- డాక్టర్ కాకర్లమూడి విజయ్
ఫాబా బీన్స్ అనే రకం చిక్కుడులో అధికమోతాదుల్లో యాంటీ
ఆక్సీడెంట్ పదార్థాలు ఉన్నాయనీ, అవి అనేకరకాల కాన్సర్‌లను నివారించడంలో
సమర్ధవంతంగా పనిచేస్తాయనీ పరిశోధకులు తెలిపారు. ఫాబా బీన్స్‌తో కాన్సర్
వంటి మహమ్మారి వ్యాధులేకాక అధిక రక్తపోటుని నియంత్రించడంలో కూడా బాగా
పనిచేస్తాయని అంటున్నారు. ఆస్ట్రేలియాలో ఈ తరహా బీన్స్ విరివిగా పండుతాయి.
వీటి నుండి వెలికితీసిన ఫీనోలిక్ సమ్మేళనాలు కొన్నిరకాల కాన్సర్ కణాలను
నాశనం చేశాయి. అయితే ఈ బీన్స్‌ని ఆహారంగా తీసుకుంటే అవి కాన్సర్ కణాలపై
ఏవిధంగా పనిచేస్తాయో ఇంకా తెలియవలసి వుంది.
No comments:
Post a Comment