ఏ సబ్బు కొందాం?
సరైన సబ్బునే వాడుతున్నామా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. పట్టులాంటి మృదువైన చర్మాన్ని పొందాలన్న తహతహలో మనం తెలియకుండానే నాసిరకం సబ్బులను వాడి మన చర్మానికే హాని తలపెడతాం. మార్కెట్‌లో నెంబర్ వన్ బ్రాండ్ అనిపించుకోవడానికి, అధిక లాభాలు గడించడానికి సబ్బుల కంపెనీలు ఏవేవో రసాయనాలు వాడుతూ, తమ వినియోగదారుల చర్మ రక్షణను గాలికి వదిలేస్తున్నాయి. అసలు ఇందులో కొట్టొచ్చినట్లు కనపడే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే చర్మపు మృదుత్వానికి మా సబ్బునే వాడండి అని గొప్పగా చాటుకొనే బ్రాండ్లే ఎక్కువగా వాడితే చర్మానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సబ్బు సంగతులు
సహజపిద్ధమైన చమురును నాసిరకం సబ్బులు తుడిచి పెడతాయి కనుక వాటిని వాడితే చర్మం పొడిబారుతుంది.
-నాసిరకం సబ్బులు వేరనీ, కంపెనీ సబ్బులు నాసిరకానివి కావనీ చాలామంది భావిస్తారు. కానీ అది సరికాదు. సబ్బు శుభ్రత దాని సువాసన, నునుపును బట్టి కాకుండా దాని టిఎఫ్‌్‌ఎం బట్టి ఉంటుంది. టిఎఫ్‌్‌ఎం అంటే 'టోటల్ ఫాటీ మేటర్'. అది ఎంత ఎక్కువగా ఉంటే సబ్బుకు అంత శుభ్రపరిచే గుణం ఉంటుంది.
-అందుచేత వినియోగదారులు ఎటువంటి సబ్బుకొంటున్నామో సరిగా ఆలోచించడం చాలా అవసరం.
-భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) నిర్దేశించినదాని ప్రకారం సబ్బులను మూడు శ్రేణులుగా వర్గీకరించారు. అవి: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.
టఎఫ్‌ఎం 76 శాతం, అంతకుమించి ఉన్నవి గ్రేడ్1. డెబ్బై శాతం, అంతకు మించి(76శాతం కంటే తక్కువగా) టిఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 2. 60 శాతం, అంతకు మించి (70శాతం కంటే తక్కువగా ) టిఎఫ్ ఎం ఉన్నవి గ్రేడ్ 3.
-గ్రేడ్2,3లో అధికంగా 'ఫిల్లర్లు' ఉంటాయి. సబ్బు మామూలుగానే కనిపిస్తూ తగిన బరువు ఉండేలాగా కొన్ని పదార్థాలను జత చేస్తారు. వాటిలో మనకు హానికరమైనవి కూడా ఉండవచ్చు.
-సబ్బులలో కలిపే 'ఫిల్లర్లలో ఆస్బెస్టాస్ వంటివి కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలం వాడితే చర్మానికి ఎంతగానో హాని కలగవచ్చు.
-ఈ సబ్బులు నీటితో కలిసినప్పుడు పీసర పీసర (మెత్తగా నానినట్లు) గా అయిపోతాయి. అందువల్ల చాలా త్వరగా అరిగిపోతాయి. ఇక తక్కువరకం సబ్బులకు నురగ తక్కువ. కంపెనీలు వాటికి ధర తక్కువగా ఉంచి, ఎక్కువ అమ్మకాలు సాగిస్తాయి. కనుక లాభాలు మాత్రం ఎక్కువ.
-ఏ రకంగా చూసినా గ్రేడ్ 1 సబ్బే నాణ్యమైంది. ఇది చర్మాన్ని మృదువుగా తాకుతూ అధిక శుభ్రతని ఇస్తుంది. అదనపు రసాయనాలను చేర్చకుండానే సువాసనను అందిస్తుంది కూడా.
Courtesy With: PRAJA SEKTHI DAILY

No comments:
Post a Comment