Thursday, 31 October 2013

బెల్లంతో బోలెడు మంచి
అనకాపల్లి బెల్లం
             పంచదార వాడటం కంటే బెల్లం వాడకం శ్రేష్ఠమని పెద్దలు చెప్తారు. బెల్లాన్ని చెరకు రసంతో తయారుచేస్తారు. ఇందులో పోషకపదార్థాలు లభిస్తాయి. బెల్లంలో విటమిన్స్‌, మినరల్స్‌, కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, ఫైబర్‌, సెలీనియం, జింక్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివెన్నో లభిస్తాయి. తీపి పదార్థాల తయారీలోనే కాక, కొన్ని వంటకాల్లో కూడా వాడతారు. శ్రీరామనవమికి చేసే పానకంలో బెల్లం తప్పనిసరి. పూజ చేసిన తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని సమర్పిస్తారు. జున్ను రుచిగా ఉండాలంటే పంచదార కంటే బెల్లం వాడటమే మేలు. పాత బెల్లమే శ్రేష్ఠమైంది. ఔషధపరంగా కూడా ఇది ఉపయోగిస్తుంది.
-  బెల్లాన్ని ఆవనూనెతో కలిపి తింటే దగ్గు, ఆయాసం తగ్గిపోతాయి.
-  ఉసిరిముక్కలను బెల్లంతో కలిపి తింటే కీళ్లనొప్పుల నివారణ కలుగుతుంది.
- రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
-  ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే, ఎక్కిళ్లు ఆగిపోతాయి.
-  రక్తలేమితో బాధపడే వారు, ఆహార పదార్థాల్లో బెల్లం వాడినా, బెల్లంతో తయారుచేసిన పదార్థాలు తిన్నా, రక్త వృద్ధి కలుగుతుంది.
-  రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది.
-  పిల్లలు నిద్రలో పక్క తడుపుతుంటే బెల్లం, నల్ల నువ్వులు దంచి లడ్డూ చేసి ఇస్తే, ఆ సమస్య తొలగిపోతుంది.
-  జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది.
-  బెల్లం, నెయ్యి కలిపి తింటే, శక్తి, బలం ఏర్పడతాయి.
-  ప్రీమెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పి.యం.యస్‌) లక్షణాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
-  అన్నంలో నెయ్యి వేసుకుని, బెల్లం ముక్కలతో లేదా బెల్లం పొడితో తింటే వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు.
-  ఓ బెల్లం ముక్కను నమిలితే, భుక్తాయాసాన్ని నివారిస్తుంది.
-  బెల్లం పొడిలో, శొంఠిపొడి కలిపి తింటే వాతాన్ని హరిస్తుంది.
-  ఎసిడిటీకి ఔషధంగా ఉపయోగిస్తుంది.
-  బెల్లంలో వామును కలిపి బాగా నమిలి తింటే కడుపులోని నులి పురుగులు సంహరించబడతాయి.
-  కఫాన్ని కరిగిస్తుంది.
-  అలసటను పోగొట్టడానికి బెల్లం ఔషధంలా పనిచేస్తుంది.
-  తాటి బెల్లం దగ్గును నివారిస్తుంది.
-  బెల్లం పానకం తాగితే చలువ చేస్తుంది.
-  బెల్లం పొడిలో, సున్నాన్ని కలిపి, బాగా రంగరించి, బెణికిన కండరాలు, వాపు మీద పట్టుగా వేస్తే, నొప్పిని నివారిస్తుంది.
-  బెల్లం ముక్కను తింటే ఎలర్జీ, చర్మపు దురదలు తగ్గుతాయి.
-  కాలుష్య నివారణకు సాయపడుతుంది.
-  పిల్లలకు బెల్లపు పదార్థాలను తినిపిస్తే శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం పెంపొందుతాయి.
-  రక్తంలో హిమో గ్లోబిన్‌ను పెంచుతుంది.
-  బెల్లం, నువ్వులు, కొబ్బరి కలిపి తింటే, నెలసరి ఋతు సమయపు బాధలు, ఋతు కార్యక్రమంలో అస్తవ్యస్తత తగ్గుతుంది.
-  నీరసంగా, బలహీనంగా ఉన్నప్పుడు బెల్లంతో చేసిన పదార్థాలు కానీ, బెల్లాన్ని కానీ తింటే, వెంటనే శక్తి కలుగుతుంది.
-  బాలింతరాలు బెల్లం తినడం మంచిది.
-  బెల్లం పాకాన్ని తింటే జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
-  ఉదయం సూర్యోదయానికి ముందు, రాత్రి పడక చేరే ముందు బెల్లాన్ని తింటే పార్శ్వపు నొప్పికి ఉపశమనం కలుగుతుంది.
-  అల్లం రసంలో, బెల్లం పొడిని చేర్చి త్రాగితే కఫం కరిగి, దగ్గు తగ్గుతుంది.
-  రోజూ చిన్న బెల్లం ముక్క తింటే రక్తహీనత తగ్గిపోతుంది.

Courtesy with: PRAJA SEKTHI DAILY

Tuesday, 29 October 2013

మేలు చేసే డ్రైఫ్రూట్స్‌














                   పళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పళ్లు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. పండ్లను కొన్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. కొన్ని పళ్లు అన్ని కాలాలలోనూ లభ్యమయితే, మరికొన్ని పళ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అరటిపళ్లు, యాపిల్‌, బత్తాయి, సపోటా, అనాస లాంటివి ఎప్పుడూ ఫ్రూట్‌ మార్కెట్‌లో లభిస్తాయి. సీతాఫలాలు, ద్రాక్ష, మామిడిపండ్లు, నేరేడు పండ్లు, రేగు పండ్లు లాంటి కొన్ని పళ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. ఆయా కాలాలలో లభించే పళ్లను తప్పకుండా తినాలి. తాజాపళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వాటిని తాజాగా ఉన్నప్పుడే తినేసెయ్యాలి. కొన్ని సీజన్లలో లభించే పళ్లను ఎండబెట్టి నిల్వచేస్తారు. వాటిని డ్రైఫ్రూట్స్‌ అంటారు. సీజన్‌లో లభించే కొన్ని పళ్ల నుంచి రసాలను తీసి వాటితో స్కాషె˜న్‌ను తయారుచేసి, ఏడాదంతా భద్రపరుస్తారు. అవి నిల్వ ఉండటానికి రసాయనికాలు కలుపుతారు. నిలువ ఫ్రూట్‌ జ్యూసెస్‌ను త్రాగేకంటే, తాజాపళ్ల రసాలే శరీరానికి పోషక విలువలు లభించేలా చేస్తాయి. బాదం, ఖర్జూరం, పిస్తా, అక్రోబ్‌, జీడిపప్పు, వేరుశెనగపప్పు లాంటి వాటిని డ్రైఫ్రూట్స్‌గా అన్ని కాలాలలోనూ ఉండేటట్లుగా నిలవ చేస్తారు.జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు లాంటి డ్రైఫ్రూట్స్‌ ఖరీదు అధికంగా ఉంటుందని అవసరమైనప్పుడు మాత్రమే కొని ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలయిన డ్రైఫ్రూట్స్‌లోనూ ఐరన్‌, కాల్షియం, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఎండు ఖర్జూరాన్ని వేడినీళ్లల్లో నానేసి, ఆ నీళ్లల్లో ఎండుద్రాక్షను కూడావేసి, కొంతసేపయిన తర్వాత వాటిని పిసికి ఆ నీటిని వడబోసి త్రాగితే దప్పిక అవదు. వేసవిలో వడదెబ్బ తగలదు. పిల్లలకు ఉపయోగించేటట్లయితే ఆ నీటిలో మెత్తటి పటికబెల్లం పొడిని కలపాలి. సీజన్‌లో అంటే జూలై నుంచి సెప్టెంబరు వరకూ సమృద్ధిగా లభించే తాజా ఖర్జూరపు పళ్లు మలబద్దకాన్ని నివారించడమే కాకుండా అవి శరీరానికి ఎక్కువ కేలరీల శక్తిని ఇస్తాయి. ఖర్జూరపు పళ్లు డ్రైఫ్రూట్స్‌గా మారినప్పుడు, వాటిలో కొవ్వు పదార్థం అధికంగా లభిస్తుంది. కేలరీల శక్తి కూడా తగ్గదు. వీటిని అతిగా తింటే స్థూలకాయం ఏర్పడుతుంది.జామపండులో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. 'సి' విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. దంతాలు, పళ్ల గట్టితనానికి జామకాయ చాలా మంచిది. మలబద్దకంతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి మెత్తని అరటిపండును తింటే సుఖ విరేచనమవుతుంది. సీజన్‌లో లభించే నేరేడు పండ్లను తినడం ఎంతో మంచిది. దీనిలో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. కమల, బత్తాయి, సపోటా లాంటి పండ్లు శరీరానికి అదనపు శక్తిని చేకూరుస్తాయి. అనాస, సీతాఫలం, కొబ్బరినీళ్లలోనూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణముంది. ఖరీదైన యాపిల్‌ పండు కంటే చౌకగలా లభించే జామపండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. పండిన జామను తినడం వల్ల జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది.డ్రైఫ్రూట్‌ అయిన బాదం పప్పును రోజుకు మూడు, నాలుగు తింటే మంచి కొలెస్ట్రాల్‌ శరీరానికి చేరుతుంది. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. తాజా పళ్లకంటే డ్రైఫ్రూట్స్‌ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆయా సీజన్‌లలో లభించే పళ్లను, ఎప్పుడూ లభించే పళ్లను ప్రతిరోజూ తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, శక్తినీ పొందటమే కాక, ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. చర్మం మృధువుగా, తేమగానూ, కాంతిగానూ ఉంటుంది.మామిడికాయలు, మామిడి పళ్లు విరివిగా లభించే వేసవికాలంలో, పచ్చిమామిడి కాయల తొక్కతీసి, ముక్కలుగా తరిగి, ఆ ముక్కల మీద, ఉప్పును, పసుపును చల్లి ఎండలో పెట్టి ఒరుగులుగా తయారుచేసి, వాటిని సంవత్సరమంతా నిల్వ ఉంచుకుంటారు. మామిడికాయలు లభించని కాలంలో, ఆ ముక్కలను కావలసినప్పుడు వాడుకుంటారు. ఎండిన మామిడి ముక్కలను దంచి, పిండిని చేసి భద్రపరుస్తారు. ఈ పొడిని ఆమేచూర్‌ అంటారు. మామిడిపండ్ల రసంతో తాండ్రను తయారుచేస్తారు. మామిడి రసంతో జామ్‌ను, రకరకాల పానీయాలను చేసి, నిల్వ ఉంచుతారు. తాజాగా లభించేటప్పుడు మామిడి పండ్లను వాడుతూ, అవి లభ్యం కానీ సీజన్‌లో తాము తయారు చేసిన నిల్వ పదార్థాలను ఉపయోగిస్తారు. చాలామంది అన్ని కాలాల్లోనూ కొబ్బరికాయలు లభిస్తున్నా, కొబ్బరిని కూడా నిల్వ ఉండేటట్లుగా ఎండుకొబ్బరిగా తయారుచేస్తారు. ఎండలోపెట్టి ఎండుకొబ్బరి నుంచి నూనెను తయారుచేస్తారు. మళయాళీలు కొబ్బరి నూనెను వంటలు, పిండి వంటల తయారీకి వాడుతారు. ఎండుకొబ్బరిని వంటలకు కూడా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను వనస్పతిలోనూ, కొన్ని రకాల సబ్బులలోనూ వాడుతారు. అయితే కొబ్బరికాయను పళ్లజాతిలోకి చేర్చారు. ఎండు కొబ్బరిని డ్రైఫ్రూట్‌గానూ పరిగణించారు. పిండివంటల్లోనూ, తీపి పదార్థాల తయారీలోనూ, వక్కపొడి తయారీలోనూ ఎండుకొబ్బరిని వాడుతారు. -యన్కే

Courtesy With: PRAJA SEKTHI DAILY
ఏ సబ్బు కొందాం?














               సరైన సబ్బునే వాడుతున్నామా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. పట్టులాంటి మృదువైన చర్మాన్ని పొందాలన్న తహతహలో మనం తెలియకుండానే నాసిరకం సబ్బులను వాడి మన చర్మానికే హాని తలపెడతాం. మార్కెట్‌లో నెంబర్‌ వన్‌ బ్రాండ్‌ అనిపించుకోవడానికి, అధిక లాభాలు గడించడానికి సబ్బుల కంపెనీలు ఏవేవో రసాయనాలు వాడుతూ, తమ వినియోగదారుల చర్మ రక్షణను గాలికి వదిలేస్తున్నాయి. అసలు ఇందులో కొట్టొచ్చినట్లు కనపడే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే చర్మపు మృదుత్వానికి మా సబ్బునే వాడండి అని గొప్పగా చాటుకొనే బ్రాండ్లే ఎక్కువగా వాడితే చర్మానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సబ్బు సంగతులు
సహజపిద్ధమైన చమురును నాసిరకం సబ్బులు తుడిచి పెడతాయి కనుక వాటిని వాడితే చర్మం పొడిబారుతుంది.
-నాసిరకం సబ్బులు వేరనీ, కంపెనీ సబ్బులు నాసిరకానివి కావనీ చాలామంది భావిస్తారు. కానీ అది సరికాదు. సబ్బు శుభ్రత దాని సువాసన, నునుపును బట్టి కాకుండా దాని టిఎఫ్‌్‌ఎం బట్టి ఉంటుంది. టిఎఫ్‌్‌ఎం అంటే 'టోటల్‌ ఫాటీ మేటర్‌'. అది ఎంత ఎక్కువగా ఉంటే సబ్బుకు అంత శుభ్రపరిచే గుణం ఉంటుంది.
-అందుచేత వినియోగదారులు ఎటువంటి సబ్బుకొంటున్నామో సరిగా ఆలోచించడం చాలా అవసరం.
-భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్‌) నిర్దేశించినదాని ప్రకారం సబ్బులను మూడు శ్రేణులుగా వర్గీకరించారు. అవి: గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3.
టఎఫ్‌ఎం 76 శాతం, అంతకుమించి ఉన్నవి గ్రేడ్‌1. డెబ్బై శాతం, అంతకు మించి(76శాతం కంటే తక్కువగా) టిఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్‌ 2. 60 శాతం, అంతకు మించి (70శాతం కంటే తక్కువగా ) టిఎఫ్‌ ఎం ఉన్నవి గ్రేడ్‌ 3.
-గ్రేడ్‌2,3లో అధికంగా 'ఫిల్లర్లు' ఉంటాయి. సబ్బు మామూలుగానే కనిపిస్తూ తగిన బరువు ఉండేలాగా కొన్ని పదార్థాలను జత చేస్తారు. వాటిలో మనకు హానికరమైనవి కూడా ఉండవచ్చు.
-సబ్బులలో కలిపే 'ఫిల్లర్లలో ఆస్బెస్టాస్‌ వంటివి కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలం వాడితే చర్మానికి ఎంతగానో హాని కలగవచ్చు.
-ఈ సబ్బులు నీటితో కలిసినప్పుడు పీసర పీసర (మెత్తగా నానినట్లు) గా అయిపోతాయి. అందువల్ల చాలా త్వరగా అరిగిపోతాయి. ఇక తక్కువరకం సబ్బులకు నురగ తక్కువ. కంపెనీలు వాటికి ధర తక్కువగా ఉంచి, ఎక్కువ అమ్మకాలు సాగిస్తాయి. కనుక లాభాలు మాత్రం ఎక్కువ.
-ఏ రకంగా చూసినా గ్రేడ్‌ 1 సబ్బే నాణ్యమైంది. ఇది చర్మాన్ని మృదువుగా తాకుతూ అధిక శుభ్రతని ఇస్తుంది. అదనపు రసాయనాలను చేర్చకుండానే సువాసనను అందిస్తుంది కూడా.

Courtesy With: PRAJA SEKTHI DAILY


 













             దబ్బపండు నిమ్మ జాతికి చెందినది. దానితో నిల్వ ఊరగాయ పెడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్‌ ఎ.సిలు, బి కాంప్లెక్స్‌ ఇందులో ఉంటాయి. పీచు పదార్థం, బీటాకెరోటిన్‌, ల్యూటిన్‌, తైకోసిన్‌, కాల్షియం, పొటాషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ ఇలాంటివెన్నో దబ్బ పండులో లభిస్తాయి. దబ్బపండు రసంతో చేసిన పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది. దబ్బ పండు రసంతో పానీయాన్ని తయారుచేస్తారు.
- దబ్బపండు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
- దబ్బపండు తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలను కనపడనివ్వదు.
- అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.
- గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది.
- కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- ఈ పండు గుజ్జును చర్మం మీద రుద్దితే, మృత కణాలు తగ్గిపోయి చర్మం తేమగానూ, మృదువుగానూ, కాంతిగానూ ఉంటుంది.
- మలబద్ధకాన్ని నివారిస్తుంది.
-క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తుంది.
- కంటిచూపును వృద్ధిచేస్తూ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- జీర్ణశక్తిని పెంచుతుంది.
- రక్తపోటును నియంత్రిస్తుంది.
- స్థూలకాయాన్ని నిరోధించేందుకు తోడ్పడుతుంది.
- జలుబును పోగొడుతుంది

Courtesy with:PRAJA SEKTHI DAILY

Friday, 25 October 2013

జంక్ ఫుడ్టా.. జంకాల్సిందే!
Posted on: Fri 04 Oct 22:37:36.996226 2013















                   ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు.
 జంక్‌ ఫుడ్‌లో ఏముంటాయో చూడండి
ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే ,
అధికంగా కొవ్వు
ఎక్కువ ఉప్పు శాతం
ఎక్కువ చక్కెర శాతం
తక్కువ పీచు పదార్థం
చాలా తక్కువ స్థాయిలో కాల్షియం, ఐరన్‌ లాటి పోషకాలు
ఇలా అలవాటు చేసుకోండి
కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోండి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.
షఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్‌ ముందు కూర్చునో చిప్స్‌ వంటి స్నాక్స్‌ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్‌ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
షఉదయంపూట ఎట్టి పరిస్థితులలో బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉండకూడదు.విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తింటే జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరిక తగ్గుతుంది.
షఇంట్లో వండే సాంప్రదాయ వంటలే కాక పోషక విలువలు కలిగిన మీకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని తినడం వలన కూడా జంక్‌ జోలికి వెళ్ళకుండా ఆపవచ్చు.
ఎప్పుడూ తినే జంక్‌ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ మార్చి, ఆరోగ్యకరమైన ఆహారం దొరికేచోటును ఎంచుకోవడానికి స్నేహితులను ఒప్పించండి.
షఫ్రెండ్స్‌తో టైమ్‌పాస్‌ చేయడానికి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కాకుండా వేరే అనువైన ప్రదేశాలు ఎంచుకోవడం వల్ల అనవసరంగా జంక్‌ఫుడ్‌ను తీసుకోకుండా ఆపచ్చు.
స్కూల్‌, లేదా క్యాంటీన్‌ నిర్వాహకులతో మాట్లాడి, జంక్‌ ఆహారం బదులు హెల్దీ స్నాక్స్‌ అమ్మేలా చూడాలి,
సూపర్‌మార్కెట్‌ నుండి కొనే సరుకుల్లో ప్రాసెస్డ్‌ఫుడ్‌ ఇంటికి తేకుండా ఉండేలా నియమం పెట్టుకోవాలి.
ఆలోచనా తీరు మారాలి
రోగ్యకరమైన ఆహారం చాలా ఖరీదు ఎక్కువై ఉంటుందనుకుంటాం. అది నిజం కాదు. జంక్‌ ఆహారపు ధరను ఇతర ఆరోగ్యకరమైన ఆహారంతో పోల్చి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం రుచి లేకుండా ఉంటుందనుకుంటాం. కానీ పోషక విలువలు కలిగిన ఆహారం కూడా రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం పండ్లు, ఎక్కువ ధర కలిగిన కూరగాయలు మాత్రమే కాదు, తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు వంటి ఎన్నో తక్కువధరకే దొరికే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.
తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి
జంక్‌ఫుడ్‌ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోని వారికంటే అధిక బరువు కలిగి ఉండే అవకాశం ఉంది.
జంక్‌ఫుడ్‌ తినడం అలవాటు మొదలైతే ఒక వ్యసనం లాగా పట్టి పీడిస్తుంది. చురుకుదనం తగ్గిపోయి మందకొడితనం ఏర్పడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల వలన ఎదుగుతున్న వయస్సులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్‌ వంటి పోషక పదార్ధాలు అందడంతో జ్ఞాపకశక్తి పెంపొంది, అన్నింటా ముందు నిలుస్తారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY

Tuesday, 22 October 2013

పొగాకు నుంచి జీవ ఇంధనాలు..!


     జన్యుమార్పిడి చేసిన పొగాకు మొక్కల ద్వారా జీవ ఇంధనాలను (బయోఫ్యూయెల్‌) తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. 'థియోరెడాక్సిన్‌' అనే ప్రొటీన్‌ ద్వారా ఇది సాధ్యమవుతుందని వారు తొలిసారిగా వెల్లడించారు. ఈ ప్రొటీన్‌ వల్ల పొగాకుమొక్కలో పిండి పదార్థం మోతాదుపెరుగుతుందని తెలిపారు. నావరె విశ్బవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు జరిపారు. థియోరెడాక్సిన్‌ ప్రొటీన్‌లో ఎఫ్‌.ఎం. అనే రెండు రకాలుంటాయని, అవి రెండూ ఒకే విధంగా పనిచేస్తాయని ఇప్పటివరకూ భావించేవాళ్లమని... కానీ, తమ పరిశోధన ద్వారా వాటి పనితీరు భిన్నంగా ఉన్నట్లుందని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొటీన్‌ల గురించి తెలిసిన నూతన విషయాల ద్వారా పొగాకు మొక్కల్లో జన్యుమార్పిడి చేసి.. 500 శాతం అధికంగా చక్కెర పదార్థాలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ చక్కెర పదార్థాలను బయో ఎథనాల్‌గా మార్చటంలో విజయం సాధించారు. ఒక టన్ను జన్యుమార్పిడి పొగాకు ఆకుల నుంచి 40 లీటర్ల బయో ఎథనాల్‌ను రూపొందించవచ్చని వారు చెబుతున్నారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY
నాట్యమాడే ఉపగ్రహాలు ఏవి?

                                  మన సౌరమండలంలో మిగతా అన్ని గ్రహాలకన్నా గురుగ్రహం (జ్యూపిటర్‌) చాలా పెద్దది. ఇది ఎంత పెద్దదంటే మిగతా అన్ని గ్రహాలను తీసుకొచ్చి ఇందులో కూర్చినా ఇందులో ఇంకా స్థలం ఉంటుంది. సూర్యుడి నుంచి సగటున 77.84 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రహం మన భూమికన్నా 1300 రెట్లు పెద్దగా ఉంటుంది. గురుగ్రహం తన చుట్టూ తను తిరగడానికి 10 గంటల సమయాన్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 11-86 సంవత్సరాల సమయం తీసుకుంటుంది.

గురుగ్రహానికి కొన్ని ఉపగ్రహాలున్నాయి అన్న సంగతిని తొలిసారిగా గెలీలియో కనిపెట్టాడు. ఆ ఉపగ్రహాలు తమ స్థానాన్ని కొన్ని గంటలలోనే మార్చడాన్ని గమనించిన ఆ శాస్త్రవేత్త వీటికి డ్యాన్సింగ్‌ శాటిలైట్స్‌ ఆఫ్‌ జ్యూపిటర్‌ (గురుగ్రహపు నాట్యమాడే ఉపగ్రహాలు) అని పేరు పెట్టారు. ఆ విధంగా నాట్యమాడే ఉపగ్రహాలు అన్నమాట వాడుకలోకి వచ్చింది.

Courtesy with: PRAJA SEKTHI DAILY





సూపర్‌ ఫుడ్స్‌

   


                    తీపి గుమ్మడి ఆకురాలు కాలంలో పండుతుంది. దీన్ని కొందరు మంచి గుమ్మడి అని కూడా అంటారు. దీన్ని కాయగూరగా, పండుగా రెండు విధాలుగా చెబుతారు.తీపి గుమ్మడి చాలా పోషక విలువలుండే 'సూపర్‌ ఫుడ్‌'. అన్ని విధాల మంచి చేయడమే కాక ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి సహాయపడుతుంది. గుమ్మడి బోలెడన్ని పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్‌లతో కూడి ఉంటుంది. దీన్ని మన రోజూ ఆహారంలో తీసుకోవడం వలన వచ్చే ఉపయోగాలు చాలా ఎక్కువ ఇది తీసుకోవడం వలన శారీరకంగా, మానసికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది అంటారు కారీ కూయి అనే పోషకాహార నిపుణులు. రోజూ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవలసినవిగా కూయి సూచించే, పది 'సూపర్‌ ఫుడ్స్‌' లో గుమ్మడి ఒకటి. గుమ్మడిలో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది విటమిన్‌ ఎ గా మార్పు చెందుతుంది. అంతే కాదు దీన్ని 'విజన్‌ విటమిన్‌'(కంటిచూపు మెరుగుపరచే విటమిన్‌) అంటారు. ఏ ఆహారంతో పాటైనా గుమ్మడిని తీసుకోవచ్చు. ఉదాహరణకి, చాలా మంది రాత్రి పూట కేవలం ఓట్స్‌ తిని పడుకుంటారు. అటాంటపుడు మీ ఆహారంలో మరికొన్ని పోషకాలు అందాలనుకుంటే, గుమ్మడి ముక్కను మిక్సీ పట్టి ఆ జ్యూస్‌ను ఓట్‌మీల్‌లో కలిపేసి తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను పోషకాల పవర్‌ హౌస్‌ అంటారు కూయి. వాటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన మంచి కొవ్వు, ప్రోటీన్లు, పీచు పదార్థం ఉంటాయి. ఇంకా మెగ్నీషియమ్‌ లాటి మినరల్స్‌ లెక్కలేనన్ని ఉంటాయి. దీనితో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, మన కణజాలానికి అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా రేయడానికి కావలసినంత ఐరన్‌ ఉంటుంది. గింజలు వేయించుకుని తింటే పై తొక్కతో సహా తినడానికి వీలుంటుంది. పగటి పూట తినడానికి పనికొచ్చే మంచి స్నాక్స్‌గా వేయించిన గుమ్మడి గింజలను వాడుకోవచ్చు. గుమ్మడిలానే దానిమ్మ కూడా సూపర్‌ ఫుడ్‌ అంటున్నారు కూయి. ఎందుకంటే దానిమ్మలో చాలా ఎక్కువ శాతంలో యాంటి ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇంకా, కివి పండులో 'టూటి ఫ్రూటి' రుచి ఉంటుందట. టూటి ఫ్రూటి రుచితో పాటు స్ట్రాబెర్రీ, పుచ్చకాయ ఫ్లేవర్‌తో ఉండే సిట్రస్‌ పండు కివి. కావలసినంత పీచు పదార్థం ఉండి, ఎక్కువ శాతం సి విటమిన్‌ ఉంటుంది. అందుకే అవి సూపర్‌ ఫుడ్స్‌

Courtesy with: PRAJA SEKTHI DAILY
హనికరం ప్యాకేజ్డ్ ఆహరం
 



    జీవితంలో తీరికలేనితనం కమ్ముకొన్నాక మనలో ఏ పనిచేయాలన్నా, చివరకు వంట చేయాలన్నా కూడా సహనం లోపిస్తుంది. దీంతో మనలో చాలా మందిమి బయట తిళ్లకి అలవాటుపడ్డాం. పిల్లల్ని స్కూళ్ల్లకి పంపి, పెద్దలు ఆఫీసులకి వెళ్లాల్సిన హడావిడిలో తయారుగా ఉన్న 'పాకేజ్డు ఫుడ్స్‌'పై ఆధారపడుతున్నాం. దీనివలన సమయం కలసి వస్తోందన్నది ఒకటే మన వాదన. కానీ జరిగే ఘోరం సంగతి తెలియదు మనకు. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ స్లో పాయిజన్‌లా పనిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకొన్న తృణధాన్యాలపై ఇంత పాలు ఒంపి, సంపూర్ణ ఆహారం సిద్ధం చేశామనుకొంటాం. కానీ మనం సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన తృణధాన్యాలతో సహా ప్యాకేజ్డ్‌ ఆహారం ఆరోగ్యవంతమైనదే కానీ, వాటిని నిల్వ ఉంచేందుకు అనుసరించే పద్ధతుల వల్లనే ప్రమాదం అని వైద్యనిపుణులు అంటున్నారు. ఎప్పుడూ హడావిడిలో ఉండే తరానికి అవసరమవుతున్న 'క్విక్‌ ఫిక్స్‌ ఫుడ్‌' తోనే ఇబ్బందంతా అని వారు హెచ్చరిస్తున్నారు. అలా తొందరగా ఆహారం తయారీకి వేసే పదార్థాలలో రసాయనాలు ఉంటాయి. అంతేకాక , అసలుకే పోషకాలు లేని పదార్థాలు ఎక్కువ. అందువల్ల చాలా కాలంపాటు వాటిని తింటే శరీరానికి హాని చేయడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్యాకెట్ల మీద ఆరోగ్యపరమైన హామీని చూసే కొంటున్నామని మనం అంటాం సాధారణంగా. నిపుణులెవరూ ఆయా పదార్థాలలో దీర్ఘకాలంలో తీవ్ర హానిచేసేవి ఉంటాయని అసలు చెప్పరు. మనమే ఏయే ఆహారపదార్థాల్లో ఏమేమి ఉంటాయో, వాటి దుష్ప్రభావం ఏమిటో తెలుసుకుందాం..
   బిస్కెట్లలో ప్రాణాంతక మూలకాలు..
    రిఫైన్డ్‌ వీట్‌ఫ్లోర్‌ (శుద్ధి చేసిన గోధుమపిండి), చక్కెర, కూరగాయలతో తయారైన వంటనూనె, పాలలోని ఘన పదార్థాలు, ఇన్వర్ట్‌ సిరప్‌ (గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ మిశ్రమం) కలవి కొన్నింటిని కలపడానికి వాడే ఎమల్సిఫయర్లు, లవణాలు, విటమిన్లు, పిండిని ముద్ద చేయడానికి వాడే ద్రవాలు.
   శుద్ధిచేసిన గోధుమపిండిలోని హానికర గుణాల గురించి మనం విని ఉన్నాం. ఈ బేక్డ్‌ కుకీలలో హెచ్చు స్థాయిలో వెజిటబుల్‌ ఆయిల్‌ను వాడతారన్నది ఆందోళన కలిగించే అసలు విషయం అని చెప్పారు పోషక నిపుణులు షోనాలీ సబర్వాల్‌. వంటనూనె (వెజిటబుల్‌) లో పోషకాలన్నీ పోతాయి. కేవలం కొవ్వు మాత్రమే మిగులుతుంది. ఇది పొట్టను ఉబ్బిపోయేలా చేస్తుంది. శరీరంలో క్రమబద్ధీకరణ కుదరని కొవ్వు చేరితే, ఉదరం విరుద్ధంగా స్పందిస్తుంది. ఫలితంగా శరీరం నెమ్మదిస్తుంది. ఇన్వర్ట్‌ సిరప్‌ వలన కడుపు నిండినట్టు అనిపిస్తుంది. చక్కెర తీసుకొన్న కొద్దీ మనం మరింతగా దాన్నే కోరుకొంటాం. చాలా ఉత్పత్తులు చక్కెర లేనేలేదని చాటుతాయి కానీ వారు చెప్పేది తెల్ల చక్కెర. ఐనా దానిలో గ్లూకోజ్‌, క్ట్రోజ్‌, ప్వాట్నర్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వాటికి దీర్ఘకాల దుష్ఫలితాలు ఎక్కువ. పాలలోని ఘనపదార్థాలు స్కిజో ఫ్రెనియా, ఆటిజం, డిప్రెషన్‌, మల్టిపుల్‌ స్లెరోసిస్‌ కలగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్డ్‌ సూప్స్‌లో..
  మొక్కజొన్న పిండి, వంటనూనె (వెజిటబుల్‌), చిక్కబరిచే పదార్థం, మెత్తగా చేసే ఎజెంట్‌, చక్కెర, ఉప్పు, ఎండబెట్టిన కూరగాయలు, ఆరబెట్టిన గ్లూకోజ్‌ సిరప్‌, ఆహారంగా తీసుకొనే కూరగాయల కొవ్వు, ఈస్ట్‌ నుంచి తీసిన పొడి, హైడ్రోలైజ్డ్‌ వెజిటబుల్‌ ప్రొటీన్‌, ఎసిడిటీని నియంత్రించే రెగ్యులేటర్‌, సువాసన పెంచే పదార్థాలు.
టమాటా సూప్‌ను తాజా టమాటాలతో తయారు చేయండి. రెండురోజులకు సరిసడేలా దీన్ని చేయండి. రంగు మారుతోందా! ప్యాకెట్‌ సూప్‌ల వాళ్లు ఎన్ని రోజులైనా రంగుపోని విధంగా ఎలా చేస్తున్నారో ఆలోచించండి. అందుకు కారణం వారు కలరింగ్‌ ఏజెంట్లు వాడతారు. కలరింగ్‌ ఏజెంట్లు విషపూరితమని డాక్టర్‌ హేమంత్‌ థక్కర్‌ అంటారు. అవి మూత్రపిండాలను, ఉద రాన్ని చాలా శ్రమించేలా చేస్తాయి. శారీరక వ్యవస్థ నుండి రసాయనాలను కడిగేయడానికి లివర్‌, కిడ్నీలు ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. ఆ సరికే అధికంగా పనిచేసి ఉన్న ఉదరకోశం, కిడ్నీలు చేయాల్సిన కష్టాన్ని చేయలేక పోతాయి. ఫలితంగా ఆహారం నుంచి జీర్ణవ్యవస్థ ద్వారా శరీరం ఇముడ్చుకొన్న పోషకాల శుద్ధి ప్రక్రియ ఆగి పోతుంది. రక్తం నుంచి విషపూరితాలను తొలగించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అల్బూమిన్‌ వంటి పోషకాల నిల్వ ప్రక్రియ నిలిచిపోతుంది. రక్త ప్రసరణ లో అడ్డంకులను తొలగించే క్రమం కూడా దెబ్బ తింటుంది. కాలకృత్యాలను కూడా క్రమం తప్పకుండా చేయడం నిలిచిపోవచ్చు. హైడ్రోనైజ్డ్‌ వెజిటబుల్‌ ప్రొటీన్‌లో తలనొప్పిని, వేగంగా గుండె స్పందననీ, ఛాతీ నొప్పినీ, వికారాన్నీ కలిగించే ఎంఎస్‌జి 30 శాతం ఉంటుంది. ఈస్ట్‌ ఎక్‌స్ట్రాక్ట్‌ పౌడర్‌ చెడ్డ బాక్టీరియా అయిన ఈస్ట్‌ను కలగజేస్తుంది. దీనివలన రక్తంలో యాసిడ్‌ ఉనికి ఎక్కువవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సూప్‌లు తాగేటప్పుడు జాగ్రత్త సుమా!
తయారు భోజనంలో..
ఎండబెట్టిన కూరగాయలు, నీరు, వంట నూనె (వెజిటబుల్‌), జీడిపప్పులు, ఉప్పు, చక్కెర, వెన్న, అల్లం గుజ్జు.
ప్రముఖ వైద్య నిపుణులు హేమంత థక్కర్‌ ఏమంటున్నా రంటే, తినడానికి తయారుగా ఉన్న భోజనంలో ఎండి పోయిన పొడికూరలు ఎక్కువగా ఉంటాయని. వా టిలో పోషకాలు శూన్యం. పీచు, కేలరీలు తప్ప ఇంకేమీ వాటిలో ఉండవు. ఆహారం తయారు గా ఉందంటే చల్లారిందని అర్థం. మళ్లీ వేడి చేస్తారు. అప్పుడు అందులో మిగిలిన సూక్ష్మ పోషకాలు ఏమైనా ఉంటే ఆవిరై పోతాయి. ఎటువంటి రసాయనాలు, పదార్థాలు కలపకుండా ఆహార పదార్థాలను ఏడాది పాటు భద్రపరచడం కుదరనే కుదరదని హేమంత్‌ చెప్పారు. షాపుల్లో తాజా ప్యాకెట్లు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. ఎంత ఆహారానికి ఎంత పదార్థం కలపాలన్నది కూడా లెక్కే. పరిమితులను దాటితే ఆహారం పాడైపోతుంది. అటువంటి ఆహారాన్ని అడ్డూ అదుపూ లేకుండా తీసుకొంటే ఉదరం, మూత్రపిండాలూ చెడిపోవడం ఖాయం.
మ్యూజ్లీలో..
ఇన్వర్ట్‌ సిరప్‌ (గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌ మిశ్రమం), స్ట్రాబెర్రీ క్రష్‌ (చక్కెర, నీరు, స్ట్రాబెర్రీ గుజ్జు), స్ట్రాబెర్రీ సిరప్‌, అనాస గుజ్జు, మామిడిపండు గుజ్జు, ఆపిల్‌
రసం, గ్లూకోజ్‌ ద్రవం, కొవ్వు అదనంగా చక్కెర కలపలేదని లేబుల్‌ చెబుతుంది. ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ తయారీలో వాడిన సిరప్‌ల ద్వారా ఎంతో చక్కెర వచ్చి చేరి ఉంటుంది. అది తిన్నాక మీరు అధిక చురుకు దనంతో ఉన్నారంటే చక్కెర పెరిగిందని గుర్తు. రక్తంలో చక్కెర స్థాయి అదుపుతప్పుతుంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌ ధాన్యాలను నిందించాలి తప్ప మరోటికాదు.
చక్కెర ఎక్కువవడంతో బాటు సోయాబీన్‌ ఆయిల్‌ తయారీలో పుట్టే సోరు లెసిథిన్‌ అనేది కూడా ఆందోళన కలిగించేదే. దీనికి చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఇది అనేక మూలకాలను అనుసంధానం చేయడం వలన ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసపడడం జరగవచ్చు. అప్పుడప్పుడు వికారం కలగవచ్చు. వాంతి అయ్యేలా తల తిరగవచ్చు. సోయాబీన్‌ తినవద్దని డాక్టర్లు సలహా ఇస్తుంటే బ్రెడ్‌ సైతం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Courtesy with: Praja Sekthi daily
ఏసీలోకి దుమ్ము ఎలా వస్తుంది?


తలుపులన్నీ మూసి ఉన్నా, గదిలో వాడుతున్న ఎ/సి (ఎయిర్‌ కండిషర్‌) ఫిల్టర్‌కి తరచూ ఎక్కువ దుమ్ము చేరుతూ ఉంటుంది. అది ఎక్కడ నుండి వస్తుంది? గదిని ఎంత నీట్‌గా ఉంచినా అది చేరుతూ ఉంటుంది. ఎందుకని?
- వి.సదాశివమూర్తి, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
తలుపులన్నీ మూసి ఉన్నా దుమ్ము, ధూళి కణాలు గది లోపలికి చేరలేకపోయేంతగా మూయలేము. నేలకు, తలుపులకు మధ్య ఉన్న సందుల్లోంచి, కిటికీ తలుపులకు, కిటికీ ఫ్రేములకు మధ్య ఉన్న సందుల్లోంచి ఎంతో కొంత దుమ్ము, ధూళి చేరుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం రోజుకు అరడజను సార్లయినా గది తలుపుల్ని తీయకుండా ఉండలేము. మనం బయట నుంచి లోనికి వచ్చేప్పుడు, లోపల్నుంచి బయటికి వెళ్లేప్పుడు తలుపులు తెరుస్తూ, మూస్తూ ఉంటాము. ఆ సమయంలో కొంత దుమ్ము చేరుతుంది. అంతేకాదు మనం మన వృత్తి నుంచి ఇంటికి చేరుకున్నప్పుడు మన బట్టల మీద కూడా అంతో ఇంతో దుమ్ము పేరుకుంటుంది. అలాగే గదిలోకి వెళ్లేప్పుడు ఎసి గాలి విసుర్ల (air currents) లో ఆ దుమ్ము కొద్దిగా గాల్లో కలుస్తుంది. ఇలా ఎన్నో మార్గాల్లో గదిలో దుమ్ము, ధూళి కణాలు చేరతాయి. ఎసి మిషన్‌ ఓ ఆంతరంగిక వాయు చోదక శీతలీకరణ యంత్రం (closed refrigeration air blowing system). గదిలోని గాలిని చల్లని గ్రిడ్‌ గుండా పదే పదే పంపుతూ గదిలోని గాలిని చల్లబరిచే పద్ధతి ఇక్కడ ఉంటుంది. అందుకే గ్రిడ్‌ సందులు దుమ్ము కణాలతో మూసుకుపోకుండా ఆ గ్రిడ్‌కు ముందుగా దుమ్మును ఫిల్టర్‌ జల్లెడ పడుతుంది. నెలకోమారో, రెండుమార్లో ఆ ఫిల్టర్‌ను నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. విద్యుత్‌ ఆదా కావాలంటే సాధ్యమైనంత మేరకు సందులు లేకుండా కిటికీలను, తలుపుల్ని వాడాలి. ఎక్కువసార్లు తలుపులు తెరవకూడదు. తలుపులు, కిటికీలు తెరచి ఉంచి ఎసి మెషిన్లను వాడడం మరింత దుబారాతనం, అవాంఛనీయం.
గమనిక:
మీ సైన్స్‌ సందేహాలను జీవన, ఎందుకని? ఇందుకని? శీర్షిక, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక, ఎం.హెచ్‌ భవన్‌, అజామాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియా, ఆర్‌.టి.సి కల్యాణమండపం లేన్‌, హైదరాబాద్‌-500 020 అన్న చిరునామాకు పంపగలరు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy with:  PRAJA SEKTHI DAILY 

Tuesday, 15 October 2013



మైక్రోవేవ్స్‌ వల్ల వేడి పుడుతుందా?
 
     మైక్రోవేవ్స్‌ వల్ల వేడి పుడుతుందా? ఇలా పుట్టిన వేడితో ఆహారపదార్థాల్ని వేడిచేసు కోవచ్చా? అలాంటి ఆహారం వల్ల ఆరోగ్యానికి హాని ఉందా?
                                                                                           - గండి కోట వెంకటశేషయ్య

               ఏ యానకమూ లేకుండా శూన్యంలో కూడా ప్రయాణించగల శక్తి రూపం కాంతి. ఇది విద్యుదయస్కాంత తరంగాల (వశ్రీవష్‌తీశీఎaస్త్రఅవ్‌ఱష షaఙవర) రూపంలోను, కాంతి కణాల (జూష్ట్రశ్‌ీశీఅర) ధారా రూపంలోనూ ఏకకాలంలో కణ తరంగ ద్వంద్వ స్వభావాన్ని (షaఙవ-జూaత్‌ీఱషశ్రీవ సబaశ్రీఱ్‌y) ప్రదర్శిస్తూ ప్రయాణిస్తుంది. ఇలాంటి తరంగాలు నీటి మీద అలలు ఒడ్డుకు చేరినట్లు భావించినట్లుగా ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణిస్తాయి. అల ఒక శిఖరానికి, తర్వాతి శిఖరానికి మధ్య ఉన్న దూరాన్ని తరంగదైర్ఘ్యం (షaఙవశ్రీవఅస్త్ర్‌ష్ట్ర) అంటారు. ఇలా కాంతిలో తరంగదైర్ఘ్యం కొన్ని వందల కిలోమీటర్లు ఉండే తరంగాలున్నాయి. ఒక మిల్లీమీటర్లో వెయ్యికోట్ల వంతు తరంగ దైర్ఘ్యమున్న తరంగాలూ ఉన్నాయి. మనం ఆల్‌ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రాల వారు ప్రసారం చేసే తరంగాల తరంగదైర్ఘ్యం కొన్ని వందల మీటర్లు ఉంటుంది. మైక్రోవేవ్స్‌లోని తరంగాల తరంగదైర్ఘ్యం మిల్లీమీటర్లో 100వ వంతు నుంచి వేయి లేదా 10 వేల వంతు పొడవు తరంగదైర్ఘ్యమున్న తరంగాలున్నాయి. మనకు సూర్యుడికాంతిలో వేడిని కలిగించే పరారుణ కిరణాల (ఱఅటతీaతీవస) తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ ఉంటుంది. మనం కంటితో చూడదగిన దృశ్యకాంతి (ఙఱరఱbశ్రీవ శ్రీఱస్త్రష్ట్ర్‌) లోని కాంతి తరంగాల తరంగదైర్ఘ్యం మిల్లీమీటర్లో లక్ష భాగంలో ఉంటుంది. ఇలా తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ ఉన్న అతినీలలోహిత (బశ్ర్‌ీతీaఙఱశీశ్రీవ్‌) కిరణాలు, శ- కిరణాలు, గామా కిరణాలు, విశ్వ కిరణాలున్నాయి. కిలోమీటర్ల స్థాయి నుంచి ఫెమ్టో మీటరు (మీటర్లో 10 కోట్ల కోట్ల వంతు) స్థాయి వరకు ఉన్న కిరణాల వైవిధ్యం ఎంతగా ఉన్నా, వాటన్నింటికీ ఓ సారూప్యత ఉంది. ఇవన్నీ శూన్యంలో ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఆ వేగం విశ్వంలో స్థిరం. దాన్నే కాంతివేగం (శ్రీఱస్త్రష్ట్ర్‌ ఙవశ్రీశీషఱ్‌y) అంటారు. ఇది 3×108 మీటర్లు /సెకను. అంటే కాంతి శూన్యంలో సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సాధనంగానీ, శక్తి రూపంగానీ ప్రపంచంలో మరోటి లేదు. అడపాదడపా శాస్త్రం పేరుతోను, కుహనా శాస్త్ర పరిభాషలోను ఇంతకన్నా వేగంలో ప్రయాణించే రూపాలున్నట్లు వాదాలున్నా ఆ వాదాలకు ఋజువులు లేవు. కాంతి కిరణాలకు మరోతత్వం కూడా ఉంది. ఇవి పదార్థంతో కలియబడతాయి (ఱఅ్‌వతీaష్‌ఱశీఅ). అంటే పదార్థాల మీద వీటి ప్రభావం ఉంటుంది. సూక్ష్మ తరంగాలు లేదా, మైక్రోవేవ్స్‌ తరంగాలు పదార్థాల్లో ఉన్న అణువుల్లోని పరమాణవుల మధ్య ఉన్న రసాయనిక బంధాల్ని కొంతమేర లూజు చేస్తాయి. తద్వారా అణువుల్లో కదలికలు ముఖ్యంగా తిరగడం అనే యాంత్రిక చర్యలు పెరుగుతాయి. ఇలా అణువుల్లో కలిగే బంధాల కదలికలు, తిరుగుళ్లు, ప్రకంపనలు (ఙఱbతీa్‌ఱశీఅర), డోలనాల (శీరషఱశ్రీశ్రీa్‌ఱశీఅర) సంయుక్త ప్రభావమే పదార్థాల్లోని వేడికి అర్థాన్నిస్తాయి. వేడి అంటే ఇదే. మైక్రోవేవ్‌ వోవెన్‌ (వీఱషతీశీషaఙవ శీఙవఅ) లో ఆహార పదార్థాల్ని పెట్టినప్పుడు ఆ ఆహారపదార్థాల్లో ఉన్న నీటి అణువులు బాగా కంపిస్తాయి. అంటే ఆ వేడి ఆ నీటిని దాదాపు ఆవిరయ్యేలా చేస్తుంది. ఆ క్రమంలో ఆ నీటి చెమ్మలో భౌతికస్పర్శలు ఉన్న ఇతర పదార్థాలు కూడా వేడెక్కుతాయి. ఒకవేళ నీళ్లు లేకున్నా కేవలం నూనెలే ఉన్నా నూనెలో ఉన్న అణువుల కదలికల్ని మైక్రోవేవ్స్‌ పెంచుతాయి. తద్వారా నూనెలు కూడా వేడెక్కుతాయి. కానీ పింగాణి, మరికొన్ని ప్లాస్టిక్‌ పదార్థాల్ని మైక్రోవేవ్స్‌ కదిలించలేవు. అందువల్లే మైక్రోవేవ్‌ పొయ్యిలో పెట్టే పదార్థాల్ని పింగాణి, గాజు, పాలికొర్పానేట్‌, మేలమిన్‌ వంటి పదార్థాల పాత్రల్లో పెడతారు. లోహపాత్రల్లో పెడితే ఆ తరంగాల శక్తిని పాత్రలే గ్రహిస్తాయి. లోనున్న ఆహారపదార్థాలకు వేడి అందదు. మైక్రోవేవ్‌ ఓవెన్లలో వేడి చేయడం వల్ల ప్రత్యేకంగా కొత్త ప్రమాదం ఏమీ లేదు. కోడిగుడ్డు వంటి వాటిని అధిక ప్రొటీన్‌ ఉన్న పదార్థాల్ని పెడితే పాత్రలు పేలిపోయే ప్రమాదముంది. మైక్రోవేవ్‌ పొయ్యిల్లో ఆహార పదార్థాల్ని (అవి అప్పటికే చెడిపోయి వాసన వస్తున్నవి కాకుంటే) వేడిచేసి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాల్సిన అవసరం రాకుండానే పరిమితంగా వండుకొని, వేడిగా ఉన్నప్పుడే తినడం ఇంకా మంచిది. శక్తి ఆదా అవుతుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy with: PRAJA SEKTHI DAILY

Thursday, 10 October 2013

 గుండెపోటు నివారణలో 'యాంజియోప్లాస్టి' 

 
 
                 సమాజంలో ప్రతిదీ నిరంతరం మారుతూ ఉన్నట్లే వైద్యంలోనూ, వైద్య విధానంలోనూ, వైద్య చికిత్సల్లోనూ కొంగొత్త మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఆయా జబ్బుల పట్లా, వ్యాధుల పట్లా పరిశీలనలూ పరిశోధనలూ పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన అవగాహన పెరిగేకొద్దీ వాటి నివారణకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానమూ విస్తరిస్తోంది. అలాంటి అధునాతన గుండెపోటు నివారణ చికిత్సలో 'యాంజియోప్లాస్టీ' ఒకటి. దీనివల్ల గుండెపోటును సులువైన పద్ధతిలో నివారించవచ్చు.
గుండె... మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. అందుకే దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం తప్పనిసరి. మారుతున్న పరిస్థితుల్లో గుండెపోటు అనేది సమాజాన్ని కుంగ దీస్తున్న సమస్య. దీనిని నివారించాలంటే గుండెపోటుకు కారణాలనూ, దాని నివారణకు అవసరమైన ఆధునిక చికిత్సా విధానాన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

యాంజియోప్లాస్టి అంటే?

గుండె పదిలంగా ఉండాలంటే శరీర భాగాల నుంచి దానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి. దానికేమాత్రం ఆటంకం కలిగినా గుండెపోటు రావచ్చు. గుండె ఆగిపోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. గుండెకు నిరంతర రక్తం సరఫరా చేసే నాళాల్లో కొవ్వు పేరుకుంటే గనుక అది గుండెపోటుకు దారితీస్తుంది. దానిని నివారించడానికి అనువైన ఆధునిక మార్గాలు రెండున్నాయి. అవే శస్త్ర చికిత్స, యాంజియోప్లాస్టి. ఈ రెండింటితో గుండె పోటును చాలావరకూ నివారించవచ్చు. శస్త్రచికిత్సలో అయితే ఛాతీని తెరిచి, చేయాల్సి ఉంటుంది. కానీ యాంజియోప్లాస్టీలో మాత్రం రక్తనాళం ద్వారా బెలూన్‌ పంపిస్తే చాలు. గతంలో తొడ నుంచి పంపే ఈ ప్రక్రియ ఇటీవల మరింత సులువైంది. మునుపటి కంటే మెరుగైన అధునాతన ప్రక్రియల్లో ఇదెంతో ముఖ్యమైనది.
ఎలా చేస్తారు?
ఒక సూక్ష్మనాళం ద్వారా శరీరంలోని రక్తనాళాల్లోకి బెలూన్‌ అనే పరికరాన్ని పంపుతారు. కొవ్వుతో పూడుకుపోయిన ఆ రక్త నాళాలను విచ్చుకుపోయేలా చేస్తారు. ఇదే యాంజియోప్లాస్టి ప్రక్రియ. గుండె పోటును నివారించడానికి ఇప్పుడు లక్షలాది మంది హృద్రోగులు ఈ మార్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు బైపాస్‌ కన్నా, అధిక సంఖ్యలో ఈ యాంజియోప్లాస్టి చికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కేథటర్‌), మూసుకు పోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సన్నటి తీగను రక్తనాళం వద్దకు జొప్పించి, లోపలికి ఒక బెలూన్‌ను పంపుతారు. ఆ బెలూన్‌ని ఉబ్బేలా చేయడం ద్వారా రక్తనాళం పూడుకుపోయిన ప్రాంతాన్ని, విచ్చుకునేలా చేస్తారు. ఫలితంగా రక్త నాళంలోని అడ్డంకి తొలగిపోవడంవల్ల రక్త ప్రసరణ మునుపటిలాగే జరగడానికి ఆస్కారం ఉంటుంది.
గుండెకు సరఫరా చేసే రక్తనాళాల ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడటంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో ఈ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వీటిని బైపాస్‌ సర్జరీవల్ల గానీ, యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారాగానీ తొలగించవచ్చు. బైపాస్‌ సర్జరీ అంటే, ఛాతీ భాగాన్ని శస్త్ర చికిత్స ద్వారా తెరచి, గుండెకు జరిగే రక్త ప్రవాహాన్ని యథాతథంగా జరిపేందుకు మరో మార్గాన్ని ఏర్పర్చడం. ఇందుకోసం పూడుకుపోయిన రక్త నాళాలకు ప్రత్యామ్నాయంగా ఇతర రక్త నాళాలను కలుపుతారు. అయితే ఇది మేజర్‌ శస్త్ర చికిత్స. ఆపరేషన్‌ అయిన తర్వాత కూడా, రోగి కనీసం వారంరోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలలు సమయం పడుతుంది. ఈ శ్రమ, ఆందోళన లేకుండా రక్తనాళాల్లో అడ్డంకులను సులువుగా తొలగించడానికి ఇప్పటి మేలైన పద్ధతే యాంజియోప్లాస్టి.

'స్టెంట్‌' ఎప్పుడు అవసరం ?

రక్త నాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి శస్త్ర చికిత్స లేకుండానే చేసే ఈ చికిత్సలో ఎలాంటి కోతా ఉండదు. తొడ, లేదా చేతిలోని రక్త నాళం ద్వారా, గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్‌ను పంపుతారు. రక్త నాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్‌ను ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టెంట్‌ అనే లోహపు గొట్టాన్ని అమర్చుతారు. దీనివల్ల రోగి ఒకటీ రెండు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి, తన రోజు వారీ పనులను సాధారణంగా చేసుకోవచ్చు. ఫలితాలూ, ప్రయోజనాలూ భేషుగ్గా ఉండటంవల్ల బైపాస్‌ సర్జరీ కన్నా, చాలా మంది రోగులూ, డాక్టర్లూ ప్రస్తుతం యాంజియో ప్లాస్టి వైపు మొగ్గు చూపుతున్నారు.

అత్యాధునికం ట్రాన్స్‌ రేడియల్‌ విధానం

ట్రాన్స్‌రేడియల్‌ విధానం అనేది యాంజియో ప్లాస్టిలో అధునాతనమైనదిగా చెప్పవచ్చు. ఇది రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో సంప్రదాయ యాంజియోగ్రామ్‌, లేదా యాంజియోప్లాస్టీని తొడలోని రక్తనాళం ద్వారా చేసేవారు దాంతో యాంజియోగ్రామ్‌ తర్వాత 5 నుంచి 7 గంటల పాటు, యాంజియోప్లాస్టీ తర్వాత 10-14 గంటలపాటు మంచం మీద కదలకుండా పడుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ట్రాన్స్‌రేడియల్‌ పద్ధతిలో చేతిలోని రక్తనాళం ద్వారా యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీ చేయడంవల్ల రోగి వెంటనే నడవవచ్చు. హాస్పిటల్‌లో ఉండే సమయం, రక్తస్రావం జరిగే అవకాశం చాలావరకూ తగ్గిపోతాయి.
యాంజియోప్లాస్టీ... అందులోనూ చేతిద్వారా చేసే ట్రాన్స్‌రేడియల్‌ యాంజియోప్లాస్టీ ఇటీవల అందుబాటులోకి రావడంతో హృద్రోగ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనితో గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలావరకూ నివారించడానికి వీలవుతోంది.

Courtesy with : PRAJA SEKTHI DAILY

తాజా పండ్లతో సత్ఫలితాలెనో


Monday, 7 October 2013

                                   
 
  సాధారణంగా అత్యంత ఖరీదైన యాపిల్‌ సామాన్యుడికి బహు దూరంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా యాపిల్సే. అతి తక్కువ ధరతో అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
  ఉపయోగాలు :
యాపిల్‌ కొరకడం, నమలడం, తినడం, వలన నోట్లో లాలాజలం ఊరి, బాక్టీరియా హరించడంతోపాటు పళ్ళు పాడవకుండా ఉంటుంది.  యాపిల్‌ జ్యూస్‌ రోజూ తాగడం వలన అల్జీమర్స్‌ వ్యాధిని అరికట్టవచ్చు. మెదడు వయసు పెరుగుతుంది. మహిళలు రోజుకో యాపిల్‌ తినడం వలన టైప్‌2 డయాబెటిస్‌ వ్యాధి బారిన పడే అవకాశాలు 28 శాతం తగ్గుతాయి.  యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. రోజూ యాపిల్‌ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  యాపిల్‌ తరచు తినడం వలన కంటిలో శుక్లాలు అభివృద్డి చెందే ఆవకాశాలు 10 నుండి 15 శాతం తగ్గుతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ ముప్పు నుండి కాపాడుతుంది.  అధిక బరువు నుండి విముక్తి పొందాలంటే రోజూ యాపిల్‌ తినాలి.  ఎముకలను రక్షిస్తుంది.  వారానికి 5 యాపిల్స్‌ తినడం వలన ఆస్థమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉవశమనం కలుగుతుంది. ్యయాపిల్‌లో 5 శాతం పీచుపదార్ధం ఉంటుంది. జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.  రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి ఇన్సులిన్‌ స్థాయిని పెంచుతుంది.
ఒక బ్రజిల్‌ దేశస్థుడి అధ్యయనం ప్రకారం, మహిళలు భోజనానికి ముందు ఒక యాపిల్‌ తీసుకుంటే 33 శాతం బరువు తగ్గడానికి అవకాశం ఉంది.  యాపిల్‌లో కేవలం 50 నుండి 80 శాతం కేలరీలు ఉంటాయి. ఎటువంటి ఫ్యాట్‌ కాని, సోడియం కానీ ఉండదు.  యాపిల్‌, విటమిన్‌ సి, ఎ, ఫ్లేవరాయిడ్‌లు, చిన్న మొత్తంలో ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాల్షియంల కలగలుపు ప్యాకేజ్‌.  యాపిల్‌లో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 
యాపిల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు

యాపిల్‌లో దాదాపు 7,500 వెరైటీలు ఉన్నాయి.
యాపిల్‌ చెట్టు రోజ్‌ కుటుంబానికి చెందింది.
యాపిల్‌ చెట్టు 100 సంవత్సరాల వరకు బతుకుతుంది.
అతి పెద్ద యాపిల్‌ బరువు 3 పౌండ్ల వరకు తూగుతుంది.
ప్రాచీన కాలంలో గ్రీసు దేశంలో ఒక అలవాటు ఉండేది. పురుషుడు, నచ్చిన యువతి పైకి యాపిల్‌ను విసురుతాడు. ఆ యువతి కనుక ఆ విసిరిన యాపిల్‌ను పట్టుకుంటే అతని ప్రస్థావనను అంగీకరించినట్టే.

Courtesy with: PRAJA SEKTHI DAILY
                                       
                                 Posted on: Sun 06 Oct 23:18:40.855203 2013
   
                                                          గ్రీన్‌ టీ ఎలా చేయాలంటే...
        ఓ కప్పు మంచినీళ్ళను మరగపెట్టండి. దానిలో ఓ టీ స్పూన్‌ తేయాకు వేయండి. అలా వేసిన తరువాత ఆ నీళ్ళను ఓ రెండు నిమిషాలు తెర్ల నివ్వండి. ఆ పైన దాన్ని వడ్డకట్టేయండి. వడపోయగా వచ్చిన తేనీటిని తాగేయండి. అందులో పంచదార కానీ, పాలు కానీ కలపకండి. అంతే! మీ ఆరోగ్యానికి అదే శ్రీరామరక్ష
   ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటీ 30 లక్షల మంది గుండె సంబంధమైన జబ్బులతో ఏటా ప్రాణాలు కోల్పోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఒక్క మన దేశం సంగతే తీసుకున్నా, దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అయిదో వంతు భాగం గుండె జబ్బుల వల్ల జరుగుతున్నవే! సాక్షాత్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ) ఈ సంగతి తెలిపింది. అయితే, ఆరోగ్యవంతమైన జీవనశైలి ద్వారా, రోజూ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చంటున్నారు నిపుణులు. కాగా, రోజూ గ్రీన్‌ టీ తాగడం కూడా గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది.
గ్రీన్‌ టీ గొప్పదనం ఏమిటంటారా? ఆ సంగతికే వస్తున్నాం. గ్రీన్‌ టీలో ఫ్లేవనాయిడ్స్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, సాధారణంగా మామూలు టీలో ఏ మేరకు చక్కెర వాడుతున్నామనే స్పృహ మనకు ఉండదు. అదే గ్రీన్‌ టీలో అలా కాదు. అందుకే, తీసుకొనే చక్కెర మొత్తాన్ని తగ్గించాలన్నా, లావెక్కే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా అందుకు చక్కటి మార్గం - గ్రీన్‌ టీ.
ఆ మధ్య ఏథెన్స్‌ మెడికల్‌ స్కూల్‌ ఓ అధ్యయనం జరిపింది. మామూలు కాఫీ, టీ, వేడి నీళ్ళు తాగే వారి కన్నా గ్రీన్‌ టీ తాగేవారిలో గుండెకు రక్తం తీసుకుపోయే నాళాలు బిగుసుకుపోకుండా ఉంటాయనీ, రక్త ప్రసారం సాఫీగా సాగుతుందనీ ఆ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా, గ్రీన్‌ టీలోని ఫ్లేవనాయిడ్లు శరీరంలోని టిస్యూ వాపునకు గురికానివ్వవు. రక్తనాళాల్లోని గోడల మీద ఈ గ్రీన్‌ టీ బాగా పనిచేస్తుంది. రక్తనాళాలు సాంత్వన పొందడానికి వీలుగా కణజాలాలు కొన్ని స్రావాలను వెలువరిస్తాయి. ఫలితంగా, రక్త ప్రసారం సులభమవుతుంది, పెరుగుతుంది.
గుండెపోటుకు ప్రధాన కారణం నాళాల్లో రక్తం గడ్డ కట్టడం! అలా గడ్డ కట్టడాన్ని కూడా గ్రీన్‌ టీ నివారిస్తుంది. జపాన్‌లో జరిగిన మరో అధ్యయనం కూడా గ్రీన్‌ టీలోని ఈ సుగుణాలను నిర్ధారించింది. రోజూ అయిదు కప్పుల కన్నా ఎక్కువ గ్రీన్‌ టీ తాగినవారిలో గుండెపోటు ద్వారా మరణించే రిస్కు దాదాపు 26 శాతం తగ్గినట్లు వారి అధ్యయనం తెలిపింది.
ఇవాళ పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. జీవనశైలులు అంతకన్నా వేగంగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయుల్లో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ఒత్తిడి, సరైన వ్యాయామం లేని జీవనశైలి, శారీరక శ్రమ బాగా తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మన భారతీయుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం, మన చైనా సోదరుల నుంచి ఈ గ్రీన్‌ టీ అలవాటు చేసుకుంటే, ఇంటికీ, ఒంటికీ కూడా మంచిది కదూ!

Courtesy with: PRAJA SEKTHI DAILY