ఉపయోగాలు :
యాపిల్ కొరకడం, నమలడం, తినడం, వలన నోట్లో లాలాజలం ఊరి, బాక్టీరియా హరించడంతోపాటు పళ్ళు పాడవకుండా ఉంటుంది. యాపిల్ జ్యూస్ రోజూ తాగడం వలన అల్జీమర్స్ వ్యాధిని అరికట్టవచ్చు. మెదడు వయసు పెరుగుతుంది. మహిళలు రోజుకో యాపిల్ తినడం వలన టైప్2 డయాబెటిస్ వ్యాధి బారిన పడే అవకాశాలు 28 శాతం తగ్గుతాయి. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రోజూ యాపిల్ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్ తరచు తినడం వలన కంటిలో శుక్లాలు అభివృద్డి చెందే ఆవకాశాలు 10 నుండి 15 శాతం తగ్గుతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంది. అధిక బరువు నుండి విముక్తి పొందాలంటే రోజూ యాపిల్ తినాలి. ఎముకలను రక్షిస్తుంది. వారానికి 5 యాపిల్స్ తినడం వలన ఆస్థమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉవశమనం కలుగుతుంది. ్యయాపిల్‌లో 5 శాతం పీచుపదార్ధం ఉంటుంది. జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది.
ఒక బ్రజిల్ దేశస్థుడి అధ్యయనం ప్రకారం, మహిళలు భోజనానికి ముందు ఒక యాపిల్ తీసుకుంటే 33 శాతం బరువు తగ్గడానికి అవకాశం ఉంది. యాపిల్‌లో కేవలం 50 నుండి 80 శాతం కేలరీలు ఉంటాయి. ఎటువంటి ఫ్యాట్ కాని, సోడియం కానీ ఉండదు. యాపిల్, విటమిన్ సి, ఎ, ఫ్లేవరాయిడ్‌లు, చిన్న మొత్తంలో ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియంల కలగలుపు ప్యాకేజ్. యాపిల్‌లో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాపిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు
యాపిల్‌లో దాదాపు 7,500 వెరైటీలు ఉన్నాయి.
యాపిల్ చెట్టు రోజ్ కుటుంబానికి చెందింది.
యాపిల్ చెట్టు 100 సంవత్సరాల వరకు బతుకుతుంది.
అతి పెద్ద యాపిల్ బరువు 3 పౌండ్ల వరకు తూగుతుంది.
ప్రాచీన కాలంలో గ్రీసు దేశంలో ఒక అలవాటు ఉండేది. పురుషుడు, నచ్చిన యువతి పైకి యాపిల్‌ను విసురుతాడు. ఆ యువతి కనుక ఆ విసిరిన యాపిల్‌ను పట్టుకుంటే అతని ప్రస్థావనను అంగీకరించినట్టే.
Courtesy with: PRAJA SEKTHI DAILY
No comments:
Post a Comment