావం నుండి గుండెను
రక్షించవచ్చట. గుండె కొట్టుకోవడంలో అంతరాయం కలిగినప్పుడు అద్రినాలిన్ వల్ల
హృదయ స్పందన వేగవంతమవుతుంది. అటువంటి పరిస్థితిని అడ్డుకోవడం ద్వారా
గుండెను కుంచింపజేయవచ్చనీ, గుండె వెడల్పు కాకుండా ఆపవచ్చనీ ఈ పరిశోధకులు
అంటు న్నారు. ఈ ప్రభావాల్ని పూర్తిగా అర్థంచేసుకోవాలంటే మరిన్ని పరిశోధనలు
చేయాల్సి ఉంది.
No comments:
Post a Comment