విమానాలకు దారి, దిశ ఎలా?
విమానాలు ప్రపంచ నగరాలకు ఏ మార్గంలో వెళతాయి? వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, దారులను, దిశలను ఎలా తెలుసుకుంటాయి?
- జి.అశోక్, గోధూర్, కరీంనగర్ జిల్లా
నేలమీదలాగా సముద్రయానానికి, విమాన యానానికి రోడ్లు, మైలురాళ్లు, రోడ్ల కూడళ్లు, మార్గదర్శక సూచికలు ఉండవు. దీనికి కారణం నేలమీద గ్రామాలు, కొండలు, నదులు, పొలాలు సహజమైన నిర్దేశచట్రం (frame of reference) గా పని చేయడంవల్ల దారుల్ని నిర్దేశించ డానికి వీలుంటుంది. కానీ సముద్రంలోకి ప్రవేశించాక కాలానికి సంబంధం లేకుండా నిలకడగా దగ్గర దగ్గరగా ఉండే నిర్మాణాలు ఉండవు. అలాగే గాల్లో కూడా నిర్మాణాలు ఉండవు. కాబట్టి సముద్ర యానానికి, విమానయానానికి మార్గాల్ని నిర్దేశించేందుకు ఇతర ఆధునిక పద్ధతుల్ని అవలంబిస్తారు. భూమి ఉపరితలం మొత్తం కొన్ని అక్షాంశాల (latitudes) రేఖాంశాల (longitudes) నే ఊహారేఖల పట్టీలలో గుర్తించారు. అంటే ఓ విధంగా ప్రపంచపటాన్ని గ్రాఫు కాగితం మీద గీచినట్లున్న మాట. గ్రాఫులో ప్రతిబిందువును, x అక్షాంశం (x-coordinate or abscissa) ద్వారాను, y -అక్షాంశం (y-coordinate or ordinate) ద్వారాను సూచించగలం. ఈ రెండు అక్షాంశాలను కలగలిపి x,y నిరూపకాంశాలు (x,y coordinates) అంటారు. అలాంటి స్థితిలో ఏర్పడే ప్రత్యేక అవకాశమేమిటంటే గ్రాఫు మీద ఏ రెండు బిందువులకు ఒకే x,y నిరూపకాంశాలు ఉండవు. వేర్వేరు బిందువులకు వేర్వేరు నిరూపకాంశాలుంటాయి. ఒక మార్గాన్ని అదే గ్రాఫు కాగితం మీద గీస్తే ఆ గీత ఏయే బిందువుల మీదుగా వెళ్లిందో చెప్పడాన్ని ఏయే నిరూపకాంశాల మీదుగా వెళ్లిందో చెప్పడం ద్వారా గుర్తించగలం. అదేవిధంగా ప్రపంచ పటంలో ప్రతి ప్రాంతానికి కచ్చితమైన అక్షాంశం, కచ్చితమైన రేఖాంశం ఉంటుంది. నేడున్న ఆధునిక సర్వేయింగ్ పద్ధతుల ద్వారా ప్రపంచపటంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ చదరపు అంగుళం మేరకు కూడా నిర్దిష్టమైన అక్షాంశ, రేఖాంశాల జతలు ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే హైదరాబాదు నగరంలో ఓ వెయ్యి గజాల ప్రాంతంలో ఉన్న ప్రజాశక్తి కార్యాలయంలోని ఫలాని గదిలోని, ఫలాని కంప్యూటరు టేబుల్‌కున్న ముందుకాలు ఏ అక్షాంశం, ఏ రేఖాంశం మీద ఉందో చెప్పగలం. అలాగే మరో అంశం ఓ ప్రాంతం సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందన్న విషయం. దీన్నే altitude అంటారు. ఇలా ప్రతి ప్రాంతానికీ latitude (అక్షాంశం), longitude (రేఖాంశం), altitude (ఎత్తు) ఉన్నాయి. ఈ పద్ధతిలో భూమధ్య రేఖ నుంచి ఉత్తరధృవపు అక్షం వరకు ఉన్న బిందువుల (స్థానాల) కు ధన చిహ్నం (+ve) ఉన్న సంఖ్యలలోనే అక్షాంశాలుంటాయి. భూమధ్య రేఖ మీద అక్షాంశం విలువ '0' (సున్నా) ఉత్తరధృవం దగ్గర అక్షాంశం విలువ 90డిగ్రిలు. అలాగే భూమధ్య రేఖకు దిగువుగా ఉన్న అన్ని ప్రాంతాలను ఋణ (-ve) చిహ్నం గల సంఖ్యలతో అక్షాంశాలు ఉంటాయి. దక్షిణధృవపు అక్షం దగ్గర ఆ విధంగా -90డిగ్రిలు అవుతుంది. ఇలా ధన ఋణ చిహ్నాల బదులు (+కు బదులు) చీ N (North) గుర్తును, (-కు బదులు)S (South) గుర్తును సంఖ్య తర్వాత అనే పద్ధతి ఎక్కువగా అమల్లో ఉంది. ఇక రేఖాంశాల విషయానికొస్తే ఇంగ్లాండు ప్రాంతం దగ్గర ఉన్న Greenwich మీదుగా ఉత్తర దక్షిణ ధృవాల్ని కలిపే నిలువు రేఖకు '0' (సున్న) విలువను ఆపాదించారు. రేఖలన్నీ ఉత్తర, దక్షిణ ధృవాల్ని కలిపేవే కాబట్టి ఈ రేఖలు గుమ్మడికాయ మీద నిలువు గీతల్లాగా ఉంటాయి. ఈ సున్న విలువగల రేఖాంశానికి ఎడమవైపు (అమెరికా ఖండంవైపు) ఉన్న ప్రాంతాలకు ఋణ గుర్తు (-ve) ఉన్న రేఖాంశ సంఖ్యగానీ లేదా సంఖ్య చివర W (West) ఉండే విధంగాగానీ పద్ధతి ఉంటుంది. సున్నా రేఖాంశానికి కుడివైపుకు (భారతదేశం వైపు) ఉన్న ప్రాంతాలకు ధన (+ve) గుర్తు గల రేఖాంశం ఉంటుంది లేద సంఖ్య చివర E (East) ఉండే విధంగా రాస్తారు. భూమి గోళాకారంగా ఉండడం వల్ల ఇంగ్లాండులోని గ్రీన్‌విచ్‌కు నేరుగా వెనుక ఉన్న ప్రాంతానికి ఎడమవైపుగా -1800 కోణాన్ని, (లేదా 180w) కుడివైపుగా +180డిగ్రిలు కోణాన్ని (లేదా 180E) సూచిస్తారు. ఆ విధంగా ఆ ప్రాంతం నుంచి ఎటువైపు తిరిగి అక్కడికి చేరుకున్నా 360డిగ్రిలు (పూర్తి వలయం) కోణాన్ని పూర్తిచేసుకున్నట్టు అర్థం. ఇప్పుడిక అసలు విషయానికొద్దాం. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి కచ్ఛితమైన అక్షాంశ రేఖాంశాలు ఉండడం వల్ల ప్రపంచం మొత్తాన్ని ఓ గ్రాఫు కాగితం మీద గీచినట్లుగా భావించాలి. ప్రతి ప్రాంతపు అక్షాంశ రేఖాంశాలు విలువల్ని విమానాల్లోని కంప్యూటర్లలో నిలువ చేశారు. ఫలాన ప్రాంతం (ఉదా: హైదరాబాదులోని శంషాబాదు విమానాశ్రయం) నుండి ఫలాని ప్రాంతం (ఉదా:అమెరికాలోని చికాగో విమానాశ్రయం) చేరుకోవడానికి ఉద్దేశించిన పైలట్ ఆ రెండు విమానాశ్రయాల అక్షాంశ, రేఖాంశాల్ని నమోదు చేస్తాడు. ప్రయాణిస్తున్న మార్గం ఏ అక్షాంశ రేఖాంశాల మీదుగా వెళ్లాలో కూడా కంప్యూటర్లు నిర్ణయిస్తాయి. పైలట్ పనల్లా ఆ విధంగా ఆ విమానం వెళ్లేలా హేండిల్సు, బటన్లు తిప్పడమే! ఇప్పుడిక పైలట్ అవసరం లేకుండా కూడా విమానాలు ప్రయోగించగలరు. మీ ప్రాంతపు అక్షాంశ రేఖాంశాలు, ఎత్తులు ఎంతో ఇంటర్‌నెట్‌లోని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోండి.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Courtesy with: PRAJA SEKTHI DAILY
Posted on: Tue 12 Nov 23:20:13.640318 2013

No comments:
Post a Comment