Tuesday, 22 October 2013

నాట్యమాడే ఉపగ్రహాలు ఏవి?

                                  మన సౌరమండలంలో మిగతా అన్ని గ్రహాలకన్నా గురుగ్రహం (జ్యూపిటర్‌) చాలా పెద్దది. ఇది ఎంత పెద్దదంటే మిగతా అన్ని గ్రహాలను తీసుకొచ్చి ఇందులో కూర్చినా ఇందులో ఇంకా స్థలం ఉంటుంది. సూర్యుడి నుంచి సగటున 77.84 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రహం మన భూమికన్నా 1300 రెట్లు పెద్దగా ఉంటుంది. గురుగ్రహం తన చుట్టూ తను తిరగడానికి 10 గంటల సమయాన్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 11-86 సంవత్సరాల సమయం తీసుకుంటుంది.

గురుగ్రహానికి కొన్ని ఉపగ్రహాలున్నాయి అన్న సంగతిని తొలిసారిగా గెలీలియో కనిపెట్టాడు. ఆ ఉపగ్రహాలు తమ స్థానాన్ని కొన్ని గంటలలోనే మార్చడాన్ని గమనించిన ఆ శాస్త్రవేత్త వీటికి డ్యాన్సింగ్‌ శాటిలైట్స్‌ ఆఫ్‌ జ్యూపిటర్‌ (గురుగ్రహపు నాట్యమాడే ఉపగ్రహాలు) అని పేరు పెట్టారు. ఆ విధంగా నాట్యమాడే ఉపగ్రహాలు అన్నమాట వాడుకలోకి వచ్చింది.

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment