Wednesday, 11 July 2012

ప్రాచీన పుష్పాలు..!


సైబీరియా ప్రాంతంలో లభించిన ఒక ప్రాచీన మొక్క తాలుకు ఫలం సుమారు 31,800 సంవత్సరాలు మంచుకింద నిక్షిప్తమై ఉందని గుర్తించారు. ఈ పండు నుండి శాస్త్రవేత్తలు కొత్త మొక్కలను సృష్టించారు. ఆ మొక్కలు పెరిగి తెల్లటి పూలను కూడా ఇచ్చాయి. అంతకాలం మంచుకింద ఉన్నా కూడా ఇంకా జీవకణాలు అలాగే ఉండటం ఆశ్చర్యపరిచింది. కొంతకాలం వరకూ కణాలను శీతలీకరించి, తిరిగి వాడటం ఇప్పుడు పరిపాటే. కానీ, దాదాపు నలభైవేల ఏళ్లనాటి పండులో సజీవకణాలు లభించడం కొత్త ప్రయోగాలకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న మొక్కల విత్తనాలని ఈ విధంగా నిక్షిప్తం చేయడం ఆరంభించారు. భవిష్యత్తులో ఏదైనా జాతి అంతరించిపోతే, ఇలా భద్రపరిచిన గింజల నుండి మొక్కల్ని తిరిగి పునరుజ్జీవింప చేయవచ్చు.

No comments:

Post a Comment