విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 17 Feb 2010, IST
'రఘుచంద్ గారూ! ఈ విషయం విన్నారా?' అంటూ లోపలికొచ్చాడు స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యకర్త శ్రీను.
రఘుచంద్ ప్రకాశంజిల్లా అద్దంకి జనవిజ్ఞాన వేదిక బాధ్యుడు.
'ఏ విషయమండీ?' అడిగారు రఘుచంద్.
'మన ఊళ్ళో ఉదయం నుండి ఒక వేప చెట్టుకు తెల్లని పాల వంటి ద్రవం కారుతున్నదండీ. వేప చెట్టుకు పాలు కారుతున్నాయనీ, అదేదో మహిమ అనీ చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది ఆ చెట్టుకు పూజలు, ప్రదక్షిణలూ మొదలెట్టారు. ఇప్పుడేం చేద్దాం?' అడిగాడు శ్రీను.
'చెట్లకు మహిమలుండటం అసంభవం. దీని వెనుక ఏదో విజ్ఞానశాస్త్ర విశేషం దాగి ఉంటుంది. ఆ విశేషం ఏమిటో వృక్షశాస్త్రజ్ఞులకు తెలుస్తుంది. అందువలన మన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు, వృక్షశాస్త్ర ఆచార్యులు అయిన ప్రొఫెసర్ సత్యప్రసాద్‌గారిని అడుగుదాం'' అన్నారు రఘుచంద్.
వెంటనే ప్రొ|| సత్యప్రసాద్ గారికి ఫోను చేసి అద్దంకిలో పరిస్థితిని వివరించడం జరిగింది. ఆయన చెట్టు నుండి పాల వంటి ద్రవం కారడాన్ని గూర్చి ఇలా వివరించారు.
'పెద్ద పెద్ద వృక్షాలకు రకరకాల కారణాలతో ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. అది బాక్టీరియా వలన కావచ్చు. శిలీంధ్రం వలన కావచ్చు. అలాంటప్పుడు చెట్టు మానులో ఎక్కడైనా గాయమైనప్పుడు, ఆ భాగంలో ఉండే లేటెక్స్ వంటి చిక్కని ద్రవపదార్థం బయటకు వస్తుంది. దానినే చెట్టు నుండి పాలు కారడంగా సైన్సు తెలియని వారు అనుకుంటుంటారు. 1, 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది. దీనిలో ఎలాంటి మహిమా లేదు.'' ఈ విషయాన్ని రఘుచంద్‌గారు స్థానిక పత్రికా విలేకరులను పిలిచి వివరించారు. మరునాడు అన్ని పత్రికలలోనూ ఆయన ఇచ్చిన శాస్త్రీయ వివరణ ప్రచురితమైంది. ప్రజలలో ఆలోచన మొదలైంది. ద్రవం కారడం కొద్దిరోజుల్లో ఆగిపోయింది. క్రమంగా వేపచెట్టుకు పూజలు చేసే భక్తుల సంఖ్య తగ్గిపోయింది.
- కె.ఎల్.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)(మరొకటి వచ్చేవారం)
- విశ్వాసాలు.. వాస్తవాలు... 16

No comments:
Post a Comment