వచ్చే ఏడాదిలో ఊబకాయానికి మందు మార్కెట్లోకి రానుంది. 'బెల్విక్' అనే ఈ మందును వాడితే సుమారు 5% శరీర బరువు తగ్గుతుందని నిర్ధారణ అయింది. అయితే, దీన్ని వాడటం వలన ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉందని అమెరికా ఆరోగ్య అధికారులు గతంలో దీనిని ఆమోదించలేదు. బెల్విక్‌ని తయారుచేసే అరీనా సంస్థ మాత్రం అటువంటి ప్రమాదమేమీ లేదని మరిన్ని వివరాలతో తాజాగా అర్జీ పెట్టుకుంది. అనేక పరీక్షల తరువాత అమెరికా ఆరోగ్య అధికారులు బెల్విక్‌ను ప్రజల వినియోగానికి శ్రేయస్కరం అని ఆమోదించారు. బెల్విక్ ఆకలిని మందగింపజేస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని వాడవచ్చు. కానీ, గర్భిణీలు మాత్రం వాడకూడదట.
Wednesday, 4 July 2012
ఊబకాయానికి మందు..!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment