బ్రిటిష్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్, భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ ఇద్దరిపేర్లు కలిపి 'హిగ్స్ బోసన్' అని ఉపకణానికి పేరు పెట్టారు. ఇది విశ్వనిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మహావిస్ఫోటనం అనంతరం జరిగిన విశ్వపరిణామంలో నక్షత్రాలు, గ్రహాలు ఒకదాని తరువాత ఒకటిగా ఎలా ఆవిర్భవించాయో 'హిగ్స్ కణాలు' వివరిస్తాయనేదే 'స్టాండర్డు మోడలు సిద్ధాంతం'. ఈ కణాలు లేకపోతే విశ్వం మొత్తం పరస్పర సంబంధం లేకుండా ఇసుక రేణువుల వలె ఉండేదే తప్ప పదార్థం ఒక దగ్గరకు చేరి గ్రహాలు, నక్షత్రాలుగా మారేది కాదని ఈ సిద్ధాంతం పేర్కొంది. దీనిప్రకారం మనకు తెలిసిన ఏ కణానికీ స్వతహాగా ద్రవ్యరాశి లేదనీ, అవి హిగ్స్ క్షేత్రములో ప్రయాణించినపుడే ఈ బోసాన్లు వాటికి ద్రవ్యరాశిని సమకూరుస్తున్నాయనీ తెలిసింది. అయితే, హిగ్స్ క్షేత్రం నుంచి ఉపకణాలు ప్రయాణించినప్పుడు ద్రవ్యరాశి ఎలా చేకూరుతుందో తెలియాల్సి వుంది.
బోసాన్ కణాలు. చుట్టు తిరుగుడు (స్పిన్) సంఖ్య ఒకటి. 'హిగ్స్ శక్తి స్థలం' (హిగ్స్ ఫోర్స్‌ఫీల్డ్) మొత్తం పరమాణు భాగాన్ని ఆక్రమించుకుంటుంది. ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వుంటుంది. క్వార్క్స్, ఎలక్ట్రాన్లు హిగ్స్ క్షేత్ర శక్తిలో పయనించినప్పుడు బరువును పొందుతాయి. ఫోటాన్ ఉపకణాలు విద్యుదయస్కాంత శక్తి కణాలుగా ఉన్నట్లుగానే హిగ్స్ క్షేత్రశక్తికి హిగ్స్ బోసాన్ ఉపకణాలు ఉంటాయి. హిగ్స్ బోసాన్ ఉపకణ ద్రవ్యరాశి చాలా ఎక్కువ. ఫలితంగా, వీటి అధ్యయనానికి పెద్ద శక్తి కావాలి.
'దైవం' కాని కణం..
No comments:
Post a Comment