- 19/02/2012 |
- సి.వి.సర్వేశ్వర శర్మ
నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ 1928లో ఒక బలహీనమైన వికిరణాన్ని
కనుగొన్నారు. దానినే రామన్ వికిరణం అంటారు. ఆనాటి నుండి ఈ రామన్
వికిరణం భౌతిక, రసాయన ప్రయోగాల్లో ఎంతో ఉపయోగపడుతోంది.
ఇప్పుడు అమెరికాలోని శాస్తవ్రేత్తలు ఈ రామన్ స్పెక్ట్రో స్కోపిని ఉపయోగించి
గుండె ధమనుల్లో వున్న ప్లేక్స్ (రక్త ప్రవాహాన్ని నిరోధించే పదార్థాలు) రసాయనిక
తత్త్వాన్ని అంచనా వేయగలిగారు. ధమనుల్లో ప్లేక్స్ పేరుకుపోయిన కొలది
రక్తప్రవాహం మందగిస్తుంది. హృదయ ధమనుల్లో ప్లేక్స్ ఒకే స్థాయిలో ఉండవు.
ఒకచోట ఎక్కువగాను, మరొకచోట తక్కువగాను ఉంటాయి. ప్లేక్స్ వల్ల అప్పుడప్పుడు
గుండె నొప్పి రావడం, ధమనుల గోడలు చిట్లడం జరుగుతుంది. ఒక్కొక్కసారి రక్తం
గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రమాదకరమైన ఈ ప్లేక్స్ రకరకాల రసాయనాలు
కలిసి ఏర్పడతాయి. ప్లేక్స్‌లోని రసాయనాలు తెలుసుకోగలిగితే, అవి ధమనుల గోడలు
చీలుస్తాయా లేదా అనే విషయాన్ని, వాటిని తొలగించడానికి కావలసిన చికిత్సా
విధానాన్ని నిర్ధారించవచ్చు. రోగి మరణించాక గాని ధమనుల్లో ఇరుక్కున్న ప్లేక్స్
రసాయనిక తత్త్వాన్ని పసిగట్టడం సాధ్యమయ్యేది కాదు. ధమనిలో ప్లేక్స్ ఉన్న
చోటుకి చొచ్చుకొని వెళ్లి కావలసిన సమాచారాన్ని అందించే పరికరాలు కరువయ్యాయి.
ఇలాంటి చోటనే రామన్ కిరణాలు అక్కరకు వస్తున్నాయని అమెరికన్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
విశే్లషణ ఒక రసాయనిక పదార్థం నుండి వచ్చే కాంతిని విశే్లషించి ఆ పదార్థాన్ని
నిర్ధారించడం స్పెక్ట్రోస్కోపితో సాధ్యం. ఒక రసాయన పదార్థం మీదికి లేజర్ కాంతిని
ప్రసారం చేసినపుడు అందులోని అణువులు కాంతిని గ్రహించి, తిరిగి పరావర్తనం
చెందేలా చేస్తాయి. ముందు ప్రసరింపజేసిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు, రసాయనిక
పదార్థం నుండి వెనుదిరిగి వచ్చిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు తేడా ఉంటుంది.
ఈ పరావర్తన కాంతి వర్ణ పటాన్ని గమనిస్తే ఆ పదార్థంలోని రసాయన మూలకాలు
తెలుసుకోవచ్చునని రామన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎన్నో ఏళ్లుగా రసాయన
శాస్తవ్రేత్తలు ఉపయోగిస్తున్నారు. ఈ సిద్ధాంతం హృద్రోగ చికిత్సలో సైతం కీలకమవుతోంది.
పరిశోధకులు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారి పాత గుండె ధమనులను పరీక్షించారు.
తరువాత దశలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న వారి ధమనుల్లో ప్లేక్స్‌ను
రామన్ స్పెక్రోస్కోపి ద్వారా పరిశీలించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న మిగిలిన
వారికి మరో విధానాన్ని అనుసరించారు. మూత్రనాళిక గుండా ఆప్టిక్ ఫైబర్‌ను ధమనుల్లో
సమస్యవున్న ప్రదేశానికి పంపిస్తారు. బయట నుండి లేజర్ కాంతిని ఆప్టిక్ ఫైబర్ మీదకు
ప్రసరింపజేస్తారు. పరావర్తనం చెందిన కిరణాలను మూత్రనాళికలో మరొక వైపునున్న
డిటెక్టర్ పరిశీలిస్తుంది. బలహీనమైన రామన్ వికిరణాల సంకేతాలను పసిగట్టే సున్నితమైన
డిటెక్టర్‌ను తయారుచేయడం వంటి చిన్నచిన్న సమస్యలు ఇంకా అధిగమించాల్సి ఉంటుంది.
ప్రోటాన్ కిరణాలు అణు భౌతిక పరిశోధనలో ఉపయోగించే ప్రోటాన్ కిరణాలు వివిధ రకాల
కేన్సర్లను సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఈ కిరణాలు
కేన్సర్ కణితి సమీపంలోని కణజాలానికి ఎటువంటి హాని కల్గించవు. ప్రోస్టేట్, ఎముక, కంటి
కేన్సర్ చికిత్సలో ఇప్పటివరకు రేడియో ధార్మిక వికిరణాలను ఉపయోగిస్తున్నారు.
ఈ వ్యాధులను ప్రోటీన్ కిరణాలతో చికిత్స చేసినపుడు మరింత ఉత్తమమైన ఫలితాలు
లభించాయని అమెరికన్ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కణితి గుండా ఒకే స్థాయిలో
వికిరణ డోస్ పంపుతారు. అదే సమయంలో కణితి పరిసరాల్లోని ఆరోగ్యవంతమైన కణజాలం
దెబ్బతినకుండా చూసేందుకు జీరో డోస్‌లో రేడియో ధార్మిక వికిరణాలను పంపుతారు.రేడియేషన్
థెరపీలో ఉపయోగించే ఫోటాన్ కిరణాలు శరీరం గుండా ప్రయాణించే సమయంలో కొంత శక్తిని
కోల్పోతాయి. అంతేగాక కిరణాలు శరీరంలోకి ప్రవేశించవలసిన చోట చర్మంపై అత్యధికంగా
కేంద్రీకృతమవుతాయి. శరీరం మందాన్నిబట్టి లోనికి ప్రవేశించాల్సిన కిరణాల్లో కొన్నింటి శక్తి
క్షీణిస్తుందని పరిశోధకులు గమనించారు. కేన్సర్‌కు గురైన ప్రోస్టేట్ గ్రంథిని శస్తచ్రికిత్స ద్వారా
తొలగించినపుడు కలిగిన ఫలితమే ప్రోటాన్ కిరణాల చికిత్సలో కూడా లభించడం
విశేషమంటున్నారు ఈ వైద్య పరిశోధకులు.

No comments:
Post a Comment