ఇతర గెలాక్సీల్లోకి వెళ్లి పరిశోధనలు చేయొచ్చా..?
ఎ. రామచంద్రయ్య సంపాదకులు, చెకుముకి,
Wed, 5 Dec 2012, IST
- ఎన్.మనోజ్‌రెడ్డి, హన్మకొండ
ప్రస్తుతం వీలుకాదనే చెప్పవచ్చు. బహుశా రాబోయే కొన్ని శతాబ్దాల పాటు కూడా వీలుకాకపోవచ్చును. గెలాక్సీ అంటే మన ఊరులాంటిదో లేదా మన భూమిలాంటిదో కాదు. ఒక సగటు గెలాక్సీ (మనం వున్న మన పాలపుంత లేదా మిల్కీవే గెలాక్సీలాంటిది) వ్యాసం సుమారు 60,000 (అక్షరాలా అరవైవేలు) పార్సెక్కులుంటుంది. ఒక్కో పార్సెక్కు (జూaతీరవష) విలువ 3.26 కాంతి సంవత్స రాలు. ఓ కాంతి సంవత్సరం (శ్రీఱస్త్రష్ట్ర్ yవaతీ) అంటే కాంతి ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించే దూరం. ఇలా లెక్కిస్తే ఓ పార్సెక్కు దూరం సుమారు 31 ట్రిలియన్ కిలోమీటర్లు. దీన్నే 310000000000 00 (31 తర్వాత 12 సున్నాలు) కి.మీ. ఇలాంటి పార్సెక్కులే సుమారు 60,000 ఓ సగటు గెలాక్సీ అంచుల మధ్య వున్న దూరం. అంటే ఓ సగటు గెలాక్సీ నిడివి 60000 × 31000000000000 = 1860000000 000000000 = 18.6 × 1017 కి.మీ. గెలాక్సీలు సాధార ణంగా పొద్దు తిరుగుడు పువ్వు ఆకారంలో ఉంటా యని ఊహిస్తే ఆ పొద్దుతిరుగుడు పువ్వు అంచుల మధ్య ఉన్న వ్యాసం (సఱaఎవ్‌వతీ) సుమారు 18,600 కోట్ల కోట్ల కి.మీ. ఉంటుందన్న మాట. మన పాల పుంత కూడా దాదాపు ఇంతే వ్యాసం లో వుంది. ఈ గెలాక్సీ అంచులో మన సౌరమండలం ఓ మారుమూల వుంది. ఇక్కణ్నుంచి మనం పాల పుంతలోని ఆవలివైపునకు రాకెట్లలో గంటకు 1,80,000 కి.మీ. వేగంతో వెళ్లినా (ఇది కూడా ఇప్పుడు సాధ్యం కాదు) ఆవలి అంచుకు చేరడానికి సుమారు లక్ష కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన విశ్వం ప్రస్తుత రూపంలో ఆవిర్భవించి 1500 కోట్ల సంవత్సరాలైంది. ఇలాంటి గెలాక్సీలు మన సాంకేతిక పరిజ్ఞాన పరిశీలనకు అనువుగా వున్న విశ్వం (శీbరవతీఙabశ్రీవ బఅఱఙవతీరవ) లోనే సుమారు 170 బిలియన్లు (17×1010) ఉన్నాయి. ఒక్క గెలాక్సీనే ఇంత దూరంలో విస్తరించి వుండగా, గెలాక్సీకీి గెలాక్సీకీ మధ్య వున్న దూరం గెలాక్సీల నిడివికన్నా కొన్ని లక్షలరెట్లు ఎక్కువ వుంటుందన్న విషయం మర్చిపోవద్దు. మన సౌరమండలంలోనే వున్నా మన పక్కింటి వ్యక్తి అనదగ్గ కుజగ్రహం (వీaతీర) దగ్గరకు పరిశోధనార్థం రాకెట్టులో అక్కడికి చేరడానికి దాదాపు ఆర్నెల్లు పడుతుంది. మన సూర్యుడే మనకు అత్యంత దగ్గరున్న నక్షత్రం. ఆ తర్వాతి నక్షత్రం ఆల్ఫా సెంటారి. అది మన సూర్యుడికి సుమారు 4.5 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. కుజ గ్రహానికి మనం ప్రస్తుతం వెళ్లగలిగిన సాంకేతిక పరిజ్ఞానం తోనే ఇవాళ ప్రయాణం ప్రారంభించి (2013 సంవత్సరం) అక్కడికి చేరుకోవాలంటే సుమారు 38 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన ఊళ్లోనే (మన మిల్కీవే గెలాక్సీ) మన పక్కింటికి (మన సౌరమండ లానికి అతి దగ్గరగా వున్న ఆల్ఫాసెంటారి నక్షత్రానికి) వెళ్లడానికే సుమారు 38 కోట్ల సంవత్సరాలు పడుతుంటే, మన ఊరిని దాట డానికే సుమారు లక్ష కోట్ల ఏళ్లు పడుతుంటే మన ఊరి నుండి కొన్ని లక్షల రెట్లు అధిక దూరంలో వున్న పక్క ఊరికి (ఆండ్రోమిడా గెలాక్సీ: ఇదే మన మిల్కీవే గెలాక్సీకి అతి దగ్గరగా వున్న గెలాక్సీ) వెళ్లడా నికి ఎన్ని లక్షల కోట్ల కోట్ల సంవత్స రాలు పడుతుందో ఊహించండి. కాబట్టి ఇంట గెలవలేని వాళ్లం, ఊర్లో రచ్చా గెలవలేని వాళ్లం పక్క వూరి పార్లమెంటును ఏం గెలు స్తాం? ఊహలకు కూడా సాధ్యంకాని వ్యవహారం. కాబట్టి పక్క గెలాక్సీకి వెళ్లడానికి మనకు సరదా వుంటే ఆ సరదా ఊహల్లో కూడా వీలుకాని మహద్భాగ్యం మహావిశ్వంలో ఉంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
No comments:
Post a Comment