Wednesday, 4 July 2012

హిమాలయ శ్రేణి..



                      హిమాలయమంటే తెలుగులో 'మంచు నివాసం'. ఈ శ్రేణిలో అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌. దీని ఎత్తు 8,848మీటర్లు (29, 029 అడుగులు). ఈ పర్వతశ్రేణి ఆఫ్ఘానిస్తాన్‌, భూటాన్‌, బర్మా, చైనా, భారత్‌, నేపాల్‌, పాకిస్తాన్‌లకు విస్తరించింది. దాదాపు 300 కోట్ల ప్రజలు దీని నుండి వచ్చే నీటిపై ఆధారపడి ఉన్నారు. ఈ పర్వతాలు 18 దేశాలకు 'పరీ వాహక' ప్రాంతంగా ఉన్నాయి. దక్షిణాసియా సంస్కృతిపై వీటి ప్రభావం అధికంగా ఉంది. హిమాలయాల్ని హిందువులు, బౌద్ధులు, సిక్కింలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ శ్రేణిలో 15 వేల హిమనీనదాలున్నాయి.
భారత-ఆస్ట్రేలియా టెక్టానిక్‌ పళ్లెం ప్రతి సంవత్సరం 15 సెం.మీ. ఉత్తర దిశలో జరిగింది. యూరేషియా పళ్లాన్ని ఎదుర్కొని ఒత్తిడికి గురవుతుంది. ఫలి తంగా ఇప్పటి హిమాలయాల పర్వత శ్రేణి ఏర్పడింది. ఇప్పటికీ ఈ భారత- ఆస్ట్రేలియా టెక్టానిక్‌ పళ్లెం ప్రతి ఏడాది 6.7 సెం.మీ. దూరం ఉత్తరంవైపుకు కదులుతుంది. భూగోళంపై ఈ పర్వతాలు ఇప్పటికీ చురుగ్గా, జవసత్వాలు కలిగి ఉన్నాయి.
సముద్రగర్భంలో ఉన్న తేలికైన సున్నపురాళ్లు(మెరిన్‌ లైమ్‌ స్టోన్‌) పైకి వచ్చి పర్వతాలుగా ఏర్పడ్డా యి. ఎవరెస్టు, దాని పక్కనున్న శిఖరాలు కలిసే (సమ్మిట్‌) ప్రాంతంలో వున్న ఈ రాళ్లే దీనికి నిదర్శనం. హిమాలయ పర్వతశ్రేణిలో 14 శిఖరాలు 8 వేల మీటర్లకుపైగా ఎత్తున్నాయి. 7,200 మీటర్లకు పైగా 100 పర్వతాలున్నాయి. ఇవి పడమర నుండి తూర్పువైపుకు 2,400 కి.మీ. మేర, 400 కి.మీ. వెడల్పున విస్తరించి ఉన్నాయి.
శిఖరం ఎత్తు పెరుగుతున్న కొద్దీ జీవవైవిధ్యం తగ్గిపోతుంది. (వివరాలు చిత్రంలో చూడండి) వేగంగా మారుతున్న భూగోళ వాతావరణం హిమాలయాలపై జీవించే జంతుజాలల్నీ ప్రభావితం చేస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల ఓక్‌ అడవుల్లో, ముఖ్యంగా గర్హల్‌ ప్రాంతంలో ఫైన్‌ చెట్లు విస్తరిస్తున్నాయి. కొన్నిరకాల చెట్లు త్వరగా పుష్పించి, కాస్తున్నాయి. ముఖ్యంగా రోడోడెరడ్రాన్‌, యాపిల్‌, మైరికా (ఒకరకం చెట్టు)లలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఔషధ మొక్కల్లో ఔషధ గుణాలు మారవచ్చని భావిస్తున్నారు.
హిమాలయాల వర్షపాత ప్రభావం దక్షిణంవైపు ఎక్కువగా ఉంది. ఉత్తరంవైపు వర్షాలు కురవడం లేదు. ఒక్కోసారి ఈ పర్వతంపై నుండి మంచు ఖండాలు కూలిపోతూ ఉంటాయి ఉత్తరంవైపునున్న ఆర్కిటిక్‌ ప్రాంతం నుండి వచ్చే చల్లనిగాలులు మన దేశంలోకి రాకుండా ఈ పర్వతాలు అడ్డుకుంటు న్నాయి. దీనిప్రభావంతో దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది. ఉత్తరదిశగా వెళ్లే ఋతుపవనాల్ని ఆపి, దక్షిణాసియాలో వర్షాలు వచ్చేలా చేస్తాయి. ఫలితంగా మధ్యాసియాలో ఎడారి ఏర్పడింది. దీనికి గోబీ ఎడారిని ఉదాహరణగా చెప్పవచ్చు. తూర్పువైపు (ఇరాన్‌) నుండి వచ్చే చలిగాలుల్నీ ఆపి, కాశ్మీర్‌లో మంచు కురవడానికి, పంజాబ్‌, ఇతర ఉత్తరభారతంలో వర్షాలు రావడానికి తోడ్పడుతున్నాయి. బ్రహ్మపుత్ర లోయ, ఈశాన్య భారతంలో, బంగ్లాదేశ్‌లో కొంతమేర చలిగాలులు రావడానికి దోహదపడుతున్నాయి.

No comments:

Post a Comment