సాధారణంగా తీవ్రమైన అపెండిసైటిస్‌కి ఆపరేషన్ చేసి
తొలగించడమే మార్గం! కానీ, తీవ్ర అపెండిసైటిస్‌తో బాధపడే వారిలో 80 శాతం
మందికి సరైన యాంటీబయాటిక్‌లు వాడి సమస్యను తగ్గించవచ్చనీ, ఆపరేషన్ అవసరం
లేకుండా నయం చేయవచ్చనీ స్వీడన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. అయితే,
యాంటీబయాటిక్‌లు వాడటం వలన సమస్య పూర్తిగా సమసిపోదనీ వీరు భావిస్తున్నారు.
భవిష్యత్తులో, మళ్ళీ అపెండిసైటిస్ తలెత్తే ప్రమాదం ఉందట. కానీ, ఆపరేషన్‌ను
తప్పించుకునేందుకు ఇదొక మార్గమని పరిశోధకులు భావిస్తున్నారు.
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
No comments:
Post a Comment