Friday, 17 October 2014

భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ


- అందుకే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ప్రయోగం
- మూడు నావిగేషన్‌ ఉపగ్రహాలు సిద్ధం
- మరో నాలుగింటితో సంపూర్ణం
    ఇప్పుడు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిష్టమ్‌(జిపిఎస్‌)- ఈ పదం తెలియని వారు లేరు. దారీతెన్ను తెలియని ఎడారిలో వదిలేసినా చేతిలోని సెల్‌ఫోన్‌లో జిపిఎస్‌ వ్యవస్థ ఉంటే చాలు....మన స్వస్థలానికి చేరిపోవచ్చు. అమెరికా ప్రయోగించిన ఉపగ్రహాల సహాయంతో ప్రపంచ దేశాలు జిపిఎస్‌ వ్యవస్థను వినియోగించుకుంటున్నాయి. అయితే భారత ఉప ఖండం కోసమే ప్రత్యేకంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించేందుకు నడుం బిగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) - ఇస్రో. అందులో భాగమే బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత, గురువారం తెల్లవారు జామున 1.32 గంటలకు శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వి-సి26 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహం.
భారత దేశానికి సొంతంగా జిపిఎస్‌ వ్యవస్థను రూపొందించడం కోసం ఇండియన్‌ రీజినల్‌ నావిగేషనల్‌ శాటిలైట్‌ సిష్టం(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)కు శ్రీకారం చుట్టింది. భారత ఉపఖండంపై స్థాన గుర్తింపు, గమనాన్ని సూచించేలా తయారు చేయనున్న ఈ వ్యవస్థ కోసం మొత్తం ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను ప్రయోగించాలిని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ(తొలి నావిగేషన్‌ ఉపగ్రహం) ఉపగ్రహాన్ని 2013 జులై 1న విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్‌ఎల్‌వి-సి22 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బిని పిఎస్‌ఎల్‌వి-సి24 ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఐదు నెలల తేడాతో గురువారం తెల్లవారి జామున మూడో నావిగేషన్‌ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సిను కక్ష్యలోకి పంపిన ఇస్రో తన సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు చాటింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ సంపూర్ణం కావాలంటే మరో నాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాల్సివుంది. దీన్ని 2015 చివరి నాటికి పూర్తి చేయాలన్నది ఇస్రో లక్ష్యం. ఏడు ఉపగ్రహాలూ కక్ష్యలోకి వెళ్లిపోతే భారత్‌కు సొంత జిపిఎస్‌ వ్యవస్థ తయారవు తుంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బి ఉపగ్రహాలు సంతృప్తికరంగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎ, భారత నావిగేషన్‌ వ్యవస్థ దేశ సరి హద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దాకా కూడా పని చేస్తుంది. ఇప్పుడు పంపుతున్న ఉపగ్రహాల జీవిత కాలం పదేళ్లుగా అంచనా వేసి ప్రయోగిస్తున్నారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ ద్వారా రెండు రకాల సేవలు అందించనున్నారు.
స్టాండర్డ్‌ పొజిషనింగ్‌ సర్వీస్‌ (ఎస్‌పిఎస్‌) దాన్ని ప్రజలందరికీ అందిస్తారు. అంటే ఇది జిపిఎస్‌ సేవలందిస్తుంది. ఇక రిస్ట్రిక్టెడ్‌ సర్వీస్‌ (ఆర్‌ఎస్‌) సేవలను అధీకృత వినియోగదారులకు మాత్రమే అందిస్తారు. ఈ నావిగేషన్‌ వ్యవస్థ నిర్వహణలో కర్ణాటక బైలాలులోని ఇండియన్‌ నావిగేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌సి) కీలకంగా వ్యవహరిస్తుంది. అక్కడి నుంచే ఈ ఉపగ్రహాల నియంత్రణ, పర్యవేక్షణ జరుగుతుంది. నావిగేషన్‌ వ్యవస్థ విమానాలు, ఓడల రాకపోకలను తెలుసుకోడానికి ఉపయోగ పడుతుంది. ఉపద్ర వాలు సంభవించినపుడు సహాయక చర్యల్లో ఎస్‌పిఎస్‌ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఇంకా వాహన చోదకులు దార్లు తెలుసుకోడా నికి, అవసరమైన సందర్బాల్లో భూమికి సంబంధిం చిన మ్యాపులు రూపొందించడానికి దోహదపడుతుంది. మొబైల్‌ ఫోన్స్‌తో నావిగేషన్‌ వ్యవస్థ అనుసంధానమై ఇప్పటి జిపిఎస్‌లాగా సేవలిందిస్తుంది. నావిగేషన్‌ వ్యవస్థతో బహుముఖ ప్రయోజనాలు ఉండడంతో ఇస్రో దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేసే పనిలో ఉంది.

Curtsey with: PRAJA SEKTHI DAILY 
నిశిరాత్రి నింగిలోకి

- ముచ్చటగా మూడడుగులు
- మిగిలింది నాలుగడుగులే...
- 2015 నాటికి సంపూర్ణ నావిగేషన్‌ సిస్టమ్‌ : ఇస్రో
      నిశిరాత్రి... బుధవారం అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయం...దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్నవేళ... అక్కడ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ... కళ్లు చిట్లించి మరీ మరో విజయానికి చేరువవుతున్నామన్న ఆశతో చూస్తున్నారు. వారిలో మొక్కవోని విశ్వాసం కనిపించింది. చిమ్మచీకటి... కడలి అలల శబ్దం తప్ప మరొకటి విన్పించడం లేదు. అర్ధచంద్రాకార జాబిలమ్మ తొంగి చూస్తుండగా అక్కడి మాస్టర్‌ కంట్రోల్‌ రూం నుండి మైనస్‌ 8,7,6,5,4,3,2,1... ప్లస్‌ 1,2,3,4,5,6,7,8 అనగానే ఒక్కసారిగా కారు చీకట్లను చీల్చుకుంటూ పిఎస్‌ఎల్‌వి నింగివైపు దూసుకెళ్లింది. ఆ కాంతిపుంజం వెలుతురుతో అక్కడ అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరి సింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కు నమ్మకమైన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ హెవి కల్‌(పిఎస్‌ఎస్‌వి) ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)1సి ఉపగ్రహా న్ని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్‌లోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ ఇందుకు వేదికగా నిలి చింది. పిఎస్‌ఎల్‌వి విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలి కితురాయి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పిఎస్‌ఎల్‌విది 28వ ప్రయోగం. ఇప్పటికి 27 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగితే 26 విజయవంతమయ్యాయి. తొలి ప్రయోగం విఫలమైంది. రెండో ప్రయోగం నుండి విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో ఆ సంఖ్య 27కు చేరింది. ఇది శాస్త్ర సాంకేతిక రంగాల్లో సువర్ణక్షారాలతో లిఖించదగిన అంశం. భారత్‌ అవసరాల కోసం మొత్తం ఏడు నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. మూడో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 2015 నాటికి పూర్తి నావిగేషన్‌ ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేస్తామని ఇస్రో సగర్వంగా ప్రకటించింది.
సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) కేంద్రంగా ఎప్పుడు ప్రయోగం జరిగినా శ్రీహరికోట, సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజలు ప్రయోగాన్ని వీక్షించడానికి తహతహలాడేవారు. ఈసారి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ప్రయోగానికి అర్ధరాత్రి దాటాక ముహూర్తం నిర్ణయించడమే కారణం. ఇస్రో కుటుంబాలు, పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, పాత్రికేయులు ప్రత్యక్ష సాక్షులుగా అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయంలో పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకెళ్లింది. విరజిమ్ముతున్న నిప్పుల వెలుతురుతో అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన రెండో ప్రయోగం ఇది. సరిగ్గా 1.32 నిమిషా లకు బయలుదేరిన పిఎస్‌ఎల్‌వి నాలుగు దశల్లో లక్ష్యాన్ని చేరింది. 20.20 సెకన్ల సమయంలో భూమికి దగ్గరగా 282.56 కిలోమీటర్లు, దూరంగా 20,670 కిలోమీటర్ల భూస్థిర కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహాన్ని దిగ్విజ యంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఛైర్మన్‌ రాధక్రిష్ణన్‌ ప్రయోగం విజయవంతమై యిందని ప్రకటిం చారు. దాంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు ఒకరినొకరు అలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఇప్పటి వరకు ఇస్రో రెండు నావిగేషన్‌ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం అర్ధరాత్రి జరిగింది మూడోది. నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌లో ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తే దేశీయ అవసరాలకు సరిపోతుంది. కక్ష్యలోకి చేరిన వెంటనే ఉప గ్రహంలోని రెండో సోలార్‌ ప్యానల్స్‌ విచ్చుకున్నాయి. కర్నాటకలోని హసన్‌లోని ఉప గ్రహ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసుకుంది. దేశంలోని 15 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన గ్రౌండ్‌ సేష్టన్లకు అందుబాటులోకి వచ్చింది.
మరో నాలుగడుగులే...!
     భారత్‌ తన సొంత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్‌ ఉపగ్రహాల   విజయపరంపర కొనసాగుతోంది. మూడు ప్రయోగాలు విజయం సాధించాయి. మరో నాలుగు నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాలు పూర్తి చేస్తే ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపోతుంది. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా నుండి భారత్‌ తీసుకుంటోంది. అందుకోసం పెద్ద మొత్తం ఖర్చు చేస్తోంది. నౌకలు, విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు దిక్సూచిగా నావిగేషన్‌ పని చేస్తోంది. మరో 45 రోజుల్లో మరో ప్రయోగం చేపడుతున్నట్లు ఇస్రో పేర్కొంది. 2015 నాటికి దేశ అవసరాలకు కావాల్సిన నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ ప్రకటించారు. ఈ ప్రయోగాన్ని పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, మిషన్‌ డైరెక్టర్‌ కున్నికృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవిఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు చంద్రదత్తన్‌, శివరామకృష్ణ పాల్గొన్నారు.
Curtsey with: PRAJA SEKTHI 

Saturday, 4 October 2014

గుండె బాగుండాలంటే...

              మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. అది ఆరోగ్యంగా ఉండాలంటే దాని గురించిన అవగాహన ఉండాలి. గుండెకు సంబంధించిన వివిధ సమస్యలకు, గుండె జబ్బుకు తేడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొందరు గుండె దడగా ఉన్నా గుండె జబ్బేమోనని కంగారు పడుతుంటారు. సరైన అవగాహన ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నేడు యువకుల్లో కూడా గుండె జబ్బులు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల గుండెకు ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొవ్వు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైనక జీవన విధానం అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయి.
లక్షణాలు
            కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఒక్కోసారి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని కచ్చితంగా చెప్పలేం. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారణకు రావాలి.
రెగ్యులర్‌ చెకప్‌
           నలభయ్యేళ్లు దాటినవారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇసిజి, 2 డి ఎకో, కొలెస్ట్రాల్‌, టిఎంటి పరీక్షల ద్వారా గుండె పనితీరు, జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు ఉంటే
            పరీక్షల్లో గుండె జబ్బు ఉందని తేలినట్లయితే, అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడుంది, ఎన్నిచోట్ల రక్త నాళాల్లో అడ్డంకులున్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరం. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు, అంతకంటే ఎక్కువబ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసిఎ)లో సమస్య ఉన్నా బైపాస్‌ సర్జరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్లల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా, ఇక ఏం పర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, డైట్‌ కంట్రోల్‌ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.
జాగ్రత్తలు
         నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ అరగంటపాటు నడవడంవల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
- డా|| జి.సూర్య ప్రకాష్‌,
కార్డియాలజిస్టు, కేర్‌హాస్పటల్‌ ముషిరాబాద్‌, హైదరాబాద్‌
9866822286. 

Courtesy  with: PRAJA SEKTHY DAILY

ఆరోగ్యానికి హాని... అజనమామోటో
                         గతంలో భోజనం చేయడమంటే కేవలం ఇంట్లో వంట చేసుకుని తినడమే. బైటినుంచి పదార్థాలు తెచ్చుకుని తినడమనేది చాలా అరుదుగా జరిగేది. కాని ప్రస్తుతం కాలం మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు (రెడీ టు ఈట్‌) దర్శనమిస్తున్నాయి. అయితే దీనితోపాటు ప్రజల్లో కొంత చైతన్యం కూడా పెరిగింది. గుడ్డిగా ఏదిపడితే అది కొనుక్కుని తినే పరిస్థితిలో ప్రజలు లేరు. తాము తీసుకుంటున్న ఆహార పదార్థాలలో ఏఏ దినుసులు మిళితం చేసి తయారు చేశారనే విషయాన్ని ఆయా ప్యాకెట్ల లేబుల్స్‌పై చూస్తున్నారు. ఈ రకమైన చైతన్యం ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు అందులో కలిపే అజినామోటోపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.
                అజినామోటో శాస్త్రీయ నామం మోనోసోడియం గ్లూటమేట్‌. ప్యాకెట్లలో లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలలో దీనిని ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాలను తయారు చేయడంలో మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం అన్ని రకాల ఆహారాల్లోనూ దీనిని వాడుతున్నారు.
               రెడీ టు ఈట్‌ పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ను నిశితంగా పరిశీలిస్తే అందులో వాడిన దినుసుల జాబితాలో ఖచ్చితంగా అజినామోటో పేరు కూడా కనిపిస్తుంది. నూడుల్స్‌ వంటి పదార్థాల్లోనే కాకుండా చివరకు ఆలు చిప్స్‌ వంటి పదార్థాల్లో కూడా దీని వాడకం కనిపిస్తుంది.
జపాన్‌కు చెందిన అజినామోటో కార్ప్‌ దీనిని తొలిసారిగా 1909లో కనుగొన్నది. ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా ఉండేట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనికి అలవాటుపడేలా చేస్తుంది. అజినామోటో అతి తక్కువ ధరకే లభ్యం కావడమనేది ఆహర పదార్థాలు తయారు చేసే కంపెనీలకు ఒక వరంగా మారింది. దీనిని ఉపయోగించడం వారికి లాభాలను చేకూర్చిపెట్టింది. ప్రస్తుతం దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
అజినామోటో వల్ల కలిగే అనర్థాలను పరిశీలిద్దాం.
                    తలనొప్పి : మోనోసోడియం గ్లూటమేట్‌ ప్రధాన దుష్పరిణామం తలనొప్పి. అయితే ఇది చిన్న సమస్య మాత్రమే. ఈ తలనొప్పి నెమ్మదిగా మైగ్రేన్‌గా రూపాంతం చెంది తరువాత కాలంలో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశాలున్నాయి. తలనొప్పి తీవ్రంగా రావడమే కాకుండా, పదేపదే వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
                నాడీ వ్యవస్థపై ప్రభావం : అజినామోటో వల్ల నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. నరాలు మొద్దుబారడం, చిటపటమంటున్నట్లు ఉండటం, ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. మత్తుగా ఉన్న భావన, బలహీనత కనిపిస్తాయి. నరాల క్షీణత కారణంగా సంభవించే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌, హంటింగ్టన్స్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ తదితర వ్యాధులు సోకడానికి అజినామోటో కారణమవుతుంది.
               గుండె జబ్బులు : గుండె కొట్టుకునే క్రమాన్ని అజినా మోటో దెబ్బ తీస్తుంది. ఛాతీ నొప్పి, హఠాత్తుగా గుండె వైఫల్యం చెందడం వంటి సమస్యలకు కారణమవుతుంది.
            మహిళలకు మంచిది కాదు : అజినామోటో వల్ల స్త్రీలలో వంధ్యత్వం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు అజినామోటో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. శిశువులకు అజినామోటో ఉన్న ఆహారాలను ఇవ్వకూడదు. ఇటువంటి హెచ్చరికలు ప్యాకెట్లపై ప్రచురించాలని వారు సూచిస్తున్నారు.
             ఇతర సమస్యలు : అధిక రక్తపోటు, ఉదరకోశ సంబంధ రుగ్మతలు, థైరాయిడ్‌ పనితీరు దెబ్బ తినడం, స్థూలకాయం, ఆస్తమా, టైప్‌ 2 మధుమేహం, హార్మోన్లలో అసమతుల్యత, ఆటిజం, ఎలర్జీలు మొదలైన అనేక సమస్యలకు అజినామోటో కూడా కారణమవుతున్నది.
Courtesy with: PRAJA SEKTHY DAILY

Saturday, 13 September 2014

పుదీనాతో మచ్చలు మాయం

                         ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో పుదీనా ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. దోమలు కుట్టడం వల్ల, ఇతర కారణాల వల్ల ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను పుదీనా ఆకుల రసం దూరం చేస్తుంది. పుదీనా నూనెతో (మింట్‌ ఆయిల్‌) తలకు మసాజ్‌ చేస్తే చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి. మహిళలు మొటిమల కారణంగా కలిగే నల్ల మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. పుదీనా ఇటువంటి మచ్చలను ను తగ్గిస్తుంది. పుదీనా రసంలో ఓట్స్‌ పౌడర్‌ను మిక్స్‌ చేసి చర్మానికి రాసు కుంటే నల్లమచ్చలను తొలగించడమే కాక, డెడ్‌ స్కిన్‌ను కూడా తొలగి స్తుంది. మచ్చలు తొలగించడంలోనూ, పాదాల పగుళ్లను నివారించడంలోనూ పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరి గించి ఆ నీటిలో పాదాలను కొద్ది సమయం నాన బెట్టాలి. వారానికి రెండు, మూడు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.

Courtesy  with: PRAJA SEKTHY DAILY

Friday, 5 September 2014

ఓ 'సూపు' చూడండి!
             వర్షాకాలంలో సాయంత్రం చిరుజల్లు పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తాగాలని, తినాలని అనిపిస్తుంది. అంతేకాదు, ఈ సీజన్‌లో కొన్ని చిరుజబ్బులు జలుబు, గొంతు బొంగురు పోవడం, దగ్గు, ముక్కుదిబ్బడ మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. వాటికి విరుగుడుగా తీసుకోవాల్సిన మాన్‌సూన్‌ సూప్స్‌ తయారీ ఎలాగో తెలుసుకుందాం.
టమోటో కోకోనట్‌ సూప్‌
          మన భారతదేశ సంప్రదాయంలో భాగం టమోటో కోకోనట్‌ సూప్‌. ఈ టమోటో కోకోనట్‌ సూప్‌ రుచిగా ఉండటమే కాదు, ఇందులో మనకు ఉపయోగపడే కొవ్వు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. వర్షకాలంలో వేడి వేడిగా ఈ సూప్‌ భలే మజా ఇస్తుంది. ఈ సూప్‌ను ఏ వేళలో (బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు , పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ టమోటో కోకోనట్‌ సూప్‌ ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావల్సిన పదార్థాలు: టమోటా ఫ్యూరీ-కప్పున్నర; కొబ్బరి-పావు చెక్క; ఆవాలు-1/2 స్పూన్‌; పంచదార-2 స్పూన్లు; పచ్చిమిర్చి-2;ఇంగువ- చిటికెడు; నూనె- 2 స్పూన్లు; కరివేపాకు- 2 రెబ్బలు, ఉప్పు- రుచికి తగినంత
తయారుచేసే విధానం: ముందుగా పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, కాస్త కాగాక ఆవాలు వేసి, చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించి, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే టమాటా ప్యూరీ, అతి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, రెండు కప్పుల నీళ్లు వేసి, సన్నటి సెగన, మూతపెట్టి మరగని వ్వాలి. మధ్యమధ్యలో కలపడం మరిచిపోవద్దు. మిశ్రమం కొంచెం దగ్గర పడిన తరు వాత, మంట మీద నుంచి తీసి, బాగా చల్లారని వ్వాలి. చల్లారిన తరువాత పంచ దార, ఉప్పు వేసి, బాగా గిలకొట్టాలి. ఆ తరువాత సన్నటి సెగన కొద్దిసెకన్ల పాటు వేడిచేసి, సర్వ్‌ చేయాలి. అంతే టమోట కోకోనట్‌ సూప్‌ తయార్‌.
స్ట్రాబెర్రీ సూప్‌
        స్ట్రాబెర్రీస్‌ ఒక మంచి మూడ్‌ను ఇచ్చేవి. ఈ ఫ్రూట్‌ను మీరు ఒక డిసెర్ట్‌గా తీసుకొని ఎంజారు చేయవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. చాలా సింపుల్‌గా, అతి తక్కువ వస్తువులతో, కొంచెం సేపటిలో దీన్ని తయారుచేయొచ్చు.
కావలసిన పదార్థాలు: తాజా స్ట్రాబెర్రీస్‌ - 2 కప్పులు; తాజా క్రీమ్‌- 2 స్పూన్లు; తాజా పెరుగు- కప్పు; పంచదార పొడి- స్పూన్‌; వెనీలా -స్పూన్‌; పుదీనా ఆకులు- గార్నిష్‌ కోసం కొద్దిగా.
తయారుచేసే విధానం: ముందుగా స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత జ్యూసర్‌లో తాజాక్రీమ్‌, పంచదార, పెరుగు వేసి మెత్తగా అయ్యే వరకూ బ్లెండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వెనీలా ఎక్సాక్ట్‌ వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని సూప్‌ బౌల్లో పోయాలి. తర్వాత పుదీనా ఆకులతో గార్నిష్‌ చేయాలి. అంతే స్ట్రాబెర్రీ సూప్‌ రెడీ.
క్యాబేజ్‌ పెప్పర్‌ సూప్‌
          బరువు తగ్గించే, జీరో క్యాలరీ డిష్‌లను మీ రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మీ శరీరంలోని కొవ్వు కణాల్ని కరిగించుకోవచ్చు. అందుకు సూప్‌ డైట్‌ పాపులర్‌ డిష్‌. ఇది బరువు తగ్గించడంలో చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు: క్యాబేజీ-4 కప్పులు (తురుము); క్యారెట్‌- 3 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి); ఉల్లిపాయలు-2 (చిన్న ముక్కలుగా తరిగినవి); మొక్కజొన్న పిండి-1/2 స్పూన్‌; నల్ల మిరియాల పొడి - చిటికెడు; ఉప్పు- రుచికి సరిపడా; వెన్న- స్పూన్‌.
తయారుచేసే విధానం: క్యాబేజీనీ, క్యారెట్‌ను తరగడానికి ముందే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెజర్‌ కుక్కర్‌లో నీరు పోసి వేడిచేయాలి. నీరు మరుగుతుండగా అందులో కట్‌ చేసి పెట్టుకొన్న క్యాబేజ్‌, క్యారెట్‌, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఈ పదార్థాలకు కొద్దిగా ఉప్పు జోడించి బాగా కలపాలి. ఆ తర్వాత ప్రెజర్‌ కుక్కర్‌లో 3-4 విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 3, 4 విజిల్స్‌ వచ్చిన తర్వాత కిందికి దింపుకొని, పక్కకు తీసి, ఐదు నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత మూత తీయాలి. తర్వాత ఫ్రైయింగ్‌ పాన్‌లో కొద్దిగా వెన్న వేసి, కరిగిన తర్వాత ముందుగా కుక్కర్‌లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్‌ సూప్‌ వేసి మిక్స్‌ చేయాలి. తర్వాత అందులోనే మిరియాలపొడి, ఉప్పు వేయాలి. ఈ రెండూ కొద్దిగా కొద్దిగా చిక్కగా మారుతుండగా అందులో మొక్కజొన్న పిండి కూడా వేసి బాగా మిక్స్‌ చేయాలి. అంతే పెప్పర్‌ - క్యాబేజ్‌ సూప్‌ రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. ఇది జలుబుతో పోరాడుతుంది. చల్లని వాతారవణంలో మీ శరీరాన్ని వేడిగా ఉంచుతుంది కూడా.
కొత్తిమీర లెమన్‌ సూప్‌
దీనిని చాలా త్వరగా, సులువుగా తయారుచేసుకోవచ్చు. అన్ని సూప్స్‌లో టమోటో సూప్‌ సాధారణమైనదైతే, కొత్తిమీర లెమన్‌ సూప్‌ ప్రత్యేకమైనది. ఇది చాలా టేస్టీ కూడా. ఈ సూప్‌తో మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కొత్తిమీర - కప్పు; ఉల్లిపాయ- 1 (చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి); స్ప్రింగ్‌ ఉల్లిపాయ (ఉల్లికాడలు)- 1 (సన్నగా తరగాలి); అల్లం-అంగుళం (చిన్న ముక్కలుగా చేయాలి); వెల్లుల్లిపాయ రెబ్బలు- 10 (సన్నగా కట్‌ చేయాలి); నిమ్మరసం- 1/4 కప్పు; వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయలు ఉడకబెట్టిన నీళ్లు) - కప్పు; మిరియాల పొడి- చిటికెడు; ఉప్పు- రుచికి సరిపడా; వెన్న-స్పూన్‌.
తయారుచేసే విధానం: ఫ్రైయింగ్‌ పాన్‌లో వెన్న వేసి కరిగిన తర్వాత, అందులోఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. మొత్తం అన్నీ మెత్తగా అయ్యే వరకూ ఐదు నిముషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కూరగాయ ముక్కలు ఉడికించుకొన్న నీరు పోసి బాగా ఉడికించాలి . ఐదు నిముషాల తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. సూప్‌ చిక్కగా మారే సమయంలో స్టౌ ఆఫ్‌ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. సర్వ్‌ చేసే ముందు కొద్దిగా వెన్నతో గార్నిష్‌ చేయాలి.
ఓట్స్‌ సూప్‌
      రోజూ ఉదయం మనం తీసుకొనే అల్పాహారం చాలా ముఖ్యమైంది. అందులోనూ ఉదయం తీసుకొనే అల్పాహారం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అటువంటి ఆహారాల్లో ఓట్స్‌తో తయారుచేసే ఆహారాలు బెస్ట్‌. అయితే సాదా ఓట్స్‌ను పాలలో కలిపి తినడం కంటే కొంచెం వెరైటీగా, కొంచెం స్పైసీగా ఓట్స్‌ సూప్‌ తయారుచేసి తీసుకోవచ్చు. వర్షాకాలంలో ఓట్స్‌ సూప్‌ ఎక్కువ పోషకాల్ని ఇవ్వడమే కాకుండా కొంచెం తీసుకున్నా, కడుపు నిండినట్టునిపిస్తుంది.ఈ సూప్‌ను అన్ని వయస్సుల వారూ తాగొచ్చు.
కావల్సిన పదార్థాలు: ఓట్స్‌- కప్పు; ఉల్లిపాయ- 1/2(చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); పచ్చిమిర్చి- 1 (చిన్న ముక్క లుగా కట్‌ చేసుకోవాలి); వెల్లుల్లి- 1; లవంగం పొడి-కొద్దిగా, మిరియాల పొడి- చిటికెడు; పాలు-కప్పు, నీళ్ళు-కప్పు; ఆయిల్‌- 2 స్పూన్లు; కొత్తిమీర-గార్నిష్‌ కోసం; ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు లేత బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు వాటిలోనే ఓట్స్‌ కూడా వేసి, మరో రెండు నిము షాలు వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేయాలి. మీడియం మంట మీద ఈ మిశ్రమాన్నంతటినీ ఉడికించు కోవాలి. ఓట్స్‌ మెత్తగా ఉడకా యని నిర్ధారించుకున్నాక, అందులో పాలు, మిరి యాలు, లవంగాల పొడి వేసి, మరో నిముషం పాటు ఉడికించుకోవాలి. ఓట్స్‌ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ క్రీమీ ఓట్స్‌ సూప్‌ను కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Courtesy with: PRAJA SEKTHI DAILY
వనస్పతి (డాల్డా)ని ఎలా తయారు చేస్తారు?
       స్వీట్లు, బిర్యాని లాంటి ప్రత్యేకమైన వంట కాలు తÄయారు చేయ టానికి వనస్పతిని కూడా ఉపయోగిస్తారు. వనస్పతిని ఎక్కువ మంది డాల్డా అని పిలుస్తారు. దీనిని ఎలా తÄయారు చేస్తారో తెలుసు కుందాం. మూమాలు వంటలకు వాడుకునే నూనెల హైడ్రోజనీకరణ వలన వనస్పతి తÄయారు అవుతుంది. శాకీయ నూనెను (వెజటబుల్‌ అయిల్‌) తీసుకుని దానిని నిఖిల్‌ అనే మూలాకాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించి హైడ్రోజన్‌ వాయువుతో కలిసి 200 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ వద్ద వేడి చేస్తే వనస్పతి ఏర్పడుతుంది. అసంతృప్త ద్రావణమైన నూనె ఈ చర్యతో సంతృప్తంగా మారటంతో వనస్పతి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఇంట్లో తÄయారు చేసుకుని తినడం కన్నా బయట నుంచి తెచ్చుకునే తినటం ఎక్కువైంది. పచ్చళ్లు, చిప్స్‌ లాంటి వాటిని కొనుక్కొని తినటం సర్వ సాధారణం అయిపోయింది. చిప్స్‌లాంటి పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచటానికి వాడే పదార్థం ఏమిటో చాలా మందికి తెలియదు. చిప్స్‌ ప్యాకెట్లలో జడ వాతావరణం కొరకు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. నైట్రోజన్‌ వాయువు ఉండడం వల్ల అక్సిడేషన్‌ చర్య జరగదు. అక్సిజన్‌ లేకపోతే ఆక్సీకరణ చర్య జరగడానికి వీలుకాదు క దా! దాని వల్ల ఆ ప్యాకెట్లలో ఉన్న ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి.
 Courtesy with: PRAJA SEKTHI DAILY

Tuesday, 22 July 2014



ప్రతి మనిషీి శాస్త్రవేత్తే!







అసలు శాస్త్రవేత్తలు లేకుంటే ఏమయుండేది? శాస్త్రవేత్తలు కనుగొనాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా?
- డి.అపర్ణ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌, కాకినాడ
జవాబు: మానవ సమాజం మొత్తం శాస్త్రవేత్తల మయం. శాస్త్రవేత్తలంటే అదో విభిన్నమయిన జీవజాతి కాదు. వారంతా మనుషులే. పుట్టుకతోనే ఎవరూ శాస్త్రవేత్తకాదు. నోబెల్‌ బహుమతి వస్తేనే, భట్నాగర్‌ అవార్డు వరిస్తేనే, నాలుగు పరిశోధనా పత్రాలు సైన్సు జర్నల్‌లో ప్రచురితమయితేనే శాస్త్రవేత్తలు అనుకోవడం అశాస్త్రీయం. చదువురాని పల్లెటూరి రైతు కూడా ఓ శాస్త్రవేత్తే. ఆ మాటకొస్తే మానవులందరూ శాస్త్రవేత్తలే. హేతుబద్ధంగా ఆలోచిస్తూ, పద్ధతి ప్రకారం జీవన కార్యకలాపాలను, సామాజిక జీవనాన్ని నిర్వర్తించే వారందరూ శాస్త్రవేత్తలే. ప్రపంచంలో ఉన్న ప్రజల్లో హెచ్చుమందికి మూఢనమ్మకాలున్నాయి. అంతమాత్రాన వారిని శాస్త్రవేత్తలు కారని అనకూడదు. ఒక నిర్వచనం ప్రకారం శాస్త్రవేత్త అంటే ఏమిటో ఈ విధంగా చెప్పబడింది.
''పదార్థాల అవగాహనతో తన జీవన ప్రక్రియల్లో శ్రమ తగ్గించుకోవడానికి పదార్థాల ధర్మాలకనుగుణంగా ముడిపదార్థాలను ఉపకరించే పదార్థాలుగా మర్చగలమా లేదా మార్చడానికి తగిన జ్ఞానసంపదగల వ్యక్తే శాస్త్రవేత్త''. ఆ విధంగా చూస్తే ముడిపదార్థాలయిన మట్టి, రాళ్లు, ఇసుక, తదితరాల్ని కొలిమిలో వేసే సిమెంటు కర్మాగారంలోని అందరూ శాస్త్రవేత్తలే. బంకమన్నును తెచ్చి కుండలు చేసే కుమ్మరి, భవనాలు నిర్మించే కమ్మరి, మురికి బట్టలి శుభ్రం చేసే చాకలి, చిందరవందరగా ఉన్న తలకట్టును చక్కని క్రాఫుగా మార్చే మంగలి, నారపోగుల్ని నేతవేసి అందమైన చీరలుగా నేసే నేత కార్మికుడు, తాడి, వెదురు, ఈత వంటి ముడిపదార్థాల నుంచి చక్కని చాపలు, బుట్టలు చేసే మేదరి, మట్టి నుంచి పద్ధతి ప్రకారం సేద్యం చేసి పంటలు పండించే రైతన్న, చక్కగా వంటచేసే వంటవాళ్లు, వినసొంపుగా నాదాన్ని వినిపించే సన్నాయి వాయిద్యకారుడు, తోలు నుంచి చెప్పుల్ని చేసే వ్యక్తి ఇలా అందరూ తమ తమ పనుల్ని ఓ నిర్దిష్ట పద్ధతి ప్రకారం, నిర్దిష్ట ప్రయోజనాల కోసం, నిర్దిష్ట ముడిపదార్థాల్ని తన శ్రమశక్తి, మేధోశక్తి ద్వారా నిర్దిష్ట ఉత్పన్న పదార్థాలు (జూతీశీసబష్‌ర) గా మార్చే ప్రతివ్యక్తీ శాస్త్రవేత్తే. అయితే తరగతిగదిలో అందరూ విద్యార్థులే అయినా వారిలో తరతమ భేదాలున్నట్లే పాదార్థిక పరిజ్ఞానం విషయంలో కూడా మనుషుల మధ్య తారతమ్యాలున్నాయి. అందులో అగ్రస్థానంలో ఉన్నవారే మనం పుస్తకాల్లో చదువుకొనే శాస్త్రవేత్తలు. ఫారడే, ఎడిసన్‌, మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, గెలీలియో, ఫ్లెమింగ్‌, హిగ్స్‌ మొదలైనవారు ఈ కోవకు చెందిన ఘనాపాటి శాస్త్రవేత్తలు.
'శాస్త్రవేత్తలు లేకుంటే ఏమి జరిగియుండేది? అన్న ప్రశ్న ఇపుడు 'ప్రజలే లేకుంటే ఏమి జరుగుండేది?' అన్న ప్రశ్నకు ప్రతిరూపమే.' కానీ ప్రజలే లేని సమాజాన్ని ఊహించలేము కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం 'ఏమి జరిగి ఉండేది కాదని'.
ఇక రెండో ప్రశ్న: 'శాస్త్రవేత్తలు కనుగొన్నవి తెలుసుకానీ కనుగొననివి తెలీవు. ప్రకృతి పరిజ్ఞానం ఇంత అని పుస్తకంలో పేజీల సంఖ్యలాగా ఉండదు. ఎంత తరిచి చూసినా తెలుసుకోవల్సింది ఇంకా ఉంటుంది. తెలుసుకున్న దానిని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. రైట్‌ సోదరులు కనుగొన్న విమానానికి నేటి విమానానికి చాలా తేడా ఉంది. కానీ ఈ పరిణామం ఒక్కరోజులో అయ్యింది కాదు. మార్కొని నిస్తంత్రి విధానపు (షఱతీవశ్రీవరర) సమాచార పంపిణీకి నేటి షఱళ ... తదితర నిస్తంత్రి పద్ధతికి చాలా తేడా ఉంది. ఇది కూడా ఉన్నఫళాన మారింది కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కంప్యూటర్‌కు, నేటి ఆధునిక కంప్యూటర్‌కు తేడా మీకు తెలియంది కాదు. ఇందులో దశాబ్దాల చరిత్ర ఉంది. అలాగని కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లో పరిశోధనలు ఆగాయా? డాల్టన్‌ నాటి పరమాణు భావనకు, నేటి హిగ్స్‌ బోసాన్‌ ఆవిష్కరణకు మధ్య శతాబ్దాల పరిశోధనలు ఉన్నాయి. ఇలా ఎన్నో రంగాల్లో ఎన్నో ఎన్నో అంతుబట్టని రహస్యాలు మిగిలే ఉన్నాయి.
- ప్రొ||ఎ.రామచంద్రయ్య
సంపాదకులు,చెకుముకి, జన విజ్ఞాన వేదిక 

Courtesy with PRAJA SEKTHI DAILY 

Sunday, 6 July 2014

ఎల్ నినో ప్రభావం వలన ఈ సంవత్సరం భారతదేశంలో.....ఫోటోలు

గత శంవత్సరం దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ లో కనీ వినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టించాయి. రాష్ట్రం రూపురేఖలనే మార్చేశాయి. రాష్ట్రంలో వచ్చిన వరుస తఫాన్ లు కోస్తాంధ్రలో పంటలను తుడిచిపెట్టాయి. ఇప్పుడు మరో ఉపద్రవం రాబోతోంది.ఈ సంవత్సరం కూడా భారతదేశ వాతావరణం మీద ఎల్ నినో ప్రభావం పడ్నుందని అది భారత్ ను కరువు కోరల్లోకి నెట్టనుందని వాతావరణ శాఖ నిరాశ కలిగించే సమాచారం అందించింది.
మధ్య ఫసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం లేదా చల్లబడడం వల్ల ప్రతీ ఐదేళ్లకోసారి 'ఎల్ నినో', 'లా నినో' మేఘాల్లో కదలికలు వస్తాయి. ఒకసారి ఎల్ నినో మేఘాలు ఎక్కువగా ఏర్పడితే ఇంకోసారి లా నినో మేఘాలు ఎక్కువగా ఏర్పడుతాయి. దీని కారణంగా వాతావరణంలో వేడి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. 'లా నినో' మేఘాలు ఎక్కువగా ఏర్పడితే వరదలు వస్తాయి. ఫలితంగా 'ఎల్ నినో' మేఘాలు ఎక్కువగా ఏర్పడితే కరువు వస్తుంది. ఇది లాటిన్‌ అమెరికా నుంచి ఆగ్నేయ దిశగా, దక్షిణ ఆసియా దేశాల వైపు వీచే రుతుపవనాలను అడ్డుకుని వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వర్షాలు సకాలంలో పడవు. అందువల్ల ఆ ఏడాది వ్యవసాయం దెబ్బతింటుంది. తిండి గింజల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా ప్రజలు ఆకలితో అల్లాడుతారు.
2004 సంవత్సరంలో భారత దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను వాతావరణంలో ఏర్పడిన ఈ 'ఎల్‌ నినో' ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది దేశంలో సాధారణం కంటే 10 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో సాంకేతికంగా 2004ను కరవు సంవత్సరంగా ప్రకటించారు.
అలాగే 2009లో కూడా 'ఎల్ నినో' ప్రభావం కారణంగా వర్షాలు రాక దేశంలో వ్యవసాయం బాగా దెబ్బతింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కరువు ఈ సంవత్సరంలో ఏర్పడింది.
2014లోనూ 'ఎల్ నినో' తన ప్రభావాన్ని మరోసారి దేశ వ్యవసాయం, ఆర్థిక పరిస్థితిపై చూపనుంది. ఇప్పటికే బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ 'ఎల్‌ నినో' ప్రభావం వస్తే వీటి ధరలు చుక్కల దగ్గరికి చేరుతాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో గత 130 ఏళ్లలో వచ్చిన కరువుల్లో 60 శాతం 'ఎల్‌ నినో' సమయంలోనే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1997 లో ఎల్ నినో ప్రభావం మనదేశ వాతావరణంలో మార్పు తీసుకు వచ్చినా, మన దేశానికి పెద్ద నష్టం జరగలేదని....కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ వ్యయాలు,ధరల కమీషన్ మాజీ అధిపతి అశోక్ గులాటి చెప్పేరు.

Wednesday, 25 June 2014

చీకటిలో వెంటనే వస్తువులు కనిపించవు ఎందుకు?
         పగటి పూట సినిమా హల్లో లైట్లు ఆర్పి వేసిన తర్వాత లోనికి వెళ్లిన వారికి వెంటనే లోపలి మనుషులు గానీ, సీట్లు గానీ స్పష్టంగా కనిపిం చక పోవడం గమనించవచ్చు. కొంచెం సేపటి తర్వాత చూపు స్పష్టం అవుతుంది. బయటి కాంతిని బట్టి మనం కంటిలోని కనుపాప తన ఆకారాన్ని సరి చేసుకుంటుంది. కాంతి తక్కువగా వున్నప్పుడు కనుపాప పెద్దది అవుతుంది. దీనివల్ల కంటిలోకి ఎక్కువ కాంతి ప్రసరిస్తుంది.
          ఎండలో వున్నప్పుడు కనుపాప సంకోచిస్తుంది. అందువల్ల ఎక్కువ వెలుతురులో నుంచి తక్కువ వెలుతురులోకి వెళ్లినప్పుడు కనుపాప ఆ కాంతికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చీకటిలోకి వెళ్లిన వెంటనే వస్తువులు స్పష్టంగా కనిపిం చవు. దీంతో పాటూ ఇంకొంచెం లోతుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కంటిలో రెటీనాలోని ''రొడాప్సిన్‌'' అనే పదార్థం ఎక్కువ వెలుతురులో ఎక్కువ శాతంగా, చీకటిలో తక్కువ శాతంగా వుంటుంది. రోడాప్సిన్‌ వల్లనే వస్తువును చూసే సంకేతాలు మెదడుకు వెళతాయి.
వాస్తులో వాస్తవం లేదు
      ఈ మధ్య వాస్తును చాలామంది పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రము నిజానికి ఓ విజ్ఞానశాస్త్ర భాగమా?
- ఎల్‌. శ్వేత, మందమర్రి, ఆదిలాబాద్‌
        వాస్తులో వాస్తవమేమీ లేదనీ, సందర్భానుసారంగా, అవకాశానుగు ణంగా దానిని వాడుకుంటున్నారనీ, దానికి ఏమాత్రం శాస్త్రీయ ప్రతిపత్తి లేదనీ ఇదే పత్రికలో పలు వ్యాసాల ద్వారా నా మిత్రుడు కె.ఎల్‌. కాంతారావుగారు వివరించి ఉన్నారు.
             ఈ దేశంలో మరే దేశంలోనూ లేనన్ని మూఢనమ్మకాలున్నాయి. మత ఛాందసత్వం, మతతత్వ రాజకీయాలు ఈ మూఢనమ్మకాలకు కావలసినంత సంపోషణనిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో కావాలనే నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలక వర్గాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి, వారిని నిరంతరం ఊహల ప్రపంచంలో ఉంచడానికి, వారి సమస్యల పరిష్కారం వాస్తవ జగత్తులోను, పోరాట స్థలాల్లోను కాకుండా మిథ్యా పేటికల్లో చూపడానికి ఓ పథకం ప్రకారం పనిచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర బీజాలు మనసులో పడకముందే మూఢనమ్మకాల వటవృక్షపు వేళ్లను నరనరాన విస్తరించే మూర్ఖపు వ్యవస్థల్ని ఉసిగొల్పుతున్నాయి. అందువల్లే విజ్ఞానశాస్త్రం, చదువుసంధ్యలు అందించే శాస్త్రీయత స్థానంలో మూఢనమ్మకాల పర్వతాలు పేరుకుపోయాయి. ఇక చదువరులు, అధికారులు, పాలకులు, సాధారణ ప్రజలు శాస్త్రీయ దృక్పథం ప్రాధాన్యాన్ని ఎలా గుర్తించగలరు?
వాస్తును ప్రచారం చేసేవారు విజ్ఞానశాస్త్రపు వాదనల సమయంలో గాలి, వెలుతురు, దుమ్ము, ధూళి, భవనపు సౌష్టవత, కట్టడపు బలం వగైరా అంశాలను నొక్కి చెప్పడానికే వాస్తు నిపుణులైన మహర్షులు వాస్తును రూపొందించారు కానీ, అందులో అశాస్త్రీయత ఏమీ లేదని వాదిస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక సివిల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆర్కిటెక్చర్‌కు మౌలిక లేదా వ్యావహారిక వైజ్ఞానిక రూపమే వాస్తు శాస్త్రం అన్న పిక్చర్‌ ఇస్తారు. వాస్తు కూడా సివిల్‌ ఇంజనీరింగే అయినట్లయితే వాస్తు పండితుల దగ్గరికి వెళ్లకుండా ఓ నమ్మదగిన సివిల్‌ ఇంజినీరును సంప్రదించాలి.
          వాస్తు చుట్టూ వైజ్ఞానిక విషయాలు దాదాపు శూన్యం. ఇంట్లో జ్వరం వచ్చినా, అల్లుడికి అమెరికాలో ఉద్యోగం ఊడినా, ఫలాని కళాశాలలో కొడుకుకి మార్కులు తక్కువ వచ్చినా, కూతురు పెళ్లి కావడానికి ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య రోజూ వాగ్వివాదాలు, ఘర్షణలు ఉంటున్నా, పదవి ఊడిపోతుందేమోనన్న భయం ఉన్నా, పాలనా దక్షత లేక తన పరిపాలనలో ఎపుడూ సమస్యలు వస్తున్నా ఆ సమస్యల్ని సహేతుకంగా, వాస్తవ ప్రపంచంలో సామాజిక కోణాల్లోంచి చూడకుండా ఇంటిగోడల మూలల్లోను, తలుపు సందుల్లోను, కిటికీ ఊచల్లోను, తలుపుల సంఖ్యలోను, పెరటి చెట్లలోను, తోటల్లోను, ఇంటిపైనున్న బరువులలోను పరిష్కారాలను వెదికే కుహనా శాస్త్రమే వాస్తు.
       భౌతికవాదుల ప్రకారం భూమికి ఉన్న అయస్కాంత దిశ తప్ప మరే విషయంలోను ఓ నిర్దిష్ట ప్రాంతీయ దిశలను బట్టి తేడాలు ఉండవు. మా ఇంటికి తూర్పున చెట్టు ఉంటే అది పక్కింటి వాళ్లకు పడమర ఉన్నట్లు అర్థం. మా ఇంట్లో బోరుబావి ఈశాన్యంలో ఉంటే అదే బోరు బావి నుంచి అడపా దడపా నీళ్లు పొందుతున్న పక్కింటి వాళ్లకు ఆగేయంలో ఉన్నట్టు అర్థం.

Curtsey with : PRAJA SEKTHI 

Monday, 9 June 2014

రోగిని వెటిలేట‌ర్ మీద ఎప్పు‌డుపెడుతారు?


   రోగిని వెంటి లేటర్‌ మీద ఎందుకు పెడతారు, అలా పెడితే బతికే అవకాశం ఉంటుందా? అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తుంటారు. అయితే అది రోగి ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వెంటిలేటర్‌ మీద పెట్టినంత మాత్రాన కచ్చితంగా బతుకుతారనో, అసలు బతికే అవకాశం లేదనో గుడ్డిగా చెప్పలేం. రోగి కండిషన్‌ సీరియస్‌గా ఉండి, బతికే అవకాశాలు తక్కువున్నప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా వెంటిలేటర్‌ పెడతారు. అది కూడా రోగి కుటుంబ సభ్యులకు తెలిపి, వారి అనుమతితో పెడతారు. దీనివల్ల చివరి వరకూ ప్రయత్నం చేశామన్న సంతృప్తి రోగి తరపు వారికి కలుగుతుంది. అలాగని ప్రతి కేసులోనూ ఇలాగే చేస్తారని అనుకోవద్దు.
రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినప్పుడు
సాధారణంగా రక్తంలో ఆక్సిజన్‌ తక్కువ ఉన్నప్పుడు, బొగ్గు పులుసు వాయువు ఎక్కువ ఉన్నప్పుడు, రోగి ఆయాసపడుతున్నప్పుడు వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది. రోగి అపస్మారక స్థితిలో ఉండి, ఊపిరి తీసుకోలేకపోతున్నప్పుడు, ఊపిరి తీసుకోవడానికి అవసరమయ్యే కండరాలు పనిచేయనప్పుడు వెంటిలేటర్‌ పెడతారు. ఊపిరి తిత్తులకు న్యుమోనియా, సిఒపిడి , ఉబ్బసం తీవ్రంగా సోకినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు అవసరాన్నిబట్టి వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది.
పెట్టే విధానం
వెంటిలేటర్‌పై పెట్టాలంటే, ముందు శ్వాసనాళంలోకి గొట్టం వేస్తారు. దానిని వెంటిలేటర్‌ ట్యూబులతో కలుపుతారు. ఈ ప్రక్రియలో శరీరం సహజ సిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమిస్తుంది. ఇంకా నష్టం జరగకుండా, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా, నిష్ణాతులైన ఐసియు డాక్టర్లు, నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్టులు 24 గంటలూ జాగ్రత్తగా చూసుకుంటారు.
పరిస్థితి మెరుగుపడే వరకు
ఒకసారి వెంటిలేటర్‌ పై పెట్టిన తర్వాత ఆ పరిస్థితి మెరుగయ్యే వరకూ ఎన్ని రోజులైనా ఉంచాల్సి రావచ్చు. కొంతమందిలో వెంటిలేటర్‌ తీయడం కష్టం కావచ్చు. ఉదాహరణకు సిఒపిడి ఉన్నా, చాలా రోజులు వెంటిలేటర్‌ మీద ఉన్నా, ఊబకాయంవల్లా, కండరాల బలహీనత ఉన్నప్పుడు ప్రత్యేక పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఐదురోజులకన్నా ఎక్కువ రోజులు వెంటిలేటర్‌ అవసరం అయితే ట్రాక్యులోస్టమీ అని చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు, వెంటిలేటర్‌ని తొందరగా తీసేయవచ్చు. మళ్లీ అవసరమైతే ప్రమాదం లేకుండా వెంటనే కనెక్ట్‌ చేయవచ్చు.
ప్రస్తుతం సాంకేతిక, వైద్య పరిజ్ఞానం పెరిగింది. వైద్య సేవలకు కావలసిన యంత్రాలు పాశ్చాత్య దేశాలతో సమానంగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. కాకపోతే మనకున్న సమస్యంతా ఒక్కటే. అదేమిటంటే సామాన్యులు అంత ఖర్చు భరించలేకపోవడం, ఇన్సూరెన్స్‌ లేకపోవడం. వెంటిలేటర్‌పై పెట్టినప్పుడుగానీ, ఏ ఆరోగ్య సంబంధిత విషయంలోనైనా గానీ సందేహం కలిగినప్పుడు చికిత్స చేస్తున్న డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవడం మంచిది.

Curtsey with: PRAJA SEKTHY
 
వ‌ర్షా‌కాలం... హ‌ర్షోల్లా‌సం ...

    వర్షాన్ని ఎలా కొలుస్తారు?
        వర్షపాతాన్ని వర్షమానిక (రెయిన్‌ గేజ్‌)తో కొలుస్తారు. ఈ కొలతను ఒక చదరపు తలంపై సేకరించిన నీటి లోతుగా వ్యక్తీకరిస్తారు. 0.01 మి.మీ లేదా 0.01 అంగుళాల ఖచ్చితత్వంతో వర్షాన్ని కొలుస్తారు. వివిధ ప్రదేశాల్లోని వర్షమానికలను భూమినుండి ఒకే ఎత్తులో ఉంచుతారు. వర్షమానికలు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిలువ వర్షమానికలు, రికార్డింగు వర్షమానికలు. నిలువ వర్షమానికలను దినసరి వర్షపాతాన్ని లేదా నెల మొత్తం కురిసిన వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగు వర్షమానికలను వర్షపాతం తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగ్‌ వర్షమానికలో ఒక బకెట్‌లో నిర్దిష్ట ఘనపరిమాణంలో వర్షం నీరు చేరినప్పుడు ఆ బకెట్‌లోనుంచి నీరు ఒలికిపోతుంది. ఇలా బకెట్‌ నిండి, నీరు ఒలికిన ప్రతిసారీ ఒక విద్యుత్‌ స్విచ్‌ దానిని నమోదు చేస్తుంటుంది.
రుతువుల రాణీ వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచువృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లూ, బయళ్లూ, ఊళ్లూ, బీళ్లూ
ఏకం చేసే వర్షాకాలం,
స్వచ్ఛకౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలి వడికించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమిత్తమే
(శ్రీశ్రీ-శైశవగీతి)
         రుతువులు వస్తూ పోతూ మీ నిమిత్తమే దాగుడు మూతల క్రీడలాడుతాయని మహాకవి శ్రీశ్రీ బాలలతో అంటున్నాడు. నిజానికి రుతువులు ఆడే దాగుడుమూతల ఆట ఎవరికి ఇష్టం కాదు? వాటి ముందు పెద్దలు కూడా పిల్లలే అయిపోతారు. మనిషి తన జీవితంలో ఎన్ని వసంతాలు, ఎన్ని శరత్తులు, ఎన్ని హేమంతాలు, ఎన్ని వర్షాలు చూసినా ఏటా ప్రతిసారీ వాటిని కొత్తగా చూస్తూనే ఉంటాడు. రుతుభ్రమణంతోపాటే వాటిని అల్లుకున్న మనిషి జ్ఞాపకాలు, అనుభూతుల భ్రమణం కూడా ఏటేటా నూతనత్వాన్ని తెచ్చుకుంటూనే ఉంటుంది.
           వచ్చేది వర్షరుతువు. ఎందరికో హర్షరుతువు. విఫలమైతే విషాదరుతువు కూడా. రుతువులలో వర్షరుతువు దారే వేరు. ఎండాకాలం ఎర్రని ఎండ మాడ్చేస్తుంది. శీతాకాలం చలి ఒక్కోసారి ఎముకల్ని కొరికేస్తుంది. కన్యాశుల్కంలో చెప్పినట్టు ఇవి పోలీసు దెబ్బలు చేసే పైకి కనిపించని గాయాలలాంటివి. వర్షాకాలం అలా కాదు. చిరుజల్లుతో మొదలై, చిన్నా పెద్దా చినుకుగా మారి, కుంభవృష్టిగా పరిణమించి, వరదగా ముంచెత్తే వర్ష విజృంభణం మనకు ఒక్కోసారి మరింత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ అనుభవంలోకి వస్తూ ఉంటుంది.
                       గ్రీష్మతాపంతో వేగిపోయిన దేహంపై తొలకరి జల్లు కలిగించే పులకింతను మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడు వేసే అదోరకం మట్టివాసన ఒక జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు తాకే ఆ మట్టివాసన వర్షం పడుతోందన్న సంకేతాన్ని మన మెదడుకు అప్రయత్నంగా అందిస్తుంది. శ్రావణ, భాద్రపదాల దగ్గరికి వచ్చేసరికి ప్రియవర్షం కాస్తా వరదలు పోటెత్తించి భయవర్షంగా మారి చాలు బాబూ, ఈ వర్షాలు అని కూడా అనిపిస్తుంది, అయినాసరే, ఏటేటా నిత్యనూతనంగా మనిషి వర్షోల్లాసాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
              వర్షాలు మొదలవడం కవులకు ప్రతిసారీ కవిత్వోద్దీపకమే. ప్రముఖ కవి కె. శివారెడ్డి 'వర్షాలు మొదలయ్యాయి' అనే శీర్షికతో రాసిన ఓ కవితలో ఇలా అంటారు.

నిశ్శబ్దంగా
కూర్చున్న నా వళ్లో
నాలుగు చినుకులొచ్చి వాలాయి
చినుకులకు రెక్కలుంటాయని
కిరణంలా బద్దలయ్యే శక్తి వుంటుందని
నా కిదివరకు తెలియదు
కర్టెన్‌ ఎత్తి తొంగి చూస్తాయి
కిటికీ అవతల నుంచుని కాళ్లు లోనికి
దీర్ఘంగా చాపుతాయి,
చిన్నప్పుడెప్పుడో చీకట్లో
బల్ల కింద వస్తువుల్ని కాళ్లతో దేవులాడినట్టు
చినుకులకు వళ్లంతా కళ్లు
..........................
చినుకుల కేసీ చినుకుల్లో నానుతున్న చెట్ల కేసి
మనుషుల కేసీ, వస్తువుల కేసీ, వాహనాల కేసీ
అప్పుడే చూపొచ్చినట్టు చూడడం
మరుక్షణంలో కళ్లు పోతాయన్నట్టు
చూపులాగుతాయన్నట్టు, సాంద్రంగా
తదేకంగా, తన్మయంగా, తనివి తీరనట్టు చూడడం-

ఎవరో నా నెత్తిన వర్షం కొంగు కప్పారు
ఎదురుగ్గా ఉన్న
అయిదంతస్తుల పంజరంలో
రెండు చినుకులు కిచకిచమంటున్నాయి-
వర్షాలు మొదలయ్యాయి
                మిగతా రుతువులతో పోల్చితే వర్షరుతువుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, రుతువుల రాణీ వసంతమే కానీ, సాహిత్యానికి ఎక్కువ వస్తువును సమకూర్చింది మాత్రం వర్షమే. వర్షం అనగానే మనకు వెంటనే మేఘం గుర్తుకు రావలసిందే. కావడానికి ఆషాఢమేఘమే కావచ్చు కానీ, కాళిదాసు మేఘదూతం కావ్యంలో ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య మేఘమే వార్తాహరి అయింది. ఇక కావ్యాలలో వర్షరుతు వర్ణనలు సరేసరి. అయితే, ఆహ్లాదకత్వం వర్షానికి ఒక పార్శ్వం మాత్రమే, ఇంకో పార్శ్వాన్ని చూస్తే వర్షం ఏటేటా మనిషిలో పంటసిరుల ఆశలు మోసులెత్తించే జీవనధార కూడా. ఒక ఏడాది వర్షం కరుణించిందంటే ఆ ఏడాది రైతు ఇంట అన్నరాశికి లోటు లేనట్టే. ఆ ఏడాదంతా రైతు కంట ఆనందవర్షమే. కానీ ఒక్కో ఏడాది వర్షం మొహం చాటేస్తుంది. మబ్బులు తెల్లమొహం వేస్తాయి. ఇంకా అన్యాయంగా వరసగా రెండు మూడేళ్లపాటు అనావృష్టి కొనసాగుతుంది. ప్రభుత్వాల రైతు వ్యతిరేక అపసవ్య విధానాల పుణ్యమా అని రైతు బతుకు అప్పుల ఊబిగా మారి ఎండిన పొలాలు ఆత్మహత్యలనే పండిస్తూ ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికీ వర్షసమృద్ధే ఆ ఏడాది ఆర్థిక ఆరోగ్యానికి కొలమానం అవుతూనే ఉండడం వర్షాలతో ఈ దేశం బతుకు ఎలా పెనవేసుకుపోయిందో గ్రహించడానికి సాక్ష్యం.
                          పడిన వర్షం మనపై పన్నీటి చిలకరింత ఎలా అవుతుందో, రాని వాన మనలో అలాగే కన్నీటి ఊట కూడా అవుతుంది. దేశంలో అనావృష్టి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో చినుకు పడడ మంటే కనకవర్షమే. వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతాల జనం ఆకాశం వైపు దృష్టిసారించి నేత్ర తపస్సు తపస్సు చేస్తూనే ఉంటారు. మన రాష్ట్రంలో అలాంటి ప్రాంతాలలో రాయలసీమ ఒకటి. అనావృష్టి సీమ రైతుల వెన్ను ఎలా విరుస్తుందో, వారి జీవితాల నిండా విషాదం ఎలా పరచుకుంటుందో చిత్రించిన సాహిత్యం అనంతం. పడని వర్షాలు సృష్టించిన కన్నీరు ఎన్నో కథలుగా మారి వేల పుటల మీదుగా ప్రవహించింది. రాయలసీమవాసి కాకపోయినా పర్యావరణకార్యకర్తగా ఆ ప్రాంతాలలో అనేకసార్లు పర్యటించిన ప్రముఖ కథకుడు తల్లావఝల పతంజలిశాస్త్రి సీమ ప్రజల బతుకుల్లోని వర్షాభావవిషాదానికి అద్దం పట్టే కథలు ఎన్నో రాశారు. ఎండిన పొలాలు, మోడువారిన చెట్టులానే వెలసిపోయి కళావిహీనంగా కనిపించే ఊరి మనుషుల ఊహల్లో వర్షం ఒక అందమైన కలగానూ, ఊహగానూ మారిపోతుంది. కాంతిలేని ఆ గాజు కళ్లముందు నిరంతరం విరగపండిన పొలాలు, ఆకుపచ్చని పరిసరాలు తిష్టవేసుకుని కూర్చుంటాయి. వారి జీవితమే ఒక స్వప్నసంచారాన్ని తలపిస్తుంది. చివరికి పిల్లల అంతశ్చేతనలో కూడా వర్షాభావం ఇంకిపోతుంది. పతంజలిశాస్త్రిగారి 'కతలవ్వ' కథలో వానలు పడని ఓ వానాకాలంలో ఆ రోజు మధ్యాహ్నమే ఒక రైతు పురుగు మందు తాగా కరువు బాధను తప్పించుకున్నాడు. రాత్రివేళ ఉన్నట్టుండి రావిచెట్టు గలగల మంది. గాలి గిర్రున తిరిగింది. వెంకట్రావు అనే కుర్రాడికి చెట్టుకింద తెల్లజుట్టు ముసలవ్వ మఠం వేసుకుని కూర్చుని కనిపించింది. ఆమె పక్కనే ఓ బుట్ట, దాని పక్కనే గుమ్మడికాయ తంబుర ఉన్నాయి. ఆమె ఆ అబ్బాయిని పిలిచి, కతలు చెబుతాను పిల్లల నందరినీ పిలుకు రమ్మని చెప్పింది. పిల్చుకొచ్చాడు. ఆమె బుట్టలోంచి దొంతర్లు దొంతర్లుగా మబ్బుల్ని తీసి పిల్లల మీద కప్పింది. ఆ స్పర్శ వాళ్లకు చల్లగా సిల్కులా తాకి హాయి గొలిపింది. అవ్వ వాళ్లకు ఓ కథ చెప్పింది. అదో రాక్షసుడి కథ. ఆకాశం భళ్లున బద్దలై కుండపోతగా వాన పడింది. వెండి దారాల మాదిరిగా ఉంది ఆ వర్షం. ఒకటే వర్షం. అలా నెలరోజులు కురిసింది. కానీ, చిత్రం, నేల మీద చుక్క నీరు లేదు. రాక్షసుడు తాగేశాడు. అప్పుడు మబ్బులన్నీ కలసి ఓ వీరుణ్ణి సృష్టించి రాక్షషుణ్ణి చంపించాయి. అతని దేహంలోంచి ఒకటే నీటిధార. ఎక్కడ చూసినా నీళ్లే. కరువు తీరేలా. పొలాలన్నీ నీటితో తళతళలాడుతున్నాయి. అనావృష్టికి అలవాటు పడిన చేతన ఊహల్లో జలపుష్కలత్వాన్ని ఎలా సృష్టించుకుంటుందో ఈ కథ చెబుతుంది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న వాన ఓ ఏడాది వంచించవచ్చు, కానీ కరుణించిన రోజులూ అంతకంటె ఎక్కువే ఉండవచ్చు. మనిషి నిరంతర ఆశాజీవి కదా. కనుక నిండు మనసుతో ఈ ఏడు కూడా వర్షాన్ని ఆహ్వానిద్దాం.
సూర్య వర్షపాతం ఎన్నిరకాలు?
                 సముద్రాలనుంచి నీరు ఆవిరైపోయి, ఆ తేమ ఆకాశంలో ద్రవీభవించి, బుడగలలాగా ఏర్పడి మేఘాలను సృష్టిస్తుంది. మేఘాలనుంచి వర్షం కురుస్తుంది. ఈ వర్షం తిరిగి సముద్రానికి చేరుతుంది. ఇలా ఒక జల చక్రం తిరుగుతుంటుంది. వర్షాన్ని అవపాత పరిమాణం, అవపాతానికి కారణం అనే రెండు అంశాలతో వర్గీకరిస్తారు. అవపాత పరిమాణం ప్రకారం వర్షాన్ని మళ్లీ ఈ కింది విధాలుగా వర్గీకరిస్తారు.
1) అతి తేలికపాటి వర్షం - అవపాతం (నీరు కురవడం) గంటకు 1 మి.మీ కంటే తక్కువ ఉంటే అతి తేలికపాటి వర్షమంటారు.
2) తేలికపాటి వర్షం - అవపాతం గంటకు 1 మి.మీ. నుంచి 2 మి.మీ. మధ్య ఉంటే తేలికపాటి వర్షం
3) ఒక మోస్తరు వర్షం - అవపాతం గంటకు 2 మి.మీ.నుండి 5 మి.మీ. మధ్య ఉంటుంది.
4) భారీ వర్షం - అవపాతం గంటకు 5 మి.మీ.నుంచి 10 మి.మీ. మధ్య ఉంటుంది.
5) అతి భారీ వర్షం - అవపాతం గంటకు 10 మి.మీ.నుండి 20 మి.మీ మధ్య ఉంటుంది.
6) కుండపోత వర్షం - దీనిని అత్యంత భారీ వర్షంగా గుర్తిస్తారు. దీనిలో అవపాతం 20 మి.మీ కంటే ఎక్కువ ఉంటుంది.
       అంతా భూమికి చేరదు
ఆకాశంనుంచి కురిసే మొత్తం వర్షం భూమి మీదకు చేరదు. కొంతశాతం వర్షం పొడి గాలి ద్వారా కిందపడుతున్న సమయంలో గాలిలోనే ఆవిరైపోతుంది. ఇలా వర్షం భూమికి చేరకుండా గాలిలో ఆవిరైపోవడాన్ని విర్గా అంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ, వాతావరణంలో తేమ తక్కువగా లేదా వాతావరణం పొడిగా ఉండే ప్రాంతాల్లోనూ వర్షం పూర్తిగా భూమిపైకి చేరకుండా గాలిలోనే ఆవిరైపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎల్‌ నినో అంటే?
                భారత దేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఎల్‌ నినో వాతావరణ సంబంధమైన పరిస్థితి. దీనిలో ఫసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత వేడెక్కుతాయి. ఇది గాలి వీచే విధానాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వరదలు లేదా కరువు కాటకాలు సంభవిస్తాయి.
                  ఎల్‌ నినో అనేది స్పానిష్‌ పదం. ఈ పదానికి 'పసి బాలుడు' అని అర్థం. వాతావరణంలో ఈ పరిస్థితి ప్రతి మూడు నుంచి ఐదేళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్‌ నినో ఏర్పడితే అది ఒక సంవత్సరకాలం పాటు కొనసాగుతుంది.
                   భారతదేశంలో 18 71నుంచి ఇప్పటి వరకూ సంభవించిన అతి పెద్ద కరువుకాటకాల్లో ఆరు ఎల్‌ నినో సంబంధమైనవిగా వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 2002, 2009నాటి కరువు పరిస్థితులకు ఎల్‌ నినో ప్రధాన కారణం.
                అయితే ఎల్‌ నినో ఏర్పడిన ప్రతిసారీ తప్పనిసరిగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 1997-98 సంవత్సరం అతి తీవ్రమైన ఎల్‌ నినో ఏర్పడినప్పటికీ భారతదేశంలో కరువు ఏర్పడలేదు. 2002లో ఒక మాదిరి ఎల్‌ నినో ఏర్పడగా, భారత్‌ తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొంది.
భారతదేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది.
ఈ సంవత్సరం (2014) కూడా ఎల్‌ నినో తన ప్రభావం చూపవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏప్రిల్‌ మాసాంతంనుంచి ఎల్‌ నినో ప్రభావం సూచీమాత్రంగా కనిపిస్తూ వస్తున్నది.
                ఎల్‌ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడినప్పటికీ, వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేసే భారత దేశం వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలరించే ఇంద్ర ధనుస్సు
            వర్షాకాలంలో అందరినీ అలరించే సుందర దృశ్యం ఇంద్రధనుస్సు. ఎండ వేళ, సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పుడు ఆకాశంలో సప్తవర్ణాలతో అలరారుతూ కనిపించే ఇంద్రధనుస్సును చూసి ఆనందించని హృదయం ఉండదు. సూర్యుడి కిరణాలు వర్షపు నీటి బిందువుల్లో పడి వక్రీకరణం చెంది, పరావర్తనమవడం ద్వారా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు పూర్తి వర్తులాకారంలోనూ ఏర్పడుతుంది. కానీ, చూపరులకు సగమే కనిపిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడిన స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించి చెప్పడం కష్టం. ఇది వస్తు రూపంలో ఉండదు కనుక దీని దగ్గరకు చేరడం, చేతితో స్పృశించడమనేవి అసాధ్యాలే. ఇంద్రధనుస్సును కేవలం 42 డిగ్రీల కోణంలోనుంచే చూడగలుగుతాము.
 వర్షచ్ఛాయా ప్రాంతం
              సముద్రాలు, భూమి సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కడంలో ఉండే భేదాల వల్ల, ఎల్లవేళలా వీచే గాలి వల్ల సముద్రాల ఉపరితలంనుంచి భూమి మీదకు తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇలాంటి గాలి మార్గానికి అడ్డుగా ఎత్తయిన కొండలు లేదా పర్వతాల వంటివి ఉంటే తేమతో కూడిన గాలి పైకి ఎగుస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గి, అది వ్యాకోచిస్తుంది. ఫలితంగా దాని సాపేక్ష ఆర్ద్రత పెరిగి నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఇలా పైకి వెళ్లిన గాలి ద్రవీభవన స్థాయిని (పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి ద్రవీభవనం సంభవించే ఎత్తును ద్రవీభవన స్థాయి అంటారు) చేరుకునే వరకూ సాపేక్ష ఆర్ద్రత మరింతగా పెరిగి గాలిని సంతృప్తం చేస్తుంది. తేలుతూ ఉన్న మేఘాలు బరువైనపుడు వర్షపాతం సంభవిస్తుంది. ఆ ప్రక్రియకు అడ్డంకిగా నిలిచిన భూస్వరూపం తాలూకు పవనాభిముఖ పార్శ్వంలో వర్షం కురుస్తుంది. ఈ భూస్వరూపానికి రెండవ వైపున ఆర్ద్రత కోల్పోయి పొడిగా ఉన్న గాలి కిందికి దిగుతూ సంకోచించి, మరింత వెచ్చగా మారుతుంది. కనుక రెండవ ఆవైపు వర్షం కురవదు. ఆ కారణంగా దానిని వర్షచ్ఛాయా ప్రాంతమని అంటారు.
క్యుములో నింబస్‌ మేఘాలు
                   ఎత్తుకు వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గడం వల్ల గాలి వ్యాకోచిస్తుంది. దానివల్ల గాలి ఉష్ణోగ్రత తగ్గి సాపేక్ష ఆర్ద్రత (తేమ) పెరుగుతుంది. ఫలితంగా నీటి ఆవిరి బిందువులుగా ద్రవీభవించి పేరుకుపోతూ, క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతాయి. ఇవి బరువెక్కి వర్షాన్నిస్తాయి. దీనిని సంవహన వర్షపాతమని అంటారు. ఈ రకమైన వర్షపాతంలో కుంభవృష్టి కాని, వడగండ్ల వాన కానీ సంభవిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ సంవహన వర్షపాతం మధ్యాహ్న సమయంలో కాని, సాయంకాల సమయంలో కానీ సంభవిస్తుంది.

Courtesy with : PRAJA SEKTHI

Monday, 12 May 2014

‘గాంధీ’కి సౌర వెలుగులు

‘గాంధీ’కి సౌర వెలుగులు
 గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో త్వరలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇక్కడ చేపట్టిన సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి నెలాఖరులోగా విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపధికన నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.

 ప్రయోగాత్మకం..
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోలార్ విద్యుత్ వినియోగం అందుబాటులోకి తేవాలని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారి గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా ప్లాంటు నిర్మాణానికి అంగీకారం తెలిపింది. 500 కేవీ గ్రిడ్ కనెక్టడ్ రూప్‌టాప్ సోలార్ సిస్టం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.3.90 కోట్ల నిధులు కేటాయించింది.

గుజరాత్ లాతూర్‌కు చెందిన ఆదిత్య గ్రీన్ ఎనర్జీ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఇక్కడి ప్లాంటు విజయవంతమైతే ఉస్మానియా, పేట్లబురుజు, నీలోఫర్ ఆస్పత్రుల్లో కూడా ఇదే తరహాలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నెలకు సుమారు లక్ష యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖకు కోట్లలో బకాయి పడ్డారు. సరఫరాను నిలిపివేస్తామని విద్యుత్‌శాఖ  హెచ్చరించడంతో ఇటీవలే కొంతమొత్తం బకాయిలు చెల్లించారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి విద్యుత్ సమస్య తీరిపోయినట్టే.

 సోలార్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను మల్టిపుల్ కనెక్టివిటీ ద్వారా సరఫరా చేస్తారు. ఎండలు అధికంగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వర్షాలు పడినా, ఆకాశం మబ్బుపట్టినా ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో విద్యుత్‌శాఖ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను వినియోగించుకుంటారు. సౌరవిద్యుత్ యూనిట్ ధరను రూ.5.50గా కేంద్రం నిర్ణయించింది. బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌పర్(బీఓటీ) పద్ధతిలో 25 ఏళ్లపాటు నిర్మాణ సంస్థ తీసుకుని తర్వాత ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందం కుదిరింది.
అమ్మ... అన్ని రోజులూ అమ్మే!
             ''అమ్మ అంటే అంతులేని సొమ్మురా! అది ఏనాడూ తరగని భాగ్యమ్మురా!!' అన్నాడో కవి. అమ్మ అనురాగం గురించి పాటలూ కథనాలూ చాలానే ఉన్నాయి. అమ్మ అనే కమ్మని మాటలో మమతల మూటలకు లెక్కేలేదు. ప్రపంచంలో ఫలితం ఆశించకుండా చూపించే ప్రేమ ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. ఓ జీవిని భూమిపైకి తెచ్చే క్రమంలో తను మరో జన్మనెత్తుతుంది. ఆ తర్వాత అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికీ వెనుకాడని హృదయం అమ్మలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ భూమిపై అనేక జీవరాశుల్ని పరిశీలించినా మనకు వాటిల్లోనూ తల్లి ప్రేమ మాధుర్యం కనిపిస్తుంది. అంతటి అపరిమితమైనది అమ్మ ప్రేమ. అలాంటి అమ్మ ప్రేమ లేకపోతే మన మనుగడే ప్రశ్నగా మారేది. ఇంత అపూర్వమైన ప్రత్యేకత ఉన్న అమ్మ గురించి ఒకరోజు కేటాయించడం వాణిజ్య దృష్టి అయినా ఈ పండుగ గురించిన కథనాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ కథలోకి వెళితే..
       'మదర్స్‌ డే' అని ఓ ప్రత్యేకరోజు కేటాయించిన చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని శతాబ్దాలకు పూర్వమే ఈ 'మదర్స్‌ డే'ను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. ఏదేమైనా ఈ 'మదర్స్‌ డే' సంస్కృతి మనది కాదు ఇది విదేశాల నుండి దిగుమతి అయిందే.
చరిత్ర చెప్పేది..
         ముఖ్యంగా గ్రీకులు దేవతలకే అమ్మగా కొలిచే 'రెహ'ను పూజిస్తూ ఉత్సవాలు చేసేవారు. తొలినాళ్ళలో క్రైస్తవులు కూడా ప్రతి నాల్గవ ఆదివారం జీసస్‌ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో ఆరోజును సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. క్రమంగా దీన్ని 'మదరింగ్‌ హాలీడే'గా ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో ఇంగ్లండ్‌కు చెందిన వలసవాదులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తీరుబడిలేని కార్యకలాపాల్లో మునిగిపోయి, ఈ 'మదరింగ్‌ డే' ఆచారానికి స్వస్తి పలికారు. అయితే 1872లో జులియా వార్డ్‌ హౌవె శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒకరోజును 'మాతృ దినం'గా పాటించడం ప్రారంభించారు. ఇది నేడు 'మదర్స్‌ డే'కి మూలమని చెప్పుకోవచ్చు.
కథనం..
         అన్నా ఎం జార్విస్‌ అనే ఫిలడెల్ఫియాలోని ఓ పాఠశాల టీచర్‌. ఈమె 1890లో తాను నివసిస్తున్న గ్రాఫ్టన్‌ నగరాన్ని వదిలి ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ఒంటరి పోరాటం ప్రారంభించారు. 1905లో తన తల్లిని ఖననం చేసిన స్మశానవాటికలో తల్లి సమాధి ఎదుటే ''చనిపోయిన లేదా జీవించి ఉన్న మాతృమూర్తుల పట్ల గౌరవంగా ఏడాదిలో ఒక రోజుని 'మదర్స్‌ డే'గా గుర్తింపు తీసుకు వస్తా'' అని అన్నా ప్రతిజ్ఞ చేశారు. ఆ క్రమంలో ఆమె 1907లో తన తల్లి అన్నే మరియా రీవిస్‌ జార్విస్‌ గౌరవార్థం జాతీయ 'తల్లుల దినాన్ని' నిర్వహించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికోసం ఆమె తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. మొదట ఆమె బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు రాశారు. అనేక విజ్ఞప్తులు చేశారు. దీంతో ఆమె ఉద్యమానికి ప్రముఖ వర్తకులు, ప్రజాప్రతినిధులు మద్దతు లభించింది. చివరకు 'మదర్స్‌ డే' జరపడానికి ఏడాదిలో ఒక రోజును నిర్ణయించడానికి దారితీసింది. వెస్ట్‌ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి, తమ రాష్ట్రంలో 'మదర్‌ డే' అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ విధంగా చర్చిలో మొట్టమొదట 'మాతృ దినోత్సవం' అన్నా తల్లి గౌరవార్థం జరిగింది. అన్నా కష్టానికి నిజమైన ఫలితం 1914లో లభించింది. దేశాధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని 'అమ్మ దినోత్సవం'గా పేర్కొంటూ జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
అన్నా పట్టుదలతో అమల్లోకి వచ్చిన ఈ 'మదర్స్‌ డే' ఉత్తర్వులో ఒక విశేషం దాగి ఉంది. మొత్తం కుటుంబ శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రజారంగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మహిళల్ని మాత్రమే గౌరవించుకునే రోజుగా కాకుండా కేవలం అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా 'మదర్స్‌ డే' జరుపుకోవడమే అందులోని విశిష్టత.
          క్రమంగా 'మాతృ దినోత్సవం' అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు 'మాతృ దినోత్సవాన్ని' వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నాయి. కాకపోతే డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలు మాత్రం 'తల్లుల దినాన్ని' మేనెలలో వచ్చే రెండో ఆదివారం నాడు జరుపుకునేవి. 19వ శతాబ్దం వచ్చే సరికి 'మదరింగ్‌ సండే'ను జరుపుకోవడం దాదాపు నిలిచిపోయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో వాణిజ్య సంస్థలు ఈ రోజును అమ్మకాలకు ప్రాధాన్యతను కలిగిన రోజుగా పరిగణించేవారు. ఇక నేటికాలానికి వస్తే 'మాతృ దినోత్సవం' అమెరికా, బ్రిటన్‌, మన భారతదేశం, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, చైనా, జపాన్‌, బెల్జియం దేశాల్లో జరుపుకుంటున్నారు. తమ తల్లులపై ఉన్న ప్రేమను ప్రగాఢంగా ప్రకటించే రోజుగా ఈ రోజును జరుపుకోవడం కొనసాగుతోంది.
ఒక్క మాట..
         మార్కెట్‌ శక్తుల మాయాజాలంలో కొట్టుకుపోకుండా అమ్మను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిత్యం ప్రేమించండి! అమ్మ అంటే అంతులేని ప్రేమను ప్రకటించండి! అమ్మతో మాట్లాడేందుకు కాసేపు సమయం కేటాయించండి. ఆమెకు ఇష్టమైన రీతిలో నడుచుకోండి. అమ్మ లేని లోటు ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు. అందుకే ఈ 'మదర్స్‌ డే' సందర్భంగా మాతృమూర్తులందరికీ వందనం.
వేసవి 'పానీ'యాలు

         
  వేసవిలో శరీరానికి నీరు ఎక్కువ శాతం అవసరం. అందుకే నీటిని ఎక్కువగా తాగడం చాలా మంచిది. ఎక్కువగా నీటినే తీసుకోలేం కాబట్టి వేసవిలో దొరికే పండ్లను తీసుకోవడం ఉత్తమం. కర్బూజ, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ, కొబ్బరి బొండాలు జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు. కాని పండ్లను అలాగే తినడం వలన వాటిలో ఉండే పీచు పదార్ధం శరీరానికి ఎంతో మంచిది. కాని దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా ద్రవపదార్ధాల వైపుకే మనసు మళ్ళుతుంది. అందుకే ఆరోగ్యాన్ని అందించే కొన్ని జ్యూస్‌లు ఇవిగో...
పుచ్చకాయ
           వేసవిలో తప్పకుండా తీసుకోవలసిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. మనిషికి కావలసిన ఖనిజాలు, పోషకాలు, ఉప్పు, నీరు... ఒక గ్లాసు పుచ్చకాయ రసం ద్వారా అందుతాయి. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. శరీరంలో చేరిన వ్యర్ధపదార్ధాలను బయటకు పంపిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధం ఈ పుచ్చకాయ జ్యూస్‌.
పుచ్చకాయ ముక్కలకు జీలకర్ర, చాట్‌ మసాలా పొడులు, చిటికెడు ఉప్పు చేర్చుకొని గ్రైండ్‌ చేసుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే ఐస్‌ ముక్కలను చేర్చుకోవచ్చు.
పుదీనా
           పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పుదీనాను తరుచుగా తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. చర్మ సంబంధిత రుగ్మతలకు మంచి మందు పుదీనా. అంతేకాదు, రక్తాన్ని శుద్దిచేసే గుణం పుదీనాలో ఉంది. అందుకే పుదీనా జ్యూస్‌ను తప్పని సరిగా తీసుకోవలసిందే.
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, వాటికి బెల్లం, జీలకర్ర పొడి, నల్లఉప్పు, కొన్ని నీళ్ళు చేర్చి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం, కొన్ని ఐస్‌ క్యూబ్‌లను చేర్చుకోవచ్చు.
బీట్‌రూట్‌
         తరుచుగా నీరసంగా అనిపిస్తుందా... అయితే బీట్‌రూట్‌ జ్యూస్‌ చక్కని పరిష్కారం. విటమిన్‌ బి, సిలు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్‌ రక్తపోటును తగిస్తుంది. బీట్‌రూట్‌ రసాన్ని కనీసం రెండు రోజుల కొకసారి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన చక్కెర అంది నీరసాన్ని తగ్గిస్తుంది.
    బీట్‌రూట్‌ జ్యూస్‌కు క్యారెట్‌, ఆపిల్‌లను ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. వాటితో పాటు అల్లం, మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కావాలనుకుంటే ఐస్‌ కలుపుకోవచ్చు. అంతే చల్లచల్లని బీట్‌రూట్‌ జ్యూస్‌ రెడీ.
కర్బూజ
           తియ్యగా, మృదువుగా ఉండే పండు కర్బూజ. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ పండు వేసవి తాపానికి చక్కని పరిష్కారం. డీ హైడ్రేషన్‌ను దరిచేరనివ్వదు. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి మంచి ఔషదం. రక్తపోటును తగ్గిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్న కర్బూజ వేసవిలో వచ్చే నీరసాన్ని తగ్గించి శరీరానికి నూతనోత్సాహాన్ని ఇస్తుంది.
కర్బూజపై తోలును తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను జ్యూసర్‌లో వేసి దానికి తేనె, పంచదార కలిపి బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్‌ను గ్లాసులో పోసి దానికి నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసి కొన్ని ఐస్‌క్యూబ్‌లను వేసి తాగితే మెదడు చల్లబడుతుంది.

Friday, 4 April 2014

హుషార్‌

-  పిఎస్‌ఎల్‌వి విజయ పరంపర
-   ఇది రెండో నావిగేషన్‌ ఉపగ్రహం
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి
          భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తాను ఎంతగానో నమ్మే పిఎస్‌ఎల్‌ వి(పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) సి-24 విజయవంతమైంది. శుక్రవారం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుండి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 అనుకున్న లక్ష్యాన్ని చేదించి విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. 4-4-2014న పిఎస్‌ఎల్‌వి సి-24 సక్సెస్‌తో షార్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. కొత్త తెలుగు సంవత్సరాది అయిన జయనామ సంవత్సరంలో తొలిసారి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి-24 విజయవంతమైంది. పిఎస్‌ఎల్‌వి వరుస విజయ పరంపరలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం 5.14 నిమిషాలు. సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో అంతా ఉత్కంఠ వాతావరణం. ఎంతో నమ్మకమైన పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 58 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తి చేసుకుంది. మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. +8, +7, +6, +5, +4, +3. +2, +1, -1, 2, 3, 4, 5, 6 అనగానే షార్లోని మొదటి లాంచ్‌ ప్యాడ్‌ నుండి పిఎస్‌ఎల్‌వి సి-24 నిప్పులు చిమ్ముతూ బూడిద వర్ణంలో నింగికెగిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, మీడియా హర్షధ్వానాల మధ్య నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో ప్రయోగం జరిగింది. మొత్తం 19 నిమిషాల 28 సెకన్లలో రాకెట్‌ నుండి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం విడిపోయింది. ఇది తొలుత 283 కిలోమీటర్ల పెరిజి, 20,630 కిలోమీటర్ల అపోజి దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీ వాలులో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవంగా 284 కిలోమీటర్ల పెరిజి, 20,652 అపోజిలో శాటిలైట్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఒక కిలోమీటర్‌ తక్కువ పెరిజి, 20 కిలోమీటర్ల తక్కువ అపోజిలో దీన్ని ప్రవేశపెట్టింది. 20 నిమిషాల 25 సెకన్లకు భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా 19 నిమిషాల 28 సెకన్లలో కక్ష్యలోకి చేరింది. నాలుగు దశల్లో ప్రయోగం సాగింది. మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ఘన ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనం ఉపయోగించారు.
  ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం బరువు 1,432 కిలోగ్రాములు, ఇందులో 818 కిలోగ్రాముల ద్రవ ఇంధనాన్ని నింపారు. దీన్ని ఐదుసార్లు మండించిన తరువాత ఈనెల 19వ తేదీ నాటికి 36 వేల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం భారతదేశం, దానిచుట్టూ 1,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో దిక్సూచిలా పనిచేస్తుంది. 1,660 వాల్టుల విద్యుత్‌ను తన రెండు సోలార్‌ రెక్కల నుండి ఉత్పత్తి చేసుకొని పనిచేస్తుంది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత మాస్టర్‌ కంట్రోల్‌ స్పెసిలిటి హసన్‌ కేంద్రం నుండి ఐదుసార్లు కక్ష్య పొడిగించిన తరువాత ద్రవ ఇంధనం మండించడం ద్వారా దీర్ఘవృత్తాకార కక్ష్య 55 డిగ్రీల తూర్పుగా, భూమధ్యరేఖ స్థలానికి 31 డిగ్రీల వాలుతో వృత్తాకార కక్ష్యలోకి మార్చబడుతుంది. ఎన్‌ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ ప్రయోగం అనంతరం ఏడు నెలల కాలంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహాన్ని తయారు చేసి నేడు నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇది భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహం. అన్ని పరీక్షలూ పూర్తి చేసుకున్న తరువాత రెండు నెలల అనంతరం వినియోగదారులకు సేవలందిస్తుంది. ఇందులో ఎల్‌5బ్యాండ్‌, ఎస్‌ బ్యాండ్‌ ఉపగ్రహం పనిచేస్తుంది. ఇందులో అత్యంత కచ్చితంగా పనిచేసే రుబీడియం అను గడియారం కీలకమైంది. మొదట ఉపగ్రహం తరువాత ఈ ప్రయోగంలో ఆరు 6ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించారు. ఇలా స్ట్రాఫాన్‌ మోటార్లను ఉపయోగించిన ప్రయోగాల్లో ఇది ఆరోది. గతంలో పిఎస్‌ఎల్‌వి సి-11, చంద్రయాన్‌, పిఎస్‌ఎల్‌వి సి-17, జిశాట్‌-12, పిఎస్‌ఎల్‌వి సి-19, పిఎస్‌ఎల్‌వి సి-22 ప్రయోగాల్లో ఈ రకమైన మోటార్లను ఉపయోగించారు.
ఈ ప్రయోగ ఉపయోగం
పిఎస్‌ఎల్‌వి ద్వారా ఐఆర్‌ఎన్‌ఎన్‌ఎస్‌(ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌) ఉపగ్రహం భారత్‌ అవసరాల నిమిత్తం తయారు చేసింది. ఇప్పటికే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ నావిగేషన్‌ ఉపగ్రహం వినియోగదారులకు సేవలు అందిస్తుండగా, భారత్‌ తయారు చేసిన రెండో నావిగేషన్‌ ఉపగ్రహమిది. భారత దేశంతో పాటు, చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకూ స్థితి, గతిని నిర్దేశించి తెలుపుతుంది. అన్నిరకాల పరిస్థితులకూ తట్టుకొని 24 గంటలూ సేవలందిస్తుంది. అంతేగాకుండా దీర్ఘచతురస్రాకారంలో 35 డిగ్రీల దక్షిణం నుండి 50 డిగ్రీల ఉత్తరం వరకూ, 30 డిగ్రీల తూర్పు నుండి సేవలందిస్తుంది. ఇందులో మూడు రకాల విభాగాలున్నాయి. అంతరిక్ష ఉపగ్రహాలు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. భూమి మీద వినియోగదారులకు అవసరమైన సేవలందిస్తుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలుంటాయి. పిఎస్‌ఎల్‌వి సి-22 ద్వారా గత ఏడాది జులై ఒకటో తేదీన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1ఎ తొలి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. నావిగేషన్‌ సిస్టమ్‌లో ఇది రెండోది. దేశంలోని అన్ని విభాగాలకూ సంపూర్ణంగా నావిగేషన్‌ సేవలందాలంటే ఏడు ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ రెండు నిర్వహించారు. మరో ఐదు ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, ముఖ్యమైన అధికారులకు పరిమితమైన సేవలందిస్తుంది. కర్ణాటకలోని బైలాలులో దీనికి సంబంధించిన భూ వ్యవస్థ కేంద్రాన్ని నిర్మించారు. నావిగేషన్‌ ఉపగ్రహాలకు ఆ కేంద్రం మెదడులాంటిది. అక్కడి నుంచే నావిగేషన్‌ ఉప్రగహాల పనితీరును ఆపరేట్‌ చేస్తారు. వినియోగదారుల సేవల కోసం, వ్యవస్థ సక్రమంగా నడిపేందుకు దేశంలోని బైలాలు, హసన్‌, బోపాల్‌తో పాటు పలు రాష్టాల్లో నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భూమిపై ప్రయాణించే వాహనాలు, సముద్రంలో ప్రయాణించే ఓడలు, విమానాలకు మార్గాలను, స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. ఆపద సమయంలో సూచనలు చేస్తుంది. రవాణా ఓడల ఉనికిని తెలియజేస్తుంది. భూ గోళానికి సంబంధించిన విషయాలను కనుగొని నిర్ధిష్ట సమయంలో తెలియజేస్తుంది. వాహనదారులకు దృశ్యం, శ్రావణ విధానంతో దిశా నిర్దేశం చేస్తుంది. కచ్చిత సమయాన్ని కనుగొంటుంది. ప్రస్తుతమున్న అవసరాల రీత్యా ఈ ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సంబరాల్లో మునిగిపోయింది. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ శేఖర్‌ దత్తూ హాజరయ్యారు. ప్రయోగ విజయవంతం అనంతరం ఇస్రో ఛైర్మన్‌కు, ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని షార్‌ డైరెక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, మిషన్‌ డైరెక్టర్‌ ఉన్ని క్రిష్ణన్‌, మాజీ షార్‌ డైరెక్టర్‌ చంద్రదత్తన్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగేశ్వరరావు, రామకృష్ణన్‌, కిరణ్‌ కుమార్‌, శివకుమార్‌ పర్యవేక్షించారు.
ప్రయోగానికి రూ. 260 కోట్లు ఖర్చు
   ఈ ప్రయోగానికి మొత్తం 260 కోట్ల రూపాయలు ఇస్రో ఖర్చు చేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1బి ఉపగ్రహానికి 150 కోట్ల రూపాయలు, పిఎస్‌ఎల్‌ వి రాకెట్‌కు 110 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.
Courtesy  with: PRAJA SEKTHI DAILY
వేస‌వి చ‌ల్ల చ‌ల్లా‌గా తాగేయండి !

- ఆమ్‌ కా పన్నా
2 పెద్ద పచ్చి మామిడి కాయలు
2 టీస్పూన్ల జీలకర్ర పొడి
1 టీస్పూన్‌ మిరియాల పొడి
నల్ల ఉప్పు
ఒక చిటికెడు ఇంగువ
పావు కప్పు పంచదార
తయారీ విధానం
మామిడికాయలు కడిగి ముక్కలు చేసి ఉడికించాలి. చల్లబడిన తర్వాత తొక్కు తీయాలి. ముక్కలను చిదిమి పేస్ట్‌ లాగా చేయాలి.
జీలకర్ర పొడి, మిరియాల పొడి, నల్ల ఉప్పు, ఇంగువ, పంచదార ఆ పేస్ట్‌కి కలపాలి. అందులో పంచదార కరిగేవరకు కలపాలి. ఆ పేస్ట్‌ని ఒక గ్లాసుకి ఒక చెంచా చొప్పున వేసి అందులో గ్లాసు నిండా చల్లని నీరు పోస్తే ఆమ్‌ కా పన్నా తయారు
వేసవిలో దాహం తీరడానికి ఎక్కువ నీరు తాగడంతో పాటు ద్రవ పదార్థాలనూ తీసుకుంటూ ఉండాలి. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఇంట్లోనే రకరకాల రుచికరమైన, పోషకాలు కలిగిన డ్రింక్‌లు చేసుకోవచ్చు.
-జల్‌జీరా
పుదీనా ఆకులు పావు కప్పు
కొత్తిమీర పావు కప్పు
అల్లం ముక్క
జీలకర్ర 2 టీస్పూన్లు
పంచదార 3 టీస్పూన్లు
ఆమ్‌చూర్‌ పౌడర్‌ పావు టీ స్పూన్‌
చాట్‌ మసాలా చిటికెడు
రాళ్ళ ఉప్పు కొద్దిగా
నిమ్మరసం 2 టీస్పూన్లు
నీరు 4 కప్పులు
తయారీ విధానం
నీరు, నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి తిప్పి పేస్ట్‌ చేయాలి. జల్లెడలో వేసి వడకట్టాలి. దానికి నిమ్మరసం చేర్చాలి. తర్వాత 4 కప్పుల నీరు, ఐసు ముక్కలు కలిపి, పైన బూందీ వేయాలి.
-బాదం పాలు
-బాదం పాలు
4 కప్పుల పాలు
పావు కప్పు బాదం పప్పు
ఒక చిటికెడు యాలకుల పొడి
3,4 టీస్పూన్‌ల తేనె
తయారీ విధానం
బాదంపప్పులు వేడినీటిలో రెండు నిమిషాలు నానబెట్టి, తొక్కు తీసి దంచాలి. అడుగు మందం ఉన్న గిన్నెలో పాలు కాచి అందులో బాదం పప్పు పొడిని వేసి ఇరవై నిమిషాలు మరగనివ్వాలి. యాలకుల పొడి వేసి మరి కొంతసేపు మరగనివ్వాలి. మంట మీద నుంచి దించి తేనె కలిపి తిప్పాలి. గోరువెచ్చగా కాని, ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా గాని తీసుకోవచ్చు.
-రండాయి
ఒక కప్పు పాలు, ఒకటిన్నర కప్పు పంచదార, పావు కప్పు ఎండబెట్టిన గులాబీ రేకులు, ఒకటిన్నర లీటర్ల నీరు, ఒక టీస్పూన్‌ బాదంపప్పు
ఒక టీస్పూన్‌ జీడిపప్పు
అర టీస్పూన్‌ గసగసాలు
అర టీస్పూన్‌ సోంప్‌
అర టీస్పూన్‌ యాలకుల పొడి
అర టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌
తయారీ విధానం
అర లీటరు నీటిలో పంచదార వేసి కరిగించాలి. ఇతర వస్తువులను మిగిలిన నీటిలో నానబెట్టాలి. అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లాగా చేయాలి. తీత పేస్ట్‌ను నానబెట్టిన నీటిలో వేసి కలపాలి. ఈ నీటిని ఒక గిన్నెకి మస్లిన్‌
బట్ట కట్టి వడబోయాలి. ఆ పేస్ట్‌కి మరికాస్త నీరు పోసి పిండితే పూర్తిగా రసం బైటికి వచ్చేస్తుంది. దానికి పాలు, పంచదార, రోజ్‌ వాటర్‌ కలపాలి. దానికి యాలకుల పొడి కలిపి తాగే ముందు ఐసు ముక్కలు వేయాలి.
-లస్సీ
2 కప్పుల తాజా పెరుగు
1 టీస్పూన్‌ పంచదార
అర టీస్పూన్‌ యాలకుల పొడి
8 నుంచి 10 మిల్లీ గ్రాముల కుంకుమపువ్వు
2 చుక్కల వెనీలా ఎసెన్స్‌
ఐస్‌ ముక్కలు
ఒక టీ స్పూన్‌ పాలు
తయారీ విధానం
కుంకుమపువ్వు 1 టీ స్పూన్‌ వేడిపాలలో కరిగించాలి.
పెరుగులో పంచదార వేసి కరిగేవరకు మిక్సీలో తిప్పాలి.
తర్వాత అందులో మిగిలిన వస్తువులు కూడా వేసి తిప్పాలి. తాగేముందు ఐసు ముక్కలు వేయాలి.
-మసాలా మిల్క్‌
4 గ్లాసుల పాలు
2 టీస్పూన్‌ల జీడిపప్పు
2 టీస్పూన్‌ల బాదంపప్పు
2 టీస్పూన్‌ల పిస్తా
పావు టీ స్పూన్‌ యాలకుల పొడి
1టీస్పూన్‌ క్రీమ్‌
ఒక చిటికెడు కుంకుమపువ్వు
4 టీస్పూన్‌ల పంచదార
తయారీ విధానం
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, యాలుకలు, పంచదార, కుంకుమపువ్వు కలిపి మిక్సీకి వేయాలి. మెత్తగా అయిన ఆ పొడిని పాలకు కలపాలి. దానికి క్రీమ్‌ను చేర్చి బాగా గిలకొట్టాలి. దానికి పాలను కలిపి ఫ్రిజ్‌లో ఉంచి 3 గంటల వరకు చల్లబరచాలి.

 Courtesy with: PRAJA SEKTHY DAILY 
కొబ్బరి నీళ్ళకు సవాలు నై...  
     
 ఎండాకాలం వచ్చేసింది. నెత్తిమీద భానుడి ప్రతాపం తాండవం చేస్తోంది. పది నిమిషాలు బయటికి వెళ్లి వస్తే చాలు, శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. చల్లని నీళ్లు తాగాలని ప్రయత్నిస్తే కూల్‌డ్రింక్‌లు కనిపిస్తాయి. కాని అవి ఆరోగ్యానికి మంచివి కావని మన ఆరోగ్యవేత్తలు నిరూపించారు. మరి దీనికి పరిష్కారం లేదంటారా? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఒకటి, కొబ్బరి నీళ్ళు.
       తక్కువ కేలరీలు, కొలస్ట్రాల్‌ లేని కొబ్బరినీళ్ళలో సుమారు 94శాతం వరకూ మాములు నీళ్లే ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లలో కేవలం 2.8శాతం మేరకు చక్కెర, 0.5శాతం వరకూ లవణాలు ఉంటాయి. బి విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి బొండాం ధరకే కూల్‌డ్రింకులు లభించినా, అనారోగ్యాన్ని కల్గించే కారకాలు ఎన్నో ఈ కూల్‌డ్రింక్‌లలో ఉన్నాయి. కాబట్టి ఆమ్లగాఢత ఉన్న కూల్‌డ్రింకులను మానేసి కొబ్బరినీళ్లు తాగమని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు.
గుండె ఆరోగ్యానికి
       దాహాన్ని తీర్చడానికే కాక, అంతకు మించి ఎక్కువ ఔషధగుణాలు ఈ కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ కొబ్బరి నీళ్ళు రక్తపోటును తగ్గించి, శరీరంలో నీటిని కోల్పోకుండా కాపాడతాయి.
మూత్రపిండాల్లో రాళ్ళను తగ్గించడానికి
       కొబ్బరి నీళ్ళు తరుచు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు చేరవు. కొబ్బరినీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం మూత్రకారక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండిపోతే వాటిని మూత్రవిసర్జనలో బయటికి పంపించి వేస్తాయి.
విరేచనాలకు విరుగుడు
       కొబ్బరి నీళ్ళు విరేచనాలను కూడా అరికడతాయి. కొబ్బరినీళ్ళు విరేచనాల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని అందించి లవణాలను అందిస్తాయి. శరీరంలోని విష పదార్ధాలను బయటికి పంపేస్తాయి. కొబ్బరినీళ్ళలో సహజసిద్ధమైన సమగాఢత ఉంది. కొబ్బరినీళ్ళలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలు మన శరీరంలోని ఎలక్ట్రోలైట్‌ ప్రమాణాలతో సమానం.
ఎండలో హైడ్రేట్‌
       ఎండాకాలంలో శరీరంలో నీటిని కోల్పోయి డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటారు.దీనికి మంచి విరుగుడు కొబ్బరినీళ్ళే. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్‌లు, చాలా తక్కువ స్ధాయిలో చక్కెర, పుష్కలంగా ఎలక్ట్రోలైట్‌లు ఉండడమే దీనికి కారణం. కొబ్బరినీళ్ళను నేరుగా కాని, నిమ్మరసంతో కాని తీసుకుంటే ఎంతో ఉపయోగం.
వ్యాయామం ముందు, తర్వాత
       వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం, ఉక్కపోతగా ఉండటం సహజం. దీనికి పరిష్కారం, ఎలాంటి రసాయన పదార్ధాలు కాని, కృత్రిమ చక్కెర పదార్ధాలు కాని లేని సహజమైన క్రీడా పానీయం కొబ్బరి నీళ్ళు. వ్యాయామం చేసే సమయంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందడానికి అతితక్కువ కేలరీలు ఉన్న కొబ్బరి నీళ్లు ఎంతో ఉత్తమం. పొటాషియం ఎక్కువగా ఉన్న కొబ్బరినీళ్ళను తీసుకోవడం వలన వ్యాయామం తర్వాత డీహ్రైడ్రేషన్‌ సమస్య రాదు.
చర్మానికి కొత్త అందం
       చర్మం మృదువుగా మారాలనుకుంటే క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగండి. ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడమే కాక, మృత కణాలను కూడా తొలగిస్తాయి. కొబ్బరినీళ్ళను రెండు రోజులకొకసారి చేతులకు, ముఖానికి రాసుకుంటే వృద్ధాప్యఛాయలు కనిపించవు. కొబ్బరినీళ్లలో ఉండే సైటోకైనిన్‌ అందుకు కారణం.
సాధారణ గర్భ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ
       కొబ్బరినీళ్ళు సహజసిద్ధంగా లభించే స్వచ్ఛమైన నీరు. కాబట్టే గర్భిణీలకు ఎంతో మంచిది. గర్భిణీలకు సాధారణంగా వచ్చే మలబద్ధకం, గుండెలో మంట, గ్యాస్‌ట్రబుల్‌ లాంటి సమస్యలకు దివ్యౌషధం కొబ్బరినీళ్ళు.
దంత సమస్యలకు విరుగుడు
       కొబ్బరినీళ్లు స్వచ్ఛమైన, సహజమైన పానీయం. పన్ను ఊడిపోయినప్పుడు దంతవైద్యుని చూసే లోపల ఆ పంటిని జాగ్రత్త చేయగలిగింది కొబ్బరినీళ్ళే.
- కోలస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే కొవ్వు సమస్య ఉండదు.
- తరచూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో షుగర్‌ స్ధాయిలు అదుపులో ఉంటాయి.
- ముఖం పై మొటిమలు, నల్లటి మచ్చలు పోవాలంటే లేత కొబ్బరి గుజ్జును రాసుకుంటే ఫలితం ఉంటుంది.
- కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది గనుక వాటిని తాగితే అతిసారం, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
- స్నానం చేసే ముంతు శరీరానికి కొబ్బరి నూనెతో బాగా మర్ధనా చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఎంతో ఉపవమనం కలుగుతుంది.
- ప్రోటీన్ల లోపం ఉన్నవారికి కొబ్బరి పాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
- కొబ్బరి నీళ్లలో కాస్త పసుపు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖం కాంతులీనుతుంది.
- కొబ్బరి నూనెతో తలకు మసాజ్‌ చేసుకుంటే శిరోజాలకే కాదు, కళ్లకు మేలు చేకూరుతుంది.
- పిల్లలకు కూల్‌డ్రింక్‌లు బదులు కొబ్బరి నీళ్లు తరచూ ఇస్తే బలం చేకూరుతుంది.

Courtesy  With: PRAJA SEKTHY DAILY

Thursday, 27 March 2014

చిప్స్‌, కోక్‌, క్యాడ్‌బరీస్‌     
                 మన సమాజంలో అతి తక్కువ ఆలోచించేది పిల్లల గురించి. అదేమిటి, తల్లిదండ్రులు ఇవాళా, రేపూ తాము అపురూపంగా కని పెంచుతున్న ఒకరిద్దరు పిల్లల్ని గురించి తప్ప మరేమీ ఆలోచించటం లేదే- అలాంటి పిల్లల గురించి ఎవరూ ఆలోచించట లేదనటం పొరపాటు కదా అనుకుంటున్నారా? తల్లిదండ్రులు తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. దాని గురించి కాదు మేం మాట్లాడేది. ఒక సమాజంగా, పోనీ ఒక సమూహంగా పిల్లల హక్కుల గురించి, వారి బాల్యానందాల గురించి, వారు మోస్తున్న బరువుల గురించి, మరీ ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవటం చాలా తక్కువ. ప్రస్తుత పౌరుల గురించి పట్టించుకోటానికి తీరికలేని ప్రభుత్వాలు భావి పౌరుల గురించి నిర్లక్ష్యంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? వారికి ఓటుహక్కు కూడా లేదాయె-
కానీ అప్పుడప్పుడూ, ఏ బాలల దినోత్సవం రోజునో, ఐక్యరాజ్యసమితి పంపిన నివేదికలో, ఆదేశాలో, ఒప్పందాలో చూసినప్పుడో ప్రభుత్వానికి పిల్లలు గుర్తొస్తారు. ఏదో ఒక రూలు వాళ్ళ గురించి పాస్‌ చేసి చేతులు దులుపుకుని ''అబ్బా చివరికి పిల్లలు కూడా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ పిల్లలు పాడుగాను'' అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. ఈ మధ్య ప్రభుత్వం నిద్రలేచి చేసిన ఒక ఆలోచన ఏమిటంటే, పాఠశాలల్లో గానీ పాఠశాలల పరిసర ప్రాంతాల్లోగాని చెత్త ఆహార పదార్థాన్ని (జంక్‌ఫుడ్‌ అని ముద్దుగా పిలుస్తారు ఇంగ్లీషులో) అమ్మకుండా నిషేధించాలని. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే పనికిమాలిన చిరుతిండ్లుగా ప్రభుత్వం కొన్ని పదార్థాల్ని బాగానే గుర్తించింది. చిప్స్‌, బాగా నూనెలో వేయించిన రకరకాల పదార్థాలు, కోకా కోలా వంటి పానీయాలు, చాక్లెట్లు, బర్గర్లు, సమోసాల వంటి వాటిని పాఠశాల లోపల నడిపే క్యాంటిన్లలో గానీ, పాఠశాలకు యాభై మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలలోగాని అమ్మకూడదని ప్రభుత్వం చాలా స్పష్టంగానే చెప్పింది. పిల్లలు ఈ పిచ్చి తిళ్ళు తినకుండా ఆరోగ్యంవంతమైన ఆహారం తినేలా ప్రోత్సహించాలనీ, దానికి అన్ని పాఠశాలలకీ వర్తించే విద్యా పాలసీగా రూపొందించాలనీ ప్రభుత్వం అనుకుంటోంది. అనుకోవటం, చెప్పటం, కాగితాల మీద రాసి సంబంధిత శాఖలలకు పంపటం ఇవన్నీ చాలా తేలిక. ఎవరికి తెలియని విషయాలు గనుక కానీ అమలు చేయటం ఈ వ్యాపార ప్రపంచంలో ఎంత కష్టమో రోజూ టి.వి చూసే వారందరికీ తెలుసు. ఆరోగ్యం సంగతలా ఉంచండి. పేద పిల్లల కోసం పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎలా విఫలమైందో మనకు తెలుసు. ఇది ఆ పిల్లల కోసం కాదు.
యాభై సంవత్సరాల వయసు దాటిన వారందరికీ ఒక రుచికరమైన జ్ఞాపకం ఉంటుంది. స్కూల్ల్లో పొద్దున రీసెస్‌ బెల్‌ కొట్టగానే, మధ్యాహ్నం 'లంచ్‌బెల్లు' కొట్టగానే, సాయంత్ర 'ఇంటిబెల్లు' కొట్టగానే స్కూలు గేటు బైటకి పరిగెత్తేవాళ్ళం. అక్కడ బుట్టలో రకరకాల చిరుతిళ్ళు పెట్టుకుని ఒక ముసలమ్మో, ఒక ముసలయ్యో, లేదా చలాకీగా ఉండే కుర్రవాళ్ళో పిల్లల కోసం రెడీగా ఉండేవాళ్ళు వేరుశనక్కాయలు, జీడిలు, ఉప్పు శనగలు, నిమ్మతొనలు, బఠానీల వంటి పాటితోపాటు సీజన్‌ని బట్టి దొరికే జామకాయలు, తేగలు, ఉప్పు, కారం రాసిన మామిడికాయ ముక్కలు, ఉసిరి కాయలు - అబ్బా రాస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి- పిల్లలు ఆ బుట్టల చుట్టూ మూగి ఏదో ఒకటి కొనుక్కొని మళ్ళీ బెల్లు కొట్టే లోపల వాటిని నమిలేసి ఆ రుచితో రెట్టించిన ఉత్సాహంతో క్లాసులకు వెళ్ళే వాళ్ళు. కొనుక్కోటానికి డబ్బులేని వాళ్ళకు స్నేహితులు పిసరంత పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ దృశ్యాలు దాదాపు అదృశ్యమై పోయాయి. ఆ ముసలమ్మలు ఇప్పుడు దేవాలయాల ముందు అడుక్కోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. సరే వాళ్ళ సంగతి మనం ఆర్చగలిగేది, తీర్చగలిగేది కాదు. పిల్లల సంగతి ఆలోచిద్దాం.
ఇప్పుడు పిల్లల దగ్గర డబ్బులు దండిగానే ఉంటున్నాయి. చిరుతిళ్ళ కోసం ఆశపడకపోతే వాళ్ళు పిల్లలే కాదు. మరి ఇంత అందమైన, ఆకర్షణీయమైన, చురుకైన 'బాల్యం' అనే మార్కెట్‌ని చూస్తూ చూస్తూ మల్టీ నేషనల్‌ కంపెనీలు ఒదులుకుంటాయా? టి.విల్లో పూర్వం ఆడవాళ్ళ శరీరాలను ఆకర్షణీయంగా చూపి అమ్ముకునే వస్తువుల ప్రకటనలే ఉండేవి. ఇప్పుడు ప్రకటనల నిండా పిల్లలే. అది బట్టల సబ్బయినా, పియర్స్‌ సబ్బయినా, పిల్లలే కనపడి ముచ్చట గొలుపుతారు. ఇక చిప్స్‌, చాక్లెట్లు, నూడిల్స్‌ వంటి వాటి సంగతి చెప్పేదేముంది. అందమైన పిల్లలు వాటిని తింటుంటే, వారి ఆనందం చూస్తుంటే పెద్దల కడుపు నిండుతుంది. పిల్లల కోరిక పెరుగుతుంది. అర్జంట్‌గా చాక్లెట్ల ఆకలి, చిప్స్‌ ఆకలి, కోక్‌ దాహం కలిగి వాటిని తీర్చుకుంటారు. ఈ చిప్స్‌, ఇంకా అలాంటి పదార్థాల్లో ఎమ్‌ఎస్‌జి కలుపుతారు. దాంతో ఇక పిల్లలు ఆ రుచికి బానిసలవుతారు. పెద్దలూ మినహాయింపు కాదు. ఎమ్‌ఎస్‌జి ఎడక్టివ్‌- దాని రుచి మరిగితే ఒదిలించుకోవటం కష్టం. ఇట్లాంటి ఆహార పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్‌లోకి ఒదిలి, వాటిని ఇంత బాగా ప్రచారం చేస్తూ పిల్లలు వాటిని తినకూడదని, స్కూళ్ళలో అమ్మగూడదనీ నిషేధించటం కుదిరే పనేనా? అందరికీ సమానమైన, ఒకే విధమైన ప్రాథమిక విద్య గురించిన పాలసీనే లేదు. ఆరోగ్యకరమైన ఆహారం గురించి స్కూలు స్థాయిలో ఒక విద్యా పాలసీ ప్రవేశపెట్టటం సాధ్యమయ్యే పనేనా?
పిల్లలు బడి ఆవరణలో ఇడ్లీలు, దోశెలు కొనుక్కొని తింటారనుకోవటం అమాయకత్వం. వెర్రితనం. వాటిని ఇళ్ళల్లోనే తినటం లేదు. పైగా ప్యాకెట్లలో దొరికే వాటికి లేని ప్రమాదం వీటికి ఉంది. ఈగలు, దోమలు తదితర బాక్టీరియాలు తాకకుండా వీటిని పిల్లలకు సురక్షితంగా అందించగలిగిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎన్ని పాఠశాలల్లో కనీసపు పారిశుధ్యానికి మనం హామీ ఇవ్వగలం? పిల్లలకేంటి, పెద్దలకేంటి అందరికీ అంగడి సరుకులంటే, నూనె సరుకులంటే మనసు లాగుతుంటుంది. వాటిని ఇళ్ళల్లో తయారు చేసుకునన్నా తింటాం. లేదా ఏ పెళ్ళిళ్ళల్లోనో తింటాం. పిల్లలు కాబట్టి బజార్లోవైనా సరే కొనుక్కుని తినాలనుకుంటారు. పెద్దలను విసిగించి కొనుక్కుతింటారు. ఆరోగ్యం పాడు చేసుకుంటారు. పెద్దలు ఆస్పత్రులు, మందులూ అంటూ మళ్ళీ ఇంకో కొత్త మార్కెట్‌కి బలిపశువులవుతారు.
దీనిని ప్రభుత్వ ఉత్తర్వులు ఆపలేవు. ప్రజలే, తల్లిదండ్రులే ఒక సమూహంగానో, సంఘంగానో ఏర్పడి సమస్య తీవ్రత గురించి ఆలోచించాలి. ఎంత తీవ్రమైన సమస్య కాకపోతే ప్రభుత్వం నామమాత్రంగానైనా దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది. పిల్లలు ఊబకాయంతో ఉండటం, చురుగ్గా లేకపోవటం, తరచు అనారోగ్యాల పాలవటం, చిన్నతనంలోనే మధుమేహం వంటి వ్యాధుల బారిన పడటం, పోషకాహార లోపంతో కంటి చూపు మందగించటం, పళ్ళు పుచ్చిపోవటం ఇంకా సవాలక్ష ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనం - ఔను మనమే కాపాడుకోవాలి. టి.విలలో కనపడే బొమ్మల్లాంటి అందమైన పిల్లల్ని మైమరచి చూసే అమ్మలూ, నాన్నలు, అమ్మమ్మలూ, తాతయ్యలూ ఆలోచించండి. ఆరోగ్యం ఒక హక్కు. మన పిల్లల ఆరోగ్య హక్కును హరించి వేస్తున్న వారి గురించైనా మనం పట్టించుకోమా? ఆదివాసీల భూముల్ని అక్రమ మైనింగుల కోసం లాక్కొంటున్న కంపెనీలు, రైతుల భూముల్ని సెజ్‌ల పేరుతో లాక్కొంటున్న కంపెనీలు - అవన్నీ చాలా పెద్ద విషయాలు, మనకు అనవసరమైన విషయాలు. మనవల్ల కాని విషయాలు. కానీ మనం బతికేదే మన పిల్లల కోసం గదా- ఆ పిల్లల ఆరోగ్యం గురించైనా పట్టించుకుందాం పట్టండి. ఏమో తీగ లాగితే డొంకంతా కదుల్తుందేమో

Sunday, 23 March 2014

ఈ దధీచి ఎముకనే సృష్టిస్తున్నాడు




      దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడంటారు. కానీ బిక్రమ్‌ జిత్‌ బసు ఎముకనే సృష్టించి జనారోగ్యరంగానికి ఒక గొప్ప ఆయుధంగా అందిస్తున్నాడు. నిజమైన ఎముకలా పనిచేసే ఈ ఎముక వైద్యరంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ.
        అక్కడికి వెడితే జనసందోహంతో కోలాహలంగా ఉండే బెంగళూరులో ఉన్నామనిపించదు. అది చాలా చల్లగానే కాక, నిశ్శబ్దంగా కూడా ఉంది. అందులో ఒక వ్యక్తి తన వృత్తికి సంబంధించిన పరికరాల మధ్య పచార్లు చేస్తున్నారు. అవి మరేవో కావు, జీవకణాలు, ఒక మైక్రోస్కోప్‌, ఒక ఆవిరి పాత్ర, పరికరాలను శుభ్రంగా ఉంచడానికి ఒక అతినీలలోహిత కిరణాల చాంబర్‌, రిఫ్రిజరేటింగ్‌ యూనిట్లు. అవన్నీ బయోలజీతో ముడిపడిన వన్న సంగతి తెలుస్తూనే ఉంది. బయోలజీ పని జీవపదార్థాన్ని శోధించడమే. 'ఇది మీకు ఒక మెడికల్‌ లేబరేటరీగా కనిపిస్తోంది కదూ?' అన్నాడు, ముసిముసిగా నవ్వుకుంటూ. ఆయన పేరు బిక్రమ్‌జిత్‌ బసు. వయసు 40 ఏళ్లు. ఆయన ఒక ఇంకుబేటర్‌ తెరిచారు. అది అప్పుడే పుట్టిన శిశువును ఉంచిందని అనుకునేరు, కాదు. అందులో 37 డిగ్రీల సెల్సియెస్‌ వద్ద మానవజీవకణాలు పెరుగుతున్నాయి. మానవశరీర ఉష్ణోగ్రత అదే.
ఆయనది 'విద్యుత్‌' భాష
2013లో యువశాస్త్రవేత్తలకు ఇచ్చే శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు ను అందుకున్న బసు, 114 ఏళ్ల చరిత్ర ఉన్న బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. వైద్యరంగంలో ఒక నూతనశకాన్ని ఆవిష్కరించబోయే ప్రయత్నంలో ఆయన మునిగి తేలుతున్నారు. అది: కృత్రిమ వాతావరణంలో జీవకణాలను అభివృద్ధి చేయడం. అందుకు ఆయన ఉపయోగించే ప్రధాన సాధనం, విద్యుత్తు. మనదేశంలో ఆ రంగంలో కృషి చేస్తున్నవారు చాలా తక్కువ. వారిలోనూ బసు ముందడుగులో ఉన్నారు. ఆయన గురించి ఇంకో విశేషం ఏమిటంటే, ఆయన 12వ తరగతివరకు తన మాతృభాష అయిన బెంగాలీ మాధ్యమంలోనే చదువుకున్నారు.
చిన్నపాటి రెండు గదులు మాత్రం ఉన్న ఆ లేబరేటరీలో డీప్‌ ఫ్రీజర్‌ పరిమాణంలోని ఒక త్రీడీ ప్రింటర్‌ ఉంది. అది సరదాగా ఎవరో ఒక మోడల్‌ కారు తయారుచేయడానికి ఉద్దేశించిందా అన్నట్టుగా ఉంది. అందులో మాగెట్లు, బ్యాటరీలు, ఒక గ్యాస్‌ సిలెండర్‌ ఉన్నాయి. ఇవన్నీ కృత్రిమ పరికరాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్‌ సామగ్రే. ఈ చిన్న లేబరేటరీలోనే బసు విద్యార్థులతో కలసి తన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తను ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థేకాక, తనింతకుముందు పనిచేసిన కాన్పూర్‌ ఐఐటి, ఆమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ ఆయన ప్రయోగాలను స్పాస్సర్‌ చేస్తున్నాయి.
ఇంతకీ బసు ప్రయోగాలు ఎలాంటివంటే, ఆయన జీవరహితపదార్థం మీద జీవకణాలను అభివృద్ధి చేస్తూ, వాటితో కొత్త ఎముకల ప్రోటో టైపులు అంటే, మాతృకలు తయారుచేస్తున్నారు. ఇంతేకాదు, ఇదే పద్ధతిలో గుండె, నరాలకు సంబంధించిన జీవకణాలను కూడా ఉత్పత్తిచేసే పనిలో ఉన్నారు. ఆయన పరిశోధనలన్నింటికీ కీలకం విద్యుత్తు. అది కూడా అతి తక్కువ విద్యుత్‌ ప్రసారం. ఇటువంటి విద్యుత్తుతో పనిచేయించడానికి ఎంతో నైపుణ్యం కూడా ఉండాలి. జీవకణాలతో మాట్లాడడానికి బసు ఉపయోగించే భాష ఈ తరహా విద్యుత్తే. జీవకణాలు ఎలా పెరగాలో విద్యుత్తే బోధిస్తుందనడం కొత్త విషయం ఏమీ కాదు. జీవులన్నింటిలోనూ నిరంతరం మంద్రస్థాయిలో విద్యుత్తు ప్రవహిస్తూనే ఉంటుంది. వోల్టేజిలలో మార్పులు చేసి కళ్లు వెనుక వైపు, గుండె మరో చోట ఉండే కప్పలను సైంటిస్టులు ఎన్నో దశాబ్దాలుగా సృష్టిస్తూనే ఉన్నారు.
బసు చేస్తున్నది ఏమిటంటే, కృత్రిమ పరిసరాలలో విద్యుత్తును ఉపయోగించి ఎముకలను, గుండె, నరాలకు చెందిన జీవకణాలను, చివరికి స్టెమ్‌ కణాలను (ఇవి ఇతర రకాల కణాలను కూడా అభివృద్ధి చేస్తాయి) కూడా పెరిగేలా చేయడం. ఇదంత తేలిక కాదు. అపరిచిత పరిసరాలలో జీవకణాలను పెంచడానికి ఎప్పుడు, ఎంత విద్యుత్తును ప్రసరింపజేయాలో బయో ఇంజనీర్‌కు కచ్చితంగా తెలిసి ఉండాలి. కణవిభజన దెబ్బతినకుండానూ, కణాలు చనిపోకుండానూ చూడాలి. 'రెండు కణాలు మాట్లాడుకునేటప్పుడు, మనం ఉపయోగించే పదార్థం అందుకు వెసులుబాటు కలిగించేదిగా ఉండాలి' అంటారు బసు.
నిజమైన ఎముకలా...
ఉదాహరణకు, బసు బృందం మనిషి ఎముకలను తలపించే హైడ్రోగ్జ్యాపటైట్‌ అనే మిశ్రమాన్ని ఎముకల అభివృద్ధిలో ఉపయోగిస్తుంది. ఎముకకు ఉండే మరో స్వభావం ఏమిటంటే, నడవడం వంటి మెకానికల్‌ ఒత్తిడి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం. హైడ్రోగ్జ్యాపటైట్‌ స్ఫటికాలను, టైటానియం, సిల్వర్‌ వంటి రకరకాల సామగ్రితో పులియబెట్టడంలో బసు లేబరేటరీ నైపుణ్యం సంపాదించింది. ఈ ఎముకల నిర్మాణానికి వాడే పదార్థాలనుంచి వివిధ ఆకృతులు అల్లడానికి త్రీడీ ప్రింటర్‌ ఉపయోగిస్తారు. ఈ కృత్రిమ ఎముక నిజమైన ఎముకలా పనిచేయాలంటే, అది విద్యుద్వావహకంగానూ, కఠినంగా ఉంటూనే వంగే విధంగానూ, బరువులు మోసేదిగానూ ఉండాలి. అదే సమయంలో, కొత్త ఎముక కణాలను ఉత్పత్తి చేసుకోగలిగేలానూ, సూక్ష్మజీవుల దాడిని నిరోధించేదిగానూ ఉండాలి. కృత్రిమంగా సృష్టించిన జీవసామగ్రి విజయవంతంగా పనిచేయాలంటే, వాటిని శరీరం తనలో ఇముడ్చుకోగలిగేలా ఉండాలి. ఇలాంటి కృత్రిమ సామగ్రిని శరీరంలో అమర్చినప్పుడు ప్రధానంగా ఎదురయ్యే సమస్య, ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా బ్యాక్టీరియా ద్వారా. ఈ బ్యాక్టీరియా అభివృద్ధిని నిరోధించడానికి బసు బృందం ప్రకృతిలోని మరో శక్తిని రంగంలోకి దింపింది. అది, మేగటిజం. ఈ రకంగా తయారుచేసిన ఎముకను ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఒక ఎలుక తొడ ఎముకలో డ్రిల్లింగ్‌ చేసి రెండు మిల్లీ మీటర్ల వ్యాసార్థం ఉన్న చిన్నపాటి సిలిండర్‌ లాంటి కృత్రిమ ఎముకను అందులోకి చొప్పించారు. అది పాత ఎముకలానే పనిచేయడం ప్రారంభించింది. తదుపరి అడుగు, ఇతర జీవులపై, ముఖ్యంగా మనుషులపై ప్రయోగాలు జరపడమే. అయితే అందుకు మరింత పరిశోధన జరగాలి. అలాగే, అనుమతులు వగైరాలు అవసరమవుతాయి. ఆ దశకు చేరేది 2015 తర్వాతే.
బసు ఇంకో సమస్యను కూడా ఎదుర్కోవాలి. పశ్చిమదేశాల్లో బసు నిర్వహించే లేబరేటరీలాంటివి ఆసుపత్రులకు అనుబంధంగా ఉంటాయి. మనదేశంలో అలా కాదు. ఇక్కడ అంతా కంపార్ట్‌మెంటల్‌ పద్ధతిలో ఉంటుంది. ఇది మా శాఖకాదు, అంటూ ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చుంటారు. కనుక ఓ వైపు అసుపత్రులను, ఇంకోవైపు కంపెనీలను బసు సంప్రదించుకుంటూ ఉండాలి. మనదేశంలో ఆసుపత్రులపైన డాక్టర్లపైన కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌, హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటివి ఏవో కొన్ని మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఇవి క్యాన్సర్‌ చికిత్సలోనే స్పెషలైజ్‌ చేస్తున్నాయి. టాటా ఆసుపత్రిలో బసుకు మద్దతుదారుగా ఉన్న ఆర్థోపెడిక్‌ ఆంకాలజీ చీఫ్‌ అజరు పురి పదేళ్ల క్రితం తక్కువ ధరకు లభించే ఒక మెటాలిక్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. బోన్‌ క్యాన్సర్‌ ఉన్నప్పుడు ఏ రోగికైనా శస్త్రచికిత్స జరిపి ఏదైనా అవయవాన్ని తొలగించినప్పుడు దాని స్థానంలో పురి అభివృద్ధి చేసిన పరికరాన్ని అమర్చవచ్చు. అయితే ఈ పరికరం పూర్తిగా యాంత్రికం కనుక దీని ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. బసు అభివృద్ధి చేసే ఎముక స్వతాహా పెరగగలగడమే కాక, దాని ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది.
జనోపయోగంగా...
హైదరాబాద్‌లోని ఎక్సెల్‌ మ్యాట్రిక్స్‌ బయొలాజికల్‌ డివైసెస్‌ సహా వివిధ కంపెనీలు బసు ప్రయోగాలకు ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. బసు మాటల్లో ఎంతో ఆశాభావం, పట్టుదల వ్యక్తమవుతుంటాయి. 'ఈ పరిశోధననంతటినీ జనానికి ఉపయోగపడే పరికరాలుగా మార్చడమే నా లక్ష్యం' అంటారాయన. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సులో కొత్తగా ఒక బయోమెటీరియల్స్‌ విభాగాన్ని ప్రారంభించాలని కూడా ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం దానిని పరిశీలిస్తోంది.
దధీచి అనే మహర్షి తన వెన్నెముకనే వజ్రాయుధంగా చేసి ఇంద్రుడికి ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. బసు కొత్త ఎముకనే సృష్టించి మానవాళి ఆరోగ్యానికి గొప్ప ఆయుధాన్ని ఇవ్వబోతున్నారు.