- డాక్టర్ కాకర్లమూడి విజయ్
అంతరిక్షంలో మన భూమికంటే భారీ పరిమాణంలో మరో గ్రహం
కనిపించింది. నిజానికి అది భూమికంటే రెండింతలు పెద్దది. విశేషమేమిటంటే, ఆ
గ్రహం అధికశాతం వజ్రంతో నిర్మితమై ఉండటం. ఆ శిలా గ్రహం ఒక నక్షత్రం చుట్టూ
అతి వేగంగా పరిభ్రమిస్తోంది. ఎంత వేగంగా అంటే, మన 18 గంటలు దానిపై ఒక
సంవత్సరం అట! ఆ గ్రహానికి '55 షaఅషతీఱ వ' అని పేరు పెట్టారు. దానిపై
ఉష్ణోగ్రతలు 1,648 సెల్సియస్ డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. ఆ గ్రహంలో
అధికశాతం గ్రాఫైట్, వజ్రాలు వున్నాయి. మామూలుగా అయితే నీరు, గ్రానైట్స్
ఉంటాయి. ఇంతకు మునుపు కూడా కొన్ని వజ్ర గ్రహాలను గుర్తించారుగానీ ప్రస్తుత
గ్రహమంత వివరాలు లభించలేదు.
No comments:
Post a Comment