Tuesday, 22 October 2013






సూపర్‌ ఫుడ్స్‌

   


                    తీపి గుమ్మడి ఆకురాలు కాలంలో పండుతుంది. దీన్ని కొందరు మంచి గుమ్మడి అని కూడా అంటారు. దీన్ని కాయగూరగా, పండుగా రెండు విధాలుగా చెబుతారు.తీపి గుమ్మడి చాలా పోషక విలువలుండే 'సూపర్‌ ఫుడ్‌'. అన్ని విధాల మంచి చేయడమే కాక ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి సహాయపడుతుంది. గుమ్మడి బోలెడన్ని పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్‌లతో కూడి ఉంటుంది. దీన్ని మన రోజూ ఆహారంలో తీసుకోవడం వలన వచ్చే ఉపయోగాలు చాలా ఎక్కువ ఇది తీసుకోవడం వలన శారీరకంగా, మానసికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది అంటారు కారీ కూయి అనే పోషకాహార నిపుణులు. రోజూ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవలసినవిగా కూయి సూచించే, పది 'సూపర్‌ ఫుడ్స్‌' లో గుమ్మడి ఒకటి. గుమ్మడిలో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది విటమిన్‌ ఎ గా మార్పు చెందుతుంది. అంతే కాదు దీన్ని 'విజన్‌ విటమిన్‌'(కంటిచూపు మెరుగుపరచే విటమిన్‌) అంటారు. ఏ ఆహారంతో పాటైనా గుమ్మడిని తీసుకోవచ్చు. ఉదాహరణకి, చాలా మంది రాత్రి పూట కేవలం ఓట్స్‌ తిని పడుకుంటారు. అటాంటపుడు మీ ఆహారంలో మరికొన్ని పోషకాలు అందాలనుకుంటే, గుమ్మడి ముక్కను మిక్సీ పట్టి ఆ జ్యూస్‌ను ఓట్‌మీల్‌లో కలిపేసి తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను పోషకాల పవర్‌ హౌస్‌ అంటారు కూయి. వాటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన మంచి కొవ్వు, ప్రోటీన్లు, పీచు పదార్థం ఉంటాయి. ఇంకా మెగ్నీషియమ్‌ లాటి మినరల్స్‌ లెక్కలేనన్ని ఉంటాయి. దీనితో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, మన కణజాలానికి అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా రేయడానికి కావలసినంత ఐరన్‌ ఉంటుంది. గింజలు వేయించుకుని తింటే పై తొక్కతో సహా తినడానికి వీలుంటుంది. పగటి పూట తినడానికి పనికొచ్చే మంచి స్నాక్స్‌గా వేయించిన గుమ్మడి గింజలను వాడుకోవచ్చు. గుమ్మడిలానే దానిమ్మ కూడా సూపర్‌ ఫుడ్‌ అంటున్నారు కూయి. ఎందుకంటే దానిమ్మలో చాలా ఎక్కువ శాతంలో యాంటి ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇంకా, కివి పండులో 'టూటి ఫ్రూటి' రుచి ఉంటుందట. టూటి ఫ్రూటి రుచితో పాటు స్ట్రాబెర్రీ, పుచ్చకాయ ఫ్లేవర్‌తో ఉండే సిట్రస్‌ పండు కివి. కావలసినంత పీచు పదార్థం ఉండి, ఎక్కువ శాతం సి విటమిన్‌ ఉంటుంది. అందుకే అవి సూపర్‌ ఫుడ్స్‌

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment