Wednesday, 18 July 2012

భూమి మీది నీళ్ళు ఇక్కడే పుట్టాయి..!



        ఇంతకాలం భూగ్రహంపైన ఉన్న జలం ఎక్కడో బాహ్యాంత రాళంలో జనించిందని అనుకుంటున్నారు. కానీ, సౌర కుటుంబం నుండి ఊడిపడ్డ ఒక ఆస్టరాయిడ్‌ వల్ల భూగ్రహం మీద జలం ఉద్భవించి ఉండవచ్చని కొత్త అంచనా. భూమికి బాగా దగ్గర నుండిగానీ, అసలు భూమి మీదే కానీ ఏర్పడిన ఆస్టరాయిడ్‌ వల్ల నీరు పుట్టి వుండవచ్చని అంటున్నారు. బహుశ మార్స్‌, జూపిటర్‌ మధ్య ఉన్న ఆస్టరాయిడ్‌ వలయం నుండి ఆస్టరాయిడ్లు భూమిని తాకి నీటిని పుట్టించి వుండే అవకాశం వుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా అంతరిక్ష పదార్థాలలోని నీటి మంచులో ఉండే డ్యుటీరియం మోతాదుని బట్టి అవి సౌర కుటుంబ తొలి దశలలో ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవచ్చు. సూర్యుడి నుండి చాలా దూరంగా ఉన్న శకలాలలో అధిక మోతాదు డ్యుటీరియం ఉంటుంది. పరిశోధకులు అధ్యయనం చేసిన శకలాలలో తక్కువ డ్యుటీరియం ఉంది. కాబట్టి నీటి మూలం మన గ్రహానికి అతి దగ్గరిలోనే ఉందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment