పొగాకు నుంచి జీవ ఇంధనాలు..!
జన్యుమార్పిడి చేసిన పొగాకు మొక్కల ద్వారా జీవ ఇంధనాలను (బయోఫ్యూయెల్)
తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. 'థియోరెడాక్సిన్' అనే
ప్రొటీన్ ద్వారా ఇది సాధ్యమవుతుందని వారు తొలిసారిగా వెల్లడించారు. ఈ
ప్రొటీన్ వల్ల పొగాకుమొక్కలో పిండి పదార్థం మోతాదుపెరుగుతుందని తెలిపారు.
నావరె విశ్బవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు జరిపారు.
థియోరెడాక్సిన్ ప్రొటీన్‌లో ఎఫ్.ఎం. అనే రెండు రకాలుంటాయని, అవి రెండూ
ఒకే విధంగా పనిచేస్తాయని ఇప్పటివరకూ భావించేవాళ్లమని... కానీ, తమ పరిశోధన
ద్వారా వాటి పనితీరు భిన్నంగా ఉన్నట్లుందని తేలిందని శాస్త్రవేత్తలు
తెలిపారు. ఈ ప్రొటీన్‌ల గురించి తెలిసిన నూతన విషయాల ద్వారా పొగాకు
మొక్కల్లో జన్యుమార్పిడి చేసి.. 500 శాతం అధికంగా చక్కెర పదార్థాలు
ఉత్పత్తి అయ్యే ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ చక్కెర
పదార్థాలను బయో ఎథనాల్‌గా మార్చటంలో విజయం సాధించారు. ఒక టన్ను
జన్యుమార్పిడి పొగాకు ఆకుల నుంచి 40 లీటర్ల బయో ఎథనాల్‌ను రూపొందించవచ్చని
వారు చెబుతున్నారు.
Courtesy with: PRAJA SEKTHI DAILY
Courtesy with: PRAJA SEKTHI DAILY
No comments:
Post a Comment