దబ్బపండు నిమ్మ జాతికి చెందినది. దానితో నిల్వ ఊరగాయ పెడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ.సిలు, బి కాంప్లెక్స్ ఇందులో ఉంటాయి. పీచు పదార్థం, బీటాకెరోటిన్, ల్యూటిన్, తైకోసిన్, కాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ ఇలాంటివెన్నో దబ్బ పండులో లభిస్తాయి. దబ్బపండు రసంతో చేసిన పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది. దబ్బ పండు రసంతో పానీయాన్ని తయారుచేస్తారు.
- దబ్బపండు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
- దబ్బపండు తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలను కనపడనివ్వదు.
- అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.
- గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది.
- కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- ఈ పండు గుజ్జును చర్మం మీద రుద్దితే, మృత కణాలు తగ్గిపోయి చర్మం తేమగానూ, మృదువుగానూ, కాంతిగానూ ఉంటుంది.
- మలబద్ధకాన్ని నివారిస్తుంది.
-క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది.
- కంటిచూపును వృద్ధిచేస్తూ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- జీర్ణశక్తిని పెంచుతుంది.
- రక్తపోటును నియంత్రిస్తుంది.
- స్థూలకాయాన్ని నిరోధించేందుకు తోడ్పడుతుంది.
- జలుబును పోగొడుతుంది
Courtesy with:PRAJA SEKTHI DAILY
No comments:
Post a Comment